Home » Comedy Stories » The Prize Winner Joke

The Prize Winner Joke

The Prize Winner Joke

ప్రైజ్ విన్నర్

ప్రజలకు చేరువయ్యే పథకంలో భాగంగా కొత్తగా పెట్టిన టోల్ గేట్ దాటినా ప్రతీ నూరవ

ప్రయాణికుడికి వెయ్యి నూట పదహార్లు బహుమతిగా ఇద్దామని అనుకున్నారు పోలీసు

విభాగం వాళ్ళు.

సరిగ్గా ఆ ప్రకారం ఓ మారుతీ కారు వచ్చింది.

ఆ కారుని ఆపిన పోలీసు డ్రైవింగ్ సీటులో ఉన్నతనికి పుష్పగుచ్ఛం, నూట పదహారు

రూపాయల చెక్కు ఇచ్చి విషయం చెప్పి శుభాకాంక్షలు చెప్పాడు. “ థ్యాంక్స్ " అంటూ

బొకేను అందుకుని పక్కనున్న భార్యకు ఇచ్చాడతను.

“ అనుకోకుండా వచ్చిన ఈ డబ్బుతో మీరేం చేయబోతున్నారు ?” అడిగాడు పోలీసు.

అతని దగ్గర సమాధానం రెడీగా ఉంది.

“ డ్రైవింగ్ లైసెన్సు కొనుక్కోబోతున్నా !” అన్నాడు ఉషారుగా.

పోలీసు ఉలిక్కిపడడం చూసి భార్య సర్ధబోయింది.

మా ఆయన తాగినప్పుడు అలాగే మాట్లాడుతాడు.పట్టించుకోకండి " అంది.

వెనక సీటులో కునికిపాట్లు పడుతున్న చెవిటి తాతగారు ఈ హడావుడికి నిద్రలేచి

పోలీసును చూసి మొత్తుకున్నాడు.

“ నేనక్కడికి మా వాడికి చెబుతూనే ఉన్నానండి.కొట్టేసిన కారుతో ఎక్కువ దూరం

వెళ్ళలేంరా.పోలీసులు మధ్య దారిలోనే పట్టేసుకుంట్రారా " అని .

రచన - శాగంటి శ్రీకృష్ణ

 

google-banner