Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    2. సంప్రదింపుల కొఱకు అటు హస్తినలోణు, ఇటు ఉపప్లావ్యమునను సభలు ఒకేరోజు జరిగినవి.
    3. పాండవులు పంపిన పురోహితుడు సంధి కొఱకు మాత్రమే వెళ్ళినాడు. సంజయుడు అట్లుకాదు. అతడు సుమారు గూఢచారిగా వెళ్ళినట్లు తోచుచున్నది. ధృతరాష్ట్రుడు మాటిమాటికి పాండవుల బలమును గురించి అడిగినాడు. సంజయుడు లేక్కలువేసి చెప్పినాడు.
    4. శాసనములు చాల వాటికి ఉన్నవి. కుటుంబ జీవనమునకు వర్తించు శాసనములు అంతగా లేవు. కుటుంబము సంప్రదాయము, ఆచార వ్యవహారముల ప్రకారము నడుచుచున్నది.
    కుటుంబమునకు పెద్దవాడు యజమాని. అతనికి కుటుంబమును గురించి శ్రద్ధ ఉన్నది. దానిని గురించి ఆలోచించగల అనుభవము ఉన్నది. కావున ఇతర కుటుంబ సభ్యులు అతని మాట ప్రకారము నడుచుకొనవలెను. ఆవిధముగా జరుగనిచో విపరీతము జరుగును.
    కౌరవులకు పితామహుడు భీష్ముడు. కావున అందరు భీష్ముని మాట వినవలెను. అతని తరువాతి వాడు ధృతరాష్ట్రుడు. అతడు రాజు. అతని కొడుకులు అతని మాట వినవలసి ఉన్నది. కాని అట్లు జరుగుటలేదు.
    అందరినిమించి దుష్ట చతుష్టయము ముఖ్యముగా దుర్యోధనుడు ఆధిక్యత వహించినాడు. ఇది సంప్రదాయమునకు ఆచారమునకు విరుద్ధము విపరీతము. అందువలననే విపరీతములు జరిగినవి. జరుగుతున్నవి. జరుగనున్నవి.
    పాండవులు అట్లుకాదు. పాండురాజు పోయినాడు. తల్లి కుంతికి ప్రాధాన్యత ఇచ్చినారు. అనేక ఇక్కట్లలో ఆమె మాట విన్నారు. వ్యాసమహర్షి ఆదేశము ప్రకారము నడుచుకున్నారు. తరువాత ధర్మరాజు పెద్దవాడు. యజమాని అయినాడు. నలుగురు తమ్ములు సమర్ధులు, వీరులు, పరాక్రమవంతులు. స్వతంత్రములైన అభిప్రాయములు, ఆలోచనలు గలవారు. అయినను అన్నమాటణు జవదాటలేదు. సముద్రము చెలియలి కట్టవద్ద నిలిచినట్లు ధర్మజుని ఆజ్ఞకు వారు బద్దులు అయినారు.
    రామాయణమునకు అట్లే జరిగినది. లక్ష్మణుడు అనేక సందర్భములలో తన ప్రతాపాగ్నిని కనబరచ చూచినాడు. "బద్ధ్యతామపి వధ్యతాం" దశరథుని బంధించిగాని వధించిగాని శ్రీరామునకు పట్టము కట్టెదనన్నాడు. సుగ్రీవుని వధింతుణన్నాడు. రాముడు వారించినాడు. మిన్నకున్నాడు. భరతుడు సహితము అంతే. రాముని అయోధ్యకు తీసుకొని వెళ్ళుటకు వచ్చినాడు. శ్రీరాముడు రానన్నాడు. పాదుకలు తీసుకొని వెళ్ళినాడు.
    కుటుంబమున స్వేచ్చకు హద్దులు ఉన్నవి. పెద్దలమాట ప్రకారము నడచిన కుటుంబములు వర్ధిల్లుచున్నవి. అందుకు వ్యతిరేకములయినవి కూలుచున్నవి. ఇది నిత్య సత్యము. కౌరవులకు అదే జరిగినది. నేటికి అదే జరుగుచున్నది. జరుగనున్నది.
    5. కుటుంబ యజమాని ఈర్ష్యాద్వేషములకు అతీతుడు కావలెను. అతనికి పక్షపాతములు ఉండరాదు. స్వపర భేదము కూడదు. పూర్తి కుటుంబమును సమానముగా చూచు సాహసము ఉండవలెను.
    లోకమును ఏలుట చులకన. కుటుంబమును సాగించుట కష్టము.
    పాండురాజు గతించినాడు. పాండవులు గుడ్డిరాజు కుటుంబమున చేరినారు. కౌరవులకు పాండవులకు ధృతరాష్ట్రుడే తండ్రి. కాని గుడ్డిరాజు ఆవిధముగా ప్రవర్తించలేదు. అతడు నిజముగా గుడ్డివాడు అయినను కాకున్నను పుత్రేషణతో గుడ్డివాడు అయినాడు. అతడు సర్వదా దుర్యోధనుని క్షేమమే కోరినాడు కాని పాండవుల క్షేమము కోరలేదు. దుర్యోధనునకు ప్రమాదము జరుగనున్నదని గ్రహించినప్పుడు మాత్రము పాండవులకు న్యాయము కలుగునట్లు మాట్లాడ చూచినాడు.
    అది కుటుంబము అయినను, రాజ్యము అయినను, ప్రపంచరాజకీయము అయినను పక్షపాతముతో కూడిన నిర్ణయములకు ప్రగతిలేదు. అన్యాయము చేసిన వారికి అధోగతి తప్పదు. పెద్దలు అయినంత మాత్రమున వారి నిర్ణయములు అన్నియు మంచివి అని చెప్పుటకు వీలులేదు.
    దశరథుడు, వాలి, రావణుడు మరొకవిధముగా ధృతరాష్ట్రుడు చేసిన తప్పునే చేసినారు. కూలినారు.
    6. రాజకీయమునందుగాని కుటుంబమునందుగాని అధికారమున లేనివాని పెత్తనము ప్రమాదములకు దారితీయును. ఇటువంటి సందర్భములు ఇటీవలి కాలములో కొన్ని జరిగినవి. జరుగుచున్నవి. అధికారములో ఉన్నవారు కొందఱు కొడుకుల వలన, కొందఱు అల్లుళ్ళ వలన అపఖ్యాతిపాలు అగుచున్నారు. ప్రజలకు నష్టము కలిగించుచున్నారు.
    దుర్యోధనుడు అధికారము లేనివాడు. అతనికి ఉన్న యోగ్యత ధృతరాష్ట్రునకు కొడుకు అగుట. అంతకుమించి అతనికి అర్హతలు లేవు. స్వార్ధము తప్ప ఇతరము అతడు ఎరుగడు. నిర్ణయములన్నియు అతని అభిమతము మీద ఆధారపడినవి.
    అతని నిర్ణయములకు ఆధారము దుష్టచింతన మాత్రము.
    ఇటువంటి నిర్ణయములు ప్రమాదకరములు అని హెచ్చరించుచున్నాడు భారత కర్త వ్యాస భగవానుడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.