Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6



    ఉమ్రావ్ : కానీ పల్లెవారు చెడిపోతే చేతికి రాకుండా చెడిపోతారు. మియాఁ ఇర్షాదలీ ఖాను కధ విన్నారుగా !
    రుస్వా : కారణం ఏమంటే వారు ఈ అనుభవాలకు దూరంగా ఉంటారు. ఒకసారి రుచి చూస్తె మితి మీరిపోతారు. సోదాల్లోని జనం అలా కాదు. వారికి అన్నీ తెలుస్తుంటాయి. వారిని అవి వింతగా ఆకర్షించవు. వారు మితిమీరరు.
    
                                   20


    రుస్వా : అవును. ఆఁ మీ దాసీది ఏమైంది? ఏదో మంచి పేరు.
    ఉమ్రావ్ : అబాదీ
    రుస్వా : అబాదీ అందమైనదే. ఆమెకు పన్నెండేళ్ళు ఉన్నప్పుడు చూచాను. వయసుతో అందం వికసించి ఉంటుంది.
    ఉమ్రావ్ : మిర్జాగారూ ! మీకు బాగానే జ్ఞాపకం ఉంటే?
    రుస్వా : గుర్తుండడానికే ముంది? అందమైన పిల్ల. నేనూ ఆ దృష్టితోనే చూచేవాణ్ణి. ఎప్పుడో పడుచుపిల్ల అవుతుంది కదా అని.
    ఉమ్రావ్ : అయితే మీరూ ఆవిడను ఆశించారన్నమాట.
    రుస్వా : వినండి ఉమ్రావ్ జాన్! ఎక్కడ అందమైన ఆడది కనిపించినా నన్ను గుర్తుంచుకోండి. సాధ్యమైతే నన్ను అభ్యర్ధిగా వ్రాయించండి. ఆయుష్యం చాలక చచ్చిపోతే నా పేర "పాతిహ" చదివించండి.
    ఉమ్రావ్ : అందమైన మగాడు కనిపిస్తే?
    రుస్వా : తమ పేరు అభ్యర్ధినుల్లోనూ, నా పేరు అతని సోదరి అభ్యర్ధుల్లోనూ నిషిద్దం కాని పక్షములో వ్రాయించండి.
    ఉమ్రావ్ ; బాగుంది. కాని షరతు ఎందుకు ?
    రుస్వా : షరతు లేనిది దేనికి? పైగా మా షరతులోని ఏ ఒక్క వ్యక్తినీ చెప్పలేదే?
    ఉమ్రావ్ : తేటతెల్లంగా ఒక్క మాట చెప్పలేరూ?
    రుస్వా : అర్ధం తెలుసు. తాత్పర్యం విదితం అని.
    ఉమ్రావ్ : అది ఇలాంటప్పుడు చెప్పవలసింది కాదు. నాకు ఒక విషయం ఉంది. శీలవతి ఏ మతానికి సంబంధించినదైనా , తల్లిగానో, సోదరిగానో భావిస్తారు. ఈ నియమానికి విరుద్దమైన వ్యవహారాలన్నీ బాధ కలిగిస్తాయి. అలాంటి శీలవతులను చెడగొట్టడానికి ప్రయత్నించేవారందరనీ తుపాకీతో కాల్చేయ్యాలని నా అభిప్రాయం. కాని ఉదారులైన స్త్రీల ఉదారత్వంతో లాభం పొందడం నేరం కాదు.
    రుస్వా : సుబాహనల్లా (బాగు బాగు)
    ఉమ్రావ్ : ఇప్పుడీ వృధా మాటలు ఎందుకు గానీ ఆబాదీ విషయం చెప్పండి. మిర్జాగారూ! వయసులో ఆమెను చూచి ఉంటే మీరు పద్యం చదివి ఉండేవారు :
    పడుచుదనం పొంగిపొరలి
    వింత అందాలు సంతరింప,
    చూచి చూచి దీక్ష సడలి    
    నిగ్రహ మంతరించే నోహో!
    ప్రాయంలో ఆమె రూపం చూడవలసింది. వందల సానులలో కూడా ఒక్కతే అలాంటిది కనిపించడం దుర్లభం.
    రుస్వా : ఎందుకలా చంపుతారు? ఇప్పుడు ఎక్కడుంది? ఏమైంది?
    ఉమ్రావ్ : మనలను విడిచింది. అహం విడిచింది.
    రుస్వా : ఇప్పుడెక్కడున్నట్లు?
    ఉమ్రావ్ : ఆస్పత్రిలో, ఇంకెక్కడ?
    రుస్వా : యవ్వనోద్రేకమేనా?\
    ఉమ్రావ్ : జీమాషాఅల్లా (బాగా చెప్పారు) , ముఖం వికారం అయింది. ఇప్పుడో కాస్సేపటిలో అన్నట్లుంది.
    రుస్వా : అసలు ఏమైంది?
    ఉమ్రావ్ : అయ్యేదేమిటీ? వట్టి పోకిరిది. కుర్రాళ్ళను కూర్చుకుంది. బాగు పడాలని ఎంతో చేశాను. కాని చెడిపోయింది. దాని కోసం నేను చేయనిదేమిటి? పంతులను పెట్టి చదువు చేప్పించాను. చదువు మీద శ్రద్ధ లేదు. వయసు రాగానే వేరే గది ఇచ్చి ఉంచాను. పట్టణంలోని ఉత్తములు కూడారు. రాత్రిబవళ్ళు తిట్లు, పోట్లాటలు, కేకలు, తల ప్రాణం తోకకు వచ్చింది, ఆటంకం అనేది లేదు. ఎవడోస్తే వాడితో నల్లా తాగేది. నచ్చ చెప్పాను. దెబ్బలు కొట్టాను. వింటేనా? చిన్నతనం నుంచే దాని దృష్టి మంచిది కాదు. ఆ రోజుల్లో బువాహుసేనీ మనమడు జమ్మన్ వస్తుండేవాడు. వాడితో ఆడేది. పిల్లవాడు పోనీ ఆడుకుంటాడు లెమ్మని ఊరుకున్నాను. కాని పిచ్చి పిచ్చి పనులు కనిపించాయి. వాడి రాకపోకలు మానిపించాను. ఒక వ్యక్తీ నా దగ్గరికి వస్తుండేవాడు. కాస్త విలాస ప్రియుడు . అతనితో సరసాలు మొదలైనాయి. అతడు మంచి వంశపు వాడే గాని కాస్త అల్పుడు. నన్ను గురించి గాని, అతని అంతస్తుగురించి గాని ఆలోచించలేదు. ఒకనాటి సాయంకాలం అబాదీతో మాట్లాడుతున్నాడు.
    చట్టన్: నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ అబాదీ ఏం చేయను / ఉమ్రావ్ జాన్ అంటే భయం.
    అబాదీ : ఇదిగో ఈ మాటకు నాకు చెప్పకు. ఎందుకు భయం?
    చట్టన్ : (అబాదీ మెడలో చేతులు వేసీ) "అబ్బ ఎంత అందంగా ఉన్నావే" అన్నాడు.
    అబాదీ : ఉంటే నీకేం ?
    చట్టన్ : (ముద్దు పెట్టుకొని) "నాకేమి? ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. చస్తున్నాను" అన్నాడు.
    అబాదీ : వెధవ పావలా ఇవ్వలేదు. చస్తాడట చావు. మహానుభావా! చాల మంది చవగా చూచాను. శవం ఒక్కనిదీ చూడలేదు.
    చట్టన్ : పావలా! ప్రాణం అర్పిస్తాను.
    అబాదీ : వెధవ ప్రాణం నేనేం చేసుకోను?
    చట్టన్ : ఆ ప్రాణం అంత చవకా? ఎందుకూ పనికి రాదా?
    అబాదీ : మాటలు నేర్చావు. జేబు చూడు. పావలా ఇచ్చి వెళ్ళు.
    చట్టన్ : అబ్బ! ఇంకా అమ్మ జీతం రాలేదంటే. ఎల్లుండి తెచ్చిస్తాగా తప్పక.
    అబాదీ : అయితే ప్రాణం ఇక్కడ పెట్టి దయచేయండి.
    చట్టన్ : ఒక్క ముద్దు.
    చట్టన్ అబాదీని దగ్గరకు లాక్కున్నాడు. అబాదీ జేబులో చేయి వేసింది. మూడు పైసలు దొరికాయి. కాజేసింది.
    చట్టన్ : నామీద ఒట్టు. పైసలు తీసుకోవద్దు. అమ్మమ్మ రంగు పొట్లాలు, దాచనా తెమ్మని ఇచ్చింది.
    అబాదీ : నీతోడు, ఇవ్వను.
    చట్టన్ : ఏం చేస్తావు చెప్పు. ఇదిగో, ఎల్లుండి పావలా తీసుకో.
    అబాదీ : ఏమి? ఖాగీనా కొనుక్కుంటా.
    చట్టన్ : ఖాగీనా మూడు పైసలదా? ఒక్క పైస తీసుకో.
    అబాదీ : మూడు పైసల ఖాగీనా ఎక్కువయిపోయింది కదూ? చాల రోజుల నుంచి తినాలనిపిస్తుంది. అమ్మగారు తిననివ్వదు. కడుపు నొప్పులేస్తుంది అంటుంది. ఒకనాడు చాటుగా అణాది కొనుక్కుని తిన్నాను. ఏమీ కాలేదు.
    నేననుకున్నాను ఇది రాక్షసిగా ఉన్నట్లుందని . ఎంత కొద్దిగా తిన్నా నాకు ఆజీర్ణం చేస్తుంది.
    రుస్వా ; కరువులో కొన్నావా?
    ఉమ్రావ్ : అవును. తల్లి ఒక రూపాయికీ అమ్మిపోయింది. మూడు రోజుల నుంచి ఉపవాసం ఉంది. రొట్టెలు పెట్టాను. మరొక రూపాయి ఇచ్చాను. నాకు జాలి కలిగింది. నా దగ్గరే ఉండి పొమ్మన్నాను. ఉండలేదు. వెళ్ళిపోయింది.
    రుస్వా : వెర్రిది. మళ్ళీ ఎప్పుడైనా వచ్చిందా ?




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.