Read more!
 Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 4

    గుమ్మంలో ఎదురుగా నిప్పులు చేరుగుతొన్న కళ్ళతో నిలబడి వుంది విశ్లే.
    భార్యని చూడగానే ఆగిపోయాడు.
    "ఏడి...ఎక్కడ..ఎక్కడండీ నా బాబు. చెప్పండి... చంపేశారా?" గొంతు పూడుకుపోతూంది.
    మీ కిష్టం లేకపోతే చెప్పండి. నేను, నా బాబు దూరంగా మీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాం. నా బాబును నాకిచ్చేయండి" హిస్టీరియా వచ్చిన దానిలా వూగిపోతూ ఆవేశంగా అంది విశాలి.
    భరద్వాజకు తెలుసు, ఇలాంటి అనుభవం ఎదురవుతుందని.
    "వీశాలీ, కన్నప్రేమ నీతో అలా మాట్లాడిస్తుంది. కానీ కన్నా ప్రేమ కన్నా,దేశభక్తీ గొప్పది విశాలీ, ఈ రోజు మన దేశం చెక్కలు ముక్కలవుతే మళ్ళీ మన దేశాన్ని సుందర స్వప్నంగా మార్చుకోలేము. ఈ రోజు కాకపోయినా రేపయినా ఈ ప్రపంచానికి సవాలిగా మారతాడు మన బిడ్డ.
    భూమిమీద పడి కొన్ని గంటలైన గడవముందే నీకు వాడి మీద ప్రేమ ఇంతలా మాట్లాడించేస్తుంది. అదే కొన్ని సంవత్సరాల పెంచితే, ఆ తర్వాత నువ్వు వాడిని మర్చిపోగలవా?
    రేపు వాడి తీక్షణమైన చూపుతో నువ్వే బూడిదిగామారుతావో?!
    ఇలాంటి పరిస్థితిలో వాడిని పెంచి, ఆ ప్రేమను చంపుకోలేక అలా అని వాడిని వదులుకోలేక మనం వుండగలమా? అందుకే విశాలీ! కన్నా ప్రేమను చంపుకుని, బిడ్డను చంపుకోవడానికి సిద్ధపడ్డాను.
    "మీ అంత విశాల హృదయం ఈ విశాలికి లేదండీ, నాకు నా బిడ్డ ముఖ్యం."
    "కానీ ఆ బిడ్డే రేపు నీ ప్రాణానికే ముప్పు తేవచ్చు."
    "నా బిడ్డే నన్ను చంపేస్తాడు. అంతేగా..." కుప్పలా కూలిపోయి ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడవసాగింది.
    "ప్లీజ్... విశాలీ... నన్నర్డం చేసుకో..." ఆమెకు దగ్గరగా వెళ్ళి అన్నాడు.
    "కనీసం నా బాబును ఎక్కడ హత్య చేసి పాతి పెట్టారో చూపించండి." ఏడుస్తూనే అంది.
    ఒక్కక్షణం చివుక్కమంది భరద్వాజ మనసు.
    భార్యకు చూపిస్తే బలవంతంగా తిరిగి తెచ్చుకుంటుంది. ఈ పాటికి బిడ్డ వూపిరి ఆగిపోయి వుండవచ్చు. ఆ ఫీలింగ్ అతన్ని వేయి శూలాలతో గుచ్చి నట్టయింది.
    "ప్లీజ్ చూపించండి.'
    "అది కాదు విశాలీ..."
    "నీకేమి చెప్పొద్దు, కనీసం నా బిడ్డ శవాన్ని కూడా చూసుకోవడానికి నోచుకోలేదా?"
    "సరే.. పద..." నిర్లప్తంగా అన్నాడు.
    అలాగే వర్షంలో బయల్దేరింది.
    బాబును పాతిపెట్టిన ప్రదేశానికి వచ్చేసరికి పావుగంట పట్టింది. దారిలో మాటలు లేవు.
    ఇద్దరిలోనూ సంఘర్షణ. ఇద్దరికీ బాదాగానే వుంది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి.
    గొయ్యిని చూడగానే ఏదో అనిమానం వచ్చింది భరద్వాజకు. తాను పూడ్చిన గొయ్యిని మరెవరో తొలిగించినట్టు... పక్కనే వున్న తుప్పు పట్టిన పలుగు కోసం చూశాడు.
    కనిపించలేదు.తనిక్కడే వదిలేశాడా పలుగు.ఏదీ కనిపించదే, చుట్టూ వెతికాడు.
    దూరంగా కనిపించింది. వెళ్ళి తీసుకువచ్చి మట్టి తీయసాగాడు.
    భరద్వాజ తవ్వుతూంటే విశాలి మట్టి తొలిగించింది.మరో పడి నిమిషాల్లో మట్టి తీయడం పూర్తయింది.
    లోపల వీళ్ళని వెక్కిరిస్తూ గొయ్యి ఖాళీగా కనిపించింది.
    ఒక్కక్షణం అలాగే నిలబడిపోయాడు భరద్వాజ.
    "ఎక్కడండీ నా బిడ్డ..." విశాలి ఏడుస్తూ అడుగుతోంది.
    "ఇందులోనే... ఇక్కడే పాతిపెట్టాను." తనలో తను గొణుగుతున్నట్టు అన్నాడు.
    అబద్దం... మీరు కావాలనే చేశారు ఇదంతా. అసలు మీరు బాబును ఇక్కడ పాతిపెట్టలేదు..."
    ఏడుస్తోంది వేశాలి.
    "నన్ను నమ్ము విశాలీ..."
    "నో... నేను నమ్మను. మిమ్మల్నే కాదు. ఈ ప్రపంచాన్నే నేను నమ్మను."
    భరద్వాజకు ఇదంతా అయోమయంగా ఉంది. ఇదెలా జరిగింది?
    ఎవరు తీసుకెళ్ళారు? జంతువులు లాకెళ్ళడానికి వీల్లేదు. జంతువులు లాకేల్తే మట్టిని తిరిగి పూడ్చివెళ్ళవు!
    ఖచ్చితంగా మనుషుల పనే!
    ఎవరు? ఎవరు?? ఎవరు??
                                               ***
    భరద్వాజ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతనికి ఎదురుగా విశాలి కూర్చుని వుంది. ఆమె చూపులన్నీ శూన్యంలో కి  చూస్తున్నట్టుగా వున్నాయి.
    భార్యను ఓ దార్చే ధైర్యం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు భార్యను ఓదార్చటం కన్నా ముఖ్యమైనది తన బిడ్డ ఏమయ్యాడో తెల్సుకోవడం? తన దేశానికి ఈ ప్రపంచానికి తన కొడుకు శాపంగా, సవాలుగా మారకూడదనుకున్నాడు. అయినా... ప్రయోజనం లేకుండా పోయింది.
    ఎదురుగా విషాదాన్ని అణువణువూ నింపుకుని భార్య.
    న్నో... తను వీటి గూర్చి ఆలోచిస్తూ తన విలువైన సమయాన్ని వృధా చేయకూడదు.
    మళ్ళీ తను పరిశోధనలో మునిగిపోవాలి. అదే సమయంలో కొడుకుకోసం ప్రయత్నించాలి.
    విశాలి మనసు మాత్రం ఇవేవీ ఆలోచించడంలేదు.
    బిడ్డ చనిపోయాడన్నది మెదటి షాక్, ఆ తర్వాత అసలు కనిపించడం లేదన్నది పెద్ద షాక్.
    ఎంతైనా నవమాసాలు మోసి ప్రసన వేదన పడి జన్మనిచ్చిన తల్లి.
    అందుకే జరిగిన ఈ సంఘటనకు తట్టుకోలేకపోతోంది.
                                               ***

 Previous Page Next Page