Home » vaddera chandidas » ప్రేమతో ....వడ్డెర చండీదాస్


                                                                                        
                                                                                                                         తిరుపతి
                                                                                                                        8-8-04
    రఘుగారికి నమస్తే,
    యెప్పడో తప్ప యెప్పడూ  దిగులు,  రేవతీదేవి  కవిత వొచ్చిందగ్గ్ర్నుంచి, అది తోడు.
    దిగులు
    దిగులు దిగులుగా దిగులు
    ఎందుకా
    ఎందుకో  చెప్పేవిలుంటే
    దిగులెందుకు
    కొన్ని సినిమాలు యెందుకు ఫ్లాప్  అవుతాయో  నాకు ఆశ్చర్యంగా వుంటుంది. మణిరత్నం హిందీ సినిమా 'దిల్ సె '  చాలా బావుంది.  ప్లాప్ ఐంది.
    రాగాల వ్తెభావా వ్తెభావం; పాడేవాళ్లని  బట్టే కాక, కీర్తనలను బట్టి కూడా వుంటుంది.
    క్లారినెట్  మంచి వాద్యం. ఆర్కెస్ట్రాలో  తప్ప విడిగా యెక్కువగా వినిపించదు.
    ఘనం శ్రీ నయ్య  నాటకురంజి  శివదీక్షాపరురాలను  రా యింతవరకూ యెవరూ పాడగా  వినలేదు.చాలా మంచి కీర్తన.
    వోసామా బిక్ లాడెన్  అల్ ఖ్తేదా  నుంచి మూడేళ్ళుగా దేశాన్ని రక్షించుకుంటోంది, అమెరికా.  అసాధారణ,  అనితరసాధ్య సామర్ధ్యం!
    వారానికి ఐదురోజులు  టివిలో చాలా అందమ్తెన  యువతీ తియ్యగా బాగా పాడగా మలయాళం  పాటలు వింటున్నాను.
    యీ పూట bombay  sisters తిల్లానాల కాసేట్ వింటున్నాను. బావుంది. (జంట  అని సందేహించాను కాని బాగా పాడారు వకటిగా) వయొలిన్ కి యుగళం  త్రయం కూడా నప్పతుంది.
    నా దగ్గిర యం.యల్. వసంతకుమారి  కాసెట్లు  చాలా వున్నాయి.
    హిందీ సినిమాల్లో దేశభక్తి  పాటలు మంచివి; వకటి రెండు గంటలకి సరిపాదా వున్నాయి.
    రేడియోలో - యే స్టేషనో యెవరో తెలియదు - బాగా పాడుతున్నారు, దుర్గా. దుర్గా రాగం నాకిష్టం.
    బాలమురళీకృష్ణ లాగా  స్వియరచన అంటూ కొందరు విద్వాంసులు తమ ప్రావిణ్యాన్ని  పాడుచేసుకుంటూ వుంటారు.  యీ మధ్య star Utsav channel లో  హరిప్రసాద్ చౌరాసియా కదా అని రికార్డు చేశాను. self composition బాసురి  సవ్వడే మారిపోయింది!  ఘోరం.  యం.యస్. సుబ్బలక్ష్మి,  యం.యల్. వసంతకుమారి, కిశోరి  అమోన్ కర్ లాంటి వాళ్ళు సొంత రచనల  జోలికి పోలేదు. బాలమురళికృష్ణ తన అధ్వితియగాన  గొప్పతనాన్నటుంచి;  గానేతరంగా  over estimate  చేసుకుంటాడు.
    వివిధభారతి,  శాస్త్రీయ సంగీతం అనురంజని  సాయంత్రం ఆరుంపావుకి  మార్చారు. SW మిద బాగా వొస్తుంది. అవసరం ఐతే  రికార్డు చేసుకోవచ్చు. చూడగా; తెలుగు న్యాస్ చానల్స్  Etv-2 కంటే tv-9  చాలా బావుంది.
    ముఘలె  ఆజమ్  కంటే Black and white అనార్ కలి యెక్కువ బావుంది, నాకు.  యిదే ఆధారంగా తెలుగులో అనార్ కలి తీశారు. హ్తేదరాబాద్  రేడియో లో  శుక్రవారం  రాత్రి 10 గంటలకి  సంగీత  సుధ తప్ప వింటానికేమి  వుండదు.
    సోమవారాలు నిమ్మి మిశ్రా చాయాగిత్,  అధ్బుతం.
    మీ నలుగురికి శుభాకాంక్షలు

                                                                                                     -వడ్డెర చండీదాస్
                                                                                                                                                                                                                                                                                                                   

                                                                                                          తిరుపతి
                                                                                                         9-8-04
    రఘుగారికి నమస్తే,
    ఇందిరాగాంధీ వుపన్యాసం బావుండేది.  గొంతు బావుంటుంది. యాక్సెన్ట్  బావుంటుంది. వయసు మళ్ళినాక చాలా అందంగా వుండేది.
    మంచి సినిమా సంగీతం కోసం - వివిధ భారతి యెక్కువగా పెడుతుండే వాడిని. యిప్పుడు బావుండటంలేదు.
    వారానికి - వివిధ భారతి 15 గంటలు,  శ్రీ లంక 30 గంటలు,  డిల్లి 10 గంటలు, శాస్త్రీయ సంగీతం  20 గంటలు  పెడుతున్నాను. మిగతా  సమయం టేప్  రికార్దరూ,  టివి,  (రోజూ రాత్రి ఆరుగంటలు  నిద్ర ) (తెలుగు పాటలు టేప్ రికార్డర్ లోనే).
    ముబారక్ బేగం, సుధా మల్ హొత్రాలవి మంచి  గొంతులు. యెందుకో పాటలు లేవు.
    పంజాబీ జానపద సంగీతం యిష్టం. మిగతా పాప్  సంగీతంలా,  పంజాబీ పాప్  సంగీతం  కూడా  యిష్టం లేదు. రాజస్తాని  బెంగాలి జానపద సంగితాలు కూడా యిష్టం. తెలుగు జానపద సాహిత్యం  యిష్టం.
    సాధారణంగా నేను వుత్తరం రాయటం,  రెండు మూడు రోజులు పడుతుంది.  రాయటం  ముగించాక  తేది వేస్తాను.
    Music  Today వాళ్ళు వేశారని జయంతి అని వోకామె వీణ కాసేట్ కొన్నాను. రాగాల దారి రాగాలాదే. కాసేట్ మొత్తం వోకలాగే వాయించింది.  ముందుగా తెలియకండా కొనదలచలేదు.
    పక్కవాద్యం -  రుక్మిణి వయొలిన్ సవ్వడి బావుంటుంది. బాగా వాయిస్తుంది కూడా.
    జీవితాన్ని యాగి పెట్టకండా జీవించేవాళ్ళు; జీవితం గురించి వాఖ్యానాలు చేస్తూ పోరు. చివరకు మిగిలేదిలో  వివిధ అంశాల గురించి నిర్వచనా లేక్కువ.
    సంగితా వాళ్ళ బాలమురళీకృష్ణ తిల్లానాల  too  fast.  డాన్సర్లు  follow అవటం చాలా కష్టం. సుదారఘునాథన్  తిల్లానాలు అందరూ follow అవటానికి విలు. (యెందుకో  తమిళం వోదలలేదు యింకా).
    హరికథ  బాగోదు. బుర్రకథ  బావుంటుంది. మనసిపూట  చిరుహసంగా వుంది. వరదనాటి గోదావరిలా హిందోళరాగంలా పొంగులెత్తటం  లేదు. శ్రావణ సెలయేటి జాలులా మధ్యమావతి రాగంలా జాల్వారుతోంది.
    కరంటు యెప్పుడు పోయినా పర్లేదుగాని, రికార్డింగ్ చేస్తున్నప్పుడు పోతే చాలా అసహనం. మొన్నోకసారి గాయత్రి గారిని  రికార్డింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో పదినిమిషాలు పోయింది.
    కొత్త చానల్ స్టార్ వుత్సావ్  పెట్టారు.  వుదయం 6-7హిందూస్తాని  శాస్త్రీయ సంగీతం పెడుతున్నారు. యివాళ్ళ DD chennai లో నాదస్వరం.  అందుకని స్టార్ వుత్సావ్ పెట్టాను. సితార్ వొస్తోంది.
    మీ నలుగురికి శుభాకాంక్షలు     
                                                                                                                     -వడ్డెర చండీదాస్.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.