ప్రేమించండి ప్లీజ్


    "అలా బతుకుతున్నామని ఎప్పుడైనా బాధ కలగదా?" చాలా సేపయ్యాక అడిగాడు అతను.
    "బాధ పడతాడు. ఎంతగా అంటే- ఆ బాధ కూడా అలవాటైపోయి విసుగొచ్చేదాకా. అందుకే బాధపడడాన్ని ప్రేమిస్తున్నాను. నాకెవరూ లేరన్న బాధను ఇష్టపడడం నేర్చుకున్నాను. నేను బతికి వున్నానన్న విషయం ఆ బాదే గుర్తుచేస్తుంది."
    అంటే ఇది ఓ రకంగా సుఖాలమీద కసి తీర్చుకోవడం. 'బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్" అని ఓ కవికూడా ఇదే కసితో అనుంటాడు. లేకపోతే బాధ ఎప్పటికి సుఖం కాదు. అలాంటిది బాధనే సుఖమనుకోవడం ఆసుఖం పట్ల మన కసిని ఎగ్జిబిట్ చేయడం ఇది ఓ రకమైన విరక్తి. దానీ బుజ్జి అలవరుచుకుంది.
    "నిన్ను ప్రేమిస్తాడా?" తక్కువ అడిగాడు అతను.
    బుజ్జి ఓ క్షణంపాటు అతని ముఖంలోకి చూసి 'ప్రేమించలేను. ఇలా నిష్కర్షగా అన్నందుకు ఏమీ అనుకోను. మనిషి మీద ముఖ్యంగా మగవాడి మీద నమ్మకం పోయిన నాలాంటిది ప్రేమించదు. నీ వల్ల ఏదైనా లాభం వుంటే ప్రేమించినట్టు నటిస్తాను. అంత తప్ప నేను నిన్ను నిజంగా ప్రేమించలేను. ఈ కారణం చేతే చాలామంది భార్యలు కూడా భర్తల్ని ప్రేమించలేరు. బజార్లో తనకు అప్పు దొరకలేదని ఇంటికొచ్చి భార్యమీద ఆ కసినంతా తీర్చుకునే భర్తమీద భార్యకు ప్రేమ వుంటుందా? వుండదు. కానీ వున్నట్టు నటిస్తుంది. ఎందువల్ల? అంత కంటే గత్యంతరం లేదు కాబట్టి. ఆ తప్పంతా భర్తదే. కానీ అది వాడు తెలుసుకోడు. పురుష దురహంకారం తెలుసుకోనివ్వదు' అని ఆగింది.
    తల తిరుగుతోంది. అతనికి మనిషికి అవసరమైన ప్రేమ పొందడం వెనుక అంత కథ వుందా? మరి ఇలాంటప్పుడు ప్రేమ పునాది మీదే మనుష్యుల సంబంధాలు ఆధారపడి వుండడం జరుగుతుందా?
    'అందుకే ప్రేమ జోలికి వెళ్ళకుండా సుఖపడడం నేర్చుకో -- మనుషుల మందలో కలిసిపోయి బతకడమే ఉత్తమమైన మార్గం"
    "ఇక్కడే తను మిగిలిన వాళ్ళతో వేరు పడిపోతున్నట్టనిపించింది. ఆంజనేయులకు మహాలింగం- బుజ్జి- వీళ్ళకంతా ప్రతి విషయం మీద చివరికి ప్రేమ మీద కూడా ఓ అవగాహన వుంది. కానీ తనకు లేదు. అందుకే తను ఎక్కడికో లక్ష్యం లేకుండా కొట్టుకుపోతున్నాడు.
    "ఇప్పుడెందుకు ఆ గొడవంతా ఇలా దగ్గరకు రా" వాతావరణాన్ని తేలికపరచడానికి అంది.
    అతను ఆమె ముందుకు మరింత జరగాలని ప్రయత్నించాడు కానీ ఒళ్ళంతా బిగుసుకుపోయినట్టు కదలలేకపోయాడు.
    "బట్టలు విప్పుకో"
    "అతనిలో చలనం లేకపోయేసరికి మీదకు లాక్కుంది.
    ఆమె వక్షంలో అతని తల.
    ఊపిరాడ్డం లేదు అతనికి. వెచ్చటి ఒడి. తల్లివదినలా, చెల్లి అనురాగంలా ప్రియురాలి నునువెచ్చని అభిమానపు పలకరింపుళా-- హాయిగా వుంది.
    "బుజ్జీ....బుజ్జీ....బుజ్జీ" పసితనంలో మొదటిసారి "అమ్మా" అని మురిసిపోతున్న బాలుడిలా పలకరిస్తున్నాడతను.
    ఆమె అతని బొత్తాములు విప్పడానికి ప్రయత్నిస్తోంధి. అతను ఆమెను నివారించాడు.
    "తొందరగా కానీ....నాకు చాలా పనులున్నాయి"
    "అతనికి ఆమె మాటలు వినిపించడంలేదు. అన్నీ ఏళ్ళు అభిమానానికి వాచిపోయిన అతను కన్నీరై ప్రవహిస్తున్నట్టు ఎగసిపడుతున్నాడు.
    ఒక్కసారిగా అతనికి తను చూడని అమ్మ గుర్తుకొచ్చింది. ఏదో అస్పష్టమైన రూపం దగ్గరకు లాక్కున్నట్టుంది. ఆ రూపం తనను అక్కున చేర్చుకొని ఓదారుస్తున్నట్టుంది. తన కన్నీళ్ళను తుడిచి, దగ్గరకు తీసుకొన్నట్టుంది.
    మరింతగా ఆమె ఒడిలోకి తలను గుచ్చాడు.
    ఎండలో నడిచీ, నడిచీ చెట్టుకింద నిలబడ్డట్టు, అలలుగా సాగిన కెరటం తీరం దగ్గర అలసట తీర్చుకున్నట్టు, మబ్బుల బరువును వర్షంతో తీర్చేసుకున్న ఆకాశం ప్రశాంతతో మెరిసినట్టు అతను తేలికపడుతున్నాడు.
    ఇంతకాలం మనసులో పేరుకుపోయిన నిమ్నతాభావం కన్నీళ్ళలో కొట్టుకొస్తోంది.
    అతని ఏడుపుని, బేలచూపులను, నిస్సహాయతను, ఆమె మరో విధంగా అర్ధం చేసుకుంది. మగవాడు అలాంటి సమయంలో ఒక్కందుకే ఏడుస్తాడని ఆమెకు అనుభవం నేర్పిన పాఠం.
    అతను తలను పైకెత్తి "మరి ఆశక్తిలేని వాడిని ఆడదాని దగ్గిరకు ఎందుకొచ్చావ్?" అంది.
    అతను తల అడ్డంగా తిప్పాడు. అతనికి చాలా చెప్పాలనుంది. తనకు ఆశక్తి వుందనీ, ప్రేమలో తప్ప ఆశక్తి విస్పోటనం కాదనీ చెప్పాలనుంది కానీ నోట మాట రావడం లేదు.
    బుజ్జి పైకి లేచింది.
    తల చెదిరినట్టు అతను ఉలిక్కిపడ్డాడు. సముద్రంలో కొట్టుకుపోతున్న వ్యక్తికి తనకు దొరికింది కొయ్యకాదనీ, కాలనాగనీ తెలిసిపోయినప్పుడు కలిగే వింత భయం అతన్ని ఆవహించింది. ఎప్పటికి తనను ఓదారుస్తూ తన పక్కనే వుండిపోతుందని అనుకున్న ఆమె బలవంతంగా తనను వేరు చేసేసరికి భరించలేకపోయాడు.
    మరింతగా కన్నీళ్ళు వరదలా ప్రవహిస్తున్నాయి.
    లేవమన్నట్లు ఆమె చేయి అందించింది.
    అతను కంగారుపడుతూ కన్నీళ్ళు తుడుచుకున్నాడు. చుట్టూ చూశాడు. కఠిన వాస్తవాలను ప్రతిబింబిస్తూ పరిసరాలు వికారంగా కనిపిస్తున్నాయి.
    అంతవరకూ  ట్రాన్స్ లో వున్నట్టు అతను తల విదుల్చుకున్నాడు.
    బుజ్జి అతన్ని నడిపించుకుంటూ బయటకు వచ్చింది. వీధి అరుగు మీద కూర్చోబెట్టింది.
    మల్లి, రజనితోపాటు మరో ఇద్దరమ్మాయిలు కూడా వున్నారు ఏమైందన్నట్టు చూశారు వాళ్ళంతా.
    బుజ్జి సమాధానం చెప్పకుండా 'రజనీ! లోపలికెళ్ళి మంచినీళ్ళు పట్టుకురా" అంది.
    రజని లోపలికెళ్ళి మంచినీళ్ళు తెచ్చింది.
    "తాగు" అని గ్లాసుకు నోటికందించింది.
    అతను నీళ్ళు తాగాడు.
    "నిదానంగా వెళ్ళు" అంది.
    అవును తను వెళ్ళాలి. ఎక్కడికి? ఆ ప్రశ్న రాక్షసుడి శరీరంలా నిముష నిముషానికి పెరిగిపోతూ వుంది.
    పైకి లేచాడు.
    జేబులోంచి పదిరూపాయల నోటుతీసి బుజ్జికి ఇవ్వబోయాడు. ఆమె దానిని తీసుకోకుండా కళ్ళతోనే వారించింది.
    "మిమ్మల్నే.....తీసుకోండి"
    "వద్దులే......ఏం చేయలేదుగా కష్టపడ్డ డబ్బే నిలవడంలేదు. నీలాంటివాడి దగ్గర తీసుకుంటే నిలుస్తుందా...... వద్దు నువ్వే వుంచుకో"
    "పదిరూపాయలనోటు అతని చేతిలో నలుగుతోంది.
    "ఫరవాలేదు.....వెళ్ళు"
    చివరిసారిగా ఆమెను చూసి తలదించుకుని నడవడం మొదలుపెట్టాడు.
    "ఎవరో ---చాలా మంచివాడు కానీ పార్టీ వుండలేదు. ఏమిటో అతని బాధ" వెళుతున్న అతన్ని చూస్తూ అంది బుజ్జి.
    "కొజ్జా కాబోలు" రజని అన్న మాటలు  అతన్ని కొరడాదెబ్బల్లా తాకాయి ఓ క్షణంపాటు ఆగిపోయాడు.
    తనని మగవాడు కాదన్నందుకు అతను బాధపడడం లేదు. అయితే ఆ మాటల్లోని జాలి, సానుభూతి అతన్ని విషపు సముద్రంలో ముంచెత్తుతున్నాయి.
    ఈ సంఘటన జరిగాక ఆంజనేయులు అప్పుడప్పుడూ విస్కీ  తాగటం అలవాటు చేసుకున్నాడు. ఆరోజు తాగాలనే వూరికి వెళ్ళకుండా నిలిచిపోయాడు. బాగా తాగి ఆర్టీసీ బస్టాండ్ పార్క్ లో పడుకున్నాడు. దిగ్గున మెలుకువ వచ్చింది ఆంజనేయులకు.
    లేచి కూర్చుని చుట్టూ చూశాడు. ఆర్టీసీ బస్టాండ్ ముందున్న పార్క్ లో యాత్రికులు అడ్డదిడ్డంగా పడి నిద్రపోతున్నారు. ఓమూల ఆవు పచ్చిక మేస్తూ అప్పుడప్పుడూ సెంట్రీ వస్తాడేమోనని భయపడుతున్నట్టు మోరెత్తి చూస్తోంది. ఎంట్రెన్స్ లో వున్న సిమెంట్ పైపు మీద కూర్చుని పడుకుని నిద్రపోతున్నట్టు ఆడవాళ్ళ లోనెక్ జాకెట్లలో చూపులను గుచ్చుతున్నాడు ఓ యువకుడు.