హలో... రాంగ్ నెంబర్.! - 10

Get latest telugu famous comedy serials, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 10

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"ఏవండీ! నిజంగా నాకు అన్యాయం చేయడం లేదా?"

"అబ్బా...అయినా నాలాంటి సిన్సియర్ ఫెలోని పట్టుకొని నీకెలా అలా అనాలనిపిస్తుంది."

"నా దగ్గర అలాంటి కథలు చెప్పకండి. నిజంగా చెన్నయ్ లో దిగి పని చూసుకొని వస్తున్నారా? లేక ఇక్కడే ఏ అమ్మాయితోనే..."

"ప్రియా...ఇప్పుడా అప్రియం మాటలెందుకు? నాకెంతమంది అమ్మాయిలూ తెలిసినా, ఎవరితో ఏ పని వున్నా...అదంతా జస్ట్ ఫర్ టైం పాస్. నువ్వు...నువ్వు కాదు...యూ ఆర్ మై లవ్...యూ ఆర్ మై లైఫ్..." అంటూ ప్రియంవదను తన మీదకి లాక్కున్నాడు.

సరిగ్గా అప్పుడే సెల్ ఫోన్ రింగయింది.

డిస్ ప్లేలో ఆ నెంబర్ చూసి...

"ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టుందే..." స్వగతంగా అనుకున్నాడు.

"బహుశా ఏ అమ్మాయిదో అయివుంటుంది" కోపంగా అంది ప్రియంవద.

"కాదు. బాగా తెలిసిన నెంబర్. ఎవరిదబ్బా..." అంటూ ఓ.కె. బటన్ ప్రెస్ చేశాడు.

"ఎస్...హు ఈజ్ ఆన్ ది లైన్" స్టయిల్ గా అడిగాడు.

"నీ కొడుకు ఆన్ ద లైన్" అటు వైపు నుంచి స్టీరియోఫోనిక్ సౌండ్ లో వినిపించింది.

"ఒరే...బబ్లూ...నువ్వా...ఎక్కడ్నుంచి..."

"ఓ సారి డోర్ దగ్గరకి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడు...ఇక్కడే మీ బెడ్రూం ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నాను...."

"మై స్వీట్ చైల్డ్..నువ్విలా మాట్లాడుతుంటే ఎంత ముద్దొస్తున్నావురా..."

"డోర్ తీసి నాకోసం ఏం తెచ్చావో తీసుకురా. ఇంకా ముద్దొస్తాను."

"నీ కోసం నేనేం తెచ్చానో గెస్ చెయ్..."

ప్రియంవద సెల్ ఫోన్ మొగుడి దగ్గర్నుంచి లాక్కొని కాల్ డిస్ కనెక్ట్ చేస్తూ...

"ఈమాత్రం అరుపుకి ఫోన్ ఆఫ్ చేసినా వినిపిస్తుంది. అయినా నాలుగడుగుల దూరం లేదు...ఫోన్ లో ఈ ముచ్చట్లేమిటి...వెళ్ళి తలుపు తీయండి" అంది.

బబ్లూ కోసం కొన్న ప్లేస్టేషన్స్ ప్యాక్ విప్పగానే, పక్క ప్యాక్ లో వున్న డిజిటల్ వాయిస్ రికార్డర్ ప్యాక్ కనిపించింది. అతనికి లూసీ గుర్తొచ్చింది.

ఆమె మొహంలో కనిపించే ఆకర్షణతో పాటు మిస్టరీ గుర్తొచ్చింది.

- అప్పుడు...?