Mr Pellikoduku Sunil Comedy
Mr Pellikoduku Sunil Comedy
.png)
ఈ రోజు మనముందుకి మిస్టర్ పెళ్లికొడుకుగా వచ్చిన సునీల్, ఇంతకుముందు
కామెడియన్ చాలా సినిమాల్లో కామెడీ చేసి మనల్ని బాగా కడుపుబ్బ నవ్వించాడు.
ఎప్పుడైతే సునీల్ హీరోగా తెర మీద కనిపించాడో అప్పటి నుండి కామెడీ అభిమానుల
హృదయాల్లో " ఇంతకాలం చక్కని కామెడీ చేసి మనల్ని మనసారా నవ్వించిన మన
సునీల్, ఇక హీరోగా సెటిల్ అయితే ఎలా ? మనం మళ్ళీ సునిల్ కామెడీని ఎంజాయ్
చేయలేము కదా " అనే చిన్న అలజడి మొదలయింది.
అది సునీల్ గమనించలేదని తన కామెడీ అభిమానులు అనుకున్నారు. కానీ అది నిజం
కాకపోవచ్చునేమోనని మనకు సునీల్ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. బహుశ
సునీల్ తన కామెడీ అభిమానుల హృదయాల్లో మొదలయిన చిన్నఅలజడిని గమనించి
ఆ నవ్వించేదేదో హీరోగానే చేస్తూ నవ్విస్తే ఎలా ఉంటుందని ఆలోచించినట్టున్నాడు.
అందుకే కాబోలు తను హీరోగా చేసిన అందులో హీరో ఇమేజ్ తో కూడిన కామెడీ చేస్తూ
తన కామెడీ అభిమానులను నవ్విస్తూనే ఉన్నాడు. మిస్టర్ పెళ్ళికొడుకైనా సునీల్ ఇప్పటి
వరకు నటించి నవ్వించిన కొన్ని కామెడీ సీన్స్ ని మిస్టర్ పెళ్ళికొడుకు కామెడీ గా
అందిస్తుంది మీ తెలుగువన్.కామ్/కామెడీ ఇది సునీల్ కామెడీ అభిమానులకు మాత్రమే.



