Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
"ఇది వరకటి మూడింటి కంటే ఇది పెద్ద ఊరేగింపు. పోయిన శనివారం చూసినదాని కంటే సుమారు రెండింతలుండి" అన్నది లేఖ.
గుళ్ళో పనివాళ్ళంతా గేటు ముందు గుమికూడి ఊరేగింపును చూస్తున్నారు. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. గుడి గుంపులోంచి విడిపోయిన ఒక వ్యక్తీ ఊరేగింపులో కనిసిపోయాడు. అతడు గుంపులో ఒకడైపోయాడు.
"విశ్వనాద్ " అని తనలో తాను గునుగుతున్న కాలూ అతనికి తెలియకుండానే "విశ్వనాద్" అని పెడబొబ్బ పెట్టాడు.
విశ్వనాద్ మారు పలక్కుండా సాగిపోయాడు. అతడు తలఎత్తి చేతులు ఊపుతూ సాగిపోయాడు.
కాలూ నోటి వెంట "విశ్వనాద్" అనే నీరస ధ్వని వెలువడింది.
"శివుని అభిషేకాపు పాలు పాపాలకు ఇచ్చేది అతనేనా?" అని అడిగాడు బి-10.
జడప్రాయమైన కాలూ చూపు అదృశ్యం అవుతున్న ఊరేగింపు మీదే నిలిచి ఉండగా యాంత్రికంగా "అవును" అని తల ఊపాడు.
"ఆకలి డొక్కలకు అన్నం మాడిమండు" కాలు చెవుల్లో గింగురుమంది. ఆ మహారవంలో విశ్వనాద్ గొంతు వినిపిస్తుందని కాలూ చెవులూ నిక్కపెట్టాడు. ఆ మహారవం అతని హృదయ కుహరంలో చొరబడి , దూసుకొని పోయి విశ్వనాద్ పక్కన నుంచోమ్మని అతన్ని పూరికొల్పింది.
"ఆకలి డొక్కలకు అన్నం మా డిమాండ్" ఆ వందల కొద్ది కంఠలలో తన కంఠమూ వినిపించినట్లు అయింది కాలుకు. పిడికిలి బిగించి గొంతు నరాలు పొంగెట్లు నినాదాలు చేస్తున్న కాలూ అతని ముందు కనిపించాడు.
'అందరికీ తిండి"
"అందరికీ పని"
"తిండి దొంగలను జైల్లో పెట్టాలి."
మంగల్ అధికారి, కాలూలో రేగిన ఉద్రిక దుమారాన్ని అడ్డలేకపోగా, ఆ దుమారానికి గడగడ వణికిపోయారు. కమ్మరి కాలూ వీధి జనంతో పాటు పిడికిలి బిగించి "అందరికీ తిండి- అందరికీ తిండి" అని నినాదం చేతుంటే " అందరికీ తిండి" అనే అక్షరాంకితమైన పతాకపు ఉన్నత ధ్వజం అతని చేతిలో ఉంది.
కమ్మరి రక్తంలో అలాంటి బాధ జీర్ణించి అయినా ఉండాలి. లేదా ఇలాంటి ఉదంతపు స్పర్శామాత్రం చేత కార్యరంగంలోకి దూకేహృదయమైనా కలిగి ఉండాలి. లేకపోతే ఉద్రేకపూరితమైన వాతావరణం గాని, ఏనాటి నుంచో కలలుగన్న ఊహలు గానీ లేకుండానే వట్టి పిలుపుకు గుండె అంతగా పొంగడం సాధ్యం కాదు.
కింద నుంచున్న పూజారి బాల్కనీ లో నుంచున్న యజమానిని చూచి తల పైకెత్తి "ఆ వెధవను గురించి నాకు మొదటినుంచీ తెలుసు. వాడు వట్టి నాస్తికుడని చెప్పానా లేదా ? ఈ నీచుల విషయం ఇప్పుడైనా తెలిసిందా? వాళ్ళు అన్నం అడుక్కోరట. డిమాండు చేస్తున్నారట! డిమాండు!"
అతనికి జవాబు ఇవ్వడానికి కాలుకూ ఏమీ తోచలేదు.
ఒక నిముషం పాటు ప్రతిమల్లా నుంచున్న మిత్రులిద్దరూ తరువాత నేలమీద కూర్చున్నారు. లేఖ మాత్రం బాల్కనీ ఇనుపకడ్డీలకు అలాగే నుంచుండిపోయింది. కాలూ ముఖంలో విషాదచ్చాయలు గోచరిస్తూ ఉండగా "ఇంక అతడు తమాయిన్చుకోలేక పోయాడు. వెళ్ళిపోవాల్సి వచ్చింది వెళ్ళిపోయాడు" అన్నాడు.
లేఖ గిరుక్కున వారివైపు తిరిగి "ఏ, అతడేమన్నా నేరం చేశాడా?" అతనికి ఊరేగింపులో చేరే హక్కు సహితం లేదా ? అతడు గుడికి బానిసెం కాదే?" అన్నది.
"లేఖా, నీవా కేకలు వినలేదూ?"
"ఆకలి డొక్కలకు అన్నం అడగడం నేరమా?"
"వారు వట్టి అన్నమే కోరి ఊరుకుంటే బాగానే ఉండేది. తిండి దొంగల్ను జైలుకు పంపాలని కూడా కోరుతున్నారు."
"వారిని జేలుకు పంపడమే కాదు, ఉరి తీయాలి."
ఆమె ముఖంలో తాండవం ఆడిన క్రౌర్యాన్ని చూసి కాలూ తెల్లబోయాడు. తరువాత మళ్ళీ మాములుగా నవ్వి "సర్ అబాలబందు అదృష్టానికి బియ్యపు వ్యాపారమే కారణం అనే విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఉరిత్రాడును తల్చుకుంటే అతని గుండె ఎలా బాదుకుంటుందో ఊహించు."
"అదీ అసలు వ్యాపార రహస్యం. మూక ఉమ్మడిగా జనాన్ని హత్య చేసిన పాపం కడిగి వేసుకోడానికి దేవుణ్ణి పోషిస్తారు . ఆరకంగా విలువైన లంచానికి ఆవిష్టం చూపని మహాదేవునితో మిత్రుత్వం చేసికుంటారు ' బి-10 పలికాడు.
'అలాంటివారితో కులమర్యదల్ను మంట కలిపించి నాలాంటి వాణ్ణి బ్రాహ్మడిగా పరిగ్రహిపచేసి బూటపు దేవుని ముందు ప్రాయశ్చిత్తం చేయించడం తల్చుకుంటే."
"కాని ..... "బి-10 ఏదో అనబోయాడు నాలుక చివరిదాకా వచ్చిన పదాలను గుటక వేసి మింగాడు.
లేఖ అతని మాటల కోసం నిరీక్షిస్తూ "ఏమిటదీ?" అని అడిగింది.
బి-10 తల ఊపి "ఏమీ లేదు, ప్రస్తుతానికి గుడిని గురించి మాట్లాడక పోవడమే మంచిది. మొట్టమొదట ఇక్కడ జరిగేదంతా బాగా అర్ధం చేసుకోవాలి. విశ్వనాద్ ను గురించి మనం విచారపదాల్సిదేమీ లేదు. భయాన్ని ఎదిరించి జయించిన వాణ్ణి అణచడం ఎవరికీ ఎన్నటికీ సాధ్యపడదు."
'భయం?" లేఖ బరువుగా ఊపిరి పీల్చింది. కనుమరుగై పోతున్న ఊరేగింపు వైపు చూసింది.
"ఇన్ని నెలల తర్వాత కూడా ఈ కాటకం ఏమీ తగ్గలేదా?"
"అనేకమందిచచ్చారు. పల్లెల నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చినవారు వారి స్థానాలు ఆక్రమించారు. పది లక్షల మంది పేవ్ మెంట్ల మీద పడి ఉండిన రోజులూ ఉన్నాయి. నేటి పరిస్థితి అంత అధ్వాన్నంగా లేకున్నా అంత మెరుగ్గా లేదని చెప్పాలి."
"అన్నార్తులను ఆదుకున్న నాధుడేలేడా?"
"ఏదో కొందరు వ్యక్తులు సంక్షేమ కేంద్రాలు ప్రారంభించారనుకో, వారికి గింజలు దొరకోద్దూ?" వెధవ బియ్యం గంజి కాస్తే అసహ్యం. అదీకాక గంజి ఆకలి డొక్కలకు అట్టే గిట్టదు."
బి-10 లేచి నుంచొని బాల్కనీ ఇటు చివరి నుంచి అటు చివరి దాకా పచార్లు చేశాడు. కాలూ మోకాళ్ళ మీద జోడించిన చేతులు పెట్టుకొని తల వ్రేలాడేసి కూర్చున్నాడు. బి-10 కాళ్ళు నేలకు రాచుకుంటూ తిరిగాడు. వేగం వెచ్చించాడు. తగ్గించాడు. మూడుసార్లు అటూ ఇటూ తిరిగి ఆగిపోయాడు. బాల్కని కడ్డీ మీద చేతులు పెట్టుకొని వంగాడు. చివరకు అతని ముఖంలోని కాఠిన్యాం సడలింది. మార్దవంగా "పోరాటం, పోరాటం భయానికి వ్యతిరేకంగా పోరాటం. అదొక్కటే వాస్తవమైన మార్గం" అన్నాడు.
కాలూ గుండెలో 'పోరాటం' అనే పదం ప్రతిధ్వనించింది. తన రక్తం గంతులేస్తున్నట్లు అనిపించింది.
పౌంటేన్ పేస్ చేత్తో తూకం వేస్తున్న నల్లజుబ్బా వ్యక్తీ, గంగూ సింగ్ గడ్డానికి వల. మా ఎముకల చమురు త్రాగండి. ఈగలు ముసిరే బాలుని ముఖం, బంగారపుధర తేజీ కావాలి. మందం కావాలి. తేజీ .......మందం.......తేజీ ........మందం.
కాలూకు ఆ ప్రతిమలు కనిపించాయి. వాటి ధ్వని వినిపించింది.
ఇదిగో ఇవి మెడల్ కేసుకు .......... చాలా? కొరడా పట్టుకున్న కొవ్వెక్కిన చేయి . నీలి రంగు ఉల్లిపొర చీర.........కస్తూరి గుబాళింపు . చీర క్రింద తడుముకున్న పుర్తుష హస్తం. వద్దు ......... వద్దు. బుద్ది తెచ్చుకో. రాణిలా జీవించు. వద్దు......వద్దు.
లేఖ ముఖం చెమటతో తడిసిపోయింది. స్వేదబిందువులు అధరోష్టం మీద రాలుతున్నాయి. మైకంలోంచి తెరుకున్నట్లు నేను కేక వేయలేదు కదా? అని అడుగుతున్నట్లు అక్కడి రెండు ముఖాలనూ చూసింది. వెనక్కు తిరిగి పొంగి తగ్గుతున్న ఆమె వక్షాన్ని బాల్కనీ ఇనుప కడ్డీకి అదిమింది.
కాలూ మాట్లాడ్డంతో బిర్రబిగిసి ఉన్న వాతావరణం సళ్లూ వదిలింది.
"నీవు ఖైదీల కులం వాడివి. అది సరేగాని నీ పేరు? నాకు నీ పేరు సహితం తెలియదు. తెలిసింది నీ నెంబరు మాత్రమే."
బి-10 నవ్వి లేఖను చూశాడు. చిందరవందరగా ఉన్న తుమ్మెద రెక్కల్లాంటి నల్లని వెంట్రుకలూ, ఎండకు మెరుస్తున్న మెడ మలుపూ ఆయనకు కనిపించాయి.
"మీ పేరు చెపుతేనే మంచిది. ఏమంటారు?"
"మంగల్ అధికారి లాంటి పేరు కదూ " బి-10 మళ్ళీ నవ్వాడు.





