రాజు - పండితుడు

ద్వావిమౌ గ్రసతే భూమిః సర్పో బిలశయానివ।
రాజానం చావిరోద్దారం బ్రాహ్మణం చాప్రవాసినమ్‌॥

పాలకుడన్నాక పోరుకి జంకకూడదు. లేనిపోని గొడవ ఎందుకులే అని చేతులు ముడుచుకోకూడదు. పండితుడన్నాక ఊరిలోనే ఉండిపోకూడదు. తన జ్ఞానాన్ని నలుగురికీ పంచాలి. లోకంలో తిరుగుతూ ఆ జ్ఞానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలి. అలా పోరుకి జంకే రాజు, ఊరిని దాటని పండితుడు సర్పం చేతిలో నాశనం అయిపోయే ఎలుకలులాగా నాశనం కాక తప్పదు.


More Bhakti Content