Rating:             Avg Rating:       443 Ratings (Avg 3.01)

సిల్లీ ఫెలో - 4

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 4

- మల్లిక్

 

"నీతో సినిమాలకీ, షికార్లకీ రావడం మానేస్తా... అప్పుడు నీకు తిక్కకుదరుతుంది" మళ్ళీ సీతే అంది.

"ప్లీజ్ సీతా... కోపగించుకోకు. త్వరలో నిన్ను నా దాన్నిగా చేస్కుంటాగా. ప్లీజ్ నవ్వవూ?" సీత గడ్డాన్ని పట్టుకున్నాడు బుచ్చిబాబు.

"నవ్వాలి సీతా... ఏదీ?"

"నేను నవ్వుతూనే వున్నాను. ఈ చీకట్లో నీకు కనిపించి చస్తే కదా?" అంది సీత.

అడ్వటైజ్ మొదలయిన అని అయిపోయి సినిమా స్టార్ట్ అయ్యింది.

కథ చాలా పాతదే! ఒక హీరో... ఇద్దరు హీరోయిన్లు!!

పాపం హీరో ఒకప్రక్క పెళ్ళాం, మరోప్రక్క ప్రేయసి ఇద్దరిమధ్య నలిగిపోతూనే ఇద్దరితోనూ సంబరంగా చంకలుగుద్దుకుంటూ స్టెప్పులేస్తూ డ్యూయెట్లు పాడేస్తున్నాడు. ఆ హీరో అభిమానులు పాటపాటకీ ఈలలువేస్తూ సీట్లోంచి లేస్తూ చిందులు వేస్తూ తెరమీదకి చిత్తు కాగితాలు వేస్తున్నారు.

"ఇదేం అభిమానం? హీరో అంటే ఇష్టం అయితే తెరమీదకి పూలు విసరాలిగానీ ఇలా చిత్తు కాగితాలు విసరడం ఏంటి?" ఆశ్చర్యంగా అడిగింది సీత.

బుచ్చిబాబు నవ్వుతూ "నొ కామెంట్!" అన్నాడు.

ఓ ముప్పావు గంట గడిచింది. దీక్షగా సినిమా చూస్తున్న సీత భుజంమీద చెయ్యి పడింది.

సీత పక్కకి తిరిగి బుచ్చిబాబు వంక చూసి నవ్వింది. బుచ్చిబాబు కూడా నవ్వి మళ్ళీ తెరవైపు మొహం తిప్పాడు. సీత భుజం మీద నుండి పైకి జరిగి ఆమె చెంపల్ని నిమిరింది.

"ఊ... ఇలాంటి పనులు చేయడానికి మాత్రం భయంలేదు" మనసులోనే అనుకుని ముసిముసిగా నవ్వింది సీత.

కొన్ని క్షణాలు గడిచిన తరువాత ఆ చేయి క్రిందికి జరగసాగింది.

"బుచ్చిబాబూ.... దిసీజ్ టూ మచ్" అంటూ క్రిందికి జరుగుతున్న చేతిని చటుక్కున పట్టుకుని కెవ్వుమని అరిచింది సీత. అది బుచ్చిబాబు చెయ్యికాదు.

సీతకి ఇటుప్రక్కన కూర్చున్నవాడు సర్దుకుని కూర్చున్నాడు.

"ఏంటి?" ఏమైంది?" సీతమీదకి వంగుతూ అడిగాడు బుచ్చిబాబు.

"నా ప్రక్కనవాడు నామీద చేయ్యేసాడు. అది నీ చెయ్యి అనుకున్నాను. అయినా అది నీ చెయ్యికాదని చెప్పకుండా బెల్లంకొట్టిన రాయిలా కూర్చుంటావేం?" విసుక్కుంది సీత బుచ్చిబాబు చెవిలో.


"బానేవుంది.. ఎవడో చీకట్లో నీమీద చెయ్యేస్తే అది నీకు తెలియాలిగానీ ఆన్కేలా తెలుస్తుంది సిల్లీగా?" బుచ్చిబాబు కూడా సీత చెవిలో అన్నాడు.

"సరే... కాస్త ఇటు జరిగి కూర్చో" అంటూ సీత భుజం చుట్టు చెయ్యేశాడు బుచ్చిబాబు.

మరో అయిదు నిమిషాలు గడిచాయి. వెనుక వరసలో వున్నా వాళ్ళలో ఎవడో కాలితో సీత వెనుకభాగాన్ని నొక్కడం మొదలుపెట్టాడు.

సీత సీట్లోంచి చివాలున లేచింది.

"ఏంటి.... ఏమైంది?" అడిగాడు బుచ్చిబాబు సీట్లోంచి కూర్చునే.

"మనం పోదాం" బుచ్చిబాబు సమాధానం కోసం చూడకుండానే బయటకి పరుగుతీసింది సీత.

బుచ్చిబాబు ఆమెని అనుసరించాడు.

"ఏంటి డియర్ ఏమైంది?" అడిగాడు బుచ్చిబాబు.

"ఎవడో రాస్కెల్ వెనుకనుండి కాలేసి నొక్కుతున్నాడు. ఛీ ఛీ... ఇంకెప్పుడూ ఈ అలగా జనాలు చూసే సినిమాలకు నేను రాను" విసుగ్గా అంది సీత.

"వెధవలు.. పోదాం పద" అన్నాడు బుచ్చిబాబు.

"పోదాంగానీ ఇందాక వాడెవడో నామీద చెయ్యేశాడని చెప్పినా నీలో ఏం రియాక్షన్ లేదేం? వాడిని పట్టుకుని నిలదీయొద్దూ?"