Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
నేను : నేను ఎన్నో పాపాలు చేశాను. అయినా అదంటే వణికిపోతాను.
రుస్వా : మీరు చాలామందిని హింసించి ఉంటారు.
నేను : అది మా వృత్తి. దాంతోనే లక్షలు అర్జించాను. వేలు పోగొట్టుకున్నాను.
రుస్వా : దానికి శిక్ష ఉండదా మరి !
నేను : శిక్ష ఉండకూడదు. మేము చేసిన మానసహింసలో ఒకరకపు అనందం ఉంది. ఆనందమే అందుకు పరిహారం.
రుస్వా : బాగా చెప్పాడు.
నేను : ఒక మహాశయుడు. విందులోనో, వినోదంలోనో మమ్ము చూచాడనుకొండి మాకోసం పడిచస్తాడు. దగ్గర దమ్మీడీ ఉండదు. వెల లేక వెలయాలు దొరకదు. అతని మనసు బాధపడుతుంది. హింసపడ్తాడు. అందులో మా నేరం ఏముంది? మరొక వ్యక్తీ మా దగ్గరకు రావాలనుకుంటాడు. డబ్బు కూడా తెస్తాడు. కాని మేము మరొకరికి కట్టుబడి ఉంటాం. అతనిని మన్నించలేము. అది మా ఇష్టం. వారికోసం చస్తామా? మా ఖర్మానికి కొందరు వస్తారు. తమను ప్రేమించమంటారు. మేము ఇష్టపడం. ఇదేం వారి జాగీరా ! దాంతో వారికి బాధ కలుగుతుంది. ఇందులో మేము చేసిన పాపమేం?
రుస్వా : అలాంటి వారిని తుపాకితో కాల్చేయాలి. నన్ను మాత్రం వారిలో లెక్క కట్టకండెం!
నేను : ఎందుకలా అంటారు? మీరు విలసప్రియులు. మీకు ఒకరి మీద గాని, ఒకరికి మీ మీదగాని ప్రేమ లేదు. మీరు అందరినీ ప్రేమిస్తారు. అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు.
రుస్వా : ఏమేమి? ఒకటి అవును. ఒకటి కాదు. అదెలా సాధ్యం?
నేను : నేను తర్కం ఎక్కువగా చదవలేదు. కాని సాధ్యమే. ఒకే మాట రెండు తీర్లుగా ఉంటుంది. ఒక ప్రేమ తెలివి గలది. ఒకటి తెలివి లేనిది.
రుస్వా : ఉదాహరణకు.
నేను : మొదటిది మీరు నన్ను ప్రేమించడం, మేము మిమ్ము......
రుస్వా : సరే మా ప్రేమ మా హృదయానికి తెలుసు. మీరు ప్రేమించడం తమ అంగీకారంతో తెలిసింది. రెండవదానికి ఉదాహరణ?
నేను : నన్ను కోరకుంటే నా చేరు పైనా కోరుతారుగా. రెండవదానికి ఉదాహరణ భగవత్రార్జన.
రుస్వా : అది సరియైన ఉదాహరణ కాదు. మరేదైనా చెప్పండి.
నేను : మంచిది, మజ్నూ లైలాను ప్రేమించినట్లు......
రుస్వా : ఎంత పాత పురాణం వెతికి తెచ్చారు!
నేను : కాకుంటే ..... నజీర్ ....
రుస్వా : (మాటకు అడ్డువచ్చి ) క్షమించండి. అదొక ఉదాహరణ ? ఒక పద్యం గుర్తుకు వచ్చింది వినండి.
నిన్ను వలచి వెంట తెచ్చుకొంటి విపదాళి
నిను వలచి చచ్చిదని ఎరిగి కూడ బుద్ది లేదు మాకు !
నేను : ఆఁ. కలకత్తా విషయమా?
రుస్వా : లోకం వట్టిపోలేదు. మీరు అక్బరలీఖాను ఇంట్లో తిష్టవేశారని విన్నామే?
నేను : చెప్పేది వినండి. మొదటి కోర్టులో నవాబు గారు గెలిచారా? అప్పుడు నేను రహస్యంగా ఉండాల్సి వచ్చింది. ఆ రోజుల్లోనే అక్బరలీఖాను నన్ను వారి ఇంటికి తీసికెళ్ళారు. చాల సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను అక్బరలీఖాను ఇంట్లో ఉండిపోయానని అపార్ధం చేసుకున్నవారు ముగ్గురు. ఒకడు అక్బరలీఖాను. రెండవది వారి భార్య. మూడవవారి పేరు చెప్పను.
రుస్వా : నేను చెప్పనా? గోహర్ మిర్జా.
నేను : కాదు.
రుస్వా : ఇంకెవరు ? చెప్పండి.
నేను : మీరు చెప్పండి. ఈ జిత్తులు మా దగ్గర సాగవు.
రుస్వా : జిత్తులా ? అయితే నేనొక కాగితం ముక్క మీద వ్రాసి ఉంచుతారు. తరవాత మీరు చెప్పండి.
నేను : బాగుంది.
రుస్వా : రాసి పట్టాను. చెప్పండి.
నేను : మూడవదాన్ని నేను.
రుస్వా : మీ పేరే వ్రాశాను. చూడండి.
నేను : వాహ్ మిర్జా సాహెబ్! సరిగ్గా కనిపెట్టారు.
రుస్వా : మీ దయ. ఆఁ అయితే ఏం జరిగింది ?
నేను : ఏం జరుగుతుంది? వినండి.
ముందు వారు నన్ను ఒక చిన్న ఇంట్లో ఉంచారు. ఆ ఇల్లు వారి ఇంటికి కలసి ఉన్నది. మధ్యన దిడ్డి ఉంది. వెధవ మట్టిల్లు. చిన్నగది. అందులో రెండు పొయ్యిలు. ఇదే వంట గది. పడక గది వగైరా గదులన్నీని. ఈ ఇంట్లోకి అక్బరలీఖాను కు దగ్గరిమిత్రులు రావాలనుకునేవారు. వారిలో ఒకడు పల్లె దొర అప్జర్ హునేను. రావడం రావడమే "కోడలా" అని మొదలు పెట్టారు. బిడియం లేదు. వట్టి అల్పత్వం. వచ్చినప్పన్నుంచి ఆకులు, ఆకులని ప్రాణం తీసేవాడు.
ఒకటి రెండు రోజులా? ఎంతకని . విసిగి పాన్ దాన్ ముందుకు నెట్టాను. నేను వదిలించుకున్నాను. తాతల సొమ్ములా ఆక్రమించుకున్నాడు. చూసేవాళ్ళకు అసహ్యం కలిగేటట్టు పాన్ తినేవాడు. సున్నపు డబ్బాలలోనూ, కాదు డబ్బాలోనూ వేళ్ళు పెట్టి నాకేవాడు. నేను వక్కలు, యాలుకల మీదనే గడపసాగాను. తుదకా మహాశయుడు వాటిని కూడా వదల్లేదు. మరొక వ్యక్తీ హజిదలీ అనేవారు తరచు వస్తుండేవారు. వారికి అక్బరలీఖాను తో బంధుత్వం ఉన్నట్లుంది. ఇప్పుడు జ్ఞాపకం లేదు. వెర్రి హాస్యం చేసేవారు హద్దు పద్దూ లేకుండా.
ఈ ఇద్దరే కాక ఇంకా అనేకమంది అక్బరలీఖాను మిత్రులు ఉండేవారు. వారు రాత్రింబవళ్ళు చట్టాలతో సతమతం అవుతుండేవారు. అంతా కోర్టు పక్షులే. అక్బరలీఖాను వెళ్ళిపోయినప్పుడు మనసుకు కాస్త శాంతి లభించేది.
కొద్ది రోజుల్లోనే ఆ ఇల్లంటే ప్రాణం విసిగిపోయింది. మరొక ఇంటికి మారుదామనుకుంటుందగానే ఒకరోజు అకస్మాత్తుగా అక్బరలీఖాను ఏదో కేసు మీద ఫైజా బాడు వెళ్ళిపోయారు. అప్జల్ హుసేన్ తన ఊరికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేరు. తలుపు వేసుకొని కూర్చొని ఉన్నాను. అక్బరలీఖాను ఇంట్లోకి ఉన్న దిడ్డి తెరచుకుంది. అక్బరలీఖాను భార్య గదిలోకి వచ్చింది. ఇష్టం అయినా కాకున్నా సలాము చేయాల్సి వచ్చింది. చాలాసేపు మంచం దగ్గర నుంచున్నారు. "కూర్చోండి" అన్నాను. కూర్చున్నారు.
నేను : పెదదాని మీద దయ కలిగింది. ఎటు వచ్చారు?
ఆమె : మీకు బాధగా ఉంటె వెళ్ళిపోతాను.
నేను : ఇది మీ ఇల్లు. అజ్ఞాపించాల్సింది మీరు.
ఆమె : ఎందుకలా అంటారు? ఈ ఇల్లు నాదేంతో మీదీ అంతే. వాస్తవానికి ఇది నాదీ కాదు. మీది కాదు. ఇల్లు గలవారిది.
నేను : అల్లా మీ ఇంటివారిని అనుగ్రహించాలి. ఈ ఇల్లు మీడీ, వారిది ను.
ఆమె : వంటరిగా కూర్చొని ఉంటారు. మేమూ మనుషులమే. ఇంట్లోకి రాకూడదూ? ఓహో! వారి అజ్ఞ కాలేదేమో?
నేను : వారి అజ్ఞకు బద్దురాలినేమీ కాను. కావలసింది మీ అనుమతి. అది లభించింది. తప్పక వస్తాను.
ఆమె ; అయితే పదండి.
నేను : నడవండి.
ఇంట్లోకి వెళ్ళి చూచాను. అల్లా అన్నీ ఇచ్చాడు. ఇత్తడి గిన్నెలు, రాగి పాత్రలు, ప్లేట్లు, చెంబులు, నవారు మంచాలు, బల్ల పీటలు, అన్నీ ఉన్నాయి. దేనికీ కొరతలేదు. అక్కడక్కడా చెత్త పడి ఉంది. ఎదురుగా వంటింట్లో అమీరన్ వంట చేస్తుంది. ఈగలు ముసురుతున్నాయి. బల్ల పీట మీద చెత్త పడి ఉంది. అమ్మగారి మంచం నిండా మణుగుల కొద్ది దుమ్ము. అమీరన్ పాన్ డాన్ తెచ్చి వారి ముందుంచింది. దాని నిండా సున్నం, కాచు మరకలే. నాకు అసహ్యమనిపించింది.
ఆమె తాంబూలం చుట్టి ఇచ్చింది. వేళ్ళసందున పెట్టుకోనో మాటలు సాగించాను. ఈలోగా ఆ వీధి ముసలది ఒకతే వచ్చింది. చేతిలో నేల తుడిచి కూర్చుంది. నావైపు సంజ్జా చేసి "ఎవరు?" అని భార్య నడిగింది.





