Home » vaddera chandidas » ప్రేమతో ....వడ్డెర చండీదాస్


                                                                                                      తిరుపతి
                                                                                                   24-7-04
    రఘుగారికి నమస్తే,
    1996 లో 90 యేళ్ళ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగార్ గాత్రం విన్నాను. బావుంది. ప్రత్యేకించి శంకరాభరణం.
    జయప్రద, పెళ్ళి కూతురి గెటప్ లో,  నర్తకి  గెటప్ లోనూ చాలా బావుండేది.
    ర్తేల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ర్తెళ్ళలో సాప్ట్ డ్రింక్స్ కి బదులు మజ్జిగ లస్సి ఉంటాయన్నాడు. అది ఆచారణియం కాదు. బడ్జెట్  ఆంగ్లేతరభాష లో  ప్రవేశ పెట్టటం  యిదే మొదలు. తమిళులు యేమి మాట్లాడలేరు యెందుకో!
    నా జ్వరం గురించి అమెరికా రాశానన్నానుకదా. My son-in-law informed  మే on phone, brain లో hypothylamas  ప్రక్కన therostat  center  వుంటుంది. బయటి వుష్ణోగ్రతకి  మారకుండా వొంట్లో యెప్పడూ  నార్మల్ వుండేలా చూస్తూంది. అది సరిగా పని చెయ్యకపోతే బయటి వుష్ణోగ్రతను బట్టి వొంట్లో  temperature  మారుతూంటుంది. One year నుంచి అలా వుంటోంది no discomfort  అన్నారు కనక you చన్ ignore. this is my opinion అని అన్నారు.  I  think he is a genius (నేప్రాలజిస్ట్!)
    మీ  దస్తూరి; సమస్య చాలా అక్షరాల సందర్భాన్ని బట్టి పోల్చుకుంటుంటాను!
    మీ మ్తెదానం లోతుల్లోకి - కాపీలు అమ్ముడయిపోయాయి అని రాశారు. విమర్శగ్రంధం  కదా సంతోష విశేషం.
    I wonder what happens  to so many  new  teen -age Models  produced in Fashion week of Fashion TV every year by  Brazil!
    అది వరకు తిరుపతి FM వివిధ భారతి 12-30 నుంచి రిలే  చేసేది. 12.30 కి హిందూస్తాని క్లాసికల్  వొస్తుంది. అవసరం ఐతే రికార్డు చేసుకునే  వాడిని. యిప్పడు  చెన్త్నే MW నుంచి వింటున్నాను. రికార్డింగ్ కి విలుకాదు. యింక రికార్డింగ్ హ్తేదరాబాద్  డిల్లిలే.
    చాలా కాలానికి మొన్నక  రోజు  వుదయం 6 గంటలకు DD  chennai లో గాయత్రి గారు వొచ్చారు. లావయ్యారు. గంట సెపు  వీణ. అలవోకగా  అధ్బుతంగా వాయిస్తారు.
    నాకు ప్రపంచంలో అత్యంత దుర్భరంగా అనిపించేది; రేడియోలో ఫోన్లో  పాటలడిగే కార్యక్రమం. (అడ్డమ్తెన  వాళ్ళూ  అడ్డమ్తెన  వూసులూ, అడ్డమ్తెన పాటలూ)
    నా వుత్తరాలు   మళ్ళి మళ్ళి చదువుకుంటున్నాట్లూ, భద్రపరుస్తున్నట్లూ రాశారు. అలా ఐతే నేను వొళ్ళు దగ్గిర పెట్టుకుని రాస్తుండాలి!
    రోజూ నిద్రలేవటం అలారం తోటే లేస్తాను. వొక్కోరోజు  వెంటనే యేదన్నా గుర్తొస్తుంది. లేస్తూనే టివి స్విచ్ ఆన్ చేస్తాను, చూస్తూ వింటూ, కుక్కర్ రడి చేసి  స్టౌమిద పెట్టి, పళ్ళు తోముకుంటాను. ఆలోపు విజిల్స్  వొస్తాయి. స్టౌ ఆఫ్ చేసి స్నానిస్తాను. వంట గంటపని . నాకెప్పుడు శ్రమగా గాని విసుగుగా గాని అనిపించలేదు.
    రోజు ఉదయం 9 నుంచి 10  వరకు;  చెన్త్నే ,  తిరువనందపురంలలో కర్నాటక సంగీతం వొస్తుంది.  బావుంటుంది.
    పాడేవాళ్ళు యెప్పడన్నా  గుక్కపడతారు. పసివాళ్ళు, యేడ్చేటప్పడు  వొక్కోసారి  అంతకంటే  అమోఘంగా గుక్కపడతారు!
    తిరుపతి వేసవి నాకిష్టం లేదు. మూడు నెలలు దుర్భరం.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                    -వడ్డెర చండీదాస్.

                                                                                                            తిరుపతి
                                                                                                         25-7-04
    రఘుగారికి నమస్తే,
    మీ వూరు కడపజిల్లా కోడూరు దగ్గిర అని రాశాను. మీరు మొన్న పుత్తూరు దగ్గిర అని రాశారు. మీ మాటల్లో పుత్తూరు యెక్కువగా  రాలేదేన్నడూ. కోడూరు వొస్తుండేది. అవసరం ఐతే నా వుత్తరంలో  మార్చండి.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                         -వడ్డెర చండీదాస్.

                                                                                                               తిరుపతి
                                                                                                            30-7-04
    రఘుగారికి నమస్తే,
    యిప్పటి సూపర్ టెక్నాలజీ లేని వెనకటి రోజుల్లో, సినిమా పాటల్లో; మెలోడి మాట అటుంచి, అద్బుత స్పష్టత వుండేది. పాట మొత్తం, ప్రతి అక్షరం సుస్పష్టంగా  చెవికి మనసుకి వినిపించేది.
    హార్మోనియం (హిందుస్తానికి)  పక్కవాద్యంగా కాక, విడిగా వినటానికి బావుంటుంది (ముఖ్యంగా కర్నాటక.)
    పాకిస్తాన్ వెళ్ళి పోయిన  రేష్మా  యిండియాలో  తన ప్రత్యేకమ్తెనా  గొంతుతో ప్రత్యేకమ్తెన  పాటలు  పాడుతుంది, హృద్యంగా.
    యీ పూట సుధా రఘునాధన్ ని  వింటున్నాను. ఆమె గొంతులో స్పష్టత. కంపన  వున్నాయి.  బాగా  పాడుతుంది MLV  శిష్యురాలు. యంగ్  talent.
    రాగాలలో చాలా రాగాలో బావుంటాయి. పాడేవాళ్ళని  బట్టి వుంటుంది.
    వెనకటి కాలంలో -  యె.పి.  కోమల శాస్త్రియాదారిత  పాటలు బాగా పాడుతుండేది.
    గజల్స్  యిష్టంలేని  నాకు,  సంగితదర్శకుడు  మదన్ మోహన్ గజల్స్  చాలా యిష్టం. లతా మంగేష్కర్ మదన్ మోహన్  గజల్  కె బాద్ షా అంది.  అనితరసాధ్య అత్యంత మధుర సంపూర్ణ శాస్త్రీయ సంగీత దర్శకుడు. యిష్టం. చాలా యిష్టం. చాలా చాలా యిష్టం.
    నా రేడియోలో  SW మిద వివిధ భారతి పెట్టటం సులభం.  శ్రీ లంక పెట్టటం పెద్ద  సమస్య.  అదే చోట పటలోచ్చే స్టేషన్లు  కిక్కిరిసి  వుంటాయి. శ్రీ లంక యేదో  యేది  కాదో తెలుసుకోవటం కష్టం. announcer  వొచ్చే వరకూ గుర్తించటం సాధ్యం   కాదు. లేదూ, మిగతావాళ్ళూ  యేడున్నరకి  ముగిస్తారు. శ్రీలంక  main అనౌన్సర్ మాట్లాడటం ముద్దు ముద్దుగా  వుంటుంది.
    నేను  తెలుగుభాష 40 అక్షరాలతోటే రాస్తాను.
    రోజులో చాలాసార్లు లతామంగేష్కర్  ని  తలుచుకుంటూ వుంటాను.
    నా దగ్గిర హిందీపాటల  కాసెట్లు  లేవు. రోజంతా రేడియో  స్టేషన్లలో  వింటూనే వుంటాను కదా!
    నాకు చమట యెక్కువ. 30డిగ్రీల  సెంటిగ్రేడ్  దాటితే  చమటలు. 24 గంటలూ fan నో Air cooler రో వుండాలి (తిరుపతికి power cut  వుండదు).
    రిటైరయ్యి తిరిగ్గానె  వున్నారుగా మరో నవల రాయండి అని అవే వాళ్ళంటే  చోరాకు అసహనం. నేను రాయటానికి యేం కావాలో యేం అక్కరలేదో హిమజ్వాల అర్ధనుస్వారంలో రాశాను.
    నేనిప్పుడు రాయటం; చెప్పలేసుకుని కూచిపూడి నాట్యం చేసినట్లు!
     కేరళ సరిహద్దు  రాష్టం కాకపోయినా  మలయాళంలో అచ్చతెలుగు  పదాలు చాలా వున్నాయి . వుదాహరణకి  - పువ్వు పాత నడవడి.  యిక  సంస్కృతి  పదాల్తేతే  రెండు భాషల్లోనూ  సమానార్ధలలో  వున్నాయి.
    DD  Hyderabad  (సప్తగిరి)లో  శినివారాలు పొద్దుట 10.30  కి కూచిపూడి  వొచ్చేది.  యిప్పుడు రావటం  లేదు.  యింక సాయంత్రం 7 గంటలకి వార్తల  కోసం తప్ప  యీ తెలుగు చానల్  కూడా పెట్టాల్సిన పనిలేదు!
    దేశ విభజన వల్ల  పాకిస్తాన్; సంగీతం నష్టపడింది, కోల్పోయింది.
    వుదయం 6 గంటలకి  DD chennai  లో మంచిదేది లేకపోతే - శ్రీలంక  రేడియో  పెట్టి, టివి sound mute లో పెడతాను.
    కోకిల కంఠస్వర లతా మంగేష్కర్;  భారతదేశ మాధుర్య సౌభాగ్యం.
    P.S. సంతోషం;  వుత్తరం విపరంగా రాశారు.  నా దగ్గిర అనుక్షణికం  గురించి యేమి లేదు. తెలియదు.
                 మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                            -వడ్డెర చండీదాస్.               
 




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.