హలో... రాంగ్ నెంబర్.! - 54

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 54

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

షవర్ నుంచి జారిపడే నీటిధార ఆమె కన్నీటి ధారతో కలిసిపోయింది. అక్కడక్కడ తగిలిన దెబ్బల తాలూకూ బాధ గుండెలో రగులుకుంది. బాధతో బరువెక్కిన గుండె, ఘనీభవించిన విషాదాన్ని బద్దలు కొట్టింది. విషాదం కన్నీరైంది. జ్ఞాపకం చెమ్మగిల్లింది. గతం క్రీనీడ అయింది.

*       *               *

దుబాయ్.

లూసీ నిద్రపోతోంది. అర్థరాత్రి పన్నెండున్నర దాటింది. విన్నెంట్ తూలుకుంటూ వచ్చి లూసీ భుజం తట్టి లేపాడు. బద్ధకంగా కళ్ళు తెరిచిన లూసీ  విన్సెంట్ ని చూసి, నిద్రమత్తుని వదిలేసి లేచింది.

"వాట్ లూసీ డాళింగ్...నేను రాకముందే, ఎవరికైనా నీ బాడీని హ్యాండోవర్ చేసావా?" మంచం ముందు కూచుంటూ అన్నాడు.

"విన్సెంట్...?"

"యస్ మైడియర్ లూసీ డాళింగ్..అసలే టెంప్టింగ్ బాడీ...పైగా నేను అర్థరాత్రుళ్ళు వరకూ రాను. వయసులో వున్నావు. నేరురల్.క్వయిట్ నేచురల్. నో ప్రాబ్లెం"

"వి..న్సెం...ట్...దిజీజ్ టూ మచ్" మరింత కోపంగా అంది లూసీ.

"టూ మచ్చా? మరి ఆ శ్రీకర్ గాడు వచ్చినప్పుడు రాసుకొని పూసుకొని తిరిగావుగా. అదేన్నోమచ్? మరీ ఇన్నోసెంట్ కబుర్లు చెప్పకు. పైగా వాడితో డిసర్ట్ సఫారీకి కూడా వెళ్ళావుగా...ఆరోజు...ఆరోజేం చేసావు?"

"ఏం చేసాను?" అడిగింది లూసీ.

"ఓహ్..నీకు డిటైల్డ్ గా చెప్పాలి కదూ. వన్ సెకన్...వన్ సెకన్ ప్లీజ్" అంటూ తూలుతూనే వార్డ్ రోబ్ దగ్గరకి వెళ్లి ఓ కవర్ తీసుకు వచ్చి, లూసీ మీదికి గిరాటేసాడు.

కవర్ ఓపెన్ చేసి, లోపల వున్న ఫోటోలను చూసి షాకైంది. తనూ, శ్రీకర్ డ్యాన్స్ చేస్తోన్న ఫోటోలు, శ్రీకర్ తనను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించిన ఫోటోలు...అంటే ఆ రోజు విన్సెంట్ నియమించిన మనిషే ఈ ఫోటోలు తీసి వుంటాడు.

"హ..లో...వ్..ఏంటీ ఆలోచిస్తున్నావు. ఎలా కవర్ చేయాలా అని ఆలోచిస్తున్నావా? డోంట్ వర్రీ...అయినా తప్పేం వుంది. వాడితో ఆ అనుభవం ఎలా వుంది, చెప్పు...చెప్పు..." లూసీ ఎదురుగా నిలబడి అన్నాడు.

"విన్సెంట్..ప్లీజ్ డోంటాక్ నాన్సెన్స్...జస్ట్ ఆ రోజు తనతో డ్యాన్స్ చేయమన్నాడు...చేసాను..దట్సాల్.."

"దట్సాల్? వెరీగుడ్..అయినా వాడికి నువ్వంటే ఎంత ఇంట్రెస్ట్..వేరే వాళ్ళను పంపుతానన్నా వద్దన్నాడు. నీ టాలెంట్ అంతగా వాడికేం చూపించావు....టెల్..టెల్ మీ"

"విన్సెంట్...అతను మన బాస్...మనకు వుద్యోగం యిచ్చిన బాస్. అతనికి అసిస్టెంట్ గా వుండమని చెప్పి పంపించింది నువ్వు. ఇప్పుడిలా అనడం ఏం బావోలేదు"

"అచ్చా..వెరీగుడ్...కొన్ని రోజుల్లోనే నిన్ను బాగా అట్రాక్ట్ చేసాడన్నమాట"

"విన్సెంట్..విల్ యు ప్లీజ్ షట్ యువర్ మౌత్?" కోపాన్ని అణిచిపెట్టుకుంటూ అంది.

ఆ వెంటనే ఆమె చెంప చెళ్ళు మంది.

"యూ డర్టీ బిచ్..నాకే ఎదురు చెబుతున్నావా? నీకసలు విశ్వాసం వుందా? రోడ్డు మీద వున్న నిన్ను ప్యాలెస్ లోకి తీసుకువచ్చాను. బ్రెడ్ కూడా తినడానికి గతిలేని నిన్ను స్టార్ హోటల్స్ లో డిన్నర్ లు తినే స్థాయికి తీసుకువచ్చాను."

"అందుకే ...అందుకే నిన్ను భరిస్తున్నాను. మనసును చంపుకొని, నువ్వే చెప్పే ప్రతీ పనీ చేస్తున్నాను" అంది లూసీ.

"చేయకపోతే ఏం చేస్తావు?" అంటూ నడుముకు వున్న  బెల్ట్ తీసాడు. మరుక్షణం లూసీ కేక ఆ ప్లాట్ లో ప్రతిధ్వనించింది.

*          *        *

కార్పెట్ మీద అలానే పడుకుండిపోయింది లూసీ.

అర్థరాత్రి రెండు దాటింది. విన్సెంట్ బెల్ట్ తో కొట్టిన దెబ్బల తాలూకు బాధ ఆమె ఒంటిమీద వాతలుగా కనిపిస్తోంది. చలికి ఆమె శరీరం వణుకుతోంది. సాయంత్రం నుంచీ ఏమీ తినలేదు.

తనమీద తనకే అసహ్యం వేసింది. తన తప్పు ఏమీ లేకుండా తను ఈ బాధలు అనుభవించడం ఏమిటి? తనకు స్వేచ్ఛ లేదు. తనకు మనసులేదు...తనకు వ్యక్తిత్వం లేదా? విన్సెంట్ బెడ్ మీద అడ్డంగా పడుకుండిపోయేడు. లూసీమీద రాక్షసత్వాన్ని చూపించి నిద్రలోకి జారుకున్నాడు. సడన్ గా అతనికి మెలుకువ వచ్చింది. కార్పెట్ మీద ముడుచుకుపడుకున్న లూసీని గమనించాడు. చలికి అతని శరీరం వణుకుతోంది. అతనిలో కోరిక రగులుతోంది.

మెల్లిగా లేచి లూసీ దగ్గరకు వచ్చాడు. లూసీని తన వైపు తిప్పుకున్నాడు. అతని నోట్లో నుంచి ఆల్కహాల్ వాసన గుప్పుమంటోంది. అతని స్పర్శ ఆమెకు కంపరం కలిగిస్తోంది. జుగుప్పని కలిగిస్తోంది.

"వదులు విన్సెంట్...ప్లీజ్" అంది లూసీ అతని పట్టు విడిపించుకునే ప్రయత్నం చేస్తూ.

"లూసీ...బెట్టు చేయకు..కమాన్"

"విన్సెంట్..ప్లీజ్..."

"దగ్గరికి వస్తూంటే బెట్టు చేస్తావేంటి..." ఆమెను ఒడిసి పట్టుకున్నాడు.

లూసీ అతన్ని విదిల్చికొట్టింది. తాగి వుండడం వల్ల విన్సెంట్ వెనక్కి పడిపోయాడు. ఆమె తిరస్కారం అతనిలో అహాన్ని రెచ్చగొట్టింది. కోపంగా లూసీ గొంతు పట్టుకున్నాడు. లూసీలో సహనం నశించింది. రోజులు..నెలలు...సంవత్సరాలుగా అతన్ని భరిస్తూ వచ్చింది. అతని చేతలను, చేష్టలను, అతను చేసే అవమానాలను భరిస్తూ వచ్చింది. ఆ సహనం భ్రళ్ళున బ్రద్ధలైంది.

తన శక్తినంతా కూడదీసుకొని, విన్సెంట్ ని బలంగా వెనక్కి నెట్టేసింది.

"యూ...బిచ్..ఎంత పొగరే..నేను తలుచుకుంటే నిన్ను బ్రోతల్ గా మార్చి, నీ లైఫ్ ని స్పాయిల్ చేయగలను తెలుసా"

"ఛీ...నువ్వు నన్ను ఓ బ్రోతల్ గానే నీ బిజినెస్ కు ఉపయోగించుకున్నావు. ఒకప్పుడు ఆకలితో అలమటిస్తోన్న నాకు షెల్టర్ ఇచ్చావన్న ఇలే ఒక కృతజ్ఞతతో నువ్వు చెప్పిన ప్రతీ పనీ చేసాను. విన్సెంట్! దయచేసి నా సహనాన్ని పరీక్షించకు అంది పళ్ల బిగవున బాధను భరిస్తూ.

విన్సెంట్ లూసీ మెడ పట్టుకొని ప్లాట్ బయటకు తీసుకువెళ్ళి చెప్పాడు.

"సహించకపోతే ఏం చేస్తావు? ఈ దుబాయ్ లో నా అండ లేకపోతే ఎలా బ్రతుకుతావో చూస్తాను. రేపట్నుంచి బెగ్గింగ్ చేసైనా లేదా బ్రోతల్ గా అయినా బ్రతకాల్సిందే. ఈ రాత్రంతా రోడ్డు మీద నిలబడి ఆలోచించుకో" అంటూ తలుపు దఢాలున వేసేశాడు.

*          *         *