Home » » పొందికైన వక్షోజాలు పొందేదెలా?1

పొందికైన వక్షోజాలు పొందేదెలా?1

సెక్స్ పరంగా స్త్రీలలో ఎక్కువ ఆకర్షణ ఉన్న అవయవాలలో మొదటివి వక్షోజాలే. వక్షోజాల తర్వాతే ముఖ, శరీరాకృతి, రంగు ఇలంటివన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. నిండా వక్షోజాలున్న స్త్రీలలో సెక్సప్పీల్ పెంచుతుంది. అందుకే సినిమా స్టార్స్, మోడల్స్ ఇతర విషయాలతో పాటు శరీరసౌష్టవం, తీరైన వక్షోజాల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

వక్షోజాలు చిన్నవిగా ఉన్న స్త్రీలలో కొంతమందికి ఆత్మన్యూనతాభావం పెరుగుతుండడం సహజమే. వక్షోజాల పరిమాణం మనిషి, మనిషికీ మారుతుంటుంది. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

వక్షోజాల ఆకృతిని, పరిమాణాన్ని మార్చుకునేందుకు ఎన్నో చికిత్సలు నేడు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇలాంటి చికిత్సలు చేయించుకోవాలనుకునేవారు ముందుగా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. వక్షోజాలొక్కటే సెక్సప్పీల్ పెంచవు. ప్రతి ఒక్కరిలో సెక్సప్పీల్ ఒక్కో విధంగా ఉంటుంది. కొందరికి కనుముక్కు తీరులో, కొందరికి శరీరాకృతిలో ఇలా విభిన్నంగా ఉంటుంది. ముందుగా తమలో సెక్సప్పీల్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఆ తర్వాతే శస్త్ర చికిత్సల జోలికి వెళ్ళాలి. కొన్ని రకాల ఇంజెక్షన్లు వక్షోజాల సైజును పెంచేందుకు వాడుతుంటారు. వీటివల్ల కొంతమేరకు ఉపయోగం ఉంటుంది. ఏ మందులనైనా వైద్యుల సలహాలేనిదే వాడడం అనర్థదాయకం కాబట్టి ఇటువంటి ఇంజక్షన్లు వాడే ముందు కూడా వైద్యులను సంప్రదించడం అవసరం. ప్రోగైనాన్ డిపో, ప్రోలుటాన్ డిపో వంటివి వాడుతుంటారు.

ఇవి వాడుతున్నప్పుడు కొన్ని రకాల క్రీమ్ లు కూడా అప్లై చేసుకోవడానికి ఉన్నాయి. ఇటువంటి మందులు వాడడం కంటే కొన్ని సహజ పద్ధతులు అనుసరించి చూడడం శ్రేయస్కరం. సహజ పద్ధతులు అంటే పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, కొవ్వు ఎక్కువగా ఉన్న నెయ్యి, నూనెలు వాడడం. దీనివల్ల శరీరంలో అదనంగా చేరే కొవ్వు వల్ల వక్షోజాల పరిమాణం కొద్దిగా మారే అవకాశం ఉంది. అలా మారిన తర్వాత కూడా మీరు అసంతృప్తితో బాధపడుతుంటే అప్పుడు వైద్యుడిని సంప్రదించండి. వైద్యులే మీకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు.

వక్షోజాల పరిమాణాన్ని పెంచేందుకు ఇంజక్షన్లు, మందులు కాకుండా మరికొన్ని మార్గాలున్నాయి. అవి ప్లాస్టిక్ సర్జరి, సిలికాన్ ఇంప్లాంట్స్ వంటివి. దీనివల్ల పరిమాణంలో మార్పు కనిపిస్తుంది. ఇదంతా ఖరీదైన వ్యవహారం. అందరికీ అందుబాటులో ఉండదు. ఖరీదుకు వెరవకుండా ఉంటే అపుడా విధానాలు అనుసరించవచ్చు.

google-banner