సిల్లీ ఫెలో - 21

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 21

- మల్లిక్

 

"వినకపోతే ఇంకా పవర్ ఫుల్ రికమెండేషన్ పెట్టిస్తాం!"

"అంటే సెంట్రల్ మినిస్టర్ దా?"

"కాదు... మిన్నారావుకి ఒక ఉంపుడు కత్తె వుంది. దాన్ని పడతాము!"

"ఛీ... ఛీ... దాన్ని మనమెందుకు పట్టాలి సిల్లీగా? నాకేం ఇంట్రెస్టు లేదు బాబూ" అన్నాడు బుచ్చిబాబు మొహం అస్సయ్యంగా పెట్టి.

"మనం ఆమెని పట్టేది రికమండేషన్ గురించి, మరెందుకోసమో కాదు" పళ్ళు కొరుకుతూ అన్నాడు వెంకట్రావు.

"ఓ.... అందుకా... తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు బుచ్చిబాబు.

"ఆమె చెపితే ఈ మిన్నారావ్ క్రిందా మీదా పడి మన పని చేస్తాడు"

వెంకట్రావు ఇలా అంటుండగానే మినిస్టర్ మిన్నారావ్ కారు వచ్చి ఇంటి గేటులోంచి లోపలకి దూసుకెళ్లింది.

"మిన్నారావ్ వచ్చేశాడు" వెంకట్రావు లేచి నిలబడ్డాడు.

ఇద్దరూ మిన్నారావ్ ఇంటివైపు అడుగులు వేసారు.

"నువ్వు నా పక్కనే కులాసాగా నిలబడి ఫోజులు కొట్టకుండా నీకు ఒంట్లో బాగోలేదని... విజయవాడ... నీలు పడవని చెప్పు.. కాస్త దీర్ఘంగా చెప్పు!" అన్నాడు వెంకట్రావు.

"అలా చెపితే సిల్లీగా వుండదా?" సందేహంగా అడిగాడు బుచ్చిబాబు.

"ఉండదు. ఏ కారణం సమీపించారు. గూర్ఖా ట్రాన్స్ ఫర్ ఆపమంటేనే సిల్లీగా వుంటుంది."

ఇద్దరూ గేటుని సమీపించారు. గూర్ఖా ఇద్దరికీ సెల్యూట్ కొట్టి లోపలకు పంపించాడు.

"ఏంటి?" అని హాల్లో వున్న పి.యే అడిగాడు.

"మినిస్టర్ గారిని కలవాలి. వీరేశం గారు పంపించారని చెప్పండి" అన్నాడు వెంకట్రావు.

పి.యే లోపలకు వెళ్ళి అరనిముషంలో బయటకి వచ్చాడు.

"కూర్చోండి.." అన్నాడు ఇద్దరితో.

ఇద్దరూ సోఫా అంచున కూర్చున్నారు. మినిస్టర్ మిన్నారావు ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తూ. పి.యే లోపలికీ బయటకీ తిరుగుతున్నాడు.

అయిదు నిముషాలు, పది... పదిహేను నిముషాలు.... టైము గడుస్తోంది. కానీ మినిస్టర్ మిన్నారావు బయటికి రాలేదు.

"మీరు మేం వచ్చినట్టు చెప్పారా?" అక్కడ ఉన్న పి.యేని సందేహంగా అడిగాడు వెంకట్రావు.

"చెప్పాకే ఆయన కూర్చోమని చెప్పారు" చెప్పాడు పీ.యే.

"మరి ఇంకా రాలేదు కదా?" మొహమాటపడుతూ అన్నాడు వెంకట్రావు.

"అంటే, ఛాం ఛాం హేర్ కంటింగ్ సెలూన్ ఓపెన్ చేసి అలసిపోయి వచ్చారు. కదా. అందుకని కాస్సేపు నడుం వాలుస్తానన్నారు" అని చెప్పి బయటకెళ్ళిపోయాడు పీ.యే.

ఆ మాట విని అంతసేపూ సోఫాలో అంచుమీద కూర్చున్నందుకు తిట్టుకుండా పూర్తిగా వెనక్కి జారబడి రిలాక్స్ అయ్యాడు.