Rating:             Avg Rating:       780 Ratings (Avg 3.01)

మై డియర్ రోమియో - 49

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 49

 

స్వప్న కంఠంనేని

 

హనిత మాటలు ప్రిన్సిపాల్ ని హంట్ చేస్తున్నాయి.
ఇంటికెళ్ళినా, పడుకున్నా,టీవీ చూస్తున్నా ఆమె మాటలే అతడ్ని వెంటాడుతున్నాయి.
సడెన్ గా భార్యను అడిగాడు.
"సిన్సియర్ గా నాకో సంగతి చెప్పు. నేనంటే నీకు ఇష్టమేనా? నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా?''
"ఏమిటండీ మీరు మరీనూ? మిమ్మల్ని ప్రేమించడమా? నేనా? ఇన్నేళ్ళ సంసారంలో మీరు నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా? నేనంతటి వ్యక్తిత్వం లేని స్త్రీని కాదండీ'' సిగ్గుపడుతూ చెప్పిందావిడ.
ప్రిన్సిపాల్ కి భార్య అన్న మాటలు అర్థం కాక బుర్ర గోక్కున్నాడు.
కాసేపయ్యాక ఆమె "భోజనం వడ్డించాను రండి'' అంది.అప్పుడే సడెన్ గా అతనికి ఆమె అంతకుముందన్న మాటలకు అర్థం ఫ్లాష్ అయింది.
ఆరోజు నుంచీ ప్రిన్సిపాల్ పిల్లిలా, పావురయిలా, పురుగులా, పనికిమాలిన వాడుగా అణిగిమణిగి ఒదిగి ఒదిగి భయంభయంగా బిక్కుబిక్కుమంటూ బతకసాగాడు. ఇంట్లోనే కాదు బయట కూడా.
హనిత, వైభవ్ ల సంగతి హనిత ఇంట్లో తెలిసిపోయింది.
హనితకి బాగా చీవాట్లు పడ్డాయి.
హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి.
"ఐ లవ్ వైభవ్'' అని ఖచ్చితంగా సమాధానమిస్తున్న హనితను ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు.
"ఇదొక మొండిది. పైగా చిన్నపిల్ల. అసలు దీన్నని లాభంలేదు. ఇదంతా వాడె నేర్పాడు. వాదిసంగతి చూసుకుందాము'' పెద్దవాళ్ళకు సర్దిచెప్పాడు హనిత పెద్దన్నయ్య హరీష్.
హనిత అన్నలు కాలేజీ గూండా విక్రమ్ కి డబ్బిచ్చి వైభవ్ మీదకి ఉసిగోల్పారు.
విక్రమ్, వైభవ్ తో ఏదో ఒక గొడవ పెట్టుకోవడానికి చూడసాగాడు.
ఒకరోజు వైభవ్ లైబ్రరీలో ఒంటరిగా కూర్చుని బుక్ చదువుతూ కనిపించాడు.వెళ్ళి పక్కనే కూర్చున్నాడు విక్రమ్.
"నువ్వు మొన్న హరిణికి కన్ను కొట్టావంట. ఏంటి సంగతి?''
వైభవ్ ఉలిక్కిపడ్డాడు.
విక్రమ్ మళ్ళీ రిపీట్ చేసాడు.
"హరిణి తప్ప లోకంలో ఇంకే ఆడపిల్లా లేదనుకుంటున్నావా?మగవాళ్ళంతా హరిణి వెంటే పడతారనుకుంతున్నావా?'' విసుగ్గా అన్నాడు వైభవ్.
విక్రమ్ గొడవ పెట్టుకోవడానికి అదే అదుననుకున్నాడుఉద్వేగంగా లేచాడు.
"నువ్వు నా హరిణిని తిదతావా?'' ఆవేశంతో ఊగిపోసాగాడు.
"వెరీ ఫన్నీ. నేను హరిణిని తిట్టడమేమిటి? నాకసలు ఆమె ఎవరో కూడా తెలీదు'' జోక్ కింద కొట్టిపారేయబోయాడు వైభవ్.
వైభవ్ కాలర్ పట్టుకున్నాడు విక్రమ్.
విక్రమ్ తనతో కావాలనే గొడవ పెట్టుకుంటున్నాడని అతనికి అప్పటికింకా అర్థం కాలేదు.
"హేయ్, ఏంటి నువ్వు? అనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేస్తున్నావు?'' ఆశ్చర్యపోతూ కాలర్ విదుల్చుకున్నాడు వైభవ్.
ఈలోగా గొడవ వినిపించిన స్టూడెంట్స్ లైబ్రరీలోకి వచ్చి వింతగా చూడసాగారు.
అందరూ వైభవ్ పని అయిపోయిందనుకున్నారు. కొందరు అతని ఆత్మశాంతికి దేవుడ్ని ప్రార్థించసాగారు.
ఇంతలో లైబ్రరీ మేడమ్ వాళ్ళ దగ్గరికి వస్తూ కనిపించింది.
ఆవిడ రావడం చూడగానే వైభవ్, విక్రమ్ లు గబగబా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
"ఏమిటి? వాట్ ఈజ్ గోయింగ్ అన్ యియర్?''అడిగిందావిడ.
"అవున్రా! చిన్నప్పుడు గాలొస్తే ఎగిరిపోయేలా వుండేవాడివి. పిల్లికి కూడా భయపడేవాడివి. ఇప్పుడిలా ఫోజు కొడుతున్నావేమిట్రా వెధవా'' అంటూ విక్రమ్ వీపు మీద గట్టిగా చరిచాడు వైభవ్.
"చంపేస్తాన్రా వైభవ్ నిన్ను. అతి చనువు తీసుకున్తున్నావు'' మనసులో తిట్టుకుంటూనే విక్రమ్ పాకి మాత్రం 'హిహిహి'' అంటూ వెర్రి నవ్వు నవ్వాడు.
"వాళ్ళేదో చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటున్న ఆనందంతో వున్నారు. మీరెందుకయ్యా ఇక్కడ? వెళ్ళండి'' చుట్టూ మూగిన స్టూడెంట్స్ ని తరిమేసింది లైబ్రరీ మేడమ్.
"ఒరేయ్ వైభవ్! మనం లైబ్రరీలో అనవసరంగా గోల చేస్తున్నాము. అలా చేయకుండా పదరా, బయటికి పోదాము'' వైభవ్ భుజాలు పట్టుకుని అన్నాడు విక్రమ్.
"మరదే. నేనా మాట ముందే చెప్పాను కదరా ఇడియట్. నువ్వే ఇక్కడ గోల మొదలుపెట్టావు. బయటికి నడవరా చౌపట్'' చిరునవ్వు నవ్వుతూ పెద్దగా అన్నాడు వైభవ్.
వైభవ్, విక్రమ్ లు చెట్టాపట్టాలేసుకుంటూ బయటికి నడిచారు.
కాలేజీ వెనుక వేపుకి చేరుకున్నారు వాళ్ళు. ఈ రసవత్తరమైన సీన్ ని చూడడానికి లైబ్రరీ మేడమ్ తరిమేసినా లైబ్రరీ బయటే పొంచి వున్న స్టూడెంట్స్ వాళ్ళను వెంబడించారు.
అక్కడైతే  ఎవరూ చూడరనుకాగానే విక్రమ్ గభాల్న వైభవ్ కాలర్ పట్టుకున్నాడు.
అంతే, ఎప్పుడూ ప్రశాంతంగా వుండే వైభవ్ మొహం రౌద్రంగా మారింది. తన ప్రతాపాన్ని చూపెట్టాలనుకున్నాడు.
తన ఒక్క చేతితోనే విక్రమ్ ని ముందుకు కదలనివ్వకుండా ఆపాడు. విక్రమ్ గింజుకున్నాడు. కానీ వైభవ్ చేతిని కష్ట కూడా కదల్చలేకపోయాడు.
సడెన్ గా వైభవ్ ఒక సైడ్ కిక్ ఇచ్చాడు. వెంట్రుకవాసిలొ కత్తిలా బిగుసుకున్న అతని పాదం విక్రమ్ కణతల పక్కనుంచి దూసుకుపోయింది.
"నేను మార్షల్ ఆర్ట్స్ రోజూ ప్రాక్టీస్ చేస్తుంటాను తెలుసా? నేనిప్పుడు ఇచ్చిన సైడ్ కిక్ చాలా పవర్ ఫుల్ కిక్. నేను కావాలనే నీకా కిక్ తగలకుండా చూసాను. ఇంకెప్పుడూ నా జోలికి రాకు'' చెప్పి మళ్ళీ ఎప్పటిలాగే ప్రశాంతంగా మారి అక్కడినుంచి వెళ్ళిపోయాడు వైభవ్.
విక్రమ్ తో పాటు అక్కడున్న వాల్లతా సంభ్రమంగా అతన్నే చూస్తుండిపోయారు.