సరికొత్త కామెడీ కవితలు
సరికొత్త కామెడీ కవితలు
.jpg)
ప్రతి శుక్రవారం '' తెలుగు కామెడీ కవితలు '' అంటూ స్పెషల్ గా మిమ్ముల్ని నవ్విస్తున్న
ఈ శీర్షిక ఈ వారం కూడా మరిన్ని సరికొత్త కామెడీ కవితలతో నవ్వించడానికి రెడీ అయి
వచ్చింది. మరి ఆలస్యం ఎందుకు మన తెలుగు కామెడీ కవితలు అంటూ చదువుకొని
హాయిగా నవ్వుకోండి. ఈ శీర్షిక మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయగలరు.
రాహుల్ ద్రావిడ్ ఆడతాడు డిఫెన్స్
నా కవితల్లో ఉంది మంచి సెన్స్
బండి నడపాలంటే కావాలి లైసెన్స్
నాతో ఉండి పెంచుకోండి కాన్పిడెన్స్
ఇదంతా నాన్సెన్స్
నీకు తక్కువ కామన్ సెన్స్
నన్ను కాలేజీలో అదోల చూసింది గీత
ఆమె వయస్సు ఎప్పుడూ లేత
దాంతో నన్ను ఎప్పుడూ కొస్తుంది గుండెకోత
ఆగలేక రాసాను నేను ఓ కవిత
అది చూశాడు మా తాత
ఓరేయ్ నువ్వు ఇలాగే ఎప్పటికీ ఉండే పీత
ఇక మారదు నీ తలరాత
నీకు పెడతాను వాత
బాలయ్య కొడతాడు డైలాగ్ తొడకొట్టి
చేస్తాను ప్రయోగాలు కొత్తకొత్తవి కనిపెట్టి
మీ అభిమానం పొందాను
నా తెలివితేటలతో మిముల్ని పడగొట్టి
మీరు బాగుపడుతున్నారు నాతో ఉండబట్టి
నీ బ్రేయిన్ ఒక బంకమట్టి
ఇలాగే చేప్తే తోస్తాను మెడబట్టి



