TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఒకతను బ్యాగుతో నగల దుకాణానికి వెళ్లాడు.
అక్కడ నగలని చూసి రేటు అడుగుతున్నాను.
" ఆ నెక్లెస్ ఎంత ?"
" పాతిక వేలు "
" అదిగో... ఆ నెక్లెస్ "
" ముప్ఫైరెండు వేలు "
" ఇదిగో...ఆ చివర నున్న డిజైనింగ్ చెయిన్ "
" అది తొంభై అయిదువేలు "
" దాని పక్కనున్న డైమండ్ నెక్లెస్ ఎంత ? దానిని చూపించండి "
" అది చాలా ఖరీదు "
" ఎంత ఖర్చైనా పరువాలేదు "
" ముందు మీ బ్యాగులో ఉన్నది డబ్బా ? లేక రివాల్వారా..చూపించండి " అని
అనుమానంగా అన్నాడు ఆ నగల వ్యాపారి.
" ఆ.." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు తన బ్యాగులో ఉన్నది ఆ దుకాణం
అతనికి ఎలా తెలిసిపోయిందో అర్థం కాలేదు.
|