Home » vaddera chandidas » ప్రేమతో ....వడ్డెర చండీదాస్


   

                                                                                                     తిరుపతి
                                                                                                   28-9-04
    రఘుగారికి నమస్తే,
    వివిధ భారతిలో - మంచి సంగీతం తగ్గిపోగా, సొంతడబ్బా ప్రకటనలు మోత యెక్కువ్తెంది.
    మీ వుత్తరంలో  విషయం  తెలిసింది.  విషయాలు తెలియలేదు. దస్తూరి అక్షరాలూ  పోల్చుకోలేకపోయాను.
    మలయాళం పాటల్లో యేక్కవగా  మగగొంతు  వినిపిస్తుంది, యెందుకో.
    చిత్రకి  తెలుగులో వున్నన్ని పాటలు,  మాతృభాష  మలయాళంలో లేవు! చిత్రకి తెలిగు వొచ్చు.
    విరసంకారణంగా, డిజ్తేర్  అన్డ  లిబరేషన్ ఆపి అనుక్షణికం తీసుకున్నారు. అలాగే హిమజ్వాల కూడా తీసుకోండి.
    మంచి popular పాటలు మంచి popular రొమాంటిక్ సినిమాల దర్శకనిర్మాత; నాసిర్  హుస్సేయిన్ .
    తెలిసినతను వోస్తూంటే  అమెరికా నుంచి మా అమ్మాయి నాకో వాచీ పంపించింది, latest  technology  ఆట, seiko  kinetic. Date  వుంటుంది. కి యిచ్చే పద్ధతి లేదు. cell లేదు.  యెప్పడూ  ఆర్నేల్లుకి  (electric charge) నిల్వ వుతుంది. చేతికి పెట్టుకుంటూంటే చాలు. అమెరికాలో cars, eletronics యెక్కువ గా  జపాన్ వి.
    తెలుగులో - పట్నం సుబ్రమణ్య అయ్యర్ కి మంచి కృతులు చాలా వున్నాయి.
    బాలమురళిది  కొత్త కాసేట్ త్రివేన్ని -most unworthy cassette.
    కాసెట్లు,  Rewind,  FF  చెయ్యను. same cassette  వెంటనే రిపీట్ చెయ్యను.
    నేను రోజులో కొన్నిసార్లు తలుచుకునేది;  గాయత్రిగారు,  లతామంగేష్కర్  (యిద్దరితోనూ పరిచయం లేదు).
    యెందువల్లనన్నా గాని జనంలో భక్తి  మితిమీరిపోతోంది.  వెనకటి కాలంలో, యీ బాబాల తామరతంపర, పూజలు వుండేవి కావు. వుదాహరణకి - వినాయక విగ్రహాల మహా అట్టహాసం. అదే  రకంగా నిమజ్జనం క్రతువు. (హ్తేదరాబాద్ లో కూడా!)
    టివిలో తెలుగులో న్యూస్ చానల్స్ పెరుగుతున్నాయి. కొత్తగా  మరో మంచి చానల్ తేజ న్యూస్ మొదల్తేంది.  cable connection వుంటే యివన్నీ వొస్తాయి. కొత్తగా కేంద్రప్రభుత్వం పెట్టబోయే DTH లో కూడా చాలా వొస్తాయట.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                          -వడ్డెర చండీదాస్.
   
                                                                                                            తిరుపతి
                                                                                                          8-10-04
    రఘుగారికి నమస్తే,
    మీరు డిల్లి రాజస్థాన్ వెళ్ళటానికి ముందు రాసిన వుత్తరం అందింది. మీరు యెలాగూ రిడరయ్యారు. కనక ప్రోఫేసరవ్వాలని  యెంతగానో కోరుకుంటాను.
    యీ వూళ్ళో షాపతను; యిప్పడోస్తున్న సినిమా పాటల క్యాసెట్లు  తప్ప, శాస్త్రీయం తెప్పించటం మానేశాడు. యింక మిరే  శరణ్యం.
    విరసం సభలో మాట్లాడిన  ముగ్గురూ మూడు విధాలుగా మాట్లాడి వుంటారు.

    నవంబరు మూడున మీ రాక కోసం నిరీక్షిస్తూ.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                   -వడ్డెర చండీదాస్.


                                                                                                         తిరుపతి
                                                                                                        8-11-04
    రఘుగారికి నమస్తే,
    యేన్నిసార్లో విన్న యీమని  శంకరశాస్త్రి 'నాదలోలుడ్తె'  కాసేట్ మళ్ళి వింటూన్నాను, యీ పూట.  అద్బుతం.
    DD chennai  బావుంటుంది.  రోజూ గంటకి తగ్గకుండా శాస్త్రీయ కర్నాటక సంగీతం  వుంటుంది. తరచూ నాట్యం వుంటుంది (భరతనాట్యం).
    కె.యస్.రమణ , మంచి కథలూ కవిత్వమూ రాయటమే కాక; సార్వత్రిక విశ్వ విద్యాలయంలో  తెలుగు విభాగంలో మంచి సమర్ధుడు. వాళ్ళ సిలబస్ నాకు నచ్చ్సింది.
    డాక్టర్లు వోప్పకోరు గాని, మందులు రాత్రులు పడుకున్నప్పుడు యెక్కువ పనిస్తాయి!
    నేను పదాలు వాడుకార్ధంలోనే వాడతాను. వ్యుత్పత్తర్ధంలో వాడను, సాధారణంగా.
    వేసవి వెళ్ళి పోయింది; సంతోషం. ఆర్నెల్ల వరకు సుఖం.
    Taxis  అన్ని వొకే రకం పడవకార్లు; న్యూయార్క్ ప్రత్యేకత. బస్సులు లేనట్లే. అన్ని యెర్రడబుల్  డెక్కర్ బస్సులు; లండన్ ప్రత్యేకత.
    అందమ్తెన ఆడవాళ్ళు నవ్వితే చాలా బావున్న పలువరుస  కనిపించాలి గాని, చిగుళ్ళు కనిపించకూడాదు.
    హజ్ యాత్రికుల చార్జిలలో 90 శాతంగా కోట్ల రూపాయలు ప్రభుత్వం చేల్లిస్తున్నట్లుగా,  మిగతా మతాలకు కూడా వర్తింపజేయ్యాలి.
    మధ్యానం శ్రీలంక  రేడియోలో  తెలుగు పాటలు విననుగాని, మలయాళం పాటలు గంటన్నర వింటాను.
    DD  1 లో గ్రూప్  డాన్సులుంటాయి.  నాకు గ్రూప్ డాన్సులు     నచ్చవు.
    జోరున వర్షిస్తూన్నప్పడు, కళ్ళు ఫ్రెష్ గా ప్లజంట్ గా వుంటాయి.
    చచ్చిపోయిన వాళ్ళ ముక్కు రంధ్రాలలో దూది యెందుకు పెడతారో నాకు తెలియదు. మా అమ్మ చచ్చిపోయినప్పుడు నేను పెట్టలేదు.
    పంచాయతిని  మలయాళంలో పంజాయిది అని పలుకుతారు.
    మాకు మిగతా చానల్స్ లాగా DD 1 కూడా బాగా వొస్తోంది. యిక్కడ వర్షాలు లేవు. మేఘవృతం. పూలజల్లలు.
    యింతవరకు సెప్టెంబరు లో రాశాను.  యిది నవంబరు.  పూర్తిచేసి పోస్టు చెయ్యలేదు, యెందుకో.
    గజిబిజిగా గుడబిడగా కాక; CD లో లాగా,  tape  recorder లో లాగా FM లో లాగా neat  గా clear  గా వుంది,  మనసు యీ పూట.
    సినిమాకి సంబందించిన అత్యంత విలువ్తెనవాళ్ళు , పాకిస్తాన్ వెళ్ళినాక వ్యర్దులయ్యారు. భారతదేశపు  నెలలో ఆ గొప్ప మహత్వం వుంది.
    చాలా సంవత్సరాల క్రితం, టివిలో (అప్పట్లో DD Delhi  వొక్కటే వుండేది  సాయంత్రాలు ప్రాంతీయ ప్రసారాలు) బాలమురళికృష్ణ గాత్రం బేబి  గాయత్రి వీణ యుగళం - సముద్రపు వొడ్డున  పూలతోటలోనూ  చిత్రీకరించారు.  బాగా పాడాడు.  బాగా వాయించింది - అని గుర్తు.   యేవిటో  యిప్పుడు  గుర్తులేదు.
    యం.యస్. గోపాల్ కృష్ణన్  కాసెట్లు అన్ని బావుంటాయి. అతని వయొలిన్  వినటం; అమితానందం.
    శుద్ద్ కళ్యాణ్ చాలామంది పాడగా వాయించగా విన్నాను. అమీర్ ఖాన్ కూడా పాడాడు. అధ్బుతం.  సరే గొంతు అనితర సాధ్యం.
    నిన్న DD chennai  లో గంటసేపు తండ్రి కూతురు (యం.యస్ . గోపాలకృష్ణన్; Dr.M. నర్మద)  వాయించారు. బాగావుంది. కలిపి జంటగా.
    మీరు 3 తేదిన వొస్తానని రాలేదు. నిరాశ దక్కింది, నాకు.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                        -వడ్డెర చండీదాస్.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.