Read more!
 Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 4

    ఫకాలున నవ్వాడు గోవిందు. సుమతి గడ్డాన్ని పట్టుకుని ఆమె కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తూ చిపిపిగా అన్నాడు "ఉన్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. మిలిటరీలోకా వెళ్ళొద్దంటున్నావు. మరీ....రోజూ, దేవిగారి దగ్గర కొలువు చేయా లన్నమాట. చీరలు మడత పెట్టడం, చెప్పులు పాలీష్ చెయ్యడం..... "ఉష్.....చాల్లెండి అంతావేళాకొళమే మీకు. ఎవరైనా వింటే నవ్విపోతారు."
    "చాల్లే .... ఎవరు  వింటారు.....ఈ  వేళలో....."
    అతని మాటిలకీ చేష్టలకీ సుమతి నవ్వకుండా వుండలేకపోయింది. నవ్వుతూన్న ఆమె పెదవులను తృప్తిగా ముద్దుపెట్టుకున్నాడు.
    "ఊఁ"?  "ఏదో ఒక ఉద్యోగం ఏదీ లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకుని, పెద్దవాళ్ళకి దగ్గరుగా వుండొచ్చుగా, వాళ్ళకి మాత్రం మనం తప్పు ఎవరున్నారు?"
    గోవింద్ మొహంలోని నవ్వు మాయమయింది. "నేనూ అదే ఆలోచిస్తున్నాను మమ్మీ! మా అత్తయ్య వాళ్ళని కొంచెం కనిపెట్టుకుని వుండమని చెప్పాలి. అత్తయ్య కూతురు, సుబ్బలక్ష్మి తెలివైనపిల్ల. చదువుకోవడానికి వీలులేక మానేసింది కానీ, లేకపోతేనా మహా గొప్పదైవుండాల్సింది. దాన్ని పంపించమని అడగాలి అత్తయ్యని కొన్నాళ్ళు అమ్మనీ నాన్నాగారినీ చూసుకోవడానికి.
    "అలాగా? ఎప్పుడూచెప్పలేదే వాళ్ళగురించి నాకు మనపెళ్ళికి కూడా వాళ్ళు వచ్చినట్లు జ్ఞాపకంలేదు."
    "రాలేదు. మామయ్యా పోయినప్పటినుంచీ, అత్తయ్య బ్లడ్ ప్రెషర్ తో మంచంపట్టింది. పెద్దకొడుకు మంచివాడే కానీ' కోడలు పరమగయ్యాళీ, అంటే మన సినిమా 'సూర్యకాతం' అన్న మాట. రెండోవాడు ఏకంగా ఇల్లరికం వెళ్ళిపోయాడు. మూడో వాడిది అతితెలివి. అన్నింటిలోనూ వున్ననంటాడు. నాలుగోవాడు నత్తినాగన్న బ్బె బ్బె బ్బె ..... అంటూ అమ్మ కొంగుచ్చుకు తిరుగుతుంటాడు. సుబ్బలక్ష్మిని నాకిచ్చి చేద్దామని మా అత్తయ్య వుద్దేశ్యం నేనువద్దన్నానని ఆ కోపంతో పెళ్ళికిరావడంమానేశారు."
    "పాపం! అయిన సంబంధం కదా అని  ఆశ, నామీద కాదు, నా డబ్బుమీద."
    "మరి, ఇప్పుడు మీరు అడగ్గానే, సుబ్బలక్ష్మిని పంపిస్తారని ఏమిటి నమ్మకం?"
    "డబ్బు .... .... డబ్బిస్తే ఏమైనా చెయ్యొచ్చు. నెలకి నాలుగోందలు అత్తయ్యకి పంపిస్తానని చెప్తాను. పైగా సుబ్బలక్ష్మి పెళ్లీ పేరంటం బాధ్యతంతా మాదేనని చెప్తాను. మంచి సంబంధం చూసి  చేస్తానని చెబుతాను ఎవరికోసం పంపిస్తుంది!"
    "ఏమోనండీ! ఈ గొడవంతా నాకు అయోమయంగా వుంది. కొడుకూ, కోడలూ వుండగా వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద అత్తగారూ, మామగారు ఆధారపడి వుడండం నాకేమీ బాగాలేదు. ఎందుకొచ్చిన రామాయణం ఇందంతా హాయిగా మనింట్లో మనం మనవాళ్ళ దగ్గర వుండక ... ..."
    "పిచ్చిదానా.... .... హాయిగా తినడం, హాయిగా పడుకోవడం ... ... ఎన్నాళ్ళు బాగుంటుంది? కొన్నాళ్ళయ్యేసరికి 'బోర్' కొడుతుంది. 'థ్రిల్' వుండాలంటే, ఎడ్ వెంచర్ కావాలి లైప్ లో సాహసం అన్నమాట. సమస్యలొస్తే ఎదుర్కోవాలి కానీ, సమస్యలోస్తాయని దూరంగా పోరిపోకూడదు. ఫేస్....ఇట్ సమస్యలని పరిష్కరించి, ఆనందాన్ని చిలికి పైకి తీయడంలో వున్న తృప్తి, సాఫీగాసాగే జీవితంలో వుండదు."
    "ఏమో! మీ అడ్వెంచర్ చూస్తే నాకు భయంగానేవుంది. సమస్య లోచ్చినప్పుడు బెదిరిపోకుండా దైర్యంగా పరిష్కరించు కోవడం సమంజసమే కానీ, కోరి సమస్యల్ని తెచ్చుకోవడం మాత్రం వెర్రితనం. 'అడుసు తొక్కనేల, కాలు కడుగనేల' అనీ తెలిసి రొంపిలోకి దిగడం వివేకం కాదేమో."
    "నీకన్నీ భయాలూ, అనుమానాలే.... సుమ్మీ!.... దానిలో కప్పలాగా మనం  మన  ఇంట్లో ఇవ్వేకాకుండా, బయట ప్రపంచంలోని వింతలూ, విడ్డూరాలు తెలుసుకోవాలనే కుతూహలం, తాపత్రయం, తప్పంటావా? నిజంగా నీకిష్టం లేకపోతే తప్పకుండా నా ప్రయత్నం విరమించు కుంటానులే, చెప్పు." సుమతి కళ్ళలోకి సూటిగా అన్నాడు గోవింద్.
    అతని మాటల్లోని నిజాయితీ, అతని  చూపుల్లోని ఆత్మీయతా సుమతిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అతని సంతోషానికి అడ్డొచ్చేపని, తాను ఏనాడూ చెయ్యకూడదని నిశ్చయించుకుంది.
    "చెప్పుసుమ్మీ!" లాలనగా అడిగాడు.
    "ఒక్క నిమిషం అతని కళ్ళల్లోకి చూసి, అతని గుండెల మీద తల ఆనించి, నెమ్మదిగా అంది, "మీ ఇష్టమే నాయియిష్టం. మీ కెలా బాగుంటుందని తోస్తే అలాగే చెయ్యండి" అంది. ఆప్యాయత నిండిన కంఠంతో  ఆమె మాట్లాడే ప్రతి ఒక్కమాట ఒక్కొక్క ఆణిముత్యంలా అనిపించింది గోవింద్ కి. ఆమెని గుండెలకి గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. "యూ ఆర్ .... మై .... డార్లింగ్ " అంటూ __
    అతని కౌగిలింతలో నగిలిపోతూ, తన్మయత్వంలో తేలిపోతూ పరవశించిపోయింది సుమతి. మరి మాట్లాడే శక్తి కోల్పోయింది.
                                                                       *    *    *   
    ఆకస్మాత్తుగా వచ్చిన కొడుకూ కోడల్నీ చూసి, ఆశ్చర్య పోయినా సంతోషించారు కామాక్షమ్మా నరసింహారావుగారూనూ. అప్పటికప్పుడు కొడుకు కిష్టమైనవంటలన్నీ చేసిపెట్టింది కామాక్షమ్మగారు. ఫోనులో అప్పడే  వియ్యంకుడి కీవార్త అందచేశారు  నరసింహారావుగారు. క్షణాల్లో వాలి పడ్డారు వాసుదేవరావుగారు. అందరూ కలసి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు.  చెయ్యి కడుక్కుంటూన్న  సుమతి ఉన్నట్టుండి ఖోళ్ళున వాంతి చేసుకుంది. అందరూ అటుకేసి పరుగెత్తారు. నీళ్ళందించింది కామాక్షమ్మాగారు. పనిమనిషి టవల్ తెచ్చిచ్సింది.
    "ఒంట్లో బాగాలేదా అమ్మా!" వాసుదేవరవుగా రాడిగారు.
    "బాగానేవుంది నాన్నా__ ఎందుకనో వాంతయింది," అంది మొహం తడుచుకుంటూ సుమతి.
    "ప్రయాణం కదూ.... సైత్యం చేసుంటుంది," అన్నారు నరసింహారావుగారు.
    "ఎందుకయినా మంచిది, డాక్టరికి చూపిస్తేసరి" అంటూ డాక్టరికి ఫోన్ చేశారు వాసుదేవరావుగారు. సుమతి వద్దంటున్నా వినక కోడల్ని మంచంమీద పడుకోబెట్టి, ఫోన్ పెట్టి ప్రక్కనే కూర్చుంది కామాక్షమ్మ.
    "కోడలి ఆరోగ్యం సరిగా వుండడంలేదా" అంటూ ప్రశ్నల్లో డాక్టర్ సీత రానే  వచ్చారు. అందరూ అవతలికి  జరిగారు.  సీత సుమతిని పరీక్షించి "కంగ్రాట్స్.... అసలు సంగతి చెప్పకుండా ఇంట్లో అందర్నీ కంగారుపెట్టెశావన్న మాట" నవ్వుతూ అంది డాక్టరు. సిగ్గుతో, నవ్వూతూ తలవంచుకుంది సుమతి. కొన్ని మందులూ, టానిక్కులూ వ్రాసిచ్చి, ఏవేవి, ఎలా వేసుకోవాలో చెప్పింది డాక్టర్.
    "ఏమయింది సీతమ్మా సుమతికి?" అంది  కామాక్షమ్మ గారికి తెలుసు. అందుకే చనువుగా, సీతమ్మ  అంటుంది. సీత కూడా కామాక్షమ్మగారిని 'అమ్మా' అంటుంది. "ఏమిటమ్మా .... అంత మాత్రం తెలుసుకాలేదానువ్వు. నువ్వు 'మామ్మ' ని కాబోతున్నావు" అంది.
    కామాక్షమ్మగారికి సంతోషంతో నోట మాటరాలేదు. "అవును, నామతి మండ నాకా ధ్యాసేలేదు. ఏమై పోయిందో అని కంగారు పడిపోతున్నాను తప్ప .... సీతమ్మా! మంచిమాట చెప్పావు. ఉండు నోరు తీపిచేస్తాను " అంటూ, కప్పునిండా పాయసం పోసుకోచ్చింది. ఎంత వద్దన్నా వినకుండా అయోమయంగా జూస్తున్న భర్త జూచి, "వీరు తాత అవబోతున్నారండీ" అంది సీతమ్మకి మంచి నీళ్ళందిస్తూ.

 Previous Page Next Page