Home » Jokes » old Lady Bus Funny Joke

old Lady Bus Funny Joke

హైదరాబాద్ బస్టాండ్ లో ఒక ముసలావిడ వైజాగ్ వెళ్ళే బస్ ఎక్కింది. ఎక్కగానే డ్రైవర్ తో 'బాబు, నేను నిద్రపోతానేమో, విజయవాడలో నన్ను లేపుతావా' అనడుగుతుంది. దానికా డ్రైవర్ సరే అంటాడు. ఆ ముసలావిడ ఆ డ్రైవర్ మాటమీద నమ్మకం లేక తోటి ప్రయాణికులకు అందరికీ కూడా చెప్తుంది. అందరూ సరే అంటారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ ముసలావిడ నిద్ర నుంచి లేస్తుంది.
ముసలావిడ : విజయవాడ ఇంకారాలేదా బాబు?
డ్రైవర్ : అయ్యయ్యో మర్చిపోయాను, విజయవాడ దాటేసి 100 km వచ్చేసాం బామ్మగారు.
దానికా ముసలావిడ ఏడుపందుకుంటుంది. తోటి ప్రయాణికులు ఆమె అవస్థ చూడలేక, బస్ వెనక్కు తిప్పమని అడుగుతారు.
డ్రైవర్ బస్ వెనక్కు తిప్పి విజయవాడ తీసుకు వెళ్ళి దిగమని చెప్తాడు. అంతలో ఆ ముసలావిడ, తన బాగ్ లోనుండి రెండు మందు బిళ్ళలు తీసి నోట్లో వేసుకుని, నీళ్ళు తాగి, డ్రైవర్ తో ఇలా అంటుంది.
'ఏమీ లేదు బిడ్డా, నాకు బి.పి. ఉంది. మా మనవడు, విజయవాడ వెళ్ళగానే ఈ రెండు టాబ్లెట్స్ వేసుకోమన్నాడు. నేనూ కూడాఅ వైజాగే వెళ్ళాలి, ఇప్పుడు వైజాగ్ పోనివ్వు '  

google-banner