రావణుడికి ఆ పేరు ఎలా వచ్చింది?

 

రావణుడి అసలు పేరు దశగ్రీవుడు. అయితే రావణ అనే పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఒకరోజు పుష్పక విమానంలో రావణుడు కైలాసం మీదుగా వెలుతుంటాడు. ఉన్నట్లుండి పుష్పక విమానం ఆగిపోతుంది. ఎందుకు ఆగావు అని రావణుడు ప్రశ్నిస్తే పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు. నేను వెళ్లలేను అంటుంది. దానికి ఆగ్రహించిన రావణుడు నేను ఇటుగా వెల్తుంది తెలీదా? అని గర్వంతో కైలాసం పైకి దిగి ఎవరా పరమేశ్వరుడు చూడాలి అంటూ వెలతాడు.

నందీశ్వరుడు అడ్డు వచ్చి ఎవరు నీవు ఏం కావాలి అని ప్రశ్నిస్తాడు. దానికి రావణుడు  నేను ఎవరో తెలీదా? నేను దశగ్రీవున్ని. దారి వదులు అని హుంకరిస్తాడు. అప్పుడు నందీశ్వరుడు "నేను ఆయన కింకరుణ్ణి, వాహనాన్ని  కైలాసంలోకి ప్రవేశం లేదు అంటాడు. అపుడు నంది ఆకారం చూసి కోతిలా ఉన్నావు అని అవహేళన చేసి మాట్లాడి ఉక్రోశంతో తన పది తలలు ఇరవై చేతులతో కైలాస గిరిని పెకలిస్తాడు. దానితో శివుడు ఆగ్రహించి తన బొటని వేలుతో కైలాసాన్ని తొక్కి పెడతాడు. రావణాసురుడు ఇరవై చేతులు కైలాసం కింద ఉండిపోతాయి. ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేక పోతాడు. అలా సంవత్సరం కాలం జరుగుతుంది. రావణుడు ఆ బాధని భరించలేక బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. ప్రళయ ఘోషలా రవం చేస్తాడు. రవం అంటే అరుపు అని అర్ధం. ఆ రవానికి సముద్రాలు పొంగుతాయి. దేవేంద్రుడు సైతం ఉలికిపడి చూస్తాడు. పండితులు భక్తులు రావణుడి వద్దకి వెళ్లి అరిస్తే పరమేశ్వరుడు అనుగ్రహించడు. సామవేద మంత్రాలతో ఉపాసన చేస్తే శివుడు అనుగ్రహించి బొటనవేలు తీస్తాడు అని చెప్తారు. అప్పుడు రావణుడు సామ వేద మంత్రాలతో ఉపాసన చేస్తాడు. శివుడు అనుగ్రహించి బొటన వేలు తీసి కరుణిస్తాడు. 

శివుడు దశగ్రీవ ఇన్ని కేకలు వేశావు ఇంత రవం చేసావు అందుకే నిన్ను రావణ అని పిలుస్తున్నా అంటాడు శివుడు. అలా  రావణాసురుడు అనే పేరు వచ్చింది.

- వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories