Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||

                          పదునాలుగవ అధ్యాయము


1.     ధ్రువాక్షితిర్ధ్రువాయోనిర్ధ్రువాసి ధ్రువంయోనిమాసీద సాధుయా|
    ఉఖ్యస్య కేతుం ప్రథమం జూషాణాధ్వర్యూసాదయతామిహ త్వా.

    (చతుర్దశ్కేధ్యాయే ద్వితీయాది చితిత్రయం వక్ష్యతే. పదునాలుగవ అధ్యాయమున రెండవది ఆదిగా మూడు కుండములు చెప్పబడినవి. అశ్వినులను పేరుగల అయిదు ఇటుకలను రెండవ కుండమున చేర్చవలెను)

    ఇటుకా! నీవు అచలనివాసివి. అచల కారణవంతవు. కావున 'రేతఃసిగ్వేల' యను శుభంకరమగు, అచలస్థానమున ప్రతిష్ఠితవగుము. దేవయజ్ఞమున అధ్వర్యభావమున నిలుచు అశ్వినులు ఇద్దరు నిన్ను ఈ స్థానమున ప్రతిష్ఠించవలెను.

    2. అశ్వినీఇష్టకా! గూటినుండి 'రేతఃసిగ్వేల' స్థానమున నిలుచుదానవు. హొమఘృతసంగతవు. అనేక ఇటుకలను భరించుదానవు. అట్టినీవు రెండవకుండమున సుఖదస్థలమున స్థిరపడుము. రుద్ర, వసుగణ ప్రభృతి దేవతలు - నీవు ఈకుండమున చేరినందుకు- నుతింతురు గాత, నీవు  మామంత్రములను సఫలముచేయుము. వర్ధిల్లచేయుము. యజమానికి సౌభాగ్యము కలుగునట్లు ఇచట స్థిరపడుము.

    అధ్వర్యులగు అశ్వినులు నిన్ను ఇచట స్థాపింతురు గాత.

    'అశ్వినాధ్వర్యూదయతామిహత్వా.'

    3. ఇష్టకా! నీవు బలమును సురక్షితముగా ఉంచు దానవు. నీయొక్క సకల సామర్థ్యములచే దేవతల సుఖము - అత్యంతసౌందర్యము కొరకు రెండవ కుండమున స్థానమును గ్రహించుము. నీవు సుఖసేవనీయవు. తండ్రి కొడుకునకు సమకూర్చునట్టి సుఖములను పోలు ఈ స్థానమున నిలిచి వర్థిల్లుము. సుఖప్రవేశనీయమగు నీదేహముచే ఈరెండవచితియందు ప్రవేశించుము.

    అశ్వినాధ్వర్యూ సాదయతామిహత్వా.

    4. ఇష్టకా! నీవు రెండవ కుండపు పూరకమవు. అశ్విని ఇటుకవగు నిన్ను సమస్త దేవతలు ప్రశంసింతురు గాథ. నీవు త్రివృదాది స్తోమవంతవు. రధంతరాది పుష్టివంతవు. అమృత ఘృత సంగతవు. ఈరెండవ కుండమున స్థానము గ్రహించుము. మాకు సంతానముతో పాటు ధనమును ప్రసాదించుము.

    అశ్వినాధ్వర్యూ సాదయతామిహత్వా.

    5. అశ్వినీఇష్టకా! నీవు అంతరిక్షమును భరించుదానవు తూర్పుమున్నగు దిక్కులను నిలిపి ఉంచినదానవు. భూతమాత్రలకు స్వామినివి. నిన్ను ప్రథమచితి మీద స్థాపించుచున్నాను. నీవు  జలతరంగమవు. ఆ తరంగముల సారభూతరసమవు. విశ్వకర్మప్రజాపతియే నీ స్రష్టయగును.

    అశ్వినాధ్వర్యూ సాదయతా మిహత్వా.

    6. (ఋతవ్య ఉపదధాతి - ఋతవ్యములను -రెండు - ఇటుకలను కుండమున చేర్చవలెను)

    జ్యేష్ఠ, ఆషాఢమాసములు గ్రీష్మఋతువగును. ఋతవ్య ఇష్టకలారా! మీరు ద్వితీయ కుండమునందు ఉండువారు. మీరు ద్యావాపృథ్వులను మాకు అనుకూలము చేయండి. జలములను, ఓషధులను అనుకూలము చేయండి. మీరు ఏకమనస్కలై నా శ్రేష్ఠత్వము కొరకు నిలువండి. ఏకమనస్కలగు అగ్నులన్నియుద్యావాపృథ్వుల మధ్య నిలిచి ఉన్నవి. అవి ఋతవ్యములగు రెండు ఇటుకలను గ్రీష్మర్తువుగా భావించి - దేవతలందరు ఇంద్రుని చేరినట్లు  - ఆ ఇటుకలతో చేరవలెను. మీరు దేవతలచే నిర్మించబదినారు. పూర్వము మీరు అంగిర శాయనమున ధ్రువముగా నిలిచినారు అట్లే మీరిద్దరు నిశ్చలముగా ఇచట స్థిరపడండి.

    7. (వైశ్వదేవియను అయిదు ఇటుకలను కుండమున చేర్చవలెను.)

    వైశ్యేదేవి ఇష్టకా! నీవు ఋతువులందు సమాన ప్రీతిగలదానవు. జలములందు సమాన ప్రీతికలదానవు. దేవతలందు సమాన ప్రీతికలదానవు. బాల్య, యౌవన, వార్థక్యముల కార్యమగు ప్రాణదేవతలందు సమాన ప్రీతికలదానవు.

    వైశ్వానరుని కొరకు అధ్వర్యులగు అశ్వినులు నిన్ను ఇచట స్థాపింతురు గాత- వైశ్వానరాయాశ్వినాధ్వార్యూ సాదతామిహత్వా.

    వైశ్వదేవి ఇష్టకా! ఋతువులందు సమాన ప్రీతిగలదానవు. జలములందు సమాన ప్రీతికలదానవు. వసువులందు సమాన ప్రీతిగలదానవు బాల్య, యౌవన, వార్థక్యాముల కారణమగు ప్రాణదేవతలందు సమాన ప్రీతి కలదానవు.

    వైశ్వానరాయాశ్వినాధ్వర్యూ సాదతామిహత్వా.

    వైశ్వదేవి ఇష్టకా! ఋతువులందు సమాన ప్రీతిగలదానవు. జలములందు సమాన ప్రీతిగలదానవు. రుద్రులందు సమానప్రీతిగలదానవు. బాల్య, యౌవన, వార్థక్య కారణములగు ప్రాణ దేవతలందు సమాన ప్రీతికలదానవు.

    వైశ్వానరాయాశ్వినాధ్వర్యూ సాదతామిహత్వా.

    వైశ్వదేవిఇష్టకా! నీవు ఋతువులందు సమాన ప్రీతిగలదానవు. జలములందు సమాన ప్రీతిగల దానవు. ఆదిత్యులందు సమాన ప్రీతి గలదానావు. బాల్య, యౌవన, వార్థక్య కారకములగు ప్రాణదేవతలందు సమాన ప్రీతిగలదానవు.

    వైశ్వానరాయాశ్వినాధ్వర్యూ సాదతామిహత్వా.

    వైశ్వదేవి ఇష్టకా! నీవు ఋతువులందు సమాన ప్రీతి గలదానవు. జలములందు సమాన ప్రీతిగలదానవు. విశ్వేదేవతలందు సమాన ప్రీతిగలదానవు. బాల్య, యౌవన, వార్థక్య కారణములగు ప్రాణదేవతలందు సమాన ప్రీతిగలదానవు.

    వైశ్వానరాయాశ్వినాధ్వర్యూ సాదతామిహత్వా.

    8. (అయిదు ప్రాణభృత్, ఇటుకలను ద్వితీయ కుండమున చేర్చవలెను)
   
    ప్రాణభృత్ ఇష్టకా! నాప్రాణమును రక్షింపుము. అపానమును రక్షింపుము. వ్యానమును రక్షింపుము. నాకనుల దూరమును చూచునట్లు చేయుము. చెవులకు శబ్దము వినుశక్తి కలిగింపుము. జలములను పెంచుము ఓషధులందు ప్రాణము చేర్చుము. రెండు కాళ్ళమనుష్యులను రక్షింపుము. నాలుగు కాళ్ల గవాది జంతువులను రక్షింపుము. ద్యులోకము నుండి వర్షము కలిగించుము.

    9. (దక్షిణోత్తర పశ్చిమేష్వను కాన్తేషు పంచపంచ పూర్వేతు చతుస్రో వయస్యా సంజ్ఞకా ఇష్టకా ఉపదధాతి - దక్షిణ, ఉత్తర పశ్చిమములందు ఐదేసి, తూర్పున నాలుగు వయస్య నామక ఇటుకలను పేర్చవలెను.)

    పశువు మూర్ధప్రదానము. అది గాయత్రిఛందో రూపము ధరించినది. పారిపోయినది. ఆ పశువును మరియు గాయత్రీ ఛందమును వానివయసువాడై ప్రజాపతి మరల సాధించినాడు. వయస్య ఇష్టకా! నీవు గాయత్రీ ఛందమున ఆయాఅవస్థల పశురూప ప్రజాపతివి. నిన్ను రెండవ చితియందు చేర్చుచున్నాను.
   
    మయంద ఛందోరూపమున - బలప్రధాన - ప్రజాపతి ఆ వయసువాడై మయంద పశువును మరల సాధించినాడు. వయస్య ఇష్టకా! మయంద ప్రజాపతి రూపమవగు నిన్ను రెండవచితియందు చేర్చుచున్నాను.

    అధిపతి ఛందోరూపమున ప్రజాపతి ఆ వయసువాడై అధిపతి పశువును మరల సాధించినాడు. వయస్య ఇష్టకా! అధిపతి ఛందోరూప ప్రజాపతి రూపమవగు నిన్ను  ద్వితీయకుండమున చేర్చుచున్నాను.

    పరమేష్ఠి స్వరూపమున ప్రజాపతి ఆ వయసువాడై పరమేష్ఠిపశువును మరల సాధించినాడు. వయస్య ఇష్టకా! పరమేష్ఠిప్రజాపతి రూపమగు నిన్ను ద్వితీయ కుండమున చేర్చుచున్నాను.

    ఏకపద ఛందోరూపమున ప్రజాపతి ఆ వయసును దాల్చి అజపశువును మరల సాధించినాడు. వయస్యఇష్టకా! మేష విశాల ఛందోరూపమవగు నిన్ను రెండవకుండమున చేర్చుచున్నాను.

     విశాలఛందోరూపమున ప్రజాపతి ఆ వయసును దాల్చి  మేషపశువును మరల సాధించినాడు. వయస్య ఇష్టకా! పురుషతంద్ర ఛందోరూపమవగు నిన్ను రెండవకుండమున చేర్చుచున్నాను.
   
    తంద్రఛందోరూపమున  ప్రజాపతి ఆ వయసువాడై పురుషపశువును మరల సాధించినాడు. వయస్యఇష్టకా! పురుషతంద్ర ఛందోరూపమవగు నిన్ను రెండవ కుండమున చేర్చుచున్నాను.

    అనాధృష్ణ ఛందోరూపమున ప్రజాపతి ఆ వయసు దాల్చి వ్యాఘ్రపశుసును మరల సాధించినాడు. వయస్యఇష్టకా! పురుషతంద్ర ఛందోరూపమవగు నిన్ను రెండవ కుండమున చేర్చుచున్నాను.

    ఛది చందోరూపమున ప్రజాపతి ఆ వయసు దాల్చి సింహ పశువును మరలసాధించినాడు. వయస్య  ఇష్టకా! సింహఛది ఛందోరూపమున ఉన్న నిన్ను రెండవ కుండమున చేర్చుచున్నాను.

    వయశ్చది ఛందోరూపమున ప్రజాపతి ఆ వయసుదాల్చి నేపృష్ఠవాహ పశువును మరల సాధించినాడు. వయస్య ఇష్టకా! నేపృష్ఠ వాహ వయశ్చది ఛందోరూపవగు నిన్ను రెండవ కుండమున చేర్చుచున్నాను.

    కురుప్ ఛందోరూపమున ప్రజాపతి ఆ వయసువాడై సేచన సమర్థపశువులను మరల సాధించినాడు. వయస్య ఇష్టకా! సేచన సమర్ధ  పశు, కకుప్ ఛందో రూపవగు నిన్ను ద్వితీయ చితి యందు చేర్చుచున్నాను.

    బృహతీ ఛందో రూపమున ప్రజాపతి పూర్ణాయువై మరల ఆవిర్భావించినాడు. వయస్య ఇష్టకా! ప్రజాపతి స్వరూపమవగు నిన్ను రెండవ కుండమున చేర్చుచున్నాను.

    10. పంక్తి ఛందోరూపమున ప్రజాపతి పూర్ణాయువై మరల ఆవిర్భవించినాడు. వయస్య ఇష్టకా! పంక్తి ఛందోరూపమగు నిన్ను రెండవ కుండమున చేర్చుచున్నాను.

    జగతీ ఛందోరూపమున ప్రజాపతి ఆ వయసువాడై ధేనువును మరల సాధించినాడు. వయస్య ఇష్టకా! జగతీ ఛందోరూపమవగు నిన్ను రెండవ చితియందు చేర్చుచున్నాను.

    త్రిష్టుప్ ఛందోరూపమున ప్రజాపతి తదాయువై త్ర్యవిపశువును మరల సాధించినాడు. వయస్యఇష్టకా!  త్రిష్టుప్ ఛందోరూపవగు నిన్ను రెండవ కుండమున చేర్చుచున్నాను.

    విరాటఛందోరూపమున ప్రజాపతి రెండేళ్లవాడయి ద్వివర్షీయ పశువును మరల సాధించినాడు. వయస్య ఇష్టకా! విరాటఛందోరూపమవగు నిన్ను రెండవకుండమున చేర్చుచున్నాను.

    గాయత్రీ ఛందోరూపమున ప్రజాపతి రెండున్నర యేళ్లవాడై రెండున్నరయేళ్ల పశువును మరల సాధించినాడు. వయస్యఇష్టకా! గాయత్రీ ఛందోరూపమగు నిన్ను రెండవకుండమున చేర్చుచున్నాను.

    ఉష్ణిక్ ఛందోరూపమున ప్రజాపతి మూడేండ్లవాడై మూడేండ్ల పశువును మరల సాధించినాడు. వయస్యఇష్టకా! ఉష్ణిక్ ఛందోరూపమగు నిన్ను రెండవ కుండమున చేర్చుచున్నాను.

    అనుష్టుప్ ఛందోరూపమున ప్రజాపతి నాలుగేండ్లవాడై నాలుగేండ్ల పశువును మరల సాధించినాడు. వయస్య ఇష్టకా! అనుష్టప్ ఛందోరూపమావగు నిన్ను రెండవకుండమున చేర్చుచున్నాను.

   
        రెండవచితి - కుండము - సమాప్తము

    11. (స్వయమాతృణ్ణ నామక ఇటుకను అందుకొనవలెను.)

    ఇంద్రాగ్నులారా! అచలమగు ఈ ఇటుకను మూడవ కుండమున చేర్చండి.

    స్వయమాతృణ్ణ ఇష్టకే! నీవు చితిలో చేర్చబడుదానవు. నీమీద గల  ఇతర ఇటుకలను భరించుదానవు. ద్యావాపృథ్వీ అంతరిక్షములను వహించు దానవగుదువు.

    12. స్వయమాతృణ్ణ ఇష్టకే! నీవు అవకాశముగల దానవు. విస్తారమవు. స్వయముగా ప్రజాపతియే నిన్ను మూడవ కుండమున స్థాపించును గాత. నీవు ఈ మూడవ చితికి నియంతవు. ఈ  మూడవ కుండమును దృఢపరచుము. ఈ మూడవ కుండమును ముక్కలు కానీయకుము. సమస్త ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములందును - గృహస్థిత, యజ్ఞాది కర్మములందును ప్రతిష్ఠింపబడుదానవు. ఈ మూడవ చితి యందు ప్రతిష్ఠించబడిన నిన్ను అంతరిక్షదేవతయగు వాయువు సర్వదా రక్షించును గావుత. అతడు సకల యోగక్షేమయుక్తుడై శాంతతేజమున నిన్ను రక్షించును గావుత.

    ఇష్టకే! నీవు వాయు దేవతచే రక్షించబడుదానవు. పూర్వము అంగిరుల మూడవకుండమున దృఢముగా నిలిచినావు. అట్లే మా తృతీయ చితియందు దృఢముగా నిలువుము.

    13. (పంచ దిశ్యాసంజ్ఞకా ఇష్టకా ఉపదధాతి, 'దిశ్య' యను పేరుగల అయిదు ఇటుకలను పేర్చును)  




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.