LATEST NEWS
  వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ కేటాయింపుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి చేసిన ఆరోపణలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఘాటుగా స్పందించారు. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నారని, డబ్బులకు ఆశపడి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనకే టికెట్ ఇచ్చారని చిన్నారెడ్డి ఆరోపించారు. తనకు టికెట్ ఇచ్చిన సోనియా గాంధీ.. ఆర్థిక సమస్యలు ఉంటే స్వయంగా ఖర్చు పెట్టి గెలిపించాలని రేవంత్ రెడ్డికి సూచించారని ఆయన పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు నిలిచిపోయాయని మంత్రులను అడిగితే.. ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నారని, కాంట్రాక్టులు తన అనుచరులకు దక్కలేదనే కారణంతో పనులు ఆపుతున్నారని వారు చెప్పారని చిన్నారెడ్డి అన్నారు. మేఘారెడ్డి తన అనుచరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తరహాలో తాను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుందని చిన్నారెడ్డి హెచ్చరించారు. అయితే తాను పార్టీని వీడబోనని, మేఘారెడ్డి వంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపే వరకు పోరాడతానని వ్యాఖ్యానించారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్వహించిన పలు విడతల సర్వేల ఆధారంగానే తనకు టికెట్ లభించిందని స్పష్టం చేశారు. విజయావకాశాలు ఉన్న అభ్యర్థులకే పార్టీ టికెట్లు కేటాయించిందని, ఇందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని అన్నారు. తాను టికెట్ కోసం ఎవరికైనా డబ్బులు ఇచ్చానని ఆరోపిస్తున్న చిన్నారెడ్డి.. ధైర్యముంటే తాను ఎవరికి, ఎంత డబ్బు ఇచ్చానో బహిరంగంగా వెల్లడించాలని మేఘారెడ్డి సవాల్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ద్వారా తన ప్రతిష్ఠను, పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2014, 2018 ఎన్నికల సమయంలో ఇకపై తాను పోటీకి దూరంగా ఉంటానని, అధిష్ఠానం ఎవరికి అవకాశం ఇచ్చినా వారి విజయానికి కృషి చేస్తానని చిన్నారెడ్డి చెప్పిన విషయాన్ని కూడా మేఘారెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తానని మేఘారెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన తరుణంలో సీనియర్ నేతలు, ఎమ్మెల్యే మధ్య బహిరంగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకోవడం వనపర్తి కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. Vanaparthy Congress, Thudi Megha Reddy, G Chinna Reddy, Vanaparthy MLA, Congress Ticket Controversy, Telangana Congress, Congress Internal Dispute, Ticket Allegations, Congress Leaders, Political Controversy, Telangana Politics, Jivan Reddy, CM Revanth Reddy
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల తొలిరోజే  అధికార తెలుగుదేశం, విపక్ష వైసీపీ సభ్యుల మధ్య మాటలయుద్ధంతో రాజకీయం వేడెక్కింది. ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు. సభా మర్యాద మరిచి వ్యక్తిగత దూషణలకు దిగారు. ఒకరు దద్దమ్మ అంటే మరొకరు దున్నపోతు అన్నారు. అసలీ రచ్చకు కారణం సభలో  డీఎస్సీ   అంశంపై మొదలైన సాధారణ చర్చ. ఈ చర్చ సందర్భంగా బొత్స, అచ్చెన్నాయుడు ఇరువురూ కూడా సంయమనం కోల్పోయి,   వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగడమే కాకుండా బాడీ షేమింగ్ వ్యాఖ్య కూడా చేసుకున్నారు.  వైసీపీ  హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు   ఇవ్వలేకపోయారంటూ ప్రశ్నించిన   మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ నాయకత్వాన్ని నిలదీశారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ వ్యవహరించిన తీరును ఎండగట్టారు.  అప్పట్లో సరైన నోటిఫికేషన్ ఇవ్వలేని  దద్దమ్మ  అంటూ   విమర్శించారు. అచ్చెన్నాయుడు చేసిన  దద్దమ్మ వ్యాఖ్యపై దీటుగా స్పందించిన బొత్స సత్యనారాయణ,  అచ్చెన్నాయుడుపై బాడీ షేమింగ్ కు దిగారు. ఎవరు ఎద్దులాగా పెరిగారో, ఎవరు దద్దమ్మో, ఎవరు ఆంబోతో ప్రజలందరికీ తెలుసునంటూ బొత్స వ్యాఖ్యానించారు.  ఈ వివాదం సభలో కలకలం రేపాయి.   Botsa Satyanarayana, Atchannaidu, AP Legislative Council, DSC Notification, YCP vs TDP, AP Politics, TeluguOne
ఎన్నికల వ్యూహకర్తగా పలువురు రాజకీయ పార్టీలను ఎన్నికలలో గెలిపించి కింగ్ మేకర్ గా గుర్తింపు పొందిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్  ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు స్వయంగా ప్రజాప్రతినిధిగా చట్టసభలో అడుగుపెట్టారు. తన సరికొత్త రాజకీయ ప్రయాణంలో భాగంగా ఆయన బంకిపుర్ శాసనసభ నియోజకవర్గ నూతన ఎమ్మెల్యేగా బీహార్ అసెంబ్లీలో సోమవారం (ఆగస్టు 17) ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్ తన ఛాంబర్‌లోనే ప్రశాంత్ కిషోర్‌తో  ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు.  జన సురాజ్ పార్టీని స్థాపించి, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి చైతన్యం తెచ్చిన పీకే..  ఇప్పుడు అధికారికంగా శాసనసభా కార్యకలాపాల్లో పాల్గొనే అర్హతను సాధించారు. అసెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.  ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిశోర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  జన సురాజ్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.   Prashant Kishor, Prashant Kishor MLA Oath, Bankipur Assembly By Election, Jan Suraaj Party, Bihar Politics   
ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో  ఉపయోగించిన దిమాగీ నక్సల్ పదం దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. దిమాగీ నక్సల్ అన్న పదం రాజకీయవర్గాలలోనే కాకుండా నెటిజనులలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది.  మావోయిజంపై ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ..  అడవుల్లో సాయుధ నక్సలిజాన్ని తుడిచిపెట్టామని చెప్తూనే..  సిద్ధాంతపరంగా ఆలోచనల్లో ఉండే  దిమాగీ నక్సల్స్ సమాజంలో ఇంకా మిగిలే ఉన్నారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆయన ప్రసంగం ముగిసిన గంటల వ్యవధిలోనే  ఇన్‌స్టాగ్రామ్‌లో  దిమాగీ నక్సల్ పార్టీ పేరుతో ఒక  ఖాతా ప్రత్యక్షమైంది. ఈ ఇన్ స్టా ఖాతాకు నెటిజనుల నుంచి విశేష ఆదరణ లభించింది. దిమాగీ నక్సల్ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ పేజీ  ప్రారంభమైన 24 గంటల వ్యవధిలోనే  1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సాధించి రికార్డు సృష్టించింది.    ఇప్పటి వరకూ  ఈ ఖాతాలో 62 పోస్టులు ఉన్నాయి.  ఈ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించి వైరల్ అవుతున్న  దిమాగీ నక్సల్ పార్టీ పేజీ  ఎవరు నిర్వహిస్తున్నారు? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు?  అనే విషయాలపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. పేజీ నిర్వాహకులు తమ గుర్తింపును రహస్యంగా ఉంచడం, కంటెంట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టంగా వెల్లడించకపోవడం సస్పెన్స్ గా మారింది. ఇది  మోదీ వ్యాఖ్యలకు నిరసనగా సృష్టించిన వేదికగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    Dimagi Naxal, Narendra Modi speech, Instagram viral page, Dimagi Naxal Party, 16 lakh followers, Independence Day Modi comments
జనసేన నాయకుడు కొణిదెల నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.  ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం (ఆగస్టు 17) ఉత్తర్వులు ారీ చేసింది.   రాష్ట్రంలో పచ్చదనం పెంచడం, పర్యావరణ సమతుల్యత కాపాడటమే ధ్యేయంగా ఈ గ్రీన్ కార్యని ర్వాహక కమిటీ ఏర్పాటైంది.  రాష్ట్రవ్యాప్తంగా అడవుల విస్తీర్ణాన్ని పెంచే ప్రక్రియలో భాగంగా నాగ బాబు నేతృత్వంలో ఈ కమిటీ  ఏర్పాటైంది. నాగబాబు సారథ్యంలో గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో  పర్యటించి,  పర్యావరణ పరిరక్షణ దిశగా చేపడుతున్న  కార్యక్రమాలు, మొక్కలు నాటే ప్రాజెక్టులను పరిశీలిస్తుంది. అలాగే  వాటి పురోగతిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పర్యావరణానికి అనుకూలమైన విధానాలను రూపొందించడంతో పాటు ప్రకృతి వనరుల సంరక్షణకు అవసరమైన వ్యూహాలను అమలు చేయడంలో ఈ కమిటీ ప్రభుత్వం తరఫున పని చేస్తుంది.  రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, హరిత విప్లవం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంగా ఈ కమిటీ ఏర్పాటు, కమిటీ చైర్మన్ గా నాగబాబు నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.  జల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపొందించే దిశగా నాగబాబు ఎలాంటి చర్యలు చేపడతారనే అంశంపై వ్యాపకంగా ఆసక్తి నెలకొంది. Naga Babu, AP Green Executive Committee, Andhra Pradesh Government, Cabinet Rank, Janasena Leader Naga Babu
ALSO ON TELUGUONE N E W S
'ప్రేక్షకులే మా దేవుళ్లు.. వారి నవ్వులే మాకు నిజమైన రివార్డులు' అంటూ ప్రమోషన్స్‌ వేదికలపై ప్రతి స్టార్ హీరో నోటి నుంచి వినిపించే మాట ఇది. కానీ, తీరా థియేటర్‌లోకి వెళ్తే పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంటోంది. గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో వస్తున్న మార్పులను గమనిస్తే ఒక ప్రశ్న స్పష్టంగా నిలదీస్తోంది. సినిమాలు తీస్తున్నది ప్రేక్షకుల వినోదం కోసమా? లేక తమ మాస్ ఇమేజ్, పాన్-ఇండియా రేంజ్,  సొంత సంతృప్తి కోసమా? ప్రేక్షకుల అభిరుచిని, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను పక్కనపెట్టి మన హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే హాయిగా నవ్వుకునే హాస్యం, గుండెలను పిండేసే అనుబంధాలు, భావోద్వేగాలు నిండిన కుటుంబ కథా చిత్రాలు రాజ్యమేలేవి. పండగొచ్చినా, వీకెండ్ వచ్చినా ఇళ్లల్లోని పెద్దలు, పిల్లలు, మహిళలంతా కలిసి థియేటర్ వైపు అడుగులు వేసేవారు. కానీ నేటి పరిస్థితి చూస్తే.. కుటుంబంతో కలిసి చూసేందుకు వీలైన సినిమాలు ఏడాదిలో వేళ్లమీద లెక్కపెట్టే స్థాయికి పడిపోయాయి. స్క్రీన్ పై పదే పదే కత్తి పట్టి నరకడం, రక్తం ఏరులై పారడం, ఊచకోతలు కోయడమే ఒక ఉద్యమంగా మారిపోయింది. మరోవైపు, "థియేటర్లకు జనాలు రావడం లేదు.. ఓటీటీల వల్లే బాక్సాఫీస్ దెబ్బతింటోంది" అంటూ నిర్మాతలు, దర్శకులు తరచూ గగ్గోలు పెడుతుంటారు. కానీ, అసలు నిజం ఏమిటంటే.. మితిమీరిన హింస, అశ్లీలత కారణంగా కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను ఇండస్ట్రీయే స్వయంగా అడ్డుకుంటోంది. పిల్లలతో కలిసి థియేటర్‌కు వెళ్లి గంటన్నర పాటు రక్తపాతం చూసి భయపడటం కంటే, హాయిగా ఇంట్లోనే ఓటీటీలో పాత సినిమాలు లేదా పద్ధతిగల షోలు చూసుకోవడమే నయమని ఫ్యామిలీ ఆడియన్స్ భావిస్తున్నారు. పెద్ద హీరోలు సైతం తాము సేఫ్ జోన్ వీడుతున్నామని చెప్తూ మాస్, డార్క్, రా-అండ్-రస్టిక్ కాన్సెప్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. 100 కోట్ల బడ్జెట్లతో నిర్మించే చిత్రాల్లో గ్రాఫిక్స్, న‌ర‌క‌డాలు, యాక్షన్ డిజైన్‌పై పెడుతున్న శ్రద్ధ.. కథలో ఉండాల్సిన హృదయాన్ని తాకే సీన్ల పై పెట్టడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. క్లాస్, ఫ్యామిలీ డ్రామాలను కేవలం చిన్న సినిమాలకే పరిమితం చేసి, స్టార్ హీరోలంతా 'కత్తుల సవాల్' కే జై కొడుతున్నారు. మాస్ ఆడియ‌న్స్‌ను అలరించడం ఎంత అవసరమో, కనీస వినోదాన్ని పంచుతూ హాయిగా సాగే చిత్రాలను అందించడం కూడా అంతే ముఖ్యం. 'ప్రేక్షకుడే దేవుడు' అనే పదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, మళ్లీ కుటుంబాలు హాయిగా థియేటర్లలో నవ్వుకునే రోజుల్ని తీసుకురావాల్సిన బాధ్యత మన దర్శకులు, హీరోలపై ఎంతైనా ఉంది. ఈ వైలెన్స్ ట్రెండ్ ఎన్నాళ్లు సాగుతుంది? ఫ్యామిలీ ఆడియన్స్ నిరాదరణ బాక్సాఫీస్‌పై లాంగ్ రన్‌లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది రాబోయే రోజుల్లో టాలీవుడ్ కచ్చితంగా ఆలోచించాల్సిన అంశం.   Tollywood Extreme Violence Movies, Telugu Family Entertainer Movies, Tollywood Star Heroes Movies, Telugu Cinema Box Office Trends, Family Audience Theatre Footfalls
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు ఆ పేరుకి ఉన్న వైబ్రేషన్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే పాన్ ఇండియా ఫ్యాన్స్, ప్రేక్షకులు మాకు తెలుసు అని ఆ వైబ్రేషన్ తాలూకు రికార్డుల గురించి పూస గుచ్చినట్టుగా చెప్తారు. అల్లు అర్జున్ ఇటీవల తన అభిమానులతో మీటింగ్ నిర్వహించి వాళ్లందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు 'ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్  (AAFA) ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సామాజిక సేవ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనతగా నిలిచింది. మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణపై, దానిని అడ్డుకునే హెచ్‌పీవీ (HPV - Human Papillomavirus) వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతపై విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు. 'ఒక లక్ష మంది బాలికలు.. ఒక ఉజ్వల భవిష్యత్తు' అనే ప్రధాన ఆశయంతో ముందడుగు వేసిన ఈ ఫ్యాన్స్ అసోసియేషన్, ఏకంగా 7 రాష్ట్రాల్లో 400కు పైగా అవగాహన సదస్సులను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మహోద్యమం ద్వారా పాఠశాలలు, కళాశాలలకు చెందిన 9 నుండి 26 సంవత్సరాల వయసు గల దాదాపు 1,00,000 మందికి పైగా బాలికలు, యువతులకు నేరుగా హెచ్‌పీవీ టీకాలపై సమగ్ర అవగాహన కల్పించారు.  అల్లు అర్జున్ ఇచ్చిన "ప్రతి ఏటా ఒక మంచి పని" (One Good Deed Every Year) అనే పిలుపునే స్పూర్తిగా తీసుకుని, వైద్య నిపుణుల సమక్షంలో యువతులకు సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదాలు మరియు టీకా ద్వారా దానిని నిరోధించే విధానాలను చాలా స్పష్టంగా వివరించారు. Also Read: ప్రస్తుతం ఏ సినిమా ఆడుతుందో, ఆడదో చెప్పలేని పరిస్థితి.. ప్రేక్షకుడా నీకు వందనం సోషల్ మీడియాలో #AAFASupportsHPVDrive హ్యాష్‌ట్యాగ్‌తో ఈ అరుదైన సేవా కార్యక్రమం ట్రెండ్ అవుతోంది. కేవలం అభిమాన ప్రదర్శనలకే పరిమితం కాకుండా, ఒక బాధ్యతాయుతమైన సైన్యంగా మారి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కృషి నిజంగా అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వస్థ్ నారీ వికసిత్ భారత్' లక్ష్యానికి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ అల్లు అర్జున్  అభిమానులు ఈ అవగాహన ఉద్యమాన్ని ప్రారంభించారు.    Allu Arjun, Allu Arjun Fans, Hpv  
సినిమా.. ప్రేక్షకులకి  వినోదాన్ని పంచడానికి మాత్రమే పుట్టిన ఒక అద్భుతమైన దృశ్య సాధనం. కానీ క్రమక్రమంగా పంచభూతాల్లో ఒకటిగా మారింది. నేటికీ ఎంతో మంది మేకర్స్, హీరోలు, హీరోయిన్స్  డైలీ ఒక సినిమా చూడందే నిద్రపోని పరిస్థితి. అందుకే అంటారు ప్రపంచం మొత్తం పెను విపత్తుతో కొట్టుకుపోయినా సినిమా మాత్రం తన జెండా, అజెండా కొనసాగిస్తూనే ఉంటుందని.  అలాంటి సినిమా ఒకప్పుడు విజయం సాధించాలంటే పెద్ద హీరో, అందరికి సులువుగా అర్ధమయ్యే కథ,  భారీ బడ్జెట్, కలర్‌ఫుల్ పాటలు, అదిరిపోయే ఫైట్లు ఉంటే సరిపోయేది.కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో, ఏ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోతుందో ముందే అంచనా వేయడం అగ్ర నిర్మాతలు, దర్శకులకి, హీరోలకి  సవాలుగా మారింది. ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన ఊహించని మార్పులు సినిమా పరిశ్రమ సమీకరణాలను తలకిందులు చేస్తున్నాయి. నేటి తరం ప్రేక్షకులు చాలా స్పష్టమైన ఆలోచనలతో ఉన్నారు. వారు కేవలం పోస్టర్, ట్రైలర్ చూసి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఒకప్పుడు గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించిన పెద్ద సినిమాలు కూడా, కథలో దమ్ము లేకపోతే కేవలం రెండు మూడు రోజుల్లోనే థియేటర్ల నుండి ఖాళీ అవుతున్నాయి. అదే సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా, కేవలం కోటి లేదా రెండు కోట్ల బడ్జెట్‌తో వచ్చిన చిన్న సినిమాలు కేవలం నోటి మాట ప్రచారం అంటే 'వర్డ్ ఆఫ్ మౌత్'తో బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నాయి. ఉదాహరణకు, గతంలో కేవలం 5 శాతం నుండి 10 శాతం వరకు మాత్రమే ఉన్న చిన్న సినిమాల విజయాల శాతం,  కంటెంట్ బలంతో ఏకంగా 40 శాతానికి పైగా వసూళ్లని  సాధిస్తూ పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ మార్పుకు ప్రధాన కారణం ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల వ్యాప్తి. కరోనా తర్వాతి రోజుల్లో ఓటీటీ వినియోగం దాదాపు 300 శాతం పెరిగింది. డిజిటల్ విప్లవం వల్ల ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేతివేళ్ల వద్దకే అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ప్రతీవారం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనే నియమం పోయింది. "కొన్ని రోజులు ఆగితే ఎలాగూ ఓటీటీలోనే వస్తుంది కదా" అనే భావన దాదాపు 60 శాతానికి పైగా ప్రేక్షకుల్లో నెలకొంది. అందుకే థియేటర్‌కు వచ్చి . 200 నుండి రూ. 300 వరకు టికెట్ కొని, మరో రూ. 200 పాప్‌కార్న్‌పై ఖర్చు చేయాలంటే ఆ సినిమాకు ఆ స్థాయి లార్జర్ ద్యాన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ లేదా బలమైన ఎమోషన్ ఉంటేనే థియేటర్లకు జనాలు వస్తున్నారు. Also Read: అదరగొడుతున్న హుషార్ పిట్టలు కలెక్షన్స్..  త్రీ డేస్ లెక్క ఇదే! అలాగే సోషల్ మీడియా ప్రభావం కూడా సినిమా భవితవ్యాన్ని నిర్ణయించడంలో 80 శాతం పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు సినిమా రివ్యూలు ఆదివారం లేదా మరుసటి రోజు పేపర్లలో వచ్చేవి. కానీ ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) ముగిసిన 15 నిమిషాలకే ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో లక్షలాది రివ్యూలు వ్యాపిస్తున్నాయి. నెగెటివ్ టాక్ కనుక ఒక్కసారి వైరల్ అయితే, ఆ సినిమా ఈవెనింగ్ షోలకే కలెక్షన్లు 50 శాతానికి పైగా పడిపోతున్నాయి. నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేసే ప్రమోషన్ల కంటే, సాధారణ ప్రేక్షకుడు సోషల్ మీడియాలో ఇచ్చే అర నిమిషం రివ్యూనే బాక్సాఫీస్ విజయాన్ని శాసిస్తోంది. మరో ఆసక్తికరమైన నిజం ఏంటంటే... ప్రేక్షకులు ఇప్పుడు స్టార్ డమ్ కంటే సబ్జెక్ట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు కూడా సరైన స్క్రీన్‌ప్లే లేకపోతే వందల కోట్ల నష్టాలను మిగులుస్తున్నాయి. అదే కొత్త నటీనటులు, సరికొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే థ్రిల్లర్లు, డ్రామాలు, రూటెడ్ ఎమోషనల్ కథలు 50 కోట్ల నుండి రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరుతున్నాయి. కానీ ఇదే నిజమని అనుకున్నా కూడా పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇటీవల చిన్న చిత్రాలు కొన్ని మంచి కంటెంట్ తోనే వచ్చాయి. కానీ ప్రేక్షకులు ఆదరించలేదు.  అందుకే ఏ సినిమా హిట్ అవుతుందో లేదో చెప్పాలని పరిస్థితి.  Cinema, Telugu Cinema, Tollywood
    వరుస సినిమాలు, గ్లోబల్ ఈవెంట్లతో బిజీగా ఉండే స‌న్నీ లియోన్ తాజాగా దైవ సన్నిధిలో కనిపిస్తూ అభిమానులను అలరించారు. ముంబైలోని ప్రముఖ ఇస్కాన్ (ISKCON) ఆలయాన్ని సందర్శించిన సన్నీ, తన రాబోయే ప్రాజెక్టులు మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి పాల్గొన్నారు. వెస్టర్న్ దుస్తులకు భిన్నంగా సంప్రదాయ పింక్ ఎంబ్రాయిడరీ సల్వార్ సూట్‌లో సన్నీ ఎంతో హుందాగా, కళగా కనిపించారు. డేనియల్ వెబర్ గ్రీన్ షర్ట్, క్రీమ్ ప్యాంట్ ధరించి ఆలయానికి రాగా.. ఈ జంటకు సంబంధించిన పిక్స్, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆలయంలో మంత్రోచ్ఛారణల నడుమ దేవుడి ఆశీస్సులు అందుకుని కొత్త పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సన్నీ లియోన్ వృత్తిపరంగా ఎంతో బిజీ షెడ్యూల్‌ను గడుపుతున్నారు. ఒకవైపు నటిగా రాణిస్తూనే, మరొకవైపు 'డీజే వరల్డ్ టూర్' పేరుతో ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి వంటి భారతీయ నగరాలతో పాటు కెనడా, థాయ్‌లాండ్‌, ఐర్లాండ్ తదితర దేశాల్లో లైవ్ షోలతో రచ్చ చేసిన సన్నీ, త్వరలోనే ఆస్ట్రేలియాలో కూడా గ్రాండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సినీ కెరీర్ విషయానికొస్తే, ఇటీవల వచ్చిన 'కెన్నడీ' సినిమాతో నటిగా మంచి ప్రశంసలు అందుకున్న సన్నీ, ఇప్పుడు 'చుడైల్' అనే సరికొత్త హారర్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. టి.ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సన్నీ లియోన్ ఉత్తరప్రదేశ్ నేపథ్యం ఉన్న ఒక భయంకరమైన దెయ్యం పాత్రలో అలరించనున్నారు. ఆమెకు పోటీగా మందనా కరీమి మరొక శక్తివంతమైన పాత్రను పోషిస్తుండగా, నటుడు రాహుల్ దేవ్ ముఖ్య భూమికలో కనిపిస్తారు. విశిష్టమైన కథాంశంతో, పూర్తిస్థాయి కామెడీ మరియు హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న 'చుడైల్' చిత్రం ప్రముఖ నిర్మాత మహీంద్రా ధరివాల్ నిర్మిస్తున్న 50వ మైలురాయి చిత్రం కావడం విశేషం. పాన్-ఇండియా కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లోనూ భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన పిక్స్ చూసిన అభిమానులు సన్నీ లియోన్‌కు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. 'చుడైల్' సినిమాలోని సన్నీ లుక్ మరియు ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకున్న 'చుడైల్' మూవీని రాబోయే సెప్టెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ హారర్ కామెడీతో సన్నీ లియోన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి!   Sunny Leone, Chudail Movie, ISKCON Temple Mumbai, Sunny Leone Latest Movie News, Tollywood Entertainment News
యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్ సంస్కృతిలో ఎంతో విశిష్టమైన బోనాల పండుగ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె, ఆ తర్వాత ఎదురైన నెగెటివిటీని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని, మనోవేదనను వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుదీర్ఘ వీడియో ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ ఆలం మండిలో వెలసిన శ్రీ మహాకాళేశ్వర అమ్మవారి బోనాల ఉత్సవాలకు ఫరియా హాజరయ్యారు. అక్కడ పక్కా తెలంగాణ సంప్రదాయ దుస్తులు ధరించి, పసిడి బోనాన్ని నెత్తిన ఎత్తుకుని డప్పు చప్పుళ్లకు అనుగుణంగా ఆమె చేసిన డ్యాన్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. లోకల్ కల్చర్‌పై తనకున్న మమకారాన్ని చాటుకుంటూ ఎంతో ఆనందంగా ఈ వేడుకల్లో భాగమైన ఆమెకు, ఆ వెంటనే సోషల్ మీడియాలో ఊహించని రీతిలో ట్రోలింగ్ ఎదురైంది. ముస్లిం నేపథ్యం ఉన్న ఫరియా హిందూ సంప్రదాయంలో జరిగే పూజల్లో ఎలా పాల్గొంటారంటూ కొందరు నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. అంతేకాకుండా తీవ్రంగా వ్యక్తిగత దూషణలకు దిగుతూ, మత విశ్వాసాల పేరుతో కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఫరియా ఓ వీడియో ద్వారా స్పందిస్తూ తన ఆవేదనను వెళ్లగక్కారు. తన కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది. "మా నాన్న సంజయ్ అబ్దుల్లా పుట్టుకతో హిందువే, కానీ ఇస్లాం సిద్ధాంతాలు నచ్చి ఆ మతాన్ని స్వీకరించారు. మతాన్ని మనస్ఫూర్తిగా గౌరవించి ఆచరించే తండ్రి పెెంపకంలో పెరిగిన నాకు సమాజంలో మంచి విషయాలే కనిపించాయి. నేను ప్రకృతిలోని ప్రతి రూపాన్ని, ప్రతి జీవిని దైవంగా భావిస్తాను. నన్ను ద్వేషించే వారికి కూడా మంచి జరగాలనే ఆశిస్తాను. ద్వేషాన్ని కేవలం ప్రేమతోనే ఎదుర్కొంటాను" అని ఫరియా స్పష్టం చేశారు. ప్రేమను వ్యక్తపరిచే స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు. 'జాతి రత్నాలు' సినిమాతో చిట్టి పాత్రలో కనిపించి తొలి చిత్రంతోనే విశేష ఆదరణ దక్కించుకున్న ఫరియా, అనతికాలంలోనే ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత 'బంగార్రాజు', 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్', 'రావణాసుర' వంటి వరుస చిత్రాల్లో నటించి తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా మంచి డ్యాన్సర్‌గా, కళలపై విపరీతమైన ప్రేమ ఉన్న నటిగా ఆమె టాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈ అంశంపై సినీ పరిశ్రమ నుంచి, సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మంచు లక్ష్మితో పాటు పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఫరియాకి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడమే తప్ప మతాన్ని ముడిపెట్టి నిందించడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.   Faria Abdullah, Faria Abdullah Bonalu Festival, Jathi Ratnalu Actress Faria, Faria Abdullah Emotional Video, Tollywood Latest Gossip Telugu
Varun Tej’s Korean Kanakaraju is having a good run at the box office. The film has crossed the ₹50.30 crore gross mark worldwide in 10 days, giving Varun Tej a much-needed commercial success after a few disappointing outings. Directed by Merlapaka Gandhi, Korean Kanakaraju is an action-comedy that has managed to connect with audiences through its comedy and action. The film has also maintained a steady run after its opening, with decent footfalls continuing through the second weekend and weekdays. The comedy scenes have been one of the highlights of the film, with Varun Tej and Satya’s combination getting good response from audiences. Thaman S’s music has also added to the film’s appeal and helped keep the theatrical momentum going. For Varun Tej, the ₹50 crore milestone is important as the actor has been waiting for a strong theatrical success. After a series of films that failed to meet expectations, Korean Kanakaraju has given him a much-needed boost and shown that he can still pull audiences to theatres with the right commercial entertainer. Produced by UV Creations and First Frame Entertainments, the film is now said to be in the profitable zone for its distributors. With the film continuing to hold well in its second week, Korean Kanakaraju is expected to add more to its worldwide total in the coming days. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన లేటెస్ట్ ప్రాజెక్ట్ "ఇరుముడి". ఆగష్టు 21న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినీ సెలెబ్రిటీలు సైతం ఈ మూవీ పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నిర్మాత రవిశంకర్ బయటపెట్టారు.  ముఖ్యంగా 'ఇరుముడి' సినిమాపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, రెబెల్ స్టార్ ప్రభాస్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో ప్రొడ్యూసర్ రవిశంకర్ సరదాగా పంచుకున్న సీక్రెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. "సాయంత్రం వేళల్లో ఎప్పుడైనా కలిసినప్పుడు ఎన్టీఆర్ గారు నన్ను సరదాగా ఏడిపిస్తూ ఉంటారు. మా నెక్స్ట్ సినిమాల గురించి సరదాగా మాట్లాడుతుంటారు. కానీ, ఇరుముడి టాపిక్ వస్తే ఈ సినిమా పక్కా సూపర్ హిట్ అంటారు." అంటూ రవిశంకర్ తెలిపారు. "ఇరుముడి సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉందని ప్రభాస్ గారు కూడా అన్నారు. అందరికీ ఈ సినిమాపై పాజిటివ్ ఫీలింగ్ ఉంది." అంటూ రవిశంకర్ తన సంతోషాన్ని పంచుకున్నారు.  కాగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ 'డ్రాగన్' చేస్తుండగా, ప్రభాస్ 'ఫౌజీ' చేస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్స్ సమయంలోనే 'ఇరుముడి' సినిమా గురించి వారు మాట్లాడారు.      Ravi Teja, Irumudi Movie, NTR, Prabhas, Mythri Movie Makers  
హుషార్ పిట్టలు.. టైటిల్ కి తగ్గట్టే బాక్స్ ఆఫీస్ వద్ద యమ హుషారుగా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. ఎటువంటి స్టార్ స్టేటస్  లేకపోయినా కంటెంట్ పవర్ ఉంటే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో కూడా నిరూపించింది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఆగస్టు 15న రిలీజైన హుషార్  పిట్టలు బాక్సాఫీస్ దగ్గర ఊహించని రేంజ్ వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  విడుదలైన మొదటి రోజు నుంచే హౌస్‌ఫుల్ బోర్డులతో సందడి చేస్తూ మూడు రోజులకి 1 . .94 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఊహించని రెస్పాన్స్ చూసి ఎగ్జిబిటర్లు సైతం థియేటర్ల సంఖ్యను భారీగా పెంచుతున్నారంటే ఈ బొమ్మ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే, థియేటర్ల బయట, లోపల కనిపిస్తున్న రచ్చ మాత్రం కాస్త వివాదాస్పదంగా మారింది. సినిమాలో యూత్‌ఫుల్ కంటెంట్, టీనేజ్ లవ్ , రొమాంటిక్ సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉండటంతో  కుటుంబ సమేతంగా వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ ని  థియేటర్ యజమానులు లోపలికి అనుమతించడం లేదు. హైదరాబాద్ లోనే ఈ పరిస్థితి ఉందంటే మిగతా ఏరియాస్ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. Also read: అగధ మూడు రోజుల కలెక్షన్స్ ఇవే!   టీనేజ్ వయసులోని ఆకర్షణ, స్మార్ట్‌ఫోన్‌లు, అశ్లీల వీడియోల ప్రభావం పిల్లల జీవితాలను ఎలా దారితప్పిస్తుందో సందేశాత్మకంగా విశ్లేషించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో రవి (అన్హు), చిట్టి (వాసవి గణేషన్) పాత్రల మధ్య సాగే అమాయకత్వంతో కూడిన టీనేజ్ రొమాన్స్, మోహం, ఆ తర్వాత వారు ఎదుర్కొనే పర్యవసానాలను చాలా బోల్డ్‌గా చూపించారు. మొదటి భాగం అంతా యూత్‌ను ఆకట్టుకునే ఫన్, బోల్డ్ కంటెంట్‌తో సాగితే, సెకండాఫ్ మాత్రం తల్లిదండ్రులకు, నేటి సమాజానికి కళ్ళు తెరిపించే భావోద్వేగమైన సందేశాన్ని ఇస్తుంది.  సినిమాలో బోల్డ్ సీన్స్ హద్దులు దాటాయనే విమర్శలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురుస్తోంది. స్టార్ కాస్ట్ లేకపోయినా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే పెద్ద సినిమాల పోటీ నడుమ ఈ చిత్రాన్ని ధైర్యంగా రిలీజ్ చేశామని, ప్రేక్షకులు ఆదరించి పెద్ద హిట్ చేశారని నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి లాంగ్ రన్ లో ఏ మేర కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.  బిక్షు దర్శకుడు.  Husharu Pittalu, Suresh Productions    
అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ విభిన్నమైన అంశాలపై నిర్మొహమాటంగా స్పందించే ఈ బ్యూటీ, ఈసారి చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ, సామాజిక దుమారానికి దారితీశాయి. తాజాగా ఆమెపై హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం టాలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల 'సనాతన ధర్మం', 'జై శ్రీరామ్' నినాదాల దుర్వినియోగంపై అనసూయ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కొందరు వ్యక్తులు ఈ నినాదాల వెనుక దాక్కుని అసాంఘిక కార్యకలాపాలకు, దాడులకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాషాయ పార్టీ నాయకులు, హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కోట్లాది మంది భావోద్వేగాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ బోరబండ పోలీస్ స్టేషన్‌లో బిజెపి నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తనపై కేసు నమోదు కావడంపై అనసూయ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె, తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. "నేను ఎప్పుడూ సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను, నిత్యం రాముడిని, ఆంజనేయ స్వామిని పూజిస్తాను. కానీ కేవలం నినాదాలు చేయడం కంటే మనుషుల్లో నైతికత, మంచి ప్రవర్తన ఉండడం ముఖ్యం అనడమే నా ఉద్దేశం" అని పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను నిజం మాట్లాడడం వల్లే కొందరికి కోపం వస్తోందంటూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అనసూయ ధైర్యాన్ని కొందరు నెటిజన్లు సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం బహిరంగ వేదికలపై సంయమనం పాటించాలని హితవు పలుకుతున్నారు. నెటిజన్లు, సినీ ప్రియుల మధ్య ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఈ వివాదంపై బోరబండ పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు వివాదాల నడుమ వార్తల్లో నిలుస్తున్న అనసూయ ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.   Anasuya Bharadwaj, Borabanda Police Station, Anasuya Controversial Comments, Anasuya Jai Shri Ram Controversy, Tollywood News Telugu
  సిల్వర్ స్క్రీన్ పై సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే పేరు పడితే చాలు ఊహించని కథ, కథనంతో కూడిన సూపర్ హిట్ సినిమా చూడబోతున్నామని తన్మయత్వంతో మురిసిపోయేవాళ్లు. హీరోల ఫ్యాన్స్ అయితే తమ హీరో సినిమా కలెక్షన్స్ విషయంలో పోటీపడుతుండే వాళ్ళు. అలాంటి బ్యానర్ అధినేత  ఎం.ఎస్. రాజు దర్శకుడిగానూ తన పందా కొనసాగిస్తు ఈ నెల 14న  మిస్టరీ హారర్ థ్రిల్లర్ చిత్రం 'అగధ' తో థియేటర్స్ లో ప్రత్యక్షమయ్యారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'అగధ'  మూడు రోజులకి కోటి ముప్పై లక్షలు సాధించట్టుగా ట్రేడ్ వర్గాల రిపోర్ట్.  ప్రపంచవ్యాప్తంగా దాదాపు  200కి పైగా స్క్రీన్లలో 500 షోలతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఓవర్సీస్‌లోనూ మోక్ష మూవీస్ ద్వారా 60కి పైగా స్క్రీన్లలో విడుదల చేశారు. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 25 వేల నుండి 30 వేల వరకు టికెట్లు అమ్ముడుపోగా, మొదటి రోజు 50 లక్షల రూపాయల కలెక్షన్లు సాధించినట్లు సమాచారం అందుతోంది. అయితే, తొలి వీకెండ్ ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన స్థాయి ఆదరణ పొందలేకపోయింది. ఆడియెన్స్ నుండి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో మూడు రోజుల కలెక్షన్ల బాక్సాఫీస్ గ్రాఫ్ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఎం.ఎస్. రాజుగారు వైవిధ్యమైన కాన్సెప్ట్ ఎంచుకున్నప్పటికీ, కమర్షియల్‌గా విజయం సాధించడానికి అవసరమైన బ్రేక్ ఈవెన్ టార్గెట్  5 కోట్లని చేరుకోవడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. థియేట్రికల్ రన్‌లో ఈ హారర్ డివైన్ థ్రిల్లర్ ఎంతవరకు నిలదొక్కుకుంటుందో వేచి చూడాలి! Also read:  ఓటిటిని షేక్ చేస్తున్న తెలుగు బోల్డ్ థ్రిల్లర్..ఇండియాలోనే నెంబర్ 1 మూవీగా ట్రెండింగ్ లో   కామాక్షి భాస్కర్ల, శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, వనితా విజయ్ కుమార్ మరియు భానుచందర్ కీలక పాత్రలు పోషించారు. దైవశక్తి, ఆవహించిన మహాదేవికి, అగధ అనే క్షుద్రశక్తికి మధ్య జరిగిన పోరాటమే అగధ మూవీ. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ సినిమాను నిర్మించారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఓన్ రిలీజ్ పద్ధతిలో కమీషన్ బేసిస్‌పై ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాల్లో  నిర్మాతలే  రిలీజ్ చేశారు.     Agadha, MsRaju, kamakshi Bhaskarla  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                  *రూపశ్రీ.  
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                                                                                                                                   *రూపశ్రీ.
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి.  అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.  కొందరు నిదానంగా తింటారు.  మరికొందరు చాలా వేగంగా తింటారు.  అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు.  కుటుంబ సభ్యులు అయినా,  స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు.  వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్  చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం  కాకుండా ఆ తరువాత  సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట.   స్ట్రాంగ్ ప్రాక్టీస్  ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం  కంటే తినడాన్ని కూడా ఒక  పనిగా భావిస్తారని అంటున్నారు.  తినే వేగాన్ని బట్టి వ్యక్తిత్వం లక్షణాలను,  తినే వేగానికి,  వ్యక్తిత్వానికి మధ్య గల సంబంధాలను వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు కనుక్కున్నారు. వేగంగా తినేవారు తరచుగా వేచి ఉండటానికి ఇష్టపడరు. ఇది క్యూలలో నిలబడినా, నెమ్మదిగా మీటింగ్స్  లో ఉన్నా లేదా ఆహారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా.. ఇలా అన్ని సందర్బాలలో వారు అన్ని వేగంగానే జరగాలని కోరుకుంటారట.  అన్ని విషయాలలోనూ సహజంగా వేగాన్ని వీరు ఇష్టపడతారట. ఈ ధోరణి భోజన చేయడం వరకు తీసుకువెళుతుందట.  చాలామందిలో తినే స్వభావం మానసిక , పర్యావరణ కారకాల ద్వారా ఏర్పడతాయని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.   వేగంగా తినే వ్యక్తులలో ఇతర పనులను కూడా వేగంగా పూర్తీ చేసే సామర్థ్యం ఉంటుందట. వర్తమానంతో పూర్తీగా నిమగ్నమవడానికి బదులుగా  తరువాత ఏమి జరుగుతుందో  అనే విషయం పై దృష్టి పెట్టేలా చేస్తుందట.  ఈ కారణంగా వీరికి భవిష్యత్తు గురించి స్పష్టమైన అంచనాలు, ప్రణాళికలు కూడా ఉంటాయట. అలాగని వేగంగా తినడాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే.. వేగంగా తినడం అనేది ఆహారం సరిగా నమలకపోవడం, తినే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం,  ఆహారం అతిగా తినడం.. ఇలా చాలా సమస్యలకు కారణం అవుతుంది.                                                                                                                                                   *రూపశ్రీ.  
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు.  అయితే  రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం  మంచిదేనా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు,  పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు.  రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం,  విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు,  జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు  చురుగ్గా ఉండటానికి,  మెదడు  ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,  అలాగే నరాల పనితీరును  కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు.  మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్‌నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక ప్రోటీన్ , తక్కువ కేలరీలు ఉంటాయి.  దీని కారణంగా ఉడికించిన గుడ్లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి , శరీరానికి కావలసిన పోషకాలు కూడా మెరుగ్గా అందిస్తాయి. ఇవి అతిగా తినడాన్ని,  వెంటనే ఆకలి కావడాన్ని అరికట్టడానికి , బరువు నిర్వహణకు సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు. అయితే పదేపదే తిమ్మిర్లు రావడం, ఎక్కువసేపు తగ్గకపోవడం లేదా శరీరంలో ఒక వైపు మాత్రమే అకస్మాత్తుగా తిమ్మిరి రావడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడానికి నరాలకు సంబంధించిన సమస్యలు ఒక కారణం కావచ్చు. నరాలు దెబ్బతిన్నప్పుడు తిమ్మిరితో పాటు మంట, జలదరింపు, సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, నొప్పి లేదా చేతులు, కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే శరీరంలో ఒక వైపు అకస్మాత్తుగా చేయి లేదా కాలు తిమ్మిరిగా మారడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను మాత్రం ప్రత్యేకంగా గమనించాలి. ముఖ్యంగా వీటితో పాటు ముఖం ఒక వైపు వంగడం, మాట స్పష్టంగా రాకపోవడం, నడవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా వచ్చే తిమ్మిరికి, నరాల దెబ్బతినడం లేదా స్ట్రోక్‌కు సంబంధించిన తిమ్మిరికి తేడా ఏమిటి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? శరీరంలో ఒక వైపు మాత్రమే తిమ్మిరి ఎందుకు వస్తుంది? ఈ విషయాలపై Dr. Anirudh Deshmukh ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. సాధారణ తిమ్మిరి ఎప్పుడు ఆందోళన చెందాల్సిన సమస్యగా మారుతుంది? నరాల సమస్యకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి? స్ట్రోక్‌ను సూచించే సంకేతాలు ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. అకస్మాత్తుగా ఒక వైపు తిమ్మిరి, బలహీనత లేదా స్ట్రోక్‌ను సూచించే ఇతర లక్షణాలు కనిపిస్తే స్వయంగా చికిత్స చేసుకోకుండా వెంటనే వైద్య సహాయం పొందండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం శ్వాసను నియంత్రిస్తూ చేసే ఒక సాధారణ యోగాభ్యాసం. దీన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో చేయడం ముఖ్యమని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ప్రాణాయామం చేయడం సరికాదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం ఉన్న సమస్యలను బట్టి విధానం మారవచ్చు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ శ్రావంతి రఘు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎవరు చేయవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలి? వీడియోలో అనులోమ విలోమాన్ని స్టెప్ బై స్టెప్‌గా ఎలా చేయాలో చూపించారు. శ్వాసను నెమ్మదిగా, నియంత్రణతో తీసుకోవడం, వదలడం వంటి అంశాలను సరైన పద్ధతిలో పాటించడం గురించి వివరించారు. ప్రాణాయామం చేసేటప్పుడు శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడం, తొందరపడకుండా శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యమైన అంశాలు. మొదటిసారి ప్రయత్నించేవారు నిపుణుల సూచనతో ప్రారంభించడం మంచిది. BP ఉన్నవారు చేయవచ్చా? అధిక రక్తపోటు ఉన్నవారు కూడా కొన్ని శ్వాసాభ్యాసాలను తగిన జాగ్రత్తలతో చేయవచ్చు. అయితే అధిక బీపీ ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే విధమైన ప్రాణాయామ పద్ధతి సరిపోదు. ముఖ్యంగా శ్వాసను బిగపట్టడం వంటి పద్ధతులను స్వయంగా ప్రయత్నించకుండా, నిపుణుల సూచనలు పాటించడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు చేయవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు కూడా అనులోమ విలోమ ప్రాణాయామం గురించి నిపుణుల సలహా తీసుకుని సాధన చేయవచ్చు. అయితే ప్రాణాయామం ఏదైనా వ్యాధికి మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులు సూచించిన మందులు, ఆహారం, వ్యాయామాన్ని కొనసాగిస్తూ మాత్రమే యోగాభ్యాసాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. సైనసైటిస్ ఉన్నవారు? సైనసైటిస్ లేదా ముక్కు సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం చేసే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. ముక్కు పూర్తిగా బ్లాక్‌గా ఉన్నప్పుడు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు బలవంతంగా శ్వాసాభ్యాసం చేయకూడదు. అవసరమైతే యోగా థెరపిస్ట్ లేదా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. రోజూ 10 నిమిషాలు చేస్తే స్ట్రెస్, BP శాశ్వతంగా పోతాయా? ప్రాణాయామం వల్ల రిలాక్సేషన్, శ్వాస నియంత్రణ, మానసిక ప్రశాంతతకు సహాయం లభించవచ్చు. అయితే రోజూ 10 నిమిషాలు అనులోమ విలోమం చేస్తే స్ట్రెస్ లేదా బీపీ శాశ్వతంగా పూర్తిగా నయమవుతాయని చెప్పడం సరైనది కాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఒక వైద్య పరిస్థితి. దాని కోసం వైద్యుల సూచనలు, మందులు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం. ఈ వీడియోలో అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎవరు చేయవచ్చు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? సరైన పద్ధతి ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రావంతి రఘు వివరిస్తున్నారు. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు బీపీ, డయాబెటిస్, సైనసైటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రాణాయామం ప్రారంభించే ముందు మీ వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా థెరపిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)