ప్రేమించండి ప్లీజ్


    "రెండోసారి బెటర్ లక్" వినయ్ శకుంతలను ప్రోత్సహించాడు ఈ మాటలతో ఆమె తన మొదటి ఓటమిని మరిచిపోయింది. ఎలా? వినయ్ ను గెలవాలన్న పట్టుదల ఆమెలో.
    "మరి అడగండి"
    "జాకెట్టుకీ, లాకెట్టుకీ వున్న సంబంధం ఏమిటి? చెప్పుకోండి చూద్దాం" అల్లరిగా నవ్వుతూ తనూ పద్మాసనం వేసుకున్నాడు వినయ్ అలా కూర్చోవడంతో ఆమెకు మరింత దగ్గరగా అతను.
    "పద సామీప్యతా?" ఆమె సందేహంగా జవాబు కరెక్టోకాదోనన్నట్టు చెప్పింది"
    "ఒకవిధంగా అది కరక్టే, కానీ పదసామీప్యతేకాదు, ఎద సామీప్యత కూడా వుంది" అన్నాడు ఆమె సిగ్గుపడి తలదించుకుంది.
    శకుంతలా! బుట్టలో పడిపోతున్నావు. చూశావా వినయ్ అడుగుతున్న ప్రశ్నలు. అవన్నీ నిన్ను ఎక్కడికి లీడ్ చేస్తాయో నిజంగా నీకు తెలీదా? తెలిసే ఆట ఆడుతున్నావా? ఒద్దు శకుంతలా ఇప్పటికీ మించిపోయింది లేదు. వెంటనే వెళ్ళిపో, బయట పడుతున్నది కేవలం వర్షమే. అగ్గుల వాన కాదు తెగించి వెళ్ళిపో ఇక్కడున్నావా? నువ్వు ఇంతకాలం పవిత్రంగా దాచుకున్న యవ్వనాన్ని వినయ్ కొల్లగొట్టేస్తాడు.
    భగవాన్! షడన్ గా అతనికి కడుపునొప్పి వచ్చేట్టుచేయ్. వాళ్ళిద్దరి మధ్యా ఏం జరగకూడదు. దేవుడూ ప్లీజ్.
    ఆంజనేయులు కళ్ళు మూసుకుని ప్రార్ధిస్తున్నాడు. కానీ అతని మొర ఏ దేవుడికీ వినిపించడం లేదు.
    "మొత్తం మీద మీరు ఆఫ్ కరెక్ట్ కాబట్టి నేను ఓడిపోయినట్టు భావించి మన షరతులో అర్ధం అంటే రెండున్నర సెంటీమీటర్లు ముందుకు జరుగుతాను" అని వినయ్ కొద్దిగా కదిలాడు.
    "మూడో ప్రశ్న ముచ్చతగా మూడోది జవాబు చెప్పగలగాలి. ఎందుకంటే ఇవన్నీ మీకు సంబంధించిన ప్రశ్నలే."
    "కానివ్వండి జవాబు చెప్పడానికే ట్రై చేస్తాను"
    "సాధారణంగా బ్రా హుక్ లు వెనకే వుంటాయి చాలామంది స్త్రీలు వాటినే ప్రిపర్ చేస్తారు. ఎందువల్ల?"
    ఆమెకు ఠక్కున తను వేసుకున్న బ్రా గుర్తొచ్చింది. తన బ్రా కూడా బాక్ ఓపెనింగే. ఎందుకు ఇలాంటి దాన్నే తను కొనుక్కుంది?
    ఆమె ఆలోచిస్తోంది.
    బయట వర్షం పడుతున్న చప్పుడు చాలా రిధమిక్ గా వినిపిస్తోంది గాలి వానను తరుముకుని పరుగెడుతున్నట్టు రివ్వున వీస్తోంది.
    బయట నిలుచున్న ఆంజనేయులు కూడా జవాబుకోసం డీప్ గా ఆలోచిస్తున్నాడు.
    బ్రా హుక్స్ ఎందుకు వెనకే వుంటాయి? వినయ్ మాటలను బట్టి ఫ్రంట్ ఓపెనింగ్ బ్రాలు కూడా వుంటాయన్నది. అర్ధమౌతోంది ఎక్కువమంది గర్ల్స్ వెనుక హుక్ లున్న బ్రాలనే ఇష్టపడతారట.
    తనలో తనే ప్రశ్నించుకున్నాడు అతను.
    లోపల శకుంతల కూడా అదే అవస్థలో వుంది.
    కానీ ఆమెకు జవాబు తట్టడం లేదు. ఏవో కొన్ని అస్పష్టంగా జవాబులు తోస్తున్నాయిగానీ అవి కరెక్ట్ కాదని ఆమెకే అనిపిస్తోంది. అందుకే ఆమె ఓ నిముషం తరువాత "తెలియదు" అంది.
    "చెప్పనా? ఫ్రంట్ ఓపెనింగ్ అయితే ప్రియుడో, భర్త దాని బంధాలను విప్పుతున్నప్పుడు ఆ స్పర్శకు వ్యాకోచణాలు సంభవించి హుక్స్ మరింత బిగుసుకుపోయి రావేమోనన్న ముందు జాగ్రత్తతో"
    వినయ్ జవాబు విని ఆమెలో ఏవో కొత్త కొత్త మార్పులు.
    అలాంటి స్థితిని ఆమె తొలిసారి పేస్ చేస్తోందన్న విషయం ఆంజనేయులుకు అర్ధమైంది. ఆమె కళ్ళల్లో మునుపటి సిగ్గులేదు. కొత్త అనుభవానికి సమాయత్తం అయ్యే ముందు కలిగే సంచలనం ఆ కళ్ళల్లో, ఒళ్ళంతా ప్రకంపనాలు మొదలు కావడం కూడా కనిపిస్తోంది రక్త ప్రసరణ హెచ్చినట్టు ఆమె ముఖం ఎర్రగా కమిలిపోతోంది.
    గుండెల్లో ఏదో సన్నమంట బయల్దేరింది ఆంజనేయులకు వినయ్ అంటే ద్వేషం పెరగసాగింది అతన్ని ఏమైనా చేసెయ్యాలన్న ఆలోచన గుండెల్లో దూరింది.
    ఈర్ష్య అతన్ని కబళించేస్తోంది. "మీరు డల్ అయిపోయారు కేవలం మీరు కాలక్షేపం కలుగజేసేందుకు ఆడుతున్న ఆట ఇది మీరు రెచ్చిపోయి సమాధానాలు చెప్పాలి." వినయ్ ఆమెలో కొంత ఈజ్ కలిగించడానికి అన్నాడు.
    ఆమె తల పైకెత్తింది.
    అతని ఎర్రటి ఛాతీమీద గుబురుగా అల్లుకున్న వెంట్రుకలు తెలియని గుబులును రేపుతున్నాయి.
    ఆమె ఠక్కున తలదించుకుంది. అతను ఆమెలో జరుగుతున్న మార్పులను గమనించనట్టు "మరి నాలుగో ప్రశ్న అడగనా?" అన్నాడు.
    ఇంకా ఎన్ని ప్రశ్నలు వేస్తాడు? ఇవన్నీ ఎప్పుడో ప్రిపేర్ చేసుకున్నాడా? ఇప్పటికిప్పుడు స్పాంటేసియస్ గా అడుగుతున్నాడా? ఆడపిల్లను లొంగదీసుకోవడానికి ఇంత కష్టపడాలా? ఇదంతా ఒక ఆర్టులాగా వినయ్ మలుచుకుంటున్నాడా?
    ఆంజనేయులు ఆలోచనల వత్తిడికి తట్టుకోలేక తల ఓ మారు విదుల్చుకున్నాడు.
    శకుంతల వినయ్ వైపు ఓసారి ఫ్లాట్ గా చూసిందే తప్ప ఏమీ మాట్లాడలేకపోయింది.
    "అయితే ప్రశ్న అడుగుతున్నాను. చీర కుచ్చెళ్ళు ఎందుకు ముందువైపునే వుంటాయి. పక్కనో - వెనకో వుండవెందుకు?"
    కుచ్చిళ్ళు వెనక ఎలా పోసుకుంటారు" కనపడవుగా అన్న జవాబు తట్టింది ఆంజనేయులకు. తలుపు భళ్ళున తెరిచి లోపలికివెళ్ళి చెప్పెయ్యాలనిపించింది. అయితే పక్కన దోపుకోవచ్చుగదా అలాంటప్పుడు వెనకయితే కుచ్చిళ్ళు పోయడానికి కుదరదన్నారు. ఓకే మరి పక్క ఎందుకు దోపుకోరో చెప్పండి అని వినయ్ అడిగితే ఏం జవాబు చెప్పాలో తోచలేదు అతనికి. అందుకే లోపలికెళ్ళాలన్న ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దీనికి వినయ్ జవాబు ఏమిటో వినాలన్న తపనతో అలెర్టు అయ్యాడు.
    వినయ్ చెబుతున్నాడు "నా లాంటి ఆకతాయి కుర్రాళ్ళు ఎక్స్ రే కళ్ళతో చూసినా ఆ చూపులు లోపలికి చొరబడకుండా అక్కడంతా మందంగా వుండాలని."
    ఇక వినలేకపోయాడు ఆంజనేయులు. ఇంత పచ్చి బూతును ఆమె ఎలా భరిస్తోంది. తను ఏం మాట్లాడినా ఆమె వినే స్థితికి తీసుకొచ్చేశాడా వినయ్? ఆమె ఏమిటి అలా అయిపోతోంది. కాంక్షలతో ఆమె కళ్ళు బరువెక్కడం తెలుస్తూనే వుంది. పెదవులు కనిపించడం కనిపిస్తూనే వుంది ఒళ్ళంతా అదరడం అర్ధమవుతూనే వుంది.
    "ఈ దేశంలో ఆడపిల్లలకు కూడా డెప్త్ తెలీదు మగవాళ్ళ లాగానే వాళ్ళు పైపై మెరుగులకే విలువనిస్తున్నారు. క్లాసులో ఫస్టుమార్కులు తెచ్చుకొనే కుర్రాడ్ని వెంగళప్ప అని భావించి సుజికి మోటార్ బైక్ మీద తిరిగే అబ్బాయిని హీరో అని భ్రమిస్తున్నారు. అందుకే ఆడపిల్లలు జీవితంలో డిసపాయింట్ అవుతున్నారు. భ్రమలు తొలిగిపోయి నిజాలు సాక్షాత్కరించినప్పుడు నిరాశనిస్పృహలు కాక మరేంమిగులుభాయి!" వినయ్ కు ఇలా పూర్తి అవగాహన వుండబట్టే ఆడపిల్లల్ని ఆకర్షించగలుగుతున్నాడా? ఇవన్నీ వినయ్ చెప్పిన మాటలే మరి.