TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Funny Wife and Husband Jokes in Telugu
మొగుడూ పెళ్ళాళయిన సీతా, రామారావు ఒకరోజు తీవ్రంగా తిట్టుకుని బాగా గొడవ
పడ్దారు. తనదే తప్పు అని మొగుడు బతిమాలుతూ ఎప్పటికీ కాళ్ళు పట్టుకోకపోవడం
వలన ఇక లాభం లేదని పరుగున బెడ్ రూములోకి వచ్చిన సీతా లాగేజి బ్యాగు తీసుకుని
గబగబ కొన్నిబట్టలను సర్దుకుని హల్లో నుండి బయటికి వెళ్లబోతుంటే భర్త రామారావు
చూశాడు.
" ఏమిటి లాగేజి బ్యాగుతో బయలుదేరావు ఎక్కడికి ? " అని అడిగాడు భర్త.
" నరకానికి " అని విసురుగా చెప్పింది సీతా.
" అయితే నిన్నునాకు తగిలించి అక్కడకు పోయిన నా అత్తమామలకు నా నమస్కారాలు
చెప్పు " అని వ్యంగ్యంగా అన్నాడు రామారావు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది సీతా.
బెడ్ రూములో ఉన్న భర్త, తన భార్యను " కాంచన....కాంచన...కాంచన...." అని
మూడుసార్లు పిలిచిన, కాంచన పలకపోవడంతో కంగారుగా హాల్లోకి వచ్చిచూస్తాడు.
కాంచన సోఫాలో కూర్చుని హాయిగా నవల చదువుతూ ఉంటుంది. " పిలిచినా
పలకకుండా అంత తీక్షణంగా చదువుతున్నావు ఏమిటే అది " అని కొంచం కోపంగా
అన్నాడు భర్త.
" అబ్బా....నన్ను కదిలించకండి...అసలే నేను " వర్షం కురిసిన రాత్రి " చదువుతున్నాను "
అని చెప్పి మళ్ళీ చదువుకోవడం మొదలు పెట్టింది ఆ భార్య.
" అదేగా నా కొంప ముంచింది " అని గబుక్కున అక్కడి నుండి పారిపోయాడు భర్త.
" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది ఆ భార్య.
|