Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ఒకనాడు గుడ్డిరాజు సభ చేసినాడు. పురోహితుడు ఆసభను ఉద్దేశించి ప్రసంగించినాడు.
    "సభాసదులారా! ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. కౌరవులు, పాండవులు వారివారి తండ్రుల రాజ్య భాగములు అనుభవించుట ధర్మమగును. తొలి నుండి దుర్యోధనుడు ఈ ధర్మమును వ్యతిరేకించుచున్నాడు. వాళ్ళను నానా కష్టములు పెట్టినాడు. లక్క ఇంత వారిని హతమార్చ యత్నించినాడు. పాండవులు తమ స్వయంశక్తితో బలపరచిన రాజ్యమును వారికి కాకుండ చేసినాడు. మాయజూదము ఆడించి వారిని అడవులకు తోసినాడు. నిండు సభలో ద్రౌపది కట్టుపుట్టములు ఒలిపించినాడు. పాండవులు వీటిని అన్నింటిని సహించినారు. అరణ్య అజ్ఞాతవాసములు ముగించినారు. ఇప్పుడు వారు సంధి కోరుచున్నారు. ధృతరాష్ట్రుడు తన కొడుకును చక్కదిద్దవలెను. పాండవులకు న్యాయము చేయవలెను.
    పాండవులు కౌరవులతో యుద్దము కోరుటలేదు. యుద్దము వలన ప్రజాక్షయము జరుగునని సంకోచించుచున్నారు. వారికి సైన్యము ఏడు అక్షౌహిణులు మాత్రమే ఉన్నదని తలచరాదు. భీమ సాత్యకులు వేయి అక్షౌహిణులతో సమానమగుదురు. అర్జునుడు గాండీవము ధరించి విజృంభించిన అతని పరాక్రమమును శివుడు మాత్రమే ఎరుగగలడు. అన్నింటిని మించి శ్రీ కృష్ణుడు వారి పక్షమున ఉన్నాడు "మాధవుడా దిక్కటే పాండవేయుల కసాధ్యం బెద్దియుంగల్గునే?".
            
            అదను దప్పకుండ నమ్మహాత్ముల నెమ్మి
            బిలువబంచి హితము బ్రియము రెండు
            పక్షములకు నగుట పాటించి తగవుమై
            గొంత భూమి యిచ్చి కూడి మనుడు".
    
    సభలో ఉన్న భీష్మునకు పురోహితుని మాటలు కర్ణామృతములయినవి. భీష్ముడు భాషించినాడు:-
    "మహాత్మా! బాగుబాగు మంచిగా మాట్లాడినావు. పాండవులు బలవంతులు. శ్రీకృష్ణునితో కూడి ఉన్నారు. యుద్దము కోరుటలేదు. సంధికోరుచున్నారు. ఇంకేమి కావలెను. ధృతరాష్ట్రుడు పితృధనము అయిన రాజ్యమును పాండవులకు అప్పగించవలెను. వారిని తన పుత్రులవలె చూడవలెను. అప్పుడు లోకమంతయు ధృతరాష్ట్రుని కీర్తించును.
    సత్య వాక్యమునకు కట్టుపడి ధర్మజుడు జూదము ఆడినాడు. ధర్మమునకు లొంగి రాజ్యమును విడిచినాడు. ధర్మజుని కనుసన్నలకు ఓడి అర్జునుడు ఊరకున్నాడు. కవ్వడి నెరగిన్కకెట్టి మగవారును నోర్తురె యిజ్జగంబులన్. అర్జునుడే అలిగిన ఈలోకములందు అతనిని గెల్చువారున్నారా?"
    అనిన విని కర్ణుండు గనలి యిట్లనియె:-
    "భీష్మా! చెప్పినదే చెప్పుచున్నావు. అది తెలియని వెఱ్ఱివారు ఇక్కడ లేరు. ధర్మరాజు తన రాజ్యమును శకునికి ఓడినాడు. అడవులకు వెళ్ళినాడు. ఇప్పుడు తన తండ్రి పాలు కావలెనని వచ్చినాడు. విరాట ద్రుపదుల అండ చూచుకొని కయ్యమునకు కాలు దువ్వుచున్నాడు. అతనికి బెదిరి దుర్యోధనుడు రాజ్య భాగమివ్వడు. ఇవ్వడు గాక ఇవ్వడు. లోకమందు ఇట్టి వ్యయము ఉండునా?'.
    అనిన గాంగేయుండు గటగటంబడి కర్ణునకిట్లనియె:-
    "కర్ణా! సూటిపోతూ మాటలు తప్ప నీకు వచ్చినది లేదు. నీ మాటలు విని జనులు నవ్వుదురు. సంతోషించరు. మొనగాడిననుచున్నావు. మొన్నటి ఉత్తర గోగ్రహణము మరచినావు. అర్జునుడు ఒక్కడు మనను ఆరుగురిని ఉగ్రరణంబున గెల్చెనిన్ననే. మాటలతో మన సభలో అర్జునుని గెలువగలవు. అర్జునుడు ఎదురయినపుడు ఎన్నిసార్లు గెలిచినావు?".
    ధృతరాష్ట్రుడు భీష్ముని మాటలు విన్నాడు. అతనిని అనుసరించినాడు. పురోహితునితో అన్నాడు.
    మంచిగ నేను బంధువులును మంత్రిజనంబులు బెద్ధలున్ విచా
    రించి సమస్త భూప్రజకు బ్రీతిగ బిడ్డలపాలికిప్డుపు
    త్తెంచెద సౌమ్యునొక్కరు మదీయ మనోగతి వారిగూడ వ
    ర్తించు తెరంగు గైగొనుట దెల్లము కౌరవజాతి కెంతయున్
    కావున నీవు ముందు వెళ్ళుము అని సత్కరించి పురోహితుని పంపినాడు.
    ధృతరాష్ట్రుడు సభ తీర్చినాడు. సంజయుని రావించినాడు. "సంజయా! పాండవులు ఉపప్లావ్యమున ఉన్నారు. వాసుదేవుడు వారితో ఉన్నాడు. నీవు వారి దగ్గరకు వెళ్ళుము. వారి దుఃఖము మానువిధముగా మాట్లాడుము. వనవాసము జరిపి వచ్చినందుకు మీ తండ్రి నన్ను పంపినాడని చెప్పుము".
    తదుపరి ధృతరాష్ట్రుడు "సభాసదులారా! పాండవులు మహాత్ములు శూరులు. వారియందు దోషము లేదు. కార్యాకార్యములు తెలియని దుర్యోధనునివల్ల విరోధము కలిగినది. మనము, పాండవులు పాలు నీళ్ళవలె కలిసి జీవించవలసి ఉన్నది. వారి తండ్రి సొత్తు వారు అనుభవించుటకు అర్హులు. 'మనలనిక నమ్మరనృతాత్ము లన్యాయపరులు గర్వులనుచు పాండు సుతులు' మనతో కలిసి బతుకుటకు ఇయ్య కొనరు. అయినను శాంతమూర్తి ధర్మజుడున్నాడు".
    "మనము వారికి రాజ్యము ఇవ్వవలెను. ఇవ్వకున్నా శ్రీకృష్ణుడు సారథిగా అర్జునుడు గాండీవము సారించును. ముల్లోకములను ముంచివేయును. భీముడు గదకొని ఉరికివచ్చిన అడ్డగలవాడెవ్వడు? అతనిని తలచిన నామనసు గడగడలాడుచున్నది నకుల సహదేవులు అన్నలకంటే తక్కువ వారుకారు. ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి, కేకయుడు. తక్కువ వారు కరు. వారిని గెలుచుశక్తి మనకు ఉన్నదా? ఉన్నదనుకున్నను




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.