సిల్లీ ఫెలో - 90

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 90

- మల్లిక్

 

మోహన్ సగం కాఫీని ఖాళీకప్పులోకి వంచి సీతకి ఇచ్చాడు.

బుచ్చిబాబు ఆముదం తాగినట్టు మొహం పెట్టాడు.

ముగ్గురూ కాఫీ త్రాగాక "ఇంక మనం ఆఫీసుకెళ్దామా?" అన్నాడు బుచ్చిబాబు.

"అప్పుడే అంత కంగారేమిటోయ్ అన్నాడు మోహన్.

"నాకు చాలా పనుంది!" బుచ్చిబాబు సోఫాలోంచి లేచాడు.

మోహన్ కూడా లేచాడు.

ఇద్దరూ ఆఫీసుకెళ్ళిపోయారు. ఆఫీసుకు వెళ్ళగానే మోహన్ తనసీట్లో కూర్చున్నాడు. బుచ్చిబాబు మాత్రం ఏకాంబరం క్యాబిన్ లోకి వెళ్ళాడు.

"రావోయ్ రా... ఇంతకీ ఆ లత్కోరు కిత్తుగాడున్నాడా?" బుచ్చిబాబుని అడిగాడు ఏకాంబరం.

"ఉన్నాడు సార్! మీరిచ్చిన కవర్ చింపిచదివాడు సార్" చెప్పాడు బుచ్చిబాబు.

"ఏమన్నాడు?"

"తర్వాత మీతోనే ఫోన్ చేసి మాట్లాడతానన్నాడు సార్"

"సరే... నువ్వెళ్ళి నీ పని చూస్కో"

"సార్... నిన్న సాయంత్రం ఏవో అర్జంట్ ఫైళ్ళు ఉన్నాయన్నారు. అవి ఇవ్వండి సార్... పూర్తి చేసి ఇచేస్తా"

"అవి మోహన్ కి పొద్దునే ఇచ్చేశా! నువ్వు అగర్ వాల్ కంపెనీకి వెళ్ళగానే మోహన్ ని లోపలికి పిలిచి నువ్వు అర్జంట్ పనిమీద అగర్ వాల్ కంపెనీకి వెళ్ళావని చెప్పి ఆ ఫైళ్ళు అతనికి అప్పజెప్పా.... నువ్వేం వర్రీకాకు... ఆపని అతను చేస్తాడ్లే!" బుచ్చిబాబు ఉలిక్కిపడ్డాడు.

"నేను అగర్ వాల్ కంపెనీకి వెళ్లినట్టు మోహన్ కి తెలుసా?" అని అడిగాడు అయోమయంగా.

"తెలుసు... నేనే చెప్పా...?!" ఆశ్చర్యంగా అడిగాడు ఏకాంబరం.

"ఏం లేదు సార్... ఏం లేదు!" అంటూ క్యాబిన్ లోంచి బయటికి వచ్చేసి అక్కడే నిలబడి ఆలోచించసాగాడు బుచ్చిబాబు.

"నేను అగర్ వాల్ కంపెనీకి వెళ్ళినట్టుగా మోహన్ కి ముందే తెలిస్తే మరి ఇంటికి ఎందుకు వచ్చినట్టు... ఎందుకు? ఎందుకు?? ఎందుకు ???.


*            *           *

ఆఫీసు నుండి రాగానే మొహం కడుక్కుని వంటగదిలోకి వెళ్ళాడు బుచ్చిబాబు.

అక్కడ సీత బెండకాయలు తరుగుతోంది.

"ఏంటీ? ఈ వేళా వంటలో నాకు సాయం చేస్తున్నావు?" సీత బుగ్గమీద చిటికె వేస్తూ అడిగాడు బుచ్చిబాబు.

"ఊ... మరీ ఇంట్లోనే ఊరికే కూర్చుని వుంటే నాకు తోచడం లేదు."

"అలాగైతే రోజూ వంటపని నువ్వే చేయవచ్చుగా! నీకూ తోస్తుంది... నాకు ఈజీగా ఉంటుంది."

"ఊహూ.... అలా కుదర్దు! తోచడానికి నేను వంట పనే చేయనక్కర్లా!"

"మరేం చేస్తావ్?"

"కూర్చో చెప్తా!"

బుచ్చిబాబు సీత ఎదురుగా పీట వేస్కుని కూర్చున్నాడు.

"చెప్పు"

"నేను కూడా ఉద్యోగం చేస్తా" బెండకాయలు తరగడం ఆపి బుచ్చిబాబు మొహంలోకి చూస్తూ అంది సీత.

"నువ్వా? ఎక్కడ??"

"ఏమో... చూడాలి! ఎక్కడైనా వేకెన్సీ ఉంటే అప్లయ్ చేస్తాను"

"నీ ఇష్టం"

"నా ఇష్టం అని ఊర్కుంటే సరిపోదు. నువ్వు ప్రయత్నించు! పెళ్ళాం మాటయితే మొగుడు వినడుగానీ ప్రేయసి మాట, గర్ల్ ఫ్రెండ్ మాటా అయితే వింటాడుగా?" నవ్వుతూ అంది సీత.

"అబ్బా మళ్ళీ చెప్పడం మొదలు పెట్టావా? నేను వెళ్తా!" పీటమీద నుండి లేవబోయాడు.

"లేవకు కూర్చో. కాఫీ పెట్టిస్తా!" అంటూ క్రింద నుండి లేచి కాఫీ పెట్టి బుచ్చిబాబుకి ఒక కప్పు ఇచ్చి తానో కప్పు తీస్కుంది.

బుచ్చిబాబు కాఫీ సిప్ చేస్తుండగా సీత అడిగింది " ఆ మోహన్ నీకు బాగా క్లోజ్ ఫ్రెండా?"