Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    అయిదు ఋక్కులచే స్తుతించినపుడు భూతాని అసృజన్త. భూతానాంపతిః అధిపతిః ఆసీత్.

    సప్తభిః అస్తువత - సప్తర్షయః అసృజ్యన్త. ధాతా అధిపతిః ఆసీత్.

    నవభిః అస్తువత-పితరః అసృజ్యన్త. అదితిః అధిపత్నీ ఆసీత్.

    ఏకాదశభిః అస్తువత - ఋతవః అసృజ్యన్త. ఆర్తవః అధిపతిః ఆసీత్.

    త్రయోదశభిః (13) అస్తువత - మాసాః అసృజ్యన్త. సంవత్సరః అధిపతిః ఆసీత్.

    పంచదశః (15) అస్తువత. క్షత్రం అసృజ్యన్త. ఇంద్రః అధిపతిః ఆసీత్.

    సప్తదశభిః (17) అస్తువత. క్షత్రం అసృజ్యన్త. బృహస్పతిః అధిపతిః ఆసీత్.

    నవదశభిః (19) అస్తువత. శూద్రార్యే - శూద్ర వైశ్యులు - అసృజ్యేతామ్. అహోరాత్రే అధిపత్నీ ఆస్తామ్.

    ఏకవింశత్యా (21) అస్తువత. ఏకశఫాః పశ్వః - వంటి గిట్ట పశువులు - అసృజ్యన్త. వరుణః అధిపతిః ఆసీత్.

    త్రయోవింశత్యా (23) అస్తువత. క్షుద్రాః పశవః అసృజ్యన్త. పూషా అధిపతిః ఆసీత్.

    పంచవింశత్యా (25) అస్తువత. ఆరణ్యాః పశవః అసృజ్యన్త. వాయుః అధిపతిః ఆసీత్.

    సప్తవింశత్యా (27) అస్తువత. ద్యావాపృథివీ వ్యైతామ్ - విడివడినవి. వానిని అనుసరించి వసవః రుద్రాః ఆదిత్యాః వ్యాయన్ - విడిపోయినారు. ద్యావాపృథ్వులకు వసు, రుద్ర, ఆదిత్యులు అధిపతులు అయినారు.

    నవవింశత్యా (29) అస్తువత. వనస్పతయః అసృజ్యన్త. సోమః అధిపతిః ఆసీత్.

    ఏక త్రింశతా (31) అస్తువత. ప్రజాః అసృజ్యన్త. మాసములకు, పక్షములకు ఆధిపత్యము కలిగినది.

    త్రయస్త్రింశతా (33) అస్తువత. భూతాని అశామ్యన్ - శాంతించనవి. శాంతించిన భూతములకు పరమేష్ఠీ అధిపతిః ఆసీత్.

                                     పదకొండవ అనువాకము

    (వ్యుష్టి నామక ఇష్టకల ఉపధానము. వ్ర్యుష్టి చీకట్ల తరిమి వేయు ఉషః కాలమగును.)

    1. ఇది వ్యుష్టిరూప ఇష్టక. ఇది పొద్దుకు తొలిది అగుచు ఆదిత్య సహితయై ప్రకాశించినది. క్రొత్త పెళ్లి కూతురు మున్ముందు ఎట్లు సంతానమును అభివృద్ధి చేయునో అట్లే ఈ ఇష్టక భూమి మీద వర్థిల్లుచున్నది. అగ్ని, సూర్య, చంద్రులు ఈ ఇష్టకకు ప్రభాత రూపము కలిగించుచున్నారు.

    2. ఈ రెండు ఉషస్సులును ఛందస్వతులు. ప్రకాశము కలిగించునవి. కాలమును బట్టి కదులునవి. సూర్యునకు పత్నులు. స్వయముగా దేవతలు. కాంతులు కలిగించునవి. జరా రహితలు. బహువ్యాపార కారణ భూతలు.

    అవి వివిధములుగ సంచరించుచున్నవి.

    3. మూడు రూపముల ఉషస్సులు యజ్ఞ మార్గమును అనుసరించుచున్నవి. అగ్ని, చంద్ర, సూర్యులు వీనికి ప్రకాశము కలిగించుట వలన ఇవి ఋతస్య పన్థాం - యజ్ఞ మార్గమును అనుసరించుచున్నవి.

    ఈ ఉషస్సులందు ఒకటి యజమాని సంతానమును, రెండవది యజమాని శక్తిని, మూడవది యజమానికి దేవత్వము ప్రసాదించు వ్రతమును రక్షించుచున్నవి.

    4. ఉషస్సు యొక్క నాలుగవ రూపము యజ్ఞమునకు రెండు రెక్కలు అగుచున్నది. ఋత్విజులను సమకూర్చుచున్నది. స్తోత్రమును కలిగించుచున్నది. గాయత్రి, త్రిష్టుప్, జగతి ఛందస్సులను, స్వర్గమును పోషించుచున్నది. ఆ విధముగా ఈ ఉషస్సు చతుష్టోమము అయినది.

    5. ప్రజాపతి ఈ సమస్త సృష్టి యందు అయిదు ఉషస్సులను, వారికి అయిదుగురేసి చెల్లెండ్రను సృష్టించినాడు. వారందరు కలసి క్రతునిష్పాదకులను, క్రత్వంగములను వ్యాపింప చేయుచున్న వారలై నానా రూపములు ధరించుచున్నారు.

    6. ఉషో దేవికి - ముప్పది రోజుల - ముప్పది మంది భగినులు ఉన్నారు. వారి ప్రకాశము సమానము. వారు వెలుగు వస్త్రములు ధరించినవారు. నిత్యాగ్ని హోత్రమును అందుకొనుచున్నారు. విద్వత్తు కలవారై, ఋతువులను ధరించుచున్నారు. సూర్యుని పార్శ్వములందు ప్రకాశించుచున్నారు.

    7. ఈమె - ఈ ఉషోదేవి - జ్యోతిష్మతి. రాత్రి రూప. ప్రదీప్త. నభోమండలమందలి సూర్యుని కిరణములను కంచుకముగా ధరించునది.

    ఉషస్సు అవతరించగా పశువులు నిద్రలేచుచున్నవి. తమ తల్లి వంటి భూమి మీద సంచరించుచున్నవి.

    8. ఏకాష్టకా - మాఘ కృష్ణ అష్టమి - తపస్సు చేసినది. మహిమాన్వితుడగు ఇంద్రుని తన కడుపున కన్నది. ఇంద్రుని చేత దేవతలు దస్యులను పరిభవించినారు. ఇంద్రుడు తన తేజస్సున అసురులను సంహరించినాడు.

    9. ధర్మమును బోధించు ఏకాష్టకా దేవతలారా! నేను కర్మానుష్ఠానము లేనివాడనై ఉండగా మీరు నన్ను కర్మానుష్ఠానపరునిగా చేసినారు. మీరు నా ఈ ప్రార్థనను మన్నించండి:-

    మీరు ఇంద్రుని మంగళకర మనసు నందు ఏ విధముగా నిలిచి ఉన్నారో అట్లే నేనును ఉందునుగాక. మీలో ఒకరిని ఒకరు వ్యతిరేకించకున్నారు కదా! అట్లే నేను సహితము ఉందునుగాక.

    10. నా మనసునందు జగముల నెరిగిన ఉషోదేవి ఆసీన అయి ఉన్నది. ఈమె ప్రతిష్ఠావంతుడగు యజమాని యందు నిలిచి అతనిని అనుగ్రహించుచున్నది.

    11. పంచవ్ర్యుష్టులను అనుసరించి పంచదోహములు ఉత్పన్నాః - పుట్టినవి. పంచవ్యుష్టుల ననుసరించి భూమి పుట్టినది. ఋతువులు ఉత్పన్నాః, అయిదు దిక్కులు ఉత్పన్నాః, పంచదశ స్తోమాః ఉత్పన్నాః.

    ఈ ఉషస్సులు ప్రకాశమునందు సమానములు.

    12. అయిదు ఉషస్సులందు ఒకటి నిత్యగర్భయై సూర్యునితో కూడి ఉంటున్నది. రెండవది ఉదకముల మహిమను భరించుచున్నది. మూడవది సూర్యునకు సంబంధించిన, సంస్కరించబడిన - ప్రదేశములందు సంచరించుచున్నది. నాలుగవది అగ్నికి సంబంధించి పావన ప్రదేశములందు సంచరించుచున్నది. అయిదవ దానిని సవిత ప్రకాశకారిణిగా నియమించుచున్నాడు.

    13. మొదటి ఉషస్సు చీకట్లను తొలగించినది. అది ఈ లోకమునకు ధేనువు వలె ప్రీతికరము అయినది.

    ఉషోదేవీ! నీవు వర్షవతివి అగుము. మాకు రానున్న సంవత్సరములందు వర్షము కలిగించుము.

    14. ఉషస్సు నభమునందలి నక్షత్రములందు శ్రేష్ఠతమము. విశ్వరూప. మిశ్రవర్ణ. సూర్యునితో సమాన ప్రయోజనము కలది. తనకు శోభన కర్మలు కోరునది. ఆమె ఆకసము నందలి కాంతితో విచ్చేసినది.

    ఉషోదేవీ! నీవు జరారహిత వయ్యు చిరకాలము నుంచి ఉన్నదానవు అయినందున జరాభూతవు అయినావు.

    15. ప్రథమోషస్సా! నీవు ఋతువులను పాలించుదానవు. అహస్సులకు నేత్రివి. ప్రజల జనయిత్రివి. నీవు ఈ కర్మకు విచ్చేసినావు.

    ఉషోదేవీ! నీవు రూపమునకు ఒక్కదానవు. అట్లయ్యు బహురూపముల దానవై చీకట్లను తొలగించుచున్నావు. నీవు జరారహితవయ్యు అన్యభూతములను జరాసహితములను చేయుచున్నావు.

                                         పన్నెండవ అనువాకము

    1. అగ్నీ! పుట్టిన మా శత్రువులను హతమార్చుము. పుట్టనున్న శత్రువును పుట్టకుండ చేయుము. నీవు సుమనస్కుడవగుము. కోపము లేని వాడవగుము. ప్రాగ్వంశము, సదస్సు, హవిర్ధానము అణు మూడిండ్లు కలవాడవు. మమ్ము వికసింపచేయుము. నీ అనుగ్రహమున మాకు సుఖములు కలుగును గాక.

    2. జాతవేదా! నీ బలమున పుట్టిన మా శత్రువులను హతమార్చుము. పుట్టనున్న వారివి పుట్టనీకుము. నీవు మాకు సుమనస్కుడవు అగుము. మా పక్షము వహించి పలుకుము. నీ అనుగ్రహమున మేము అధికులము అగుదుముగాక.

    3. ఇష్టకే! త్వం చతుశ్చత్వారింశః స్తోమః, వర్చిః ద్రవిణమ్ - ధనము - అసి.

    4. ఇష్టకే! త్వం షోడశః స్తోమః, ఓజః, ద్రవిణమ్ అసి.

    5. ఇష్టకా స్వరూపమా! నీవు పృథివి పూరించు దానవు అగుచున్నావు. 'అప్సః' అను పేరు గల దానవు అగుచున్నావు.

    6. ఇష్టకే! త్వం ఏవశ్చద్దః, పరివశ్చన్దః, శమ్భూశ్చందః, పరిభూశ్చన్దః, ఆచ్చచ్చన్దః, మనశ్చన్దః, వ్యచశ్చన్దః సింధుశ్ఛన్దః, సముద్రం ఛన్దః, సలిలంఛందః, సంయచ్ఛందః, వియచ్ఛందః, బృహచ్ఛందః, రథంతరం ఛందః, నికాయశ్ఛన్దః, వివిధశ్ఛన్దః, గిరిశ్ఛన్దః, భ్రజశ్ఛన్దః, సష్టుప్ఛన్దః, అనుష్టుప్ఛన్దః, కకుచ్ఛన్దః, తికకుచ్ఛన్దః, కావ్యంఛన్దః అఙ్కు సంఛన్దః పదపఙ్త్కి శ్ఛన్దః, అక్షర పఙ్త్కిశ్ఛన్దః విష్టార ప్త్కి శ్ఛన్దః, క్షురో భృజ్వానశ్ఛన్దః, పక్షశ్ఛన్దః, పరివశ్ఛన్దః వయశ్ఛందః వయస్కృచ్ఛన్దః, విశాలంఛంధః విష్పర్దాశ్ఛందః, ఛదిశ్ఛన్దః, దురోహణంఛన్దః, స్తన్ద్రం ఛన్దః, అఙ్కాఙ్కం ఛన్దః అసి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.