Home

»

Latest News

Dhurandhar 2: ధురంధర్ 2 పై వెట్రిమారన్ కామెంట్స్!..ప్రాణాలు కోల్పోయిన వారిని చూసారా!

Mar 31, 2026

 

 

-ఇండియా వైడ్ గా క్రేజ్ ని కంటిన్యూ చేస్తున్న ధురంధర్ 2 
-నిన్న నీలిర మూవీ ఈవెంట్ లో వెట్రి మారన్ కీలక వ్యాఖ్యలు 
-ఖచ్చితంగా ధురంధర్ 2 గురించే 
-ఇంతకీ ఆ మాటలేంటి!


సినిమా రిలీజై రెండు వారాలు దాటినా సోమవారం నాడు సెకండ్ సెకండ్ షో ఫుల్ అవ్వాలంటే ప్రస్తుత స్క్రాప్, పైరసీ వరల్డ్ లో సినిమాతో పాటు ఎంతో మంది రాత బాగుండాలి. ఆ రాత బాగుందని 'ధురంధర్ 2'(Dhurandhar 2)టీం నిరూపించింది. ఇండియా వైడ్ గా నిన్న చాలా ఏరియాస్ లోని సెకండ్ షోస్ ఇదే పరిస్థితి. దీన్ని బట్టి ధురంధర్ 2 ప్రేక్షకుల నీరాజనాలు ఏ విధంగా అందుకుంటుందో అర్ధం చేసుకోవచ్చు. కానీ రీసెంట్ గా విభిన్న చిత్రాల దర్శకుడు 'వెట్రిమారన్'(Vetrimaaran)ధురంధర్ 2 పేరు ఎత్తకుండానే ఇటీవల రిలీజైన ఒక మూవీ అంటు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమలో హీట్ ని రాజేస్తున్నాయి. మరి ఈ న్యూస్ ఏంటో చూద్దాం 


ఏప్రిల్ 3 న శ్రీలంక సివిల్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన 'నీలిర'(Neelira)అనే మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రస్తుతం ప్రతిదీ ఒక ప్రచారంగా మారిపోయింది. మన జ్ఞాపకాలని, ఆలోచనలని ప్రభావితం చేసే శక్తి కూడా సదరు ప్రచారానికి ఉంది. వందల కోట్ల రూపాయలు సంపాదించాలనే లక్ష్యంతో, ద్వేషాన్ని హింసని పెట్టుబడిగా పెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నోట్ల రద్దు' సమయంలో సాధారణ ప్రజలు క్యూ లైన్లలో నిలబడి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం  మనందరికీ తెలుసు. కానీ సినిమాల ద్వారా ఆ ప్రభావాన్ని చాలా సులభంగా మార్చేయవచ్చు. వాస్తవాలను వక్రీకరించి చూపిస్తు ప్రజల జ్ఞాపకాలని  తారుమారు చేస్తున్నారు. కానీ నీలిర మూవీ ఒక జాతిని, మతాన్ని అపహాస్యం చేసేలా తెరకెక్కలేదని చెప్పుకొచ్చాడు.


aslo read: VIjay: విజయ్ పై ప్రముఖ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు.. విజయ్ సమర్పించిన ఆస్తులు ఎన్ని 


ధురంధర్ 2 లోని ఒక సన్నివేశం విషయానికి వస్తే పాకిస్థాన్ లో ఉన్న దావూద్ ఇబ్రహీం 60000 కోట్ల రూపాయిల ఒరిజినల్ ఇండియన్ కరెన్సీ లాగానే ఉండే వాటిని ముద్రించి  ఇండియాలో మార్చాలని చూస్తాడు. ధురంధర్ ఈ విషయాన్నీ కనిపెట్టి ఇండియన్ ఐబి చీఫ్ కి చెప్పడంతో మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం నోట్ల రద్దు చేసినట్టుగా చూపించారు. మరి వెట్రిమారన్ తన స్పీచ్ లో 'ధురంధర్ 2' పేరు ప్రస్తావించకపోయినా   ఆయన మాట్లాడింది ధురంధర్ 2 గురించే అనే విషయం క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎలాంటి ఆర్భాటాలు, భేషజాలకి పోకుండా మనుషుల జీవితాలు, భావోద్వేగాలు  సామాజిక అస్పృశ్యతల వల్ల కలిగే సదరు మనుషులు పడే  ఇబ్బందులు, వాళ్ళు ఎదురుతిరిగితే ఏర్పడే పరిస్థితులు ఆధారంగానే వెట్రి మారన్ సినిమాలు ఉంటాయి. అణగారిన వర్గాల్లో నుంచే తన హీరో వస్తుంటాడు. ప్రెజెంట్ 'విడుతలై 2'  'అరసన్' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ధురంధర్ 2 కూడా రికార్డు కలెక్షన్స్ ని సాధిస్తు బిజీగానే ఉంది. ప్రెజెంట్ తన స్టేటస్ 1365 కోట్లు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com