Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    "నీ ఇష్టం ." క్షణ క్రితం రాతి మీద ఈదుతున్నట్లు కనిపించిన వ్యక్తీ క్షణంలో నవ్వులు దొంతర్లు ఎలా కురిపించగలుగుతున్నాడా? అని కాలూ తన్నుతానే ప్రశ్చించుకున్నాడు.
    "బిటేన్ ' ఇదొక పేరెందుకు కాగూడదు? అవును ఎందుకు కారాదు? బిటేన్ అంతే"
    కాలూ ఆలోచనలో దొర్లాడాడు.
    "నేనైతే ఇలాంటి పేరు బెంగాలీలో వినలేదు. లేఖా! నీవు?"
    ఆమె కూడా ఆలోచనలో మునిగిపోయింది.
    "జితెన్.... హిటేన్..... నిటేన్.... రిటెన్ ....."
    బి-10 మరొకసారి విరగబడి నవ్వాడు. 'అన్నీ ఉన్నాయి బిటేన్ తప్ప. అయితే బిటేన్ బెంగాల్ మొత్తంలో లేకుంటే నేను బిటేన్ అవుతా . ఏం? సరిపోయింది కదూ?"

                                                               17


    సిమెంటు నేల మీద కూర్చొని , 37 ఫోర్డ్ వాల్వును సానపడ్తున్నాడు. క్రుడి పక్క మూడు గజాల దూరంలో పగిలిన సైలేన్సరు ను రవ్వలు లేస్తుండగా మేస్త్రీ అతుకుతున్నాడు. ఒక మూలకు ముక్కకు నేక్కేల్ ఫ్రేము గల కాళ్ళద్దాలు తగిలించుకున్న వ్యక్తీ కూర్చొని ఉన్నాడు. అతని ముందు కొద్ది ఎత్తుగల బల్ల ఉంది. అతడు బల్లమీదికి వంగి ఆయిల్ గేజును గడియారాలు బాగుచేసే వానిలా తీక్షణంగా చూస్తున్నాడు. ఇంకో 20 మంది రకరకాల పనుల్లో మునిగి ఉన్నారు. బెంగాల్ మొబైల్స్ లిమిటెడ్ లో ఇంకా చేయాల్సిన పని బోలెడుంది.
    బిటేన్ చుట్టూ కలయజూశాడు. అన్నీ కొత్త మొఖాలే కనిపించాయి. పాత మిత్రులు ఎవరూ లేరు. వారంతా మిలటరీ వారి మెకానికల్  ఇంజనీరింగ్ శాఖలో చేరిపోయారు. వర్క్ షాపుల్లో ఉన్న పనివాళ్ళ అందరిని మిలిటరీ తనలో ఇముడ్చుకుంది. అందుకే బిటేన్ కు తేలిగ్గా పూర్వపు ఉద్యోగం దొరికింది. అతని పాత చరిత్ర గానీ, పాత ప్రవర్తన గానీ అడగడం జరుగలేదు.
    వారం రోజులు విశ్రాంతి తీసుకొమ్మని కాలూ అర్ధించాడు. కాకుంటే కనీసం మూడు రోజులు, సంవత్సరపు బండ చాకిరీ వల్ల కలిగిన శ్రమ తీర్చుకోవడానికైనా ఒక్క మూడు రోజులు విశ్రాంతి తీసుకో. ఒక్క మూడు రోజులు అని బ్రతిమిలాడాడు.
    బిటేన్ కు మూడు రోజుల విశ్రాంతి కూడా అనవసం అనిపించింది. పొట్ట గడుపుకోవాలి. ఎంత తొందరగా ప్రారంభిస్తే అంతమంచిది.
    పరధ్యానంగా వాల్వు బాగుచేశాడు. ఆలోచించాల్సింది చాలా ఉంది. తాను కిందు మీద అయిపోతున్నట్లు అనిపించింది. ఈ కలవరానికి కారణం చంద్రలేఖ.
    ఇంతకూ ముందొక కన్య బిటెన్ను కిందు మీదు చేసి అతని అభిప్రాయాల్ను జీవితాన్నీ మార్చేసింది. అది జరిగిపోయి అప్పుడే రెండు సంవత్సరాలు గడిచాయి. అయినా అదంతా నిన్ననే జరిగినట్లు కనిపించింది.
    ఆమె బిటేన్ కు ఒకే ఒక చెల్లెలు. పూర్ణిమ అతని కంటే అయిదు సంవత్సరాలు చిన్నది. ఆమెలో చంద్రలేఖ లాంటి అద్భుత సౌందర్యం లేకున్నా ఆమె కూడా అందమైనదే. పన్నెండేళ్ళు దాటిన్నాటి నుంచీ సుమారు స్కూలు తరువాత సమయం అంతా ఏదో వ్రతాల్లో నూ నియమాలలోనూ గడపాల్సి వచ్చేది. వారి బ్రాహ్మణ మాతాపితరులు ఏవో మంత్రాలు చదువుతూ గంటలకొద్దీ దేవుని గదిలో గడిపేవారు. దినచర్యలా జరుగే ఈ పూజా వ్యవహారాలకూ, ఏర్పాట్లు చేయడమే కాక, అవివాహిత కన్య చేయాల్సిన క్రతువులన్నీ చేయాల్సి వచ్చేది. అలా చేస్తే పెళ్ళి ఆయిం తర్వాత సుఖ జీవనం గుడుస్తుందని నమ్మకం. ఈ వ్రత, నియమాల వల్ల స్కూలు పని చేయలేకపోతున్నానని పూర్ణిమ తల్లితో మొర పెట్టుకున్నాప్పుడల్లా స్కూలు మానిపించేస్తానాని తల్లి బెదిరించేది.
    "ఈ బూటకపు చదువులు ఓరగబెట్టేదేముంది? చేసుకునే వాళ్ళంతా చదువు కావాలంటే నా బిడ్డను అసలు స్కూలుకే పంపేదాన్ని కాదు. కుర్రాళ్ళకు కలిగిన భావాలే తలిదండ్రులకు కలుగుతున్నాయి. పెళ్ళి చూపులకు రాగానే "అమ్మాయి ఎన్నో క్లాసు దాకా చదివింది?" అని అడగడం మామూలైపోయింది. ఈ దేశంలో అన్నీ పిదబుద్దులే పుడుతున్నాయి."
    పాత విశ్వాసాల్లో ఆమె కంటే ఏమాత్రం తీసిపోని ఆమె భర్త అందుకున్నాడు. "నారాయణుడు మళ్ళీ అవతారం ఎత్తే రోజులు వచ్చాయి. ఆ పరాత్సరుడు ఈ లోకంలో అవతరించడం ఇది పదకొండోసారి. ఈ అవతారం నాల్గవ అవతారం అయిన నరసింహవతారం లా రౌద్రవతారం అవుతుంది. నరసింహుడు హిరణ్యకశిపుడుని డొక్క చీల్చినట్లు ఆ శ్రీహరి ఈ అవతారంలో దుష్టత్వపు డొక్క చీలుస్తాడు. ఈ కలికాలానికి ఆ నరసింహుడి వాడి గోళ్ళు కావాలి" అని చేతులు జోడించాడు.
    పూర్ణిమ ఆధునిక కీవితపు అంచులు సహితం అంటని అమాయకురాలు. బసవ్ తో ఆమెకు పరిచయం గలగడమూ, ఆమె హృదయంగణంలో అతడు అడుగు పెట్టడమూ అంతా ఆశ్చర్యంగా జరిగిపోయింది. బసవ్ ఉక్కు కర్మాగారంలో ఫోర్మన్. కొద్ది కాలంలోనే అతనికి అసిస్టెంటు ఇంజనీర్ పదవీ లేక అంతకంటే పెద్ద పదవి కూడా లభించవచ్చునని వినికిడిగా ఉంది. ఒకనాడు బసవ్ పూర్ణిమ తండ్రికి పూర్ణిమను తనకిచ్చి పెళ్ళి చేయవలసిందిగా ఉత్తరం రాశాడు. ఆరోజు ఆదివారం కావడాన బిటేన్ అతని తండ్రీ ఇంటి దగ్గరే ఉన్నారు. మున్నెన్నడూ చూడని భయంకర రూపం ఆ లేఖలో కనిపించి తండ్రి ముందు చకితుడైనాడు. తదనంతరం కోపంతో మండిపోయి ఉత్తరం చేతిలో పట్టుకొని దిగ్గున లేచి భార్యను కేకేశాడు. వంటింట్లో ఉన్న ధర్మపత్ని చేతులు కొంగుతో చుడుచుకుంటూ పరిగెత్తుకొని వచ్చింది. గుక్క తిప్పుకోకుండా జరిగినదంతా చెప్పేయడంతో కలగపులగం అయిన పదాల్లో ఏదో జరిగిన విషయం ఛాయా మాత్రంగా గ్రహించింది ధర్మపత్ని. ఆమె అరచేత్తో నుదురు బాదుకొని ఏడ్చింది.
    ఆమె రొమ్ము బాదుకొని ఏడుస్తూ "ఎంత పరువు తక్కువ? ఎంత పరువు తక్కువ ! స్వర్గంలో ఉన్న  పద్నాల్గు పురుషాంతరాలవారికీ పరువు తక్కువ పని జరిగిపోయిం" దని మొత్తుకుంది.
    అప్పుడు పూర్ణిమ ఇంట్లో లేదు. పక్కింటి నుంచి ఆమె గుమ్మంలో అడుగు పెట్టీ పెట్టడమే రెండు పులులూ ఆమె మీద విరుచుకుపడ్డాయి. తల్లి సిగపట్టుకొని నేల మీద పడేసి గోరగొరా పడకగధిలోకి లాక్కుపోయింది. నేలకు ఒరుసుకుని చెక్క చెక్కలైన ఆమె వీపు మీద తల్లి బలం కొద్ద్దీ కోపంతో గుద్దులు గుద్దింది.
    "ఎంత పాపిష్టిరాలవే? పొట్టలోనే చచ్చినా, పుట్టగానే మెడ నొక్కేసినా పీడా విరగడై పోయేది. నా చనుబాలతో పామును పెంచానే పామును!"
    పెదవులు కరిచిపట్టి, ఒక్క మాటైనా మాట్లాడకుండా పూర్ణిమ ఆ యాతన భరించింది. ఆమె కనురెప్పలు పొంగాయి కాని అధరం కదల్లేదు. ఆమె స్వభావమే అంత. ఎన్నడూ ఎదిరించి ఎరుగదు. పెదవి కదల్చకుండా బాధలన్నీ భరిస్తుంది.
    బిటేన్ కొద్దిసేపు ప్రతిమలా నుంచొని అంతా చూశాడు. అతని హృదయం ఇంక ఆ బాధ భరించలేకపోయింది. జీవితంలో ప్రధమ పర్యాయం మాతృ, పితృదేవులను ఎదిరించాడు.
    "ఏం పాపం చేసిందని ఆమెను చంపేస్తున్నారు?"
    ఇదంతా చూస్తూ పక్కనే నుంచున్న తండ్రి జవాబు విసిరాడు.
    "ఇది వాణ్ణి చాటుగా ఎన్నిసార్లు కలుసుకుందో? లేకుంటే వాడు నాకు ఉత్తరం వ్రాసే ధైర్యం చేస్తాడూ?" అసలు వాడికి బుద్ది స్వాధీనంలో ఉన్నట్టు లేదు. వాడి కులంలో తగినపిల్ల దొరక్కనా?"
    "బసవ్ కు ఏమైంది? పూర్ణిమకు అంతకంటే మంచి వరుణ్ణి తెస్తారా?"
    తండ్రి గుడ్లెర్ర చేశాడు. "ఓరి చవటా, వాడు బ్రాహ్మడు కాదని నేను చెప్పాలా? ఏమీ తెలియనట్లు నటిస్తావెం? ఏదీ విషయం. ఈ నాటకంలో నీక్కూడా పాత్ర ఉన్నట్లుంది."
    తరువాత కొన్ని గంటలకు తండ్రి పక్క చుట్టా, రేకు పెట్టె పట్టుకొని రాత్రి బండికి ప్రయాణం అయినాడు. తండ్రి కలకత్తాకు ప్రయాణం అయిన్నాటి నుంచీ ఇంట్లో మౌనం నాట్యం చేసింది. తన కూతుర్ను మృత్యువు మింగేసినట్లు విలపించే తల్లి ఏడుపు వినా ఆ ఇంట్లో ఒక్క మాట వినిపించలేదు. తల్లి పూర్ణిమను నూరు కళ్ళతో కాపలా కాసింది. ఒక వారం గడిచింది. నాటి రాత్రి పూర్ణిమ పెళ్ళనే విషయం ఉదయం గాని తెలియజేయబడలేదు.
    మామూలు పెళ్ళిళ్ళలా కాకా నిరాడంబరంగా పెళ్ళి జరిగిపోయింది. డజను మంది కంటే ఎక్కువ అతిధులు రాలేదు. ఒకే ఒక సన్నాయి వాడు వాయించిన మంగళ వాద్యంలో కలకాలంగా నిలిచి ఉన్న శోకం వినిపించింది. పెళ్ళికొడుకు మధ్యాహ్నం బండిలో కలకత్తా నుంచి వచ్చి ఒక అద్దె గదిలో విడిది చేశాడు. అతడు సాయంకాలం గుమ్మంలో అడుగు పెట్టినప్పుడు బిటేన్ చూశాడు. జారిపోయిన చెంపలూ, పెరుగు బుడ్డి లాంటి తలా కనిపించాయి. రెండునెల్ల క్రితం అతని భార్య దివంగుతురాలైందనీ, అతనికి బిడ్డలూ, బిడ్డలకూ బిడ్డలూ ఉన్నారని తరువాత అతనికి తెలియవచ్చింది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.