సిల్లీ ఫెలో - 25

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 25

- మల్లిక్

 

"అంత అదృష్టం నాకెక్కడిది గానీ... నా ట్రాన్స్ ఫర్ ఆర్డరు కాన్సిల్ అయినట్టు హెడ్డాఫీసు నుండి లెటర్ వచ్చింది. ఇప్పుడే బా పిలిచి చెప్పాడు" అన్నాడు బుచ్చిబాబు.

"ఓ ... అయితే స్వీట్ ఇవ్వాల్సిందే!"

"ఓ... తప్పకుండా...."

బుచ్చిబాబు ప్యూనుతో స్వీట్స్ తెప్పించి అందరికీ పంచాడు.

ఆ ట్రాన్స్ ఫర్ ఆగడానికి అసలు కారకుడైన పక్క సెక్షన్ లోని వెంకట్రావు దగ్గరికి వెళ్ళాడు బుచ్చిబాబు.

"ఊ... అయితే నీట్రాన్స్ ఫర్ ఆగిపోయిందన్న మాట! ఆ మిన్నారావ్ మాట నిలబెట్టుకున్నాడు" అన్నాడు వెంకట్రావ్.

"ఆ ట్రాన్స్ ఫర్ ఆగిపోయింది కాబట్టి బతికిపోయాను. లేకపోతె మా పెళ్ళి అయ్యాక సీత ఇక్కడ... నేను విజయవాడలో ఎంత కష్టం!" అన్నాడు బుచ్చిబాబు.

"నీ మొహంలే... అసలు పెళ్ళే ఓ పెద్దకష్టం..." అన్నాడు వెన్కత్రాఉ.

"అలాగంటావా?"

"అవును... కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు"

"నీకు తెలియదురా... సీత చాలా మంచిపిల్ల!" చెప్పాడు బుచ్చిబాబు.

"ఓహో! నీ సీత చాలా మంచిపిల్ల. మా పెళ్లాలంతా గయ్యాళీలు! అదేగా నువ్వంటున్నది?

"అబే... నేనలా ఎక్కడన్నాను? సిల్లీగా మాట్లాడకు!" కంగారుపడుతూ అన్నాడు బుచ్చిబాబు.

"ఇప్పుడు మేము ఏం చెప్పినా నీకు సిల్లీగానే అనిపిస్తుంది. కానీ పెళ్ళయ్యాక తెలుస్తుంది మా మాటలలో ఎంత నిజం వుందో... ఎంతో ప్రేమించుకుని పెళ్ళిచేసుకున్నవాళ్ళే తన్నుకుచావడం నేను చూశాను" అన్నాడు వెంకట్రావు.

అతడు ఆమాట అనగానే బుచ్చిబాబుకి తన ఫ్రెండ్ కిరణ్ గుర్తుకొచ్చాడు. ఆరోజు అతని గుమ్మం దగ్గర నిలబడి కిరణ్ అతని భార్య తీవ్రంగా దెబ్బలాడుకోవడం స్వయంగా విన్నాడు. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు.

రేపు తనూ! సీతకూడా అంతేనా?

"నో....నో... వాళ్ళువేరు ... నేనూ సీత వేరు" అనుకున్నాడు బుచ్చిబాబు.

*            *        *

"ఇదిగో ఇక్కడే! ఈ షాపులో చీరలు బాగుంటాయి" అంటూ ఆగింది సీత.

బుచ్చిబాబు కూడా ఆగి తలెత్తి షాపు బోర్డువంక చూసాడు.

దగాచంద్ క్లాత్ స్టోర్స్ అని రాసివుంది బోర్డుమీద.

"బోర్డుచూస్తే అదో మాదిరిగా వుంది. మనం ఇక్కడ చీరలు కొనొచ్చంటావా? అనుమానంగా అడిగాడు సీతని.

"ఏమో మరి... పేరు అలావున్నా చీరలు బాగానే వుంటాయి. నేను చీరలెప్పుడూ ఇక్కడే కొంటాను. ఇంక పేరు సంగతంటావా? కొందరు పుట్టిన పిల్లలు బ్రతకకపోతే అలాంటి పేర్లు పెడుతుంటారు. వాళ్ళ తల్లితండ్రులు అందుకే అలాంటి పేరు పెట్టారేమో?...

"అవునవును... మా బంధువుల్లో కూడా ఒకళ్ళు వాళ్ళబ్బాయికి ఫకీరు అని పేరు పెట్టారు."

"హామ్మయ్య కన్విన్స్ అయ్యావుకదా... ఇహ లోపకికి పద" అంది సీత తేలికగా నిట్టూరుస్తూ.

ఇద్దరూ "దగాచంద్ క్లాత్ స్టోర్సు'లోకి అడుగుపెట్టారు.

కౌంటర్లో వున్న సేఠ్దగాచంద్ లేచి నిలబడి సీతని సాదరంగా ఆహ్వానించాడు.

"ఆయియే బహెన్ జీ... ఆయియే" అంటూ బుచ్చిబాబుని చూస్తూ "మీది మొగుడూ వుందీ?" అని అడిగాడు.

"కాదు.. త్వరలో అవుతుంది" అంది సీత బుచ్చిబాబుని చూసి నవ్వుతూ

హిహిహి"

ఆ సమయంలో ఇంకేం చెయ్యాలో తోచక అనవసరంగా నవ్వాడు బుచ్చిబాబు.