Home » Hello Wrong Number » హలో... రాంగ్ నెంబర్.! - 35

హలో... రాంగ్ నెంబర్.! - 35

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 35

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

సడెన్ బ్రేకుతో కారాగింది.

"ఏమైంది.." కారు వెనక సీటులో కూచున్న 'మిస్ సిటీ' షాలిని అడిగింది. సరిగ్గా అరగంట క్రితమే ఆడిటోరియంలో 'మిస్ సిటీ' కిరీటాన్ని ఆమె తలమీద అలంకరించారు.

ఇరవై సంవత్సరాల షాలిని...రెండేళ్లు తగ్గినట్టు కనిపిస్తుంది.

మిస్ ఇండియాకు వెళ్లే ప్రయత్నంలో ఆమెకు తగిలిన మొట్టమొదటి అవకాశం 'మిస్ సిటీ' టైటిల్. తెలివి, అందం, లౌక్యం....మూడూ పుష్కలంగా వున్న షాలిని తను మిస్ ఇండియాకు వెళ్లాలన్నా, మిస్ యూనివర్స్ అవాలన్నా తనకో మంచి స్పాన్సర్ కావాలి. ఫైనాన్సియల్ సపోర్టు కావాలి.

ఆమెకు ఎవర్ని ఎలా క్యాష్ చేసుకోవాలో తెలుసు. ఆమె నవ్వితే పలువరస, ఒళ్లు విరుచుకుంటే మెనిచాయ తళుక్కున మెరుస్తాయి.

"చిన్న ప్రాబ్లెమ్ మేడమ్..." కారు బాయ్ నెట్ ఓపెన్ చేసి చూసి చెప్పాడు డ్రైవర్.

"ముందు చెక్ చేసుకోవద్దూ." అంటూ కారు దిగి బయటకు వచ్చి నిలబడింది. ఆ కొద్దిపాటి ఎండేతట్టుకోలేనట్టు విలవిల్లాడింది.

"మేడమ్...ఆటోని పిలవమంటారా?" అడిగాడు డ్రైవర్.

కోపంగా డ్రైవర్ వంక చూసింది. డ్రైవర్ కు తను చేసిన తప్పేమిటో అర్థమైంది. కారురేంజ్....అదీ కనీసం హోండాసిటీ కారు రేంజ్ వుండాలి.

"టాక్సీని పిలవనా మేడమ్.." భయపడుతూనే అడిగాడు.

మళ్ళీ కోపంగా చూసింది.

"సారీ మేడమ్....ఈ దారిలో వెళ్లే హోండాసిటీ కారును ఆపాలా?" అడిగాడు డ్రైవర్.

"ఏదో ఒకటి చెయ్" అంటూ రోడ్డు వైపు దృష్టి సారించింది.

*                  *                 *

హోండాసిటీ కారు రోడ్డు మీద గాలిలో తెలుతున్నట్టు వెళ్తోంది.

అతనికెందుకో లూసీ గుర్తొచ్చింది. కారు మాగ్జిమమ్ స్పీడులో వెళ్తోంది. అతని దృష్టి ఎడమవైపు ఆగి వున్న కారు మీద పడింది. వేగంగా వెళ్తోన్న కారును సడెన్ బ్రేకుతో ఆపాడు. రివర్స్ తీసుకుని, వెనక్కి వచ్చాడు.

కారు మీద చేయివేసి స్టయిల్ గా నిలబడి వుందా అమ్మాయి. ఆమెనెక్కడో చూసినట్టు అనిపించింది. హోండాసిటీ కారు తమ కారు పక్కన ఆగడంతోనే డ్రైవర్ పరుగెత్తుకొచ్చి శ్రీకర్ తో చెప్పాడు.

"మా మేడమ్ కు లిఫ్ట్ ఇస్తారా సార్...ప్లీజ్"

"మీ మేడమ్ పేరేమిటో?" అన్నాడు శ్రీకర్.

"షాలిని...మిస్ సిటీ సార్"

అప్పుడు గుర్తొచ్చింది శ్రీకర్ కు. ఆరోజు ఉదయమే పేపర్లో ఆ వార్త చదివినట్టు.

సరిగ్గా అప్పుడే ప్రియంవద ఎక్కిన ఆటో అటువైపే వస్తోంది.

వాట్ నెక్స్ ట్

google-banner