శుద్ధ తప్పు
శుద్ధ తప్పు
కాలికి సిమెంటుకట్టుతో ఆసుపత్రిలో బెడ్ మీద పడి వున్న భర్తతో అంది భార్య, కళ్ళు వత్తుకుంటూ “పొద్దున మీరు చెప్పిన సంగతి శుద్ధ తప్పని ఇప్పటికికయినా ఒప్పుకుంటారా?”
“ఏ సంగతి?” నీరసంగా మూలిగాడు భర్త.
“కాలు జారితే తీసుకోగలంగాని నోరు జారితే తీసుకోలేం అనలేదూ...''
''అన్నాను, అయితే?''
''బాత్రూంలో కాలుజారి మీరిలా అయ్యారు. నేను పక్కింటావిడని నోటికి వచ్చినట్లు తిట్టినా నాకేం కాలేదు?” అంది భార్య.



