Home

»

Latest News

ప్రస్తుతం ఏ సినిమా ఆడుతుందో, ఆడదో చెప్పలేని పరిస్థితి.. ప్రేక్షకుడా నీకు వందనం

Aug 17, 2026 2:25PM


సినిమా.. ప్రేక్షకులకి  వినోదాన్ని పంచడానికి మాత్రమే పుట్టిన ఒక అద్భుతమైన దృశ్య సాధనం. కానీ క్రమక్రమంగా పంచభూతాల్లో ఒకటిగా మారింది. నేటికీ ఎంతో మంది మేకర్స్, హీరోలు, హీరోయిన్స్  డైలీ ఒక సినిమా చూడందే నిద్రపోని పరిస్థితి. అందుకే అంటారు ప్రపంచం మొత్తం పెను విపత్తుతో కొట్టుకుపోయినా సినిమా మాత్రం తన జెండా, అజెండా కొనసాగిస్తూనే ఉంటుందని. 

అలాంటి సినిమా ఒకప్పుడు విజయం సాధించాలంటే పెద్ద హీరో, అందరికి సులువుగా అర్ధమయ్యే కథ,  భారీ బడ్జెట్, కలర్‌ఫుల్ పాటలు, అదిరిపోయే ఫైట్లు ఉంటే సరిపోయేది.కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో, ఏ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోతుందో ముందే అంచనా వేయడం అగ్ర నిర్మాతలు, దర్శకులకి, హీరోలకి  సవాలుగా మారింది. ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన ఊహించని మార్పులు సినిమా పరిశ్రమ సమీకరణాలను తలకిందులు చేస్తున్నాయి. నేటి తరం ప్రేక్షకులు చాలా స్పష్టమైన ఆలోచనలతో ఉన్నారు. వారు కేవలం పోస్టర్, ట్రైలర్ చూసి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఒకప్పుడు గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించిన పెద్ద సినిమాలు కూడా, కథలో దమ్ము లేకపోతే కేవలం రెండు మూడు రోజుల్లోనే థియేటర్ల నుండి ఖాళీ అవుతున్నాయి. అదే సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా, కేవలం కోటి లేదా రెండు కోట్ల బడ్జెట్‌తో వచ్చిన చిన్న సినిమాలు కేవలం నోటి మాట ప్రచారం అంటే 'వర్డ్ ఆఫ్ మౌత్'తో బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నాయి. ఉదాహరణకు, గతంలో కేవలం 5 శాతం నుండి 10 శాతం వరకు మాత్రమే ఉన్న చిన్న సినిమాల విజయాల శాతం,  కంటెంట్ బలంతో ఏకంగా 40 శాతానికి పైగా వసూళ్లని  సాధిస్తూ పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి.

ఈ మార్పుకు ప్రధాన కారణం ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల వ్యాప్తి. కరోనా తర్వాతి రోజుల్లో ఓటీటీ వినియోగం దాదాపు 300 శాతం పెరిగింది. డిజిటల్ విప్లవం వల్ల ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేతివేళ్ల వద్దకే అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ప్రతీవారం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనే నియమం పోయింది. "కొన్ని రోజులు ఆగితే ఎలాగూ ఓటీటీలోనే వస్తుంది కదా" అనే భావన దాదాపు 60 శాతానికి పైగా ప్రేక్షకుల్లో నెలకొంది. అందుకే థియేటర్‌కు వచ్చి . 200 నుండి రూ. 300 వరకు టికెట్ కొని, మరో రూ. 200 పాప్‌కార్న్‌పై ఖర్చు చేయాలంటే ఆ సినిమాకు ఆ స్థాయి లార్జర్ ద్యాన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ లేదా బలమైన ఎమోషన్ ఉంటేనే థియేటర్లకు జనాలు వస్తున్నారు.

Also Read: అదరగొడుతున్న హుషార్ పిట్టలు కలెక్షన్స్..  త్రీ డేస్ లెక్క ఇదే!

అలాగే సోషల్ మీడియా ప్రభావం కూడా సినిమా భవితవ్యాన్ని నిర్ణయించడంలో 80 శాతం పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు సినిమా రివ్యూలు ఆదివారం లేదా మరుసటి రోజు పేపర్లలో వచ్చేవి. కానీ ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) ముగిసిన 15 నిమిషాలకే ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో లక్షలాది రివ్యూలు వ్యాపిస్తున్నాయి. నెగెటివ్ టాక్ కనుక ఒక్కసారి వైరల్ అయితే, ఆ సినిమా ఈవెనింగ్ షోలకే కలెక్షన్లు 50 శాతానికి పైగా పడిపోతున్నాయి. నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేసే ప్రమోషన్ల కంటే, సాధారణ ప్రేక్షకుడు సోషల్ మీడియాలో ఇచ్చే అర నిమిషం రివ్యూనే బాక్సాఫీస్ విజయాన్ని శాసిస్తోంది. మరో ఆసక్తికరమైన నిజం ఏంటంటే... ప్రేక్షకులు ఇప్పుడు స్టార్ డమ్ కంటే సబ్జెక్ట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు కూడా సరైన స్క్రీన్‌ప్లే లేకపోతే వందల కోట్ల నష్టాలను మిగులుస్తున్నాయి. అదే కొత్త నటీనటులు, సరికొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే థ్రిల్లర్లు, డ్రామాలు, రూటెడ్ ఎమోషనల్ కథలు 50 కోట్ల నుండి రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరుతున్నాయి. కానీ ఇదే నిజమని అనుకున్నా కూడా పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇటీవల చిన్న చిత్రాలు కొన్ని మంచి కంటెంట్ తోనే వచ్చాయి. కానీ ప్రేక్షకులు ఆదరించలేదు.  అందుకే ఏ సినిమా హిట్ అవుతుందో లేదో చెప్పాలని పరిస్థితి. 

Cinema, Telugu Cinema, Tollywood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com