హలో... రాంగ్ నెంబర్.! - 60

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 60

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

డ్రైవ్ చేస్తూనే మోబిటెల్ చెవికి ఆనించుకొని "హలో..." అన్నాడు.

"హాయ్ శ్రీ...నేను షాలినిని" అటువైపు విపించింది.

"వస్తున్నాను" చెప్పాడు శ్రీకర్.

"మనీ డ్రా చేసారుగా..." అడిగింది అటువైపు నుంచి షాలిని. శ్రీకర్ కు ఒక్కసారిగా కోపం తన్నుకువచ్చింది.

షాలిని పదేపదే డబ్బు విషయం ప్రస్తావించడం అతనిని అసహానికి గురిచేసింది. మనసులో వున్న రొమాంటిక్ ఫీలింగ్ ఎప్పుడో ఆవిరైంది. సెక్స్ అంటే తనకు యిష్టమే. కానీ కేవలం డబ్బుతో మాత్రమే ముడిపడే సెక్స్ అంటే అతనికి అసహ్యం. కొద్దిగా ఎఫెక్షన్..కొద్దిగా యిష్టం..కొద్దిగా స్వార్థం..తనకు తానుగా డబ్బు దాయం చేయడం లేదు. నువ్వు డబ్బు యిచ్చేకే మన మధ్య 'ఎఫయిర్' మొదలవుతుంది...అన్నట్టు చెప్పే షాలిని తీరు అతనికి మింగుడు పడ్డం లేదు.

ఆ క్షణంలో అతనికి ప్రియంవద గుర్తొచ్చింది. ఇదే పరిస్థితిలో ప్రియంవద వుంటే, "అబ్బ..వెధవ డబ్బు తర్వాత డ్రా చేద్దురు" అంటూ తనని బెడ్ రూమ్ లో మంచానికి...ఊహూ..తనకే కట్టిపడేసుకునేది.

ఆ వూహ అతనికి కొత్త ఆనందాన్ని యిచ్చింది. అతనో నిర్ణయానికి వచ్చాడు.

*                 *              *

ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే అతడ్ని చుట్టుసుకుంది.

"ఓహ్..శ్రీ..యూ..ఆర్ లుకింగ్ స్మార్ట్. అబ్బ నీ బాడీ హీటర్ లా యింత వేడిగా వుందేమిటి" అంది అతని పెదవుల మీద, పాదాలపై లేచి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ. శ్రీకర్ సున్నితంగా ఆమెను విడిపించుకున్నాడు. షాలిని దానిని పెద్దగా పట్టిందుకున్నట్టు లేదు. అతని చేతిలో వున్న బ్రీఫ్కేస్ ని ఓపెన్ చేసి బ్యాంకులో నుంచి డ్రా చేసిన లక్ష రూపాయలు మంచం మీద పరిచాడు. వంద, యాభై రూపాయల బండిల్స్...

"అబ్బ..వెయ్యి రూపాయల బండిల్ అయితే బావుండేది. హ్యాండ్ బ్యాగ్ లో సరిపోయేది. పోనీలే, ఇలా ఎక్కువ బండిల్స్ చూస్తూంటే అదో ఆనందం" అంటూ ఆ డబ్బును టీపాయ్ మీద పెట్టి, బెడ్ మీద వెల్లకిలా పడుకుంటూ "కమాన్ శ్రీ" అంది రెండు చేతులూ చాపి అతడ్ని ఆహ్వానిస్తున్నట్టు.

శ్రీకర్ షాలిని వైపు చూసి చెప్పాడు "నేను వెళ్తాను షాలిని. అర్జంట్ అస్సయింట్ మెంట్ ఒకటుంది మరిచేపోయాను"

షాలిని శ్రీకర్ వంక చూసి "నిజ్జంగా అస్సయిన్ మెంట్ వుందా! నామీద కోపమా?" అడిగింది.

"నాకెవరి మీదా కోపం లేదు" అన్నాడు శ్రీకర్.

"పోనీ ఓ అరగంట. ఎట్ లీస్ట్ పదిహేను నిమిషాలు..." అంది షాలిని. ఆమె మాటల్లో అతనితో స్పెండ్ చేయాలనే ఫీలింగ్ కన్నా, అతను డిస్సపాయింట్ అయితే తనకు ఫ్యూచర్ లో 'నష్టం' అనే ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తోంది.

"సారీ షాలిని..వస్తాను. బై..గుడ్ బై" అన్నాడు బయటకు వెళ్తూ.

ఆ క్షణం ఆమెకు తెలియదు శ్రీకర్ ఇక ఎప్పుడూ తనకోసం రాడని.

'ఓ నిజం అనుభవంలోకి రావడానికి లక్షరూపాయలు తను నష్టపరిహారంగా చెల్లించవలసి వచ్చింది' అనుకున్నాడతను.

*           *             *

"మేడమ్...నేను జేమ్స్ బాండ్ ని. శ్రీకర్ గారు సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలో వున్న బ్యాక్ ఆఫ్ పంజాబ్ నుంచి లక్ష రూపాయలు డ్రా చేసారు. అక్కడ్నుంచి మిస్ సిటీ షాలిని యింటికీ వెళ్ళారు. లోపల ఓ ఇరవై నిమిషాలు వుండి వుంటారు. ఆ తర్వాత మీ యింటివైపే వస్తున్నారు. మళ్లీ నేను ఈవెనింగ్ ఫోన్ చేస్తాను" చెప్పి కట్ చేసాడు జేమ్స్ బాండ్.

ప్రియంవద మోబిటెల్ ఆఫ్ చేసి ఆలోచనలో పడింది. లక్షరూపాయలు...మిస్ షాలినికి ఎందుకు ఇచ్చినట్టు? ఈ విషయంలో భర్తని నిలదీయాలా? వద్దా? ఆమె ఎటూ తేల్చుకోలేకపోతోంది. అతని డబ్బు అతనిష్టం...కానీ  ఆ డబ్బు యిచ్చిన పర్పస్ ఏంటి?

తను షాలినితో తన భర్తకు సంబంధం వుందని నిరూపించడం ఎలా? తను గెలవాలి. తన గెలుపు ఖరీదు...తన కాపురం. ఆమె అలా ఆలోచిస్తూ వుండగానే కారు వచ్చిన శబ్దం వినిపించింది.

*                *             *