Aanagar Colony 1

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

1 వ భాగం

అదీ విచిత్రమైన కలినీ అక్కడ అన్నీ ఆశ్చర్యాలే...అన్నీ విచిత్రాలే. ప్లేటు భోజనం ముప్పావలా వుండొచ్చు...హోటల్ వుండొచ్చు..హోటల్ లో ఒకరోజు బసచేయడానికి రెండు రూపాయలు సరిపోవచ్చు. అక్కడి మనుష్యుల రివర్స్ లో నడుస్తారు. అద్దె ఇళ్ళల్లో తాళ్ళ సహాయంతో పైకి వెళ్తారు. ఇంటికి తాళాలుండవ్. అన్నీ "అతి'లే ఆహానగర్ అంతా నవ్వులే... ప్రపంచంలోని విచిత్రమైన మనస్తత్వం వున్న వాళ్ళను... వింతగా అనిపించే విషయాలను... నవలా చదువుతూ విజువలైజ్ చేసుకోవచ్చు.

ఇంకెందుకాలస్యం. మీ అభిమాన రచయిత్రి, సూరేపల్లి విజయ ఆహానగర్ కాలినీలోకి ఆహ్వానం..... ఆహానగర్ కాలినీలోకి ప్రవేశించే ముందు ఆహానగర్ కాలినీలోకి ప్రవేశించే...మీకు సుస్వాగతం. ఈ కాలనీ ఊహా మాత్రపు ఆలోచన. ఇలాంటి కాలనీ ఉందా? ఉంటుందా? లేదా? అన్న మీమాంసలొద్దు.

ఆహానగర్ కాలినీలో తారసపడే పాత్రలు, సంఘటనలు నిజ జీవితంలో మీరు చూసినవే అయ్యుండొచ్చు. ఆహానగర్ కాలినీలో జరిగే సంఘటనలు...నిజంగా ఇలా జరిగితే బావుండని మీ కనిపించనూ వచ్చు. కొన్ని పాత్రల్లో అతి ఉండొచ్చు. మరికొన్ని పాత్రల్లో అతి జరిగితే కనిపించనూవచ్చు. ప్రపంచలో మనిషి తప్ప ఏ ప్రాణి నవ్వలేదు. అలాంటి నవ్వు నిత్య జీవితంలో ఏర్పడే టెన్షన్ల వల్ల మన పెదవుల నుంచి దూరమైపోతుంది.

మన పెదవులు మీద రాన్రాను కనుమరుగైపోతున్న ఆ చిర్నవ్వును తిరిగి మీ పెదాల మీదికి రప్పించే ప్రయత్నమే ఆహానగర్ కాలనీ. మనసారా నవ్వగలిగిన వారికీ బాధలు, అనారోగ్యాలు దరిచేరవని ఒత్తిడిలు, మనసుమీద వుండవని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. కామెడి సినిమాలు చూసినా, జోక్స్ చదివినా, మన పెదాలు విచ్చుకొని, మనసారా నవ్వినా క్షణం, ఆ సమయంలో మన శరీరంలో 'ఇంటర్ ఫెరాన్ గామా" అనే రసాయనం ఉత్పత్తి పెరిగిపోతుంది.

శరీరంలోని అనారోగ్యపాలను పరిదిద్దే గుణం ఈ రసాయనానికి వుంది. అదే విధంగా నవ్వినప్పుడు మెదడు నుండి బాధను ఉపశమనం కలిగించే రసాయనాలు విడుదలై ఒత్తిడిని తగ్గిస్తాయి. నిజ్జంగా నిజ్జం! నవ్వు ఆరోగ్యానికి మంచిదని సైన్స్ కూడా కన్ ఫర్మ్ చేసింది. న్యూయార్క్ లో ఓ వ్యక్తి సంవత్సర కాలంగా వెనకనుంచి నడవడం ప్రాక్తీస్ చేసుకున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా వెనకడుగుల వేసుకుంటూ ఆఫీసుకు వెళ్తాడు.

రోడ్స్ ఐలాండ్ జనాభా ఎక్కువయిందని కుటుంబ నియంత్రణ కొత్త కోణంలో అమలు జరపాలని సెక్స్ టాక్స్ విధించారు. అక్కడి ఆరోగ్య శాఖాధికారులు. నెదర్లాండ్స్ లో వృద్ధ ప్రేమికులకు సెపరేట్ గా ఓ కాలనీ వుందట. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు రీడబుల్లీ కోసం మెలో డ్రామా మిక్స్ చేసి ఈ నవల రాయడం జరిగింది. వాటి తాలూకు వివరాలు కూడా అవసరాన్ని బట్టి నవలలో ఇచ్చాను. ఇది పూర్తిగా కల్పితం కాదు. అలా అని ఎవర్ని ఉద్దేశించి రాసినదీ కాదు. అక్కడక్కడా చదివిన విషయాలు, చూసిన సంఘటనలు ప్లస్ కొత్తగా సృష్టించిన పాత్రలు వెరసీ ఆహానగర్ కాలనీ.

ఈ ఆహానగర్ కాలనీ రీలాక్సింగ్ మజిలీ, రెగ్యూలర్ టెన్షన్ లైఫ్ ఓ ఓ బ్రేక్ పాయింట్ కావాలని ఆకాంక్షిస్తూ...... ఆహానగర్ కాలనీ "వెల్ కమ్ ఆహానగర్ కాలనీ" బోర్డు తలక్రిందులుగా వేలాడుతోంది. వరుసక్రమంలో రిక్షాలు స్టాండులో వున్నాయి. మరో పక్క ఆటోలు ఆగి వున్నాయి. రిక్షావాళ్ళు జీన్స్ ప్యాంటు, టీషర్ట్స్ తో కాలేజీ కుర్రాళ్ళలా ఉన్నారు. సమయం ఉదయం ఆరుగంటల నలబై నిమిషాలు. ఓ బస్సోచ్చి ఆహానగర్ కాలనీ బస్టాప్ ముందాగింది.

"ఆహానగర్ కాలనీ" అరిచాడు కండక్టర్.

ఏర్ బ్యాగ్ ని భుజానికి తగిలించుకొని సీటులో నుంచి లేచాడు సాకేత్. ప్రయాణికులంతా అతని వైపు విచిత్రంగా చూసారు.

"మీది ఆహానగర్ కాలినియా?" ఓ ముసలతను అడిగాడు.

"కాదు" అన్నాడు సాకేత్.

"మరి అక్కడికెందుకెళ్తున్నట్టు?" మరో జీన్స్ ప్యాంట్ శాల్తీ అడిగాడు.

"ఊర్కే. తోచక. తాపీగా చెప్పి బస్సు దిగాడు సాకేత్.

"ఏంటో పిదపకాలం...పిదపబుద్ధులు...తోచక ఆహానగర్ కాలనీ వెళ్ళడమేంటో?" ఓ ముసలవ్వ సన్నాయి నొక్కులు నొక్కుకుంది.

ఇంకావుంది