Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
నేను :చిత్తం.
బేగమ్ : అయితే ఖుదాహాఫిజ్ '
నేను : ఖుదాహాఫిజ్. ఆఁ చిన్నబాబు ఎలా ఉన్నారు?
బేగమ్ : మాషా అల్లా! బాగుంది. ఇప్పుడు గుర్తుకు వచ్చాడా?
నేను : మాటల్లో పడి మరిచిపోయాను. మరుపు కాదు. అడుగుదామనుకుంటూ ఉండగానే మరొక మాట రావడం.
బేగమ్ : క్షేమంగా ఉన్నాడు. కాస్త పెరిగాడు. వచ్చిన్నాడు చూడవచ్చుగా.
నేను : ఇక రాత్రికి నిద్ర లేనట్లే. ఖుదాహాఫిజ్.
బేగమ్ : ఖుదా హపిజ్. చూడు తప్పక రావాలి.
నేను : అలాగే.
మళ్ళీ మాటలు సాగాయనే విషయం దాసీ గ్రహించి మేనావాళ్ళు గోల చేస్తున్నారని బేగమ్ గారికి విన్నవించింది.
22
రేలు పవళ్ళు తల బ్రద్దలు చేసి యోచించితి
ఈ జగాన్నాటకం బోధపడదు నాకు!
నేను ఖానమ్ నుండి విదిపోయాను. అయినా ఆమె బ్రతికి ఉన్నాన్నాళ్ళూ ఆమెను నా పోషకురాలుగానే భావించాను. ఆమెకు గూడా నేనంటే ఎంతో వాత్సల్యం ఉండేది. ఆమె అపారంగా డబ్బు సంపాదించింది. ధనమంటే పడి చచ్చేది. ముసలితనం పెరుగుతుంటే ఆవిడ ప్రవృత్తి మారింది. ఎవరి ఆర్జనకు ఆశ పడలేదు. అయినా అందరినీ పూర్వం లాగే ప్రేమించేది. నేనంటే ఆమెకు ప్రత్యేకమైన వాత్సల్యం. బిస్మిల్లా ఆమెను ఎంతో సతాయించడాన అసహ్యం లాంటిది ఏర్పడింది. ఎంతైనా కూతురు కదా! విప్లవం తరవాత ఖుర్షీద్ జాన్ కూడా వచ్చేసింది. ఉండడం ఖానమ్ దగ్గరే. అమీర్ జాన్ వేరేగది తీసుకుంది. అయినా ఆమె వస్తూ పోతూ ఉంది.
ఖానమ్ నాకు ఇచ్చిన గదిని ఆమె బ్రతికి ఉన్నన్నాళ్ళూ ఖాళీ చేయమనలేదు. నా సామానంతా అందులోనే ఉండేది. తాళం చేసి ఉంచేదాన్ని. ఎప్పుడైనా బుద్ది పుడితే అక్కడికీ వెళ్ళేదాన్ని. ఏడాది మొత్తం ఎక్కడున్నా మొహర్రంలో దానదర్మాలు అక్కడే చేసేదాన్ని. తానూ చనిపోయేవరకూ నాపేర దానదర్మాలు చేసింది ఖానమ్.
గురువారం నాడు బేగమ్ కలిశారు. శుక్రవారం నాడు ఖానమ్ పరిస్థితి బాగుండలేదని మనిషి వచ్చాడు. నన్ను జ్ఞాపకం చేస్తుందని చెప్పాడు. వెంటనే వెళ్ళాను. ఆవిడను చూచాను. ఇంటికి తిరిగి వద్దామనుకుంటుండగానే మంచి బట్టల జత ఒకటి తీసి కెళ్ళాలనిపించింది. గది తలుపు తెరిచాను. చూస్తె గది నిండా సాలెగూళ్ళున్నాయి. మంచం మీద మణుగుల కొద్ది మట్టి పడి ఉంది. చాపలు, తివాచీలు చిందరవందరగా పడి ఉన్నాయి. చెత్తా చెదారం చూచి నాకు పూర్వపు రోజులు గుర్తుకు వచ్చాయి. అల్లా! ఒకప్పుడు ఈ గది సర్వదా అలంకరించబడి ఉండేది. రోజుకు నాలుగుసార్లు ఊడ్పు జరిగేది. దుమ్ము అన్నమాట ఉండేది కాదు. పూచిక పుల్ల కనిపించేది కాదు. ఇప్పుడు ఆ స్థితికి వచ్చింది. క్షణం నిలువ బుద్ది కావడం లేదు. అదే మంచంలో పడుకునేదాన్ని. ఇప్పుడు చూడడానికే అసహ్యంగా ఉంది. వెంట మనిషి ఉన్నాడు. సాలెగూళ్ళు తొలగించమన్నాను. ఎక్కడ్నుంచో గడ తెచ్చి శుభ్రం చేశాడు. ఈలోగా తివాచీ చుట్టాను. ఇద్దరం కలసి దాన్ని శుభ్రం చేసి పరచం. తెరలు దులిపాం. మంచం మీద పరుపు దులిపించాను. గదిలోంచి సింగార్ దాన్ 'పాన్ దాన్ ఉగల్ దాన్ ' తెచ్చాను. పూర్వం ఉన్దినట్లుగా వాటినన్నింటినీ నా దగ్గర పరచుకున్నాను. మంచం మీద బాలీసు కు అనుకోని కూర్చున్నాను. తాంబూలం వేసుకున్నాను. ఎదురుగా అద్దం ఉంది. అందులో ప్రతిబింబం కనిపించింది. పూర్వపు రోజులు గుర్తుకు వచ్చాయి. వయసు సొగసు కళ్ళలో మసిలింది. ఆ కాలంలో నన్ను గౌరవించిన వారి చిత్రపటాలు మనసులో మెదిలాయి. గోహర్ మిర్జా కొంటెతనం, రాషిద్ వెకిలితనం, ఫైజు ప్రేమ, సులాను వదనము, ఒక్కరేమిటి ఆ కాలంలో నా దగ్గరకు వచ్చిన వారందరి గుణగణాలు గుర్తుకు వచ్చాయి. ఆ గది స్ముతుల పేటికగా కనిపించింది. ఒక పటం కనిపించేది. మాయమయ్యేది. మరొకటి వచ్చేది. ఇలా అందరూ అయిపోయేన తరవాత మళ్ళీ ఆవర్తనం అవే ముఖాలు ఒకటి తరవాత ఒకటి మెల్లమెల్లగా కదలసాగాయి. వాటిని గురించి ఆలోచించే అవకాశం లభించింది. ముందు ఒక్కక్కటే కనిపించిన పటాల్లోంచి అనేకం బయలుదేరాయి. స్మృతి పధం విస్తృతం అయింది. జీవితం మొత్తంలోనూ జరిగిందంతా కనుల ముందు కనిపించింది. సుల్తాను గారు స్మ్ర్తుతి పధంలో కనిపించారు. మొదటి కచేరి - మధుర సంభాషణ - కవితా చర్చ - ఖాను గారి గోష్ఠి వెకిలి మాటలు - సుల్తాను పిస్తోలు పేల్చడం -- ఖాను గారు పడిపోవడం - షమ్మీర్ ఖాను ప్రాణాపాయం - కొత్వాలు రావడం -- ఖానును ఇంటికి పంపడం - కుర్రాని చేత చీటీ పంపడం - నవాబు గంజు జలపాలు - ఇవన్నీ నిన్న జరిగినట్లు కనిపించాయి. ఇదంతా గుర్తుకు వస్తున్నా మొదటి కచేరీ తరవాత సుల్తాను గారి మనిషి సందేశం తేవడం దగ్గరికి వచ్చి మనసు నిలిచిపోయింది. ఏదో జారిపోయినట్లనిపించింది. ఇంతలో మనిషి గట్టిగా కేక పెట్టాడు.
"అమ్మా ! మీ ఓటి మీద జెర్రి పాకుతుంది ."
"ఓయ్ " అని ఒణి తీసిపారేశాను. ఎడంగా జరిగాను. మనిషి ఒణి దులిపాడు. జెర్రి పాకుతూ మంచం క్రిందికి వెళ్ళిపోయింది. మనిషి మంచం ఎత్తాడు. మంచపు కోడు క్రింద అయిదు సవరనులు పరిచి ఉన్నాయి.
మనిషి చకితుడై "చూడండి ఏమి ఉందో ?" అన్నాడు.
నేను మనసులో ఇవి ఆ సవరనులు అనుకోని "సవరసులు" అన్నాను.
"వాహ్ ! నవర్సు లెక్కడి నుంచి వచ్చాయి ?"
నేను నవ్వి "జెర్రి సవరసులుగా మారింది తీసుకో" అన్నాను.
ముందు మనిషి తబ్బిబ్బైనాడు. తరవాత అయిదూ తీసి నాకూ ఇచ్చాడు.
రుస్వా : పితురీలో ఖానమ్ ఇల్లు దోపిడీ కాలేదా ?
ఉమ్రావ్ : అయింది. ఎందుకు కాలేదు? మంచపు కోడు ఎవడూ ఎత్తి చూడకుండవచ్చుగా.
రుస్వా : కావచ్చు.
23
కాంక్ష, ఈర్ష్య వీటినెలాగ జయించడం ?
చెలికాండ్ర కూడినపు డవి ఇనుమడించు!
ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు బేగం గారి దాసీది మేనా తీసుకొని వచ్చి నెత్తిన కూర్చుంది. అప్పుడే లేచాను. ఇంకా బాగా హుక్కా కూడా పీల్చలేదు. దాసీది తొందర చేయసాగింది. భోజనం వగైరా చేసి వెళ్దామానుకున్నాను. కాని బేగమ్ తనకు తోడుగా భోజనానికి రావలసిందన్నారని దాసీది తెలియజేసింది. "నవాబుగారు ఉన్నారా?" అని అడిగాను. ఉదయం లేచి ఊరికి వెళ్ళిపోయారని చెప్పింది. ఎప్పుడు వస్తారని అడుగగా సాయంకాలం వరకు వస్తారని తెలియపరచింది. బేగంతో చాల విషయాలు మాట్లాదాలనుకున్నను. వెంటనే చేతులు, ముఖం కడుక్కొని , తల దువ్వుకొని దాసీ దాన్ని వెంట తీసుకొని బయలుదేరాను.
వెళ్ళే వరకు బేగం ఎదురు చూస్తూ కూర్చుంది. నేను వెళ్ళగానే దస్తర్ ఖాన్ పరచారు. బేగం గారితో భోజనం చేశాను. భోజనం ఆనందంగా ఉంది. పరోటాలు, కుర్మా, రకరకాల కూరలు, పచ్చళ్ళు, వేపుళ్ళు సేపుల మురబ్బా, సోహన్ హల్వా , భోజనం అయిన తరవాత మెల్లగా నా చెవులో.
బేగం : కరీమ్ ఇంట్లో జొన్న రొట్టేలూ, మినపప్పు గుర్తున్నాయా?
నేను : మాట్లాడకు. ఎవరైనా వినగలరు.
బేగం : వింటే ఏం, తెలియని విషయమా ? నవాబు తల్లి - భగవంతుడు ఆమెకు స్వర్గం ప్రసాదించుగాక ! నన్ను నవాబు కోసం ఖరీదు చేసింది.
నేను : మాట్లాడకు. ఎవరైనా వినగలరు.
బేగం : వింటే ఏం, తెలియని విషయమా ? నవాబు తల్లి - భగవంతుడు ఆమెకు స్వర్గం ప్రసాదించుగాక ! నన్ను నవాబు కోసం ఖరీదు చేసింది.
నేను : అబ్బ! మాట్లాడకు. వేరుగా వెళ్ళి మాట్లాడుకుందాం పద.
తాంబూలాలు అయినాయి. దాసీది హుక్కా గొట్టం తెచ్చి పెట్టింది. బేగం అందరినీ అక్కడి నుంచి పంపించేసింది.
నేను : నన్ను గుర్తించావు కదు!





