తెలుగు జబర్దస్తీ కామెడీ స్పెషల్

Telugu Jabardasth Comedy Special

'' తెలుగు జబర్దస్తీ కామెడీ స్పెషల్ ''

చలాకీ ముద్దుగుమ్మతో చిలిపి కృష్ణుడు 

ఈ రోజు నుండి ప్రతి మంగళవారం '' తెలుగు జబర్దస్తీ కామెడీ స్పెషల్ '' అంటూ స్పెషల్ గా మిమ్ముల్నినవ్వించడానికి రెడీ అయి వస్తుంది. ఈ శీర్షికలో మనం కొంటెగా చలాకీగా ఉండే ఒక ముద్దుగుమ్మ కొంటెతనంతో ఉండే ప్రశ్నల్ని అడుగుతుంది. వాటికి చిలిపిగా నవ్వుతూ కృష్ణుడు తుంటరి జవాబులు చెప్పుతూ నవ్విస్తూ ఉంటాడు.

మరి అవి ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉంది కదా ! మరి ఆలస్యం ఎందుకు తెలుగు జబర్దస్తీ కామెడీ స్పెషల్ ల్లో చలాకీ ముద్దుగుమ్మతో చిలిపి కృష్ణుడు అంటూ చదువుకొని హాయిగా నవ్వుకోండి. ఈ శీర్షిక మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయగలరు.

 

చలాకీ ముద్దుగుమ్మ : ఎప్పుడు వృత్తిధ్యాసలో ఉండే డాక్టర్ ?

చిలిపి కృష్ణుడు : " నువ్వు నన్ను తాకుతుంటే సిగ్గేస్తోంది " అని ప్రియురాలు

అంటే, " ఇదే మొదటిసారా...లేదా...ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగిందా ''

అని ప్రశ్నించేవాడు.


చలాకీ ముద్దుగుమ్మ : మిత్రలాభం, మిత్రభేదం అంటే ?

చిలిపి కృష్ణుడు : " అప్పు తీసుకొని ఎగ్గొట్టడం "


చలాకీ ముద్దుగుమ్మ : మనోరథం అంటే ?

చిలిపి కృష్ణుడు : " కోరికలనే గుర్రాలచే లాగబడేది


చలాకీ ముద్దుగుమ్మ : అరవై నాలుగు కళల్లో అతికష్టమైనడి ఏది ?

చిలిపి కృష్ణుడు : " అరవై నాలుగు పేర్లూ గుర్తుపెట్టుకోవడం"


చలాకీ ముద్దుగుమ్మ : మాష్టారు షాక్ తినేదెప్పుడు ?

చిలిపి కృష్ణుడు : " పిల్లల్ని ' నేటి నుండి విద్యుచ్చక్తిని ఎందుకు వేరు చేస్తారని

ప్రశ్నిస్తే ' స్నానం చేసేటప్పుడు షాక్ కొట్టకూడదని వేరు చేస్తారు సార్ ' అని

జవాబు ఇచ్చినప్పుడు.

Brahmanandam Acts As Deadbody