లెక్క తప్పిన శిక్ష
లెక్క తప్పిన శిక్ష

టీచర్: చింటూ! నీకసలు Elephant అన్న పదం కూడా రాకపోతే ఎలాగ? నువ్వు ఇంగ్లీషులో బాగా వెనుకబడి ఉన్నావు. అందుకనే రేపు వచ్చేసరికి వందసార్లు Elephant అని రాసుకుని తీసుకురా!
మర్నాడు...
టీచర్: అదేంటి నేను నిన్ను వందసార్లు Elephant అని రాసుకుని రమ్మన్నాను కదా! నువ్వు ఇరవైసార్లే రాసుకుని వచ్చావేంటి?
చింటూ: అయ్యో అలాగా! నాకు ఇంగ్లీషే కాదు, లెక్కలు కూడా సరిగా రావనుకుంట. ఏమనుకోకండి టీచర్.



