మత బోధకుడు కావాలనుకుంటున్నాడు
.png)
మత బోధకుడు కావాలనుకుంటున్నాడు
ఆస్తికురాలైన ఒక అమ్మాయి నాస్తికుడైన ఒక అబ్బాయి ప్రేమలో పడ్డారు.
కానీ మతపరమైన వారి అభిప్రాయాలు వేరుగ ఉండిపోయాయి.
తన కూతురుకు సలహా ఇస్తూ తల్లి అబ్బాయికి మతంలో ఉన్న అందాన్నీ, ఆనందాన్నీ గురించి నచ్చజెప్పమంది.
ఆ అమ్మాయి అక్షరాలా అలానే చెసింది. అబ్బాయికి అమ్మాయి బాగా బోధన చేయడంతో వారిద్దరి పెండ్లి తారీఖు ఖరారు చేయబడింది.
కానీ పెండ్లి జరగాల్సిన తారీఖు ముందు రోజు అమ్మాయి ఏడుస్తూ ఇల్లు చేరి దీర్ఘాలు తీస్తూ పెండ్లి జరగడం లేదు అంది.
"ఎందుకని? నీవి అతడికి మతన్ని గురించి బోధించావు కదా? అని తల్లి అంది.''
నేను కొంత ఎక్కువగా బోధించాననుకుంటున్నాను. ప్రస్తుతం ఆ అబ్బాయి మత బోధకుడు కావాలనుకుంటున్నాడు అని కూతురు తల్లితో చెప్పింది.



