Rating:             Avg Rating:       650 Ratings (Avg 3.00)

సరదాగా కాసేపు పెట్రోల్ ఆదా చేయండి ఇలా

సరదాగా కాసేపు...

 

పెట్రోల్ ఆదా చేయండి ఇలా

 

ఎప్పుడు, ఏ క్షణాన ఏ ధర పెరుగుతుందో మనకు తెలియదు కదా ! ఒకవేళ తెలిసిన

మనం చేసేది ఏముంటుంది ? ధరను పెంచుకోవడంలో ముఖ్యంగా పెట్రోల్ కీలకమైన

పాత్ర పోషిస్తుంది. ఎందుకు పెంచుకుంటుందో, ఎందుకు తగ్గించుకుంటుందో మనకు

అర్థంకాక బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు చెప్పండి. పెట్రోల్ ధర పెరిగినప్పుడు మనం

కొన్ని జాగ్రత్తలు సరదాగా పాటిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం.

ఈ రచన మీద మీ అభిప్రాయాలు కోరుకుంటున్నాం.

 

* ముందుగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే....సాధ్యమైనంతవరకు మీ వెహికల్ ని

వాడడం తగ్గించండి.

 

* వెహికల్ బదులు నడవడం ఆరోగ్యానికి మంచిదని తెలుసుకుంటే మీకు పెట్రోల్

సమస్య ఉండదు.

 

* ముఖ్యంగా లావుగా ఉన్నవాళ్లకి లిప్ట్ ఇవ్వకండి. బరువు ఎక్కువైతే ఏ వెహికల్

అయినా పెట్రోల్ బాగా తాగుతుందని తెలుసుకోండి.

 

* మీ వెహికల్ ని దొంగలు ఎవరైనా ఎత్తుకుపొతే శని వదిలిపోయిందని సంతోష పదండి.

అప్పుడు పెట్రోల్ కు వాడాల్సిన డబ్బులు మరే ఇతర దానికైనా వాడుకోవచ్చు.

 

* మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ వెహికల్లో పెట్రోల్ లేకుండా జాగ్రత్త పడండి. ఎవరైనా

వెహికల్ అడిగితే పెట్రోల్ లేదని ఇవ్వకుండా తప్పించుకోవచ్చు కదా !

 

* బస్టాండ్ ల్లో బస్సుల కోసం చూసేవాళ్ళ దగ్గరికి వెళ్లి లిప్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు

వసూలు చేయండి. దాంతో పెట్రోల్ కొనుక్కోవచ్చు.

రచన - శాగంటి శ్రీకృష్ణ