హలో... రాంగ్ నెంబర్.! - 47

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 47

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"నువ్వింతగా ఫీలవుతున్నావు కాబట్టి...రోజుకు ఓన్లీ టచ్చింగు మాత్రమే..."

"అదేం కుదర్దు...సంవత్సరం పాటు నేను పెళ్ళయిన బ్రహ్మచారిణి, మీరు పెళ్ళయిన బ్రహ్మచారే..."

"పోనీ...వారంలో ఓసారి బ్రహ్మచారులమనే విషయం మరిచిపోదాం..."

"నథింగ్ డూయింగ్..."

"సరే, ఈ పందెం నెక్స్ ట్ వీక్ మొదలెడదామా?"

"నథింగ్...ఇప్పుడే...ఈ క్షణమే...మన మధ్య పందెం ప్రారంభం...అమ్మాయిలంటే మీకెంత మాత్రం వీక్నెస్ లేదని, తలుచుకుంటే నిగ్రహంగా విగ్రహంలా వుండగలరని ప్రూవ్ చేసుకోండి. అమ్మాయిలతో కనిపించారో అంతే సంగతులు"

శ్రీకర్ ఒక్కక్షణం ఆలోచనలో పడ్డాడు. సాయంత్రమే షాలిని బెడ్ రూమ్ లోకి ఆహ్వానించింది. తనే మూడ్ బాగోలేదని, రేపైతే బెటరని అన్నాడు. సాయంత్రమే కమిటైనా బావుండేది.

"ఏంటీ ... ఆలోచిస్తున్నారా?"

"ఛ..ఛ..అదేం లేదు. పందెం రేప్పొద్దున్న ప్రారంభిద్ధామా...అని" అన్నాడు.

ప్రియంవద శ్రీకర్ వంకే చూస్తోంది.

"ఏమిటే అలా చూస్తున్నావు" అడిగాడు శ్రీకర్." మీ చూపుల్లో నాకు డిఫరెంట్ మీనింగ్ కనిపిస్తూంది" అంది ప్రియంవద.

"నీకు అనుమానం ఫోభియా పట్టుకుంది. సర్లే..ఇంతకీ మన పందెం ఇప్పుడే ప్రారంభమైందంటావు. కనీసం రేపొద్దున్న వరకూ పొడిగించే అవకాశం కూడా లేదన్తావ్" క్రీగంట ఆమెను చూస్తూ అన్నాడు.

"నో ఛాయిస్...ఈ డిజిటల్ వాయిస్ రికార్డ్ర్ మన సంభాషణ అంతా టేప్ అయింది. ఇదే మన మధ్యసాక్షి" అంది ప్రియంవద.

"అవునవును. నేరకపోయి కొనుక్కొచ్చాను' మనసులో అనుకున్నాడు శ్రీకర్.

ప్రియంవద రికార్డింగ్ బటన్ ఆఫ్ చేసి, దాన్ని వాడ్రోబ్ చివర అరలోవున్న సొరుగులో పెట్టి, తాళం వేసి, తాళం చెవిని తన తలదిండు కింద పెట్టింది.

భార్య వంకే చూస్తుండిపోయాడు శ్రీకర్. తమ సంభాషణ అలా మొదలై, ఇలా పందెంతో ముగుస్తుందని అనుకోలేదు.

ప్రియంవద అటువైపు తిరిగి అనుకుంది. సెప్టెంబర్ 1 సరిగ్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలింది. మరి తన కాపురం..దేవుడా...నేనే గెలిచి, ఆయన ఓడిపోయి, ఆయన నిగ్రహాన్ని చెడగొట్టి, జీవితాంతం మరో అమ్మాయి వంక తిరగకుండా చూడు మొక్కుకుంది.

సరిగ్గా శ్రీకర్ కూడా...'దేవుడా..నేను గెలిచి, జీవితాంతం అమ్మాయిలతో ఎంజాయ్ చేసేలా, ఇప్పుడు నాకు నిగ్రహాన్ని యిచ్చి, జీవితాంతం కులాసా పురుషుడిగా తిరిగేలా దీవించుస్వామీ' అని క్వయిట్ ఎగైనిస్ట్ గా వేడుకున్నాడు.

*               *             *

అర్థరాత్రి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు శ్రీకర్. ప్రియంవద పక్కనే పడుకొని వుంది. రెండు చేతులూ తల వెనగ్గా పెట్టుకుని పడుకుని వుంది. శ్రీకర్ కు భార్య ఎప్పుడూ అందంగానే కనిపిస్తుంది. అంతకన్నా అతనికి భార్యలో నచ్చే విషయం ఒకటుంది.

ఎప్పుడు తను దగ్గరకు తీసుకున్నా, అయస్కాంతంలా తనని అతుక్కుపోతుంది. తన గుండెలో ఒదిగిపోతుంది. బెట్టు చేయడం, ఎక్స్ ప్లాయిట్ చేయడం తెలియదు. 'ఆ విషయంలో' తననెప్పుడూ డిస్సపాయింట్ చేయలేదు.

రాత్రంతా అలానే ఆలోచిస్తూ పడుకున్నట్టు వుంది. కళ్ళజోడు తీయడం మరిచిపోయింది. మెల్లిగా కళ్ళజోడు తీసి పక్కన పెట్టి ఆమె కళ్ళ మీద మీద ముద్దు పెట్టుకున్నాడు.

ప్రియంవదకి మెలుకవ వచ్చి, కళ్ళు తెరిచింది. భర్త పెదవుల తాలూకు స్పర్శను అనుభూతితీస్తూ...మళ్ళీ కళ్ళు మూసుకుంది. శ్రీకర్ ఆమె బుగ్గల మీద, తర్వాత పెదవుల మీద ముద్దుపెట్టుకున్నాడు. తన రెండు చేతులను భర్త నడుం చుట్టూ వేసింది. శ్రీకర్ ఆమె కంఠం మీదుగా కిందికి వచ్చాడు.

సరిగ్గా అప్పుడే..ప్రియంవద రియాక్షన్ మానేసి, యాక్షన్ లోకి దిగింది. శ్రీకర్ ని వెనక్కితోసింది మంచం మీది నుంచి కిందికి పడేలా...

"చచ్చాను..." శ్రీకర్ అరిచాడు.