Brahmi Birthday Special Jokes
Brahmi Birthday Special Joke

స్క్రీన్ మీద కనిపిస్తే చాలు
అటు చిన్నపిల్లల నుండి ఇటు పెద్దవాళ్ళ వరకు అందరిని కడుపుబ్బ నవ్వించే కామెడీ
కింగ్ ఎవరు అని ఎవరిని అడిగిన...వాళ్ళ నాలుక టక్కున పలికే పేరు ఇంకెవరు మన
బ్రహ్మానందమే అని ! మరి అది నిజమే కదా ! ఆయనను చూస్తే మనకు తెలియకుండానే
నవ్వు పెదాల మీద విరబూస్తుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పుట్టిన మన
బ్రహ్మానందం గారు సినిమాలలోకి రాకముందు తెలుగు లెక్చరర్ గా పశ్చిమగోదావరి
జిల్లాలోని అత్తిలిలో పనిచేశారు. అలా పనిచేస్తున్న సమయంలోనే కామెడీ చిత్రాల
దర్శకుడు జంధ్యాల గారు ఆహా నా పెళ్ళాంటా చిత్రం ద్వారా బ్రహ్మానందం గారిని
కామెడియన్ గా తెలుగు తెరకు పరిచయం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు భాష
బేదం లేకుండా అందరిని మనసారా నవ్విస్తూనే ఉన్నారు. మరి ఈ రోజు ఆ నవ్వుల
రారాజు పుట్టినరోజు కాబట్టి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ...హీరోలు
డైరెక్టర్లు చెప్పిన డైలాగులకు సరదాగా నవ్వుతూ కామెంట్ డైలాగులు చేసి నవ్వించిన
కొన్ని బ్రహ్మి కామెంట్ జోక్స్ చూసి మనం మనసారా ఆనందంగా నవ్వుకుందాం.
.png)
.png)
.png)
.png)



