Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
సమహం ప్రజయా సంమయా ప్రజా |
సమహగం రాయస్వోషేణ సం మయా రాయస్వోషః ||
ఏడవ ప్రపాఠకము
మొదటి అనువాకము
1. అగ్నా విష్ణువులారా! మీరు సమాన ప్రీతి గలవారు అగుదురు గాక. మీ వాక్కులు వర్థిల్లును గాక. అన్నములు, ధనములు అందుకొని విచ్చేయండి.
2. మీరు మాకు అన్నమును, అన్నజ్ఞానమును, శుద్ధిని, ఆకలిని, జీర్ణమును, అన్నహేతువగు యజ్ఞమును కలిగించండి.
స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శ్రుతిశ్చమే జ్యోతిశ్చ మే సువశ్చమే ప్రాణశ్చమే పానః చమే వ్యానశ్చమే సుశ్చమే చిత్తంచమే ఆధీతంచమే వాక్చమే మనశ్చమే చక్షుశ్చమే శ్రోత్రంచమే దక్షశ్చమే బలంచమ ఓజశ్చమే సహశ్చమ ఆయుశ్చమే జరాచమ ఆత్మాచమే తనూశ్చమే శర్మచమే వర్మచ మ్కే ఙ్గానిచమే స్థానిచమే పరూగంషిచమే శరీరాణిచమే.
రెండవ అనువాకము
జ్యైష్ఠ్యంచమే ఆధిపత్యంచమే భానుశ్చమేమశ్చమేమ్బశ్చమే జేమాచమే మహిమాచమే వరిమాచమే ప్రథిమాచమే వర్ష్మాచమే ద్రాఘుయాచమే వృద్ధంచమే వృద్ధిశ్చమే సత్యంచమే శ్రద్ధాచమే జగచ్చమే ధనంచమే వశశ్చమే త్విషిశ్చమే క్రీడాచమే మోదశ్చమే జాతంచమే జనిష్యమాణంచమే సూక్తంచమే సుకృతంచమే విత్తంచమే వేద్యంచమే భూతంచమే భవిష్యచ్చమే సుగంచమే సుపధంచను బుద్ధిశ్చమే క్ఞప్తంచమే కఞప్తిశ్చమే మతిశ్చమే సుమతిశ్చమే.
(ఇవన్నియు కలిగించండి. అమః = అప్రమేయత్వము. అమ్భః = చల్లని తీయని నీరు. జేమా = జయ సామర్థ్యము. ప్రథిమా = గృహక్షేత్రాది విస్తారము. వర్ష్మా = పుత్రపౌత్రాదులు. వశః = సర్వస్వాధీనత్వము. త్విషిః = శరీర కాంతి. బుద్ధిః = సత్రయాగ ఫలము. క్ఞప్తమ్ = తన పనికి సరిపడు ద్రవ్యము. క్ఞప్తిః = స్వకీయ సామర్థ్యము.)
మూడవ అనువాకము
శంచమే మయశ్చమే ప్రియంచమ్కేను కామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వన్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యన్తాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే సూశ్చమే ప్రసూశ్చమే సీరంచమే లుయశ్చమే ఋతంచమ్కే మృతంచమే యక్ష్మంచమేనామయశ్చమే జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమే నమిత్రంచమేభయంచమే సుగంచమే శయనంచమే సుషాచమే సుదినంచమే.
(మయః = ఆముష్కిక సుఖము. యన్తా = నియత ఆచార్యాదికము. సంచిత్ = వేద శాస్త్రాది జ్ఞానము. అయక్ష్మం - యక్ష్మరోగ రాహిత్యము. అనానుయత్ = జ్వరాది అల్ప రోగ రాహిత్యము.)
నాలుగవ అనువాకము
ఊర్క్చమే సూనృతాచమే వయశ్చమే రసశ్చమే ఘృతంచమే మధుచమే సగ్దిశ్చమే సపీతిశ్చమే కృషిశ్చమే వృష్టిశ్చమే జైత్రంచమ ఔద్భిద్యంచమే రయిశ్చమే పుష్టంచమే పుష్టిశ్చమే విభుచమే ప్రభుచమే బహుచమే భూయశ్చమే పూర్ణంచమే పూర్ణతరంచమేక్షితిశ్చమే కూయవాశ్చమేన్నంచమ్కేక్షుచ్చమే వ్రీహయశ్చమే యవాశ్చమే మాషాశ్చమే తిలాశ్చమే ముద్గాశ్చమే ఖల్వాశ్చమే గోధూమాశ్చమే మసురాశ్చమే ప్రియంగవశ్చమేణవశ్చమే శ్యామాకాశ్చమే నీవారాశ్చమే.
(ఊర్క - సాధారణ అన్నము. సగ్దిః - బంధువులతో కూడి భుజించుట. సపీతిః - బంధువులతో కూడి త్రాగుట. అక్షితిః నుండి నీవారము వరకు ధాన్య ప్రాకారములు.)
అయిదవ అనువాకము
అశ్మాచమే మృత్తికాచమే గిరయశ్చమే పర్వతాశ్చమే వనస్పతయశ్చమే హిరణ్యంచమేయశ్చమే సీసంచమే త్రపుశ్చమే శ్యామంచమే లోహంచమే అగ్నిశ్చమే ఆపశ్చమే వీరుధశ్చమే ఓషధయశ్చమే కృష్ణ పచ్యంచమే కృష్ణపచ్యంచమే గ్రామాశ్చమే పశవ అరణ్యాశ్చ యజ్ఞేన కల్పన్తాం. విత్తంచమే విత్తిశ్చమే శక్తిశ్చమ్కేర్దశ్చమే ఏమశ్చమ ఇతిశ్చమే గతిశ్చమే.
(అశ్మ - రాయి. వీరుధః = పొదలు. కృష్ణ పచ్యమ్ = దున్నిన నేలలోని పంట. అకృష్ణ పచ్యమ్ = దున్నని భూమి పంట, విత్తమ్ = పూర్వ లబ్దము. విత్తిః = భావి లాభము.)
ఆరవ అనువాకము
అగ్నిశ్చమ ఇన్ద్రశ్చమే సోమశ్చమ ఇన్ద్రశ్చమే సవితాచమ ఇన్ద్రశ్చమే సరస్వతీచమ ఇన్ద్రశ్చమే పూషాచమ ఇన్ద్రశ్చమే బృహస్పతిశ్చమ ఇన్ద్రశ్చమే మిత్రశ్చమ ఇన్ద్రశ్చమే వరుణశ్చమ ఇన్ద్రశ్చమే త్వష్టాచమ ఇన్ద్రశ్చమే ధాతాచమ ఇన్ద్రశ్చమే విష్ణుశ్చమ ఇన్ద్రశ్చమే శ్వినౌచమ ఇన్ద్రశ్చమే మరుతశ్చమ ఇన్ద్రశ్చమే విశ్వేచమే దేవా ఇన్ద్రశ్చమే పృథివీచమ ఇన్ద్రశ్చమే న్తరిక్షంచమ ఇన్ద్రశ్చమే ద్యౌశ్చమ ఇన్ద్రశ్చమే దిశశ్చమ ఇన్ద్రశ్చమే మూర్దాచమ ఇన్ద్రశ్చమే ప్రజాపతిశ్చమ ఇన్ద్రశ్చమే.
(హవిస్సు విషయమున ఇంద్రుడు సర్వదేవతలతో సమాన భాగము కలవాడు. అందువలన ప్రతి దేవతతో కూడ చెప్పబడినాడు.)
ఏడవ అనువాకము
అగ్ంశుశ్చమే రశ్మిశ్చమేధిపతిశ్చమేన్తర్యామశ్చమే ఐన్ద్రవాయవశ్చమే మైత్రావరుణశ్చమ అశ్వినశ్చమే ప్రతి పస్థానశ్చమే శుక్రశ్చమే మన్దీచమ ఆగ్రయణశ్చమే వైశ్వాదేవశ్చమే ధ్రువశ్చమే వైశ్వానరశ్చమ ఋతుగ్రహాశ్చమేతిగ్రాహ్యాశ్చమ ఐన్ద్రగ్నశ్చమే వైశ్వదేవశ్చమే మరుత్వతీయాశ్చమే మాహేన్ద్రశ్చమ ఆదిత్యాశ్చమే సావిత్రశ్చమే పౌష్ణశ్చమే పాత్నీ వతశ్చమే హరియోజనశ్చమే.
(ఇవి గ్రహములను పాత్రలు. వీనిని గురించి మొదటికాండపు నాలుగవ ప్రపాఠకమున వివరించబడినవి. అంశు, రశ్మి, అదాభ్య మున్నగు పేర్లు గలవి. అవి తనకు సంపన్నములు కావలెనని.)
ఎనిమిదవ అనువాకము
ఇధ్మశ్చమే బర్హిశ్చమే వేదిశ్చమే ధిష్ణియాశ్చమే చమసాశ్చమే గ్రావాణశ్చమే ప్వరవశ్చమే ఉపరవాశ్చమే ధిషవణేచమే ద్రోణకలశశ్చమే వాయవ్యానిచమే పూతభృచ్చమ అధవనీయశ్చమ అగ్నీధ్రంచమే హవిర్దానంచమే గృహాశ్చమే పదసశ్చమే పురోడాశాశ్చమే వభృతశ్చమే స్వగాకారాశ్చమే.
(ఇధ్మాదులు యజ్ఞోపకరములు.)
తొమ్మిదవ అనువాకము
అగ్నిశ్చమే ఘర్మశ్చమేర్కశ్చమే ప్రాణశ్చమే శ్వమేధశ్చమే పృథివీచమే దితిశ్చమే దితిశ్చమే ద్యౌశ్చమే శక్వరీ రఙ్గులయో దిశశ్చమే యఙ్ఞేన కల్పన్తా మృక్చమే సామచమే స్తోమశ్చమే యజుశ్చమే దీక్షాచమే తపశ్చమ ఋతుశ్చమే వ్రతంచమేహో రాత్రయో ర్వృష్ట్యా బృహద్రథంతరేచమే యజ్ఞేన కల్పేతామ్.
(అగ్ని ఘర్మాదులు, పృథివ్యాది దేవతలు, ఋగ్యజుస్సామములు, దీక్షాదులు నేను చేయు యజ్ఞము వలన తమతమ విధులు నిర్వర్తించుటకు సమర్థులు అగుదురు గాక.)
పదవ అనువాకము
గర్భాశ్చమే వత్సాశ్చమే త్ర్యవిశ్చమే త్ర్యవీచమే దిత్యవాట్చమే దిత్యౌహీచమే పఞ్చావిశ్చమే పఞ్చావీచమే త్రివత్సశ్చమే త్రివత్సాచమే తుర్యవాట్చమే తుర్యౌహీచమే వష్ఠవాచ్చమే వష్ఠౌహీచమ ఉక్షాచమే వశాచమ ఋషభశ్చమే వేహచ్చమే నడ్వాఞ్చమే దేనుశ్చమ ఆయుర్య జ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగం శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతామాత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం.
గర్భము నందలి పశుపిండములు, ఏడాది లోపలి దూడలు, సంవత్సరన్నర పెయ్యలు, సంవత్సరన్నర లేగలు, రెండేళ్ల ఎద్దు, రెండేళ్ల ఆవు, రెండున్నర సంవత్సరముల ఎద్దు, రెండున్నర సంవత్సరముల ఆవు, మూడేండ్ల ఎద్దు, మూడేండ్ల ఆవు, మూడున్నర సంవత్సరముల ఎద్దు, మూడున్నర సంవత్సరముల ఆవు, నాలుగేండ్ల ఎద్దు, నాలుగేండ్ల ఆవు, పుట్టించగల ఆబోతు, గొడ్డుబోతు ఆవు, వయసు మిన్న ఆబోతు, కట్టి ఈనలేని ఆవు, బండిని లాగు ఎద్దు, అప్పుడే ఈనిన ఆవు ఇవన్నియు నాకు కలుగును గాక.
ఆయువు యజ్ఞము చేత, ప్రాణము యజ్ఞము చేత, అపానము యజ్ఞము చేత, వ్యానము యజ్ఞము చేత, నేత్రములు యజ్ఞము చేత, శ్రోతములు యజ్ఞము చేత, మనసు యజ్ఞము చేత, వాక్కు యజ్ఞము చేత, ఆత్మ యజ్ఞము చేత కల్పించబడును గాక.
యజ్ఞో యజ్ఞేన కల్పతామ్.
పదకొండవ అనువాకము
ఏకాచమే తిస్రశ్చమే పఞ్చచమే నవచమే ఏకాదశచమే త్రయోదశచమే పఞ్చదశచమే సప్తదశచమే నవదశచమే ఏకవిగంశతిశ్చమే త్రయోవిగంశతిశ్చమే పఞ్చవిగంశతిశ్చమే సప్తవిగంశతిశ్చమే నవవిగంశతిశ్చమే ఏకత్రిగంశచ్చమే త్రయస్రిగంశచ్చమే చతుస్రశ్చమేష్టౌచమే ద్వాదశచమే షోడశచమే విగంశతిశ్చమే చతుర్విగంశతిశ్చమే ష్టౌవిగంశతిశ్చమే షట్త్రిగంశచ్చమే చత్వారిగంశచ్చమే చతుశ్చత్వారిగంశచ్చమేష్టౌచత్వారిగంశచ్చమే వాజశ్చ ప్రసవాశ్చాపిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్దాచ వ్యశ్నియాశ్చాన్త్యా యనశ్చాన్త్యశ్చ భౌవనశ్చ భువనాశ్చాధిపతిశ్చ.
1,3,5,7,9,11,13,15,17,19,21,23,25,27,29,31,33 సంఖ్యలు నాకు చెందును గాక.
4,8,12,16,20,24,28,32,36,40,44,48 సంఖ్యలు నాకు చెందును గాక.
చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక, మార్గశీర్ష, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసములు శుభప్రదములు అగును గాక.
పన్నెండవ అనువాకము
1. తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర దిక్కులు నాలుగు. ఊర్ధ్వ, మధ్యమ, అధమ దిక్కులు మూడు. ఈ సప్త దిశలు మాకు అన్నప్రదములు అగును గాత. అట్టి అన్నము ఈ ధనప్రదేశమున ఉండి, విశ్వేదేవతల ప్రేరణతో మమ్ము రక్షించును గాక.





