Home » » యోని వదలుగా అవడం, కెగెల్ ఎక్సర్ సైజులు, భగసంకోచకాలు

యోని వదలుగా అవడం, కెగెల్ ఎక్సర్ సైజులు, భగసంకోచకాలు

యోని వదలుగా అవడం

    చాలామంది భర్తలు తమ భార్య యోని లూజు అయిందనీ, అందువలన సెక్స్ లో తృప్తి కలగట్లేదనీ అడుగుతూ వుంటారు. మరి కొందరు భర్తలు ఈ విధమైన కామెంట్, సెక్స్ సమయంలోనే బార్యతో చేస్తారు. దీనివలన చాలామంది ఆడవారు తీవ్రమైన డిప్రెషన్ కు లోనవుతారు.
    పిల్లలు కలిగాక యోని వదులయిపోతుందా అని చాలామంది అడుగుతూ వుంటారు. నిజానికి పిల్లలు కలిగాక కూడా యోని మామూలుగానే వుంటుంది.
    లూబ్రికేషన్ ఎక్కువయినందువలన యోని లూజుగా అనిపించవచ్చు. శృంగారం సమయంలో మధ్యమధ్య తుడుచుకోవడం ద్వారా  ఈ సమస్యను అధిగమించవచ్చును.
    తగినంత ప్రేరేపణ చెయ్యనందువలన యోని లూజుగా  అనిపిస్తుంది. మూడవ వంతు భాగంలో రక్త ప్రసారం పెరిగి  యోని  గోడలు ఉబ్బుతాయి. అందువలన రతిలో తగినంత రాపిడి వుంటుంది. చాలామంది మగవారు తగినంత ఫోర్ ప్లే, తగినంతసేపు చెయ్యరు. కానీ భార్యను మాత్రం నిందిస్తారు.

    కెగెల్ ఎక్సర్ సైజులు

 

     కొందరు ఆడవారు రతి సమయంలో కండరాలు బిగపడతారు. అది మగవానికి అత్యంత ఆనందాన్నిస్తుంది. కెగెల్ ఎక్సర్ సైజులు యోనిలోని ప్యూబోకాకిగ్జియల్ కండరాలకు శక్తినిస్తాయి. మొట్టమొదట యోనిలోకి వేళ్లనుంచి ఆ వేళ్ళని మూడు నుంచి అయిదు సెకన్లు బిగపట్టాలి. అలా రోజుకు ఇరవై సార్లు చెయ్యాలి. అలా రోజూ ప్రాక్టీస్ చెయ్యాలి. కొన్నాళ్ల తర్వాత వేళ్లు లేకుండానే యోని కండరాలని బిగపట్టడం అలవాటు చేసుకోవాలి. ఈ ఎక్సర్ సైజుల్ని  సెక్స్ సమయంలో చెయ్యాలి. అప్పుడు యోని కండరాలు సంకోచాలు పురుషాంగాన్ని పట్టుకుని, పురుషునికి ఆనందం కలుగుతుంది.
   

 

 

భగసంకోచకాలు   


    కామసూత్రాలలో భగసంకోచకాలు చెప్పారు. తామరపువ్వులను వాటి కాడతో సహా పాలతో నూరి మాత్రగా చేసి యోనిలో వుంచుకుంటే వృద్దనారికి కూడా కుమారి యోనిలాగా యోని  అవుతుంది. అదే విధంగా దేవదారు, పసుపు, మాను పసుపు, కమల కేసరాల్ని నూరి లేపనం చేయవచ్చు లేదా త్రిఫలా అంటే  కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, నేరేడు పట్ట, లొద్దుగ వీటిని తేనెతో లేపనం వేయచ్చు. అదేవిధంగా కటుతుంబి బీజం, లొద్దుగ వీటిని కూడా లేపనం  చేయవచ్చు.  అశ్వగంధ, వస, శొంఠి, మిరియాలు, పిప్పళ్లు, పసుపు, తామర,  చెంగళ్వకోష్ఠు వీటిని లేపనం చేయవచ్చు. ఇప్ప చెక్కని తేనెతో కలిపి నూరి లేపనం చేయవచ్చు. వీటిపై అనేక పరిశోధనలు అవసరం. దురదృష్టవశాత్తు ఇలాంటి పరిశోధనలు జరగట్లేదు.

google-banner