Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||
పదమూడవ అధ్యాయము
1. మయిగ్నహ్ణామ్యగ్నే అగ్నిం రాయస్పోషాయ సుప్రజాస్త్వాయ సువీర్యాయ
మాము దేవతాః సచన్తామ్||
(త్రయోదశే పుష్క రపర్ణాద్యుపధానమన్త్రాణి ఉచ్యతే - పదమూడవ అధ్యాయము కమలపత్ర ఉపధానమంత్రములు చెప్పబడినవి. ఉత్తరవేది వెనుక కూర్చుని యజమాని జపించును.)
గోధన, అశ్వధన పుష్టికొరకును -సుసంతాన ప్రాప్తికొరకును- శుభములకు గాను బలవీర్యముల కొరకును సర్వప్రథమమున అగ్నిని స్థాపించుచున్నాను. ఇప్పుడు యజనీయ దేవతలందరు హవిరాదులను స్వీకరించవలెను.
2. (పుష్కర పర్ణముపదధాతిస్తమ్భే - దర్భల కూర్చమీద కమల పత్రమును ఉంచవలెను)
కమలపత్రమా! నీవు జలముల పృష్టమవు. అగ్నికొరకు తేబడిన మట్టికి కారణకన్న ముందు వెలువడినాడు. వెలువడిన ఆదిత్యుడు అంతరిక్షమున విరాజిల్లు సత్ - అసత్ లను స్వప్రకాశమున అభివ్యక్తము చేయును.
4. అతడు సృష్టికన్న ముందే హిరణ్యగర్భుడై అవతరించినాడు. సృష్టి జరిగినంత అతడే భూతజాతమునకు అధిపతిఅయినాడు. అతడే ద్యులోక భూలోకములను ధరించినాడు. అట్టి ఏ దేవతకు హవిస్సు అర్పించవలెను?
కస్మైదేవాయ హవిషా విధేమ?
5. సూర్యుడు మహాప్రకాశమునకు కేంద్ర బిందువు. అతడు ద్యులోక, భూలోక, అంతరిక్షములను మొట్టమొదటి ప్రకాశింపచేసినాడు ఈముల్లోకములు ఎల్లరకు సమాన స్థానములు. సూర్యుడు అట్టిముల్లోకములందు సంచరించువాడు. అతనిని - సప్తదిశలకు ప్రతీకలగు -సప్తఋత్విజుల సహితుడనై యజింతును.
6. (యజమానో హిరణ్యపురుషం పశ్యనృక్త్రయం పఠేత్ యజమాని హిరణ్యపురుషుని దర్శించి మూడు మంత్రములను చదువవలెను)
భూమి మీద అన్ని దిశలందున్న సర్పములకు వందనము. అంతరిక్షమున, ద్యులోకమున ఉన్న సర్పములకు వందనము.
7. యాతుధానుల బాణస్వరూపములగునవియు - వనస్పతులందు దాగి ఉన్నవియు -గుంతలందు పడినిద్రించినవియునగు సర్వసర్పములకు నమస్కారము.
8. వెలుగులు నిండిన ద్యులోకమందున్నవియు - సూర్యకిరణములందున్నవియు - జలములే నివాసముగాగల సర్వసర్పములకు నమస్సులు.
9. (హిరణ్యపురుషునకు ఘృతాహుతులు అర్పించవలెను)
అగ్నీ! నీ బలమును వ్యక్తపరచుము. దుష్టులను సంతప్తులను చేయుటకుగాను - రాజు మంత్రుల సహితుడై గజము మీద సర్వత్ర సంచరించునట్లు - భూమి యందంతటను వల వలె వ్యాపింపుము. క్రోధము కలిగినంత రాక్షసాదులమీద నిశిత శరములు కురిపించువాడవు - నీవు రాక్షసులు మండిపోవు నీ మంటలందు కాల్చుము.
10. అగ్నీ! నీ జ్వాలలు వాయుప్రేరితములు. శీఘ్రసంచారలు. వానిని మరింత తీవ్రము చేయుము. ఆ తీవ్రజ్వాలలందు రాక్షసులను భస్మము చేయుము. పిశాచములను భస్మముచేయుము. అగ్నీ! నీ విస్ఫులింగములను నలుదిశలకు చిమ్ముము.
11. అగ్నీ! మమ్ము రక్షించుటకు నలుదిశల నీ అనుచరులను నిలుపుము. నీవు అత్యంత వేగవంతుడవు. ఆహింస్యుడవు. మా ప్రజలకు పాలకుడవగుము. నిందించువారు మాకు దగ్గరలో ఉన్నారు. దూరమందున్నను నిన్ను బాధించరాదు. బాధించలేరు.
12. అగ్నీ! నీవు నీ మంటలచే మండిపడుము. ఆ మంటలను వ్యాపింపచేయుము. మాశత్రువులను పూర్తిగా దహనము చేయుము.
అగ్నీ! నీ ఆయుధములు - జ్వాలలు - అతి తీక్ష్ణములు. కొందరు మా విషయమున అదాతలు అయినారు. అట్టివారిని- నీవు ఎండుగడ్డినివలె - కాల్చి బూడిద చేయుము.
13. అగ్నీ! నీవు నీజ్వాలలను పైపైకి పంపుము - పెంచుము. మమ్ము పొంచి ఉన్న శత్రువును నీజ్వాలలచే కాల్చివేయుము. రాక్షసులు ఎక్కుపెట్టిన బాణములను పడవేయుము. మా శత్రువు వంటరియైనను - సంఘీభూతుడైనను వారిని మెలిపెట్టుము. జుహువా! అగ్ని తేజము సన్నిహితముగా నిన్ను స్థాపించుచున్నాను.
14. ఈ అగ్ని పగటిపూట ఆదిత్యరూపుడై ద్యులోకపు శీర్షమగును. ఆకాశపు ఉన్నతస్కంధమగును. పృథ్వికి పాలకుడగును. ఇతడు జలముల బలములను వర్ధిల్లచేయును.
(ఔదుంబరం దధిపూర్ణాం స్రచముత్తరే దధాతి - ఔదుంబర స్రువమున దధిని నింపి ఉత్తరమున నిలుపుము )
ఔదుంబరస్రువమా! ఇంద్రుని ఓజస్సు సహితముగా నిన్ను ఇచట స్థాపించుచున్నాను.
15. అగ్నీ! నీవు జ్వాలా జిహ్వుడవు - నీ జిహ్వలు హవ్యవాహికలు. నీవు వాయువు యొక్క కళ్యాణవంత ఆడు గుర్రములను అధిరోహింతువు. అప్పుడు యజ్ఞములకును వర్షజలములకును నేతవగుదువు. స్వర్గప్రదమగు జ్వాలా శిఖరమును ద్యులోకమున విస్తరింపచేసెదవు.
16. (స్వయమాతృణ్ణాం పృథిసంస్తుతా మిష్టకాముపదధాతి - విరిగిన మట్టి ఇటుకను కుండమున వేయవలెను)
ఇష్టకా! నీవు పృథ్విని ధరించుదానవు. అత్యంతస్థిరరమవు. నీవు విశ్వాకర్మచే ఇచట స్థాపించబడినావు. ఇక నిన్ను ఈ సముద్రముగాని, హిరణ్మయుడు గాని బాధించజాలరు. ఎత్తిబాధలు లేనిదానవై కుండమును దృఢపరచుము.
17. ఇష్టకా! నీవు అవకాశయుక్తవు. విస్తారయుక్తవు. జలముల పృష్టభాగమునను- సముద్రమార్గమునను ప్రజాపతియే నిన్ను స్థాపించును గాత. నీవు ఎంతో విస్తరించుము - నీవు నేలవుకదా!
18. ఇష్టకా! నీవు భువమవు. భూమివి-భూరసి భూమిరసి' ఆదిత్యస్వరూపవు. సమస్త విశ్వమును ధరించు దానవు- భరించుదానవు. పృథ్విని సంయమితము చేయుము. ఈ కుండమును దృఢమొనర్చుము. ఈ కుండమును బాధించకుము.
19. స్వయమాతృణ్ణఇష్టకా! లోకములన్నింటి ప్రాణ, అపాన, వ్యాన, ఉదానములు - కీర్తి - శాస్త్రీయ ఆచరణసిద్ధి కొరకు నిన్ను స్థాపించుచున్నాను. మహాయోగ క్షేమ సంపత్తితోను, సుఖ కరమగు గృహముతోను అగ్ని నిన్ను రక్షించును గాత. అగ్నిద్వారా సురక్షితవైన నీవు- అంగిరుల యజ్ఞమందు వలె - మా యజ్ఞమును స్థిరపడుము.
20. (అగ్నినా ద్రష్టాం దూర్వేష్టకాముపదధాతి - అగ్నికి చూపిన దూర్వాను ఇటుకపై వేయవలెను)
దూర్వమా! ఈ మట్టి - ఇటుక - లో నాటుకొని పర్వపర్వములుగా పెరిగినట్లు మమ్ము సహితము శతసహస్ర పుత్ర, పౌత్రులతో వర్ధిల్లచేయుము.
21. దూర్వమా - గారికా! నీవు నీ వందలకొలది వ్రేళ్లను వ్యాపింపచేయుదువు. తదుపరి వేలవేల మొక్కలుగా నెల నుండి బయటపడుదువు. అట్టి నిన్ను ఈ స్థానమున హవి అర్పించి సేవింతుము.
22. అగ్నీ! నీవు నీ సకల జ్యోతియుతుడవై సూర్యుని యందు చేరినావు. నీ కిరణములతోనే ద్యులోకమును ప్రకాశవంతము చేసినావు. అట్టి నీ సమస్త ప్రకాశములచే సమస్తజనులను ప్రకాశింపచేయుము.
23. దేవతలారా! మీకాంతులు సూర్యునందున్నవి - గోవులందున్నవి. అశ్వములందున్నవి. ఇంద్రాగ్ని బృహస్పతులారా! మమ్ము అట్టి సమస్త కాంతులచే కాంతిమంతులను చేయండి.
ఈ భూలోకము ఎంతో శోభాయమానము. అది జ్యోతిరూపమగు అగ్నిని ధరించును. ద్యులోకము స్వయంప్రకాశము. అట్లయ్యు ఆదిత్యరూపమగు అగ్నిని ధరించును.
(రెండవ ఇటుకను పేర్చవలెను)
ఇటుకా! నీపేరు విశ్వజ్యోతి. నిన్ను ప్రజాపతి స్వయముగా స్థాపించును గాత. నీవు మాకు జ్యోతిని ప్రసాదించుము. అగ్నియే నీకు స్వామి యగును. అంగిరుల యజ్ఞమును స్థిరముగ నిలిచినా రీతి - అగ్నిద్వారా స్థాపించబడిన నీవు ఈ కుండమందు యథాస్థానమున దృఢముగా స్థిరపడుము.
25. (ఋతవ్యే ఉపదధాతి - ఋతవీ అను ఇటుకను పేర్చవలెను)
చైత్ర - వైశాఖములు వసంతఋతువగును. వసంతమా! కుండమందు చేరిన ఈ అగ్నిని మధ్యనుంచి సంధించుదానవు. ద్యావాపృథ్వులను అనుకూల పరచుము. జలములను, ఓషధులను అనుకూలము చేయుము. నాపెత్తనము నిమిత్తము ఇష్టికారూప అగ్నులను అనుకూలము చేయుము. ఇతరులు సహితము ద్యావాపృథ్వులకు మధ్య వేదికలను ఏర్పరచినారు. అన్యదేవతలు ఇంద్రుని సేవించుటకు చుట్టుముట్టినట్లు -వసంతమా! ఆ వేదికల సహితముగా మా వేదికి సమాహితమగుము.
ఇష్టకా! అగ్ని నీకు అధిపతి. నీవు అగ్నిచే ఈ కుండమున స్థాపించబడినావు. అంగిరుల యజ్ఞమున స్థిరపడి నిలిచినట్లు - ఈ కుండమందు యథాస్థానమున దృఢముగా స్థిరపడుము.
26. (కూర్మం దధిమధుఘృతైరభ్యనక్తి - తాబేలును పెరుగు, తేనే, నేతులతో స్నాన మాడించవలెను)
27. యజ్ఞసంకల్పముగల యజమానికి వాయువు మధురమై వీచును. నదులు మధురములై ప్రవహించును. మాకు ఓషధులు మధురములు కావలెను.
28. మాకు రాత్రులు మధురములు అగును గాత. పగళ్లు మధురములగును గాత. ఈభూలోకము మధుయుక్తమగును గాత. మనలనందరను పాలించు ద్యులోకము మధురమగును గాత.
29. వనస్పతులు మధురములు అగును గాత. సూర్యుడు మధుతముడు అగును గాత. గోవులు మధురములగు దుగ్ధఘృతములు ఇచ్చునవి అగును గాత.
30. (ఆషాఢమను ఇటుకను మూరెడు దూరమున ఉన్న మూడవ పద్య ఇటుక దగ్గరి శేవల తృణమందు తాబేలును వదలవలెను)
కూర్మమా! జలపు గంభీరదేశమగు రవిమండలమున ప్రవేశింపుము. అచట సూర్యుడు నీకు తాపము కలిగించకుండవలెను. విశ్వనేత అగ్ని నిన్ను కాపాడవలెను. అనఖండిత అవయవములు గల ఇటుకలను ప్రజను నీవు వీక్షించుము. నిన్ను దివ్యవృష్టి తడుపుచుండును గాత.
త్వాదివ్యావృష్టిః సచతామ్.
31. (కూర్మమును చేతితో రుద్దవలెను)
ఈకచ్ఛపము జలములకు అధిపతి. ఇటుకల అభివర్షకము. ఇది ముల్లోకములు దాటిపోవును. కూర్మమా! ఆహుతి ఇచ్చిన పశువు వలె పుణ్యలోకమునకు చేరుము. అక్కడ పూర్వకాలమున కుండములందు మరణించిన కూర్మములు ఉన్నవి. నీవు కూడ అచటికి చేరుము.
32. మహీద్యౌః పృథివీ చ న ఇమం యజ్ఞమిమిక్షితామ్|
పితృతాంనో భరీమంభిః
8వ అధ్యాయపు 32వ మంత్రము పునరావృతము.
33. (ఉలూఖలమూసలే ఉపదధాతి. రోలురోకలిని ఒక చోట పెట్టవలెను.)
విష్ణువు కర్మలను చూడండి! ఏ విష్ణువు యజ్ఞకారకుడో అతడు ఇంద్రునకు అనుకూల మిత్రుడగుచున్నాడు!
34. (రోటి మీద రోకలిని పెట్టవలెను)
ఉలూఖలమా! నీవు జగములు ధరించుదానవు. అత్యంత స్థిరమవు. అగ్ని తొలుత రోలు- రోకలి నుండియే పుట్టినది. తదుపరి రెండు అరణులందు ఆవిర్భవించినది. అట్టి అగ్నికి తన విధులు తెలియును. గాయత్రి, త్రిష్ణుప్, అనుష్టుప్ ఛందముల ద్వారా అర్పించిన ఆహుతులను దేవతలకు చేర్చుణు.
35. ఉఖా! మాకు వర్షము, గోధనము, అశ్వ ధనము, బలము, యజ్ఞము, సంతానము కలుగుటకు నీవు ఇచటనే విశ్రమింపుము. నీవు సామ్రాట్టువు - స్వరాట్టువు - "సామ్రాడసి స్వరాడసి" సరస్వతి యొక్క రెండు స్రోతములు నిన్ను రక్షించును గాత.
36. (ఋగ్ద్యయేనోఖామధ్యే ఆహుతీ జుహొతి. ఈ రెండు మంత్రములచే ఉఖామధ్యమున రెండు ఆహుతులు అర్పించవలెను.)





