Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    4. ఇష్టకా! దిక్కులందు ఉత్తర దిక్కువు. ఋతువులందు శరత్తువు. దేవతలందు మిత్రావరుణ స్వరూపవు. ధనములందు శూద్రమవు. స్తోమములందు ఏకవింశ స్తోమమవు. అది త్రిణవ ప్రవర్తని. వయసులందు మూడున్నర సంవత్సర రూపమవు. యుగములందు కలియుగమవు. వాతములందు ఉత్తరగాలివి. ఋషులందు 'ప్రత్న' ఋషి స్వరూపమవు.

    5. ఇష్టకా! నీవు దిక్కులందు ఊర్ధ్వ దిశవు. ఋతువులందు హేమంత, శిశిరమవు. దేవతలందు బృహస్పతివి. ధనములందు వర్చో రూపవు. స్తోమములందు త్రిణవస్తోమమవు. అది త్రయస్త్రింశ స్తోమ ప్రవర్తిని. వయసు లందు నాలుగు సంవత్సరముల వయో రూపమవు. యుగములందు కలియుగ అవసానయుగమవు. వాతములందు సకల దిశల వాతమవు. ఋషులందు 'సువర్ణ' ఋషివి.

    6. పితృ, పితామహ, ప్రపితామహులారా! భ్రాతృ పుత్రాదులారా! మీరు మమ్ము పాలించండి. మమ్ము రక్షించండి.

    ఇష్టకా! నిన్ను ఈ బ్రాహ్మణ, క్షత్రియుల అభీష్టము కొరకును, ఈ పురోహితుడు చేయు కర్మ కొరకును, దేవతల ఆహ్వానము నిమిత్తము ఉపధానము చేయుచున్నాను.

                                         నాలుగవ అనువాకము

    1. ఇష్టకా! నివాసమున ధ్రువమగుదానవు. నీవు పుట్టిన మట్టి ధ్రువమైనది. నీవు ధ్రువమగుదానవు. మేము నిన్ను ఉపాధానము చేయుచున్నాము. నీవు - అంతకు ముందే ఏర్పరచిన ధ్రువమగు స్థానమున ఆసీనవగుము. దేవతలకు అధ్వర్యులగు అశ్వినులు నిన్ను తూర్పున స్థాపింతురుగాక.

    2. ఇష్టకా! సమర్థులగు పుత్రులున్న ఇంటి తండ్రి వలె, సమర్థవంతమగు నీస్థానమున కూర్చుండుము. నీవు పృథ్వివి. నీవు బృహత్తువు. నీవు సుఖించుదానవు. దేవతలందు నీవు శరీర సహితవై సుఖముగా ఉండుము. సర్వత్ర సుఖసేవ్యవై కొడుకు విషయమున తండ్రి వలె ఉండి పొమ్ము. దేవతల అధ్వర్యులగు అశ్వినులు నిన్ను ఈ అగ్ని క్షేత్రమున స్థాపింతురుగాక.

    3. ఇష్టకా! నీవు మంచి నివాసము గల దానవు. ధనము కలదానవు. మాకు దీర్ఘాయువును, అధిక ధనమును, సుపుత్రులను కలిగించుము. మా బుద్ధి మాంద్యమును, పాప బుద్ధిని పూర్తిగా నశింపచేయుము. యజ్ఞకర్తకు ధనపుష్టిని సర్వత్ర కలిగించుము. అతని స్వర్గమందు పుష్టిని కలిగించుము. దేవతలకు అధ్వర్యులగు అశ్వినులు నిన్ను ఈ అగ్ని క్షేత్రమున స్థాపింతురుగాక.

    4. ఇష్టకా! నీవు దేవతలను చేరుదానవు. చితాగ్నికి పూరకమవు అగుచున్నావు. నిన్ను విశ్వే దేవతలు సర్వత్ర కీర్తింతురుగాక. నీవు స్తోత్రవతివి. ఘృతవతివి. ఈ స్థానమున ఉండుము. మాకు పుత్ర, పౌత్రాది యుక్తమగు ధనమును కలిగించుము. దేవతలకు అధ్వర్యులగు అశ్వినులు నిన్ను ఈ అగ్ని క్షేత్రమునందు స్థాపింతురుగాక.

    5. ఇష్టకా! నీవు స్వర్గమునకు శీర్షమగు ఆదిత్య స్వరూపవు అగుచున్నావు. పృథ్వికి నాభి స్థానము అగుచున్నావు. దిశలను ఏర్పరచుదానవు అగుచున్నావు. భువనములకు అధిపత్నివి అగుచున్నావు. జలముల తరంగమవు, జలబిందువువు అగుచున్నావు. విశ్వకర్మ నీకు ఋషి అగుచున్నాడు. దేవతల అధ్వర్యులగు అశ్వినులు నిన్ను ఈ అగ్ని క్షేత్రమున స్థాపింతురుగాత.

    6. ఇష్టకా! నీవు ఋతువులన్నిట సజూః అసి. - సమాన ప్రీతి కలదానవు అగుచున్నావు. బ్రహ్మాదులతో సజూః అసి. రుద్రాదులతో సజూః అసి. ఆదిత్యులతో సజూః అసి. విశ్వే దేవతలతో సజూః అసి. దేవతలతో సజూః అసి. ఆయువు నిచ్చు వారితో సజూః అసి. నిన్ను వైశ్వానరాగ్ని కొరకు ఉపధానము చేయుచున్నాను. దేవతల అధ్వర్యులగు అశ్వినులు నిన్ను ఈ అగ్ని క్షేత్రమున స్థాపింతురుగాక.

    7. ఇష్టకా! మే ప్రాణం పాహి. మే అపానం పాహి. మే వ్యానం పాహి. నా కన్నులకు విశాల దృష్టి కలుగునట్లు ప్రకాశింపచేయుము. నా చెవులను మంచి మాటలు విను శక్తి గలవానిని చేయుము.

    8. ఇష్టకా! జలములను సంతోష పరచుము. ఓషధులకు తృప్తి కలిగించుము. ద్విపాత్తులను కాపాడుము. చతుష్పాత్తులను రక్షింపుము. దివి నుండి వర్షమును అంతట కురిపించుము.

                                       అయిదవ అనువాకము

    1. ఇష్టకా! నీవు సార్ధ సంవత్సర వయోరూప త్రిష్టుప్ ఛందము అగుచున్నావు. రెండు సంవత్సరముల వయోరూప 'విరాట్' ఛందము అగుచున్నావు. సార్ధ ద్విసంవత్సర వయో రూప గాయత్రీ ఛందము అగుచున్నావు. మూడు సంవత్సరముల వయో రూప 'ఉష్ణిక్' ఛందము అగుచున్నావు. నాలుగు సంవత్సరముల వయోరూప 'బృహతి' ఛందము అగుచున్నావు. నాలుగున్నర సంవత్సరముల వయోరూప 'బృహతి' ఛందో రూపవు అగుచున్నావు. ఋషభవయో కకుప్చందో రూపవు అగుచున్నావు. ధేనుర్వయోజగతీ ఛందః. పురుషో వయస్తన్ద్రం ఛన్దః. వ్యాఘ్రోవయ్కోనాధృష్టంఛన్దః. సింహోవయశ్చదిశ్చన్దః. విష్టమ్భో వయ్కోధిపతిశ్చందః. క్షత్రంవయో వయన్దం ఛందః. విశ్వకర్మావయః పరమేష్ఠీఛందః. మూర్ధావయః ప్రజాపతిశ్చందః.

                                        ఆరవ అనువాకము

    1. ఇంద్రాగ్నులారా! ఇది స్వయమాతృణ్ణ ఇష్టక. పగుళ్లు లేనిది. దీనిని గట్టి పరచండి. ఇది తన శక్తిచే ద్యావాపృథ్వులను, అంతరిక్షమును బాధించునంత ఎదుగునుగాక.

    2. స్వయమాతృణ్ణ ఇష్టకా! నీవు వ్యక్తిత్వము కలదానవు. విశాలవు. దీప్తియుక్తవు. విద్వాంసులతో కూడినదానవు. ప్రజాపతి నిన్ను అంతరిక్షముపైన స్థాపించునుగాక. నీవు ద్యులోక, భూలోక, అంతరిక్షములను ప్రకాశింప చేయుచున్నావు. అంతరిక్షమును నియంత్రించుము. అంతరిక్షమును దృఢపరచుము. అంతరిక్షమును హింసించకుము.

    ఇష్టకా! వాయువు నీకు ప్రాణ, అపాన, వ్యాన ఉదాన వాయువృత్తి లాభమును, ప్రతిష్ఠను, చరిత్రను యోగ క్షేమములను కలిగించునుగాత. వాయువు తన దీప్తి విశేషమున నిన్ను రక్షించునుగాక. అతని అనుగ్రహమున నీవు స్థిరముగా ఆసీనవగుము.

    3. ఇష్టకా! నీవు ప్రకాశించుచున్న దానవై ప్రాక్ దిగ్రూపము అగుచున్నావు. విరాట్రూపమువై దక్షిణ దిగ్రూపము అగుచున్నావు. సమ్రాట్ రూపమువై పశ్చిమ దిగ్రూపము అగుచున్నావు. స్వరాట్ రూపమువై ఉత్తర దిగ్రూపము అగుచున్నావు. అధిపత్నివై ఊర్ధ్వ దిగ్రూపము అగుచున్నావు.

    4. ఇష్టకే! మే ఆయుః పాహి. మే ప్రాణం పాహి. మే అపానం పాహి. మే వ్యానం పాహి. మే చక్షుః పాహి. మే శ్రోత్రం పాహి. మే మనః జిన్వ - సంతోష పరచుము. మే వాచం సిన్వ సంతృప్త పరచుము. మే ఆత్మానం పాహి. మే జ్యోతిః యచ్చ - నాకు జ్యోతిని ప్రసాదించుము.

                                            ఏడవ అనువాకము

    1. ఇష్టకే! నీవు మా ఛందః ప్రమాఛందః, ప్రతిమా ఛందః అస్రీవిశ్చన్దః, పంక్తి చ్చందః, ఉష్ణి హా ఛన్దః బృహతీ ఛన్దః, అనుష్టుప్చన్దః, గాయత్రీ ఛన్దః, త్రిష్టుప్ ఛన్దః, జగతీ ఛన్దః, పృథివీ ఛందః, అంతరిక్షం ఛందః, ద్యౌశ్చన్దః, సమాశ్చన్దః నక్షత్రాణి ఛన్దః, మనశ్చన్దః, వాక్చందః, కృషిశ్చన్దః, హిరణ్యం ఛన్దః, గాశ్చన్దః, ఆజా ఛన్దః, అశ్వశ్చన్దః అసి - అగుచున్నావు.

    ఇష్టకే! త్వం - నీవు అగ్నిర్దేవతా, వాతో దేవతా సూర్యో దేవతా, చన్ద్రః దేవతా, వసవో దేవతా, రుద్రా దేవతా, ఆదిత్యా దేవతా, విశ్వే దేవా దేవతా, మరుతో దేవతా, బృహస్పతిర్దేవతా, ఇన్ద్రోదేవతా, వరుణో దేవతా అసి.

    2. ఇష్టకే! నీవు శిరస్సు వలె ప్రధానమైన దానవు. ప్రకాశించుదానవు. స్థిరమగు దానవు. ధారణ హేతువగు దానవు. నిన్ను నియంత్రించుకొనుదానవు. అందరను నియంత్రించుదానవు.

    ఇష్టకే! నిన్ను అన్నము కొరకు ఉపదధామి ఉపదానము చేయుచున్నాను. బలము కొరకు ఉపదధామి కృషి కొరకు ఉపదధామి. క్షేమాయ ఉపదధామి.

    ఇష్టకా! నీవు స్వయం నియంతవు. ప్రకాశమానవు. స్థిరమైన దానవు. ధారణ హేతువగుదానవు. ధారణ చేయుదానవు. ధరిత్రీ రూపమవు. ఆయుషే త్వా ఉపదధామి. వర్చసే త్వా ఉపదధామి. ఓజసే త్వా ఉపదధామి. బలాయత్వా ఉపదధామి.

                                        ఎనిమిదవ అనువాకము

    1. ఇష్టకా! నీవు శీఘ్రమగు త్రివృత్ స్తోమమవు. భాసమాన పంచదశ స్తోమమవు. విశాల సప్తదశ సోమమవు. వడిగల అష్టాదశ స్తోమమవు. తపము వంటి నవదశ స్తోమమవు. అభివర్తమను సవింశ స్తోమమవు. ధారకమగు ఏకవింశత్సోమమవు. బలహేతువగు ద్వావింశస్తోమమవు. సంభరణ మగు త్రయో వింశత్ స్తోమమవు. ఉత్పాదకమగు చతుర్వింశ స్తోమమవు. గర్భము వంటి పంచ వింశ స్తోమమవు. అష్టమ ధాతువు వంటి త్రిష్ణవ స్తోమమవు. క్రతువు వంటి ఏక త్రింశ స్తోమమవు. ప్రతిష్ఠ వంటి త్రయస్త్రింశ త్సోమమవు. ఆదిత్యునకు నివాస స్థానమగు చతుస్త్రింశ స్తోమమవు. నాకము వంటి షట్త్రింశ స్తోమమవు. వివర్తమగు అష్టాచత్వారింశ స్తోమమవు. ధారకమగు చతుష్టోమమవు.

            (ఇవి సంఖ్యా సూచకములు.)

                                        తొమ్మిదవ అనువాకము

    1. ఇష్టకా! నీవు అగ్ని యొక్క హవిర్భాగవమవు. దీక్ష ఆధిపత్యమవు. దేవతలకు ప్రియమగు మంత్రమవు. త్రివృత స్తోమమవు.

    2. ఇష్టకా! ఇంద్రుని హవిర్భామవు. విష్ణువు వంటి ఆధిపత్యమవు. ప్రియమగు క్షాత్రమవు. పంచదశ స్తోమమవు.

    3. ఇష్టకా! పురోహితుల దక్షిణవు. ప్రజాపతి వంటి ఆధిపత్యమవు. ప్రియమగు అన్నమవు. సప్తదశ స్తోమమవు.

    4. ఇష్టకా! నీవు మిత్రదేవుని హవిర్భాగమవు. వరుణుని ఆధిపత్యమవు. ద్యులోకమును అంటిన ప్రియమగు వర్షమవు. వాయువవు. ఏకవింశస్తోమమవు.

    5. ఇష్టకా! నీవు అదితి హవిర్భాగమవు. పూష దేవుని ఆధిపత్యమవు. ప్రియమగు ఓజస్సువు. త్రిణవ స్తోమమవు.

    6. ఇష్టకా! వసువుల హవిర్భాగమవు. రుద్రుల ఆధిపత్యమవు. ప్రీతిపాత్రములగు చతుష్పాత్తువు. చతుర్వింశస్తోమమవు.

    7. ఇష్టకే! త్వం ఆదిత్యానాంభాగః, మరుతాం ఆధిపత్యమ్, స్పృతాః - ప్రీతిహేతువులగు గర్భాః, పంచవింశః స్తోమః అసి.

    8. ఇష్టకే! త్వం సవితుః భాగః బృహస్పతేః ఆధిపత్యమ్. స్పృతాః సమీచీః దిశః చతుష్టోమః స్తోమః అసి.

    9. ఇష్టకా! నీవు మాసముల భాగమవు. పక్షముల ఆధిపత్యమవు. నీవే ప్రియ ప్రజ. చత్వారింశ స్తోమమవు.

    10. ఇష్టకే! త్వం ఋభూణాం భాగః, విశ్వేషాం దేవానాం ఆధిపత్యం, స్పృతం భూతం గృహం, త్రయస్త్రింశస్తోమః అసి. 

                                          పదవ అనువాకము

    1. ఒక ఋక్కుచే స్తుతించినమత ప్రజలు కలిగినారు. వారికి ప్రజాపతి అధిపతి అయినాడు.

    మూడు ఋక్కులచే స్తుతించినంత బ్రాహ్మణులు పుట్టినారు. వారికి బ్రహ్మణస్పతి అధిపతి అయినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.