LATEST NEWS
    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కూటమి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుగుబాటు నేతగా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) వైఖరి అధికార పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సొంత పార్టీపైనే ఏ విధంగా ప్రెస్ మీట్ల ద్వారా దాడి చేశారో, ఇప్పుడు కూడా దాదాపు అదే తరహా ధోరణిని అవలంబిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏలూరులో జరిగిన 'దళిత క్రైస్తవ శంఖారావం' సభలో జడా శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిగా రఘురామకృష్ణరాజు స్పందించిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మధ్య ఆసక్తికర చర్చ టోన్‌ నిర్వహించింది. రాజకీయ వ్యూహాలు మరియు అంతర్గత అసంతృప్తి ఈ మొత్తం వ్యవహారం వెనుక రఘురామకృష్ణరాజు ఒక స్పష్టమైన పొలిటికల్ లైన్ తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తనకు దక్కిన డిప్యూటీ స్పీకర్ పదవి పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో తన పాత్రను ప్రస్తుత ప్రభుత్వం తక్కువ చేసి చూసిందనే భావన ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గానీ, పార్టీ అంతర్గత వేదికలపై గానీ మాట్లాడకుండా పబ్లిక్ గా ప్రెస్ మీట్లు పెడుతూ పరోక్ష విమర్శలు చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన వ్యూహం ఏంటంటే, రఘురామకృష్ణరాజు తన ప్రసంగాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గానీ, లోకేష్ ను గానీ ఎక్కడా చిన్న మాట కూడా అనడం లేదు. కేవలం జడా శ్రవణ్ కుమార్ ను టార్గెట్ చేస్తూనే, కూటమిలోని మరో కీలక భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రి అయినప్పుడే తాను ఫిర్యాదు చేస్తానని అనడం, వారం రోజుల్లో రాజకీయాల్లో మార్పులు వస్తాయని వ్యాఖ్యానించడం ద్వారా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు. తద్వారా ఆయన బీజేపీ మరియు జనసేన వైపు రాజకీయంగా అడుగులు వేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిణామాలు మరియు ప్రభుత్వానికి ఇబ్బందులు రఘురామకృష్ణరాజు అవలంబిస్తున్న ఈ వెటకారపు ధోరణి, దూకుడు వైఖరి వల్ల ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఆయన చైర్ లో కూర్చుని సీనియర్ సభ్యుల పట్ల వ్యవహరించిన తీరుపై పార్టీలోనే అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమైంది. అత్యున్నతమైన స్థానంలో ఉంటూ, ప్రభుత్వం సజావుగా సాగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కూటమిలో అంతర్గత సంక్షోభం ఉందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన రాజీనామా చేయకుండా, పార్టీ తనను గెంటేసే వరకు అక్కడే ఉండి పొగబెట్టే వ్యూహాన్ని అమలు చేశారు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తూ కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని భావిస్తే, అది కూటమిలోని ఇతర పార్టీలతో ఉన్న సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావం భవిష్యత్తులో ఈ పరిణామాలు ఏపీ రాజకీయాలపై గట్టి ప్రభావమే చూపేలా ఉన్నాయి. గతంలో 1999లో చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినప్పుడు ఆయన తిరుగుబాటు చేసి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు విషయంలో కూడా చంద్రబాబుకు అలాంటి శాపమే ఎదురవుతుందా అనే చర్చలు నడుస్తున్నాయి. అయితే కేసీఆర్ నాటి పరిస్థితులు వేరు, ఇవాల్టి రఘురామకృష్ణరాజు పరిస్థితులు వేరనేది విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ, రఘురామకృష్ణరాజును అలాగే వదిలేస్తే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఒకవేళ లోకేష్ లాంటి యువ నాయకత్వం అగ్రెసివ్ గా నిర్ణయాలు తీసుకుని ఆయనపై క్రమశిక్షణా చర్యలకు పూనుకుంటే, ఆయన పూర్తిగా బీజేపీ లేదా జనసేన నీడలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ "డిప్యూటీ స్పీకర్" సంక్షోభాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే దానిపైనే కూటమి ప్రభుత్వ అంతర్గత స్థిరత్వం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.  
  తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన నలుగురిని అరెస్ట్ చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా పెను భూకంపం సంభవించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి గండికొడుతూ విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.  అయితే, ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే సరికొత్త రాజకీయ సంక్షోభం తెరపైకి వచ్చింది. టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. ఎలైయరాజా తనకు రూ.35 కోట్ల భారీ లంచం ఆఫర్ చేశారంటూ చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. శాసనసభ స్పీకర్‌కు వ్యతిరేకంగా ప్రతిపాదించబోయే ఒక కీలక తీర్మానంలో పార్టీ లైన్‌కు భిన్నంగా, తమకు అనుకూలంగా ఓటు వేయాలని కొందరు వ్యక్తులు తనపై ఒత్తిడి తెచ్చారని, ప్రలోభాలకు గురిచేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఎమ్మెల్యే ఎలైయరాజా జూన్ 29న గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌ కార్యాలయంలో అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చెన్నైలోని డి-1 ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు అత్యంత వేగంగా దర్యాప్తు జరిపి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అరంబాక్కానికి చెందిన తిరునావుక్కరసు, తిరుచిరాపల్లికి చెందిన నరేష్, మేడవక్కానికి చెందిన త్యాగరాజన్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ప్రాథమిక విచారణలో తిరునావుక్కరసు అనే వ్యక్తి 'ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్' (ఐపీడీఎస్) అనే ఒపీనియన్ పోలింగ్ సంస్థను నడుపుతున్నట్లు నటించి, ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య నేతల ఆదేశాల మేరకే తాను ఈ పని చేస్తున్నానని ఎమ్మెల్యేను నమ్మించే ప్రయత్నం చేసినట్లు తేలింది. రూ.35 కోట్ల భారీ మొత్తాన్ని ఆశగా చూపిస్తూ, ఒకవేళ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఈ విషయాన్ని బయటపెడితే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను అంతం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఎలైయరాజా వెల్లడించారు. ఈ కేసు విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ఊహించని లింకులు బయటపడుతున్నాయి. జైలు నుంచి విడుదలై, కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్న డీఎంకే మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీ సోదరుడు వి. అశోక్ కుమార్ హస్తం కూడా ఈ కుట్రలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడైన నరేష్‌ను అశోక్ కుమార్ చెన్నైలో స్వయంగా కలిసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ హార్స్ ట్రేడింగ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) వ్యవహారంలో తిరునావుక్కరసు పూర్తిగా సెంథిల్ బాలాజీ, అశోక్ కుమార్ ల సూచనల మేరకే పావులు కదిపినట్లు తెలుస్తోంది.  ఈ పరిణామాలపై అధికార టీవీకే పార్టీ తీవ్రంగా స్పందించింది. అవినీతి, అక్రమ సంపాదన తమకు తెలియదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని సీఎం విజయ్ అసెంబ్లీ వేదికగా ఘాటుగా విమర్శించారు. కేవలం ఎలైయరాజా మాత్రమే కాకుండా మరికొంతమంది టీవీకే ఎమ్మెల్యేలను కూడా లొంగదీసుకునేందుకు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, పోలీసులు కాల్ డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేర్లు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. వీరిద్దరూ చిత్ర విచిత్ర విన్యాసాలతో నిత్యం వార్తల్లో ఉంటుంటారు. ఇప్పుడు తాజాగా దువ్వాడ మిస్సింగ్ అంటూ దివ్వెల మాధురి చేస్తున్న హడావుడి మరో కొత్త డ్రామాయా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.   శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో గత కొంతకాలంగా వ్యక్తిగత, రాజకీయ వివాదాలతో వార్తల్లో నిలిచిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఎపిసోడ్ లో.. దువ్వాడ అదృశ్యం వార్త కలకలం రేపుతోంది.   వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై  కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో   నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.   అయితే ఆయన భారీ ర్యాలీగా బయలుదేరి మార్గమధ్యంలో  ఎలా మిస్సౌతారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దువ్వాడ అనుచరులు, వైసీపీ  కార్యకర్తలు భారీ సంఖ్యలో కొత్తూరు పోలీసు స్టేషన్ కు చేరుకున్నా.. దువ్వాడ మాత్రం అక్కడకు రాలేదు.   దీంతో  దివ్వెల మాధురి   దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులే రహస్యంగా అదుపులోకి తీసుకుని ఉంటారంటూ ఆరోపణలు గుప్పించారు. ఎవడో ఊరూ పేరూ లేని వాడు కేసు పెడితే.. ఒక ఎమ్మెల్సీని పోలీసు స్టేషన్ కు పిలుస్తారా? అంటే మండిపడ్డారు. దువ్వాడకు ఏదైనా జరిగితే.. ఎవరినీ వదిలిపెట్టనంటూ పోలీసులపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.  కొత్తూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.    దివ్వెల మాధురి చేస్తున్న ఆరోపణలను కొత్తూరు పోలీసులు  తోసిపుచ్చారు. తాము దువ్వాడ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయలేదని, అసలు ఆయన పోలీస్ స్టేషన్‌ కే రాలేదని స్పష్టం చేశారు.  దువ్వాడే అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లి ఉంటారని పోలీసులు అంటున్నారు.  ఇక పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన దివ్వెల మాధురిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.  ఇక ఈ డ్రామాలో ట్విస్ట్ ఏమిటంటే.. పోలీసు స్టేషన్ కు బయలుదేరిన దువ్వాడ రూటు మార్చి.. ఒడిస్సావైపు వెళ్లడం. ఈ విషయాన్ని పోలీసులు ఆయన ఫోన్ సిగ్నల్స్ ద్వారా సాంకేతికంగా ధృవీకరించారు.  
కేంద్ర ఎన్నికల సంఘం   పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలే విమర్శించాయి.  ఎన్నికల నిర్వహణలో, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని  ధ్వజమెత్తాయి.ఈ మేరకు ప్రతిపక్ష  ఇండియా కూటమి పార్టీలు సంయుక్తంగా భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాయి. ఈ విషయంలో  సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఎన్నికల సంఘం నిర్ణయాలపై సమగ్ర న్యాయ సమీక్ష   నిర్వహించాలని ఆ లేఖలో డిమాండ్ చేశాయి.   దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని  పేర్కొన్నాయి. ఈ లేఖపై  ఇండియా కూటమికి చెందిన  23  పార్టీల నాయకులు సంతకాలు చేశారు.   ప్రతిపక్షాలన్నీ కలిసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా  హాట్ టాపిక్ గా మారింది. గతనెల  8న జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సీజేఐకి ఇండియా కూటమి పార్టీలు సంయుక్త లేఖ రాశాయి. ఈ లేఖపై ఇండియా కూటమి పార్టీల నేతలే కాకుండా, కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎంకే, ఆప్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు కూడా సంతకాలు చేశారు. అలాగే ఒక ఇండిపెండెంట్ ఎంపీ కూడా వీరిలో ఉన్నారు.   వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా తీవ్ర సవరణ' సర్  ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపించాయి. అధికార పార్టీకిలబ్ధి చేకూరేలా..   ఓటర్ల జాబితాను మేనిపులేట్ చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్, డెరెక్ ఒబ్రెయిన్ వంటి అగ్రనేతలు బ  విమర్శలు గుప్పించారు.  రాజ్యాంగ రక్షకుడిగా ఉన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగానైనా స్వీకరించి, ఈసీ పక్షపాత వైఖరిపై విచారణ జరపాలని ఇండియా కూటమి పార్టీలు ఆ లేఖలో కోరాయి. 
తమిళనాడు  ముఖ్యమంత్రి విజయ్ రాజకీయాలలో కొత్త ఒరవడి తీసుకువస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయ్ పెరంబదూర్, తిరుచిరాపల్లి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల నుంచీ విజయం సాధించారు.   దీంతో  తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ తాజాగా తిరుచిరాపల్లిలో ఏర్పాటు చేసిన కృతజ్ణతా సభలో చేసిన ప్రకటన ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. తిరుచిరాపల్లి ఉప ఎన్నికలో టీవీకే తరఫున స్థానిక అభ్యర్థి మాత్రమే పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని ఆయన విస్పష్టంగా చెప్పారు.   పార్టీ అధినేత స్థానిక నేతకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పడంతో, గ్రౌండ్ లెవెల్‌లో టీవీకే క్యాడర్ మరియు స్థానిక కార్యకర్తలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.   విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమికి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే మద్దతు ఉండటంతో ప్రభుత్వం స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ బై-ఎలక్షన్ ద్వారా టీవీకే ప్రభావాన్ని దెబ్బతీయాలని డీఎంకే వ్యూహాలు రచిస్తోంది. ఆ వ్యూహాలకు చెక్ పెట్టే దిశగా విజయ్ ముందుకు సాగుతున్నారనడానికి లారెన్స్ కు టికెట్ నిరాకరించి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే స్థానిక నేతకే పార్టీ టికెట్ ఇస్తానని ప్రకటించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ   విజయ్ అవినీతి రహిత పాలన,  సామాజిక న్యాయంపై ఇచ్చిన హామీలకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నారన్న భావన రాజకీయవర్గాలలో సైతం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే.. తిరుచ్చిలో స్థానికునికే పార్టీ టికెట్ ప్రకటన ఈ ఉప ఎన్నికలో టీవీకే విజయాన్ని దాదాపు ఖరారు చేసేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. సాధారణంగా అమ్మాయిలు ఇంట్లో చిన్న బొద్దింకలు, బల్లులను చూస్తేనే భయంతో కేకలు పెడుతూ ఇల్లు పీకి పందిరి వేస్తుంటారు. అలాంటిది ఈ కన్నడ సుందరి మాత్రం తనకు అసలు పాములంటేనే భయం లేదని, వాటితో తనకు చిన్నప్పటి నుంచే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం నభా నటేష్ నటించిన సరికొత్త చిత్రం "నాగబంధం" త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ, పాములకు సంబంధించి పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న "నాగబంధం" సినిమా టైటిల్ చూస్తేనే ఇందులో పాముల పాత్ర ఎంత కీలకంగా ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతుంది. షూటింగ్ సమయంలో గ్రాఫిక్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల కోసం నిజమైన పాములను కూడా ఉపయోగించారని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. సాధారణంగా సెట్స్‌పైకి నిజమైన పాములు వస్తే నటీనటులు, టెక్నీషియన్లు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయపడటం సహజం. కానీ నభా నటేష్ మాత్రం ఆ సమయంలో ఏమాత్రం భయపడకుండా చాలా కూల్‌గా షూటింగ్‌లో పాల్గొందట. దీనికి గల కారణాన్ని ఆమె వివరిస్తూ, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. తాము చిన్నప్పుడు ఉన్న ఇల్లు చాలా పురాతనమైనదని, అది తన తాతల కాలం నాటి ఇల్లు కావడం వల్ల అక్కడ పాములు తిరగడం చాలా సర్వసాధారణమైన విషయమని నభా తెలిపింది. ముఖ్యంగా కర్ణాటకలోని ప్రసిద్ధ కాఫీ తోటల ప్రాంతమైన చిక్కమగళూరుకు చెందిన వారికి అసలు పాములంటే పెద్దగా భయం ఉండదని నభా నటేష్ చెప్పుకొచ్చింది. తాను కూడా అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని కావడం వల్ల చిన్నతనం నుంచే పాములను చూస్తూ పెరిగానని చెప్పింది. ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకుంటూ, చిన్నప్పుడు తను, తన సోదరుడు కలిసి ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ తింటున్న సమయంలో కూడా ఎదురుగా పాములు తిరుగుతూ కనిపించేవని, అయినా సరే తాము ఏమాత్రం భయపడకుండా ప్రశాంతంగా తింటూ, ఆడుకుంటూ ఉండేవారమని వివరించింది. ఇంట్లోకి పాములు రావడం ఒక దినచర్యలా అలవాటైపోవడం వల్లే, ఇప్పుడు నాగబంధం సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌పై నిజమైన పాములు కనిపించినా తనకు అస్సలు భయం వేయలేదని ఈ ఇస్మార్ట్ బ్యూటీ ధైర్యంగా స్పష్టం చేసింది. కేవలం 19 ఏళ్ల వయసులోనే కన్నడ పవర్ స్టార్ శివరాజ్ కుమార్ సరసన "వజ్రకాయ" అనే సూపర్ హిట్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది నభా నటేష్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈమెకు కన్నడంలో వరుసగా భారీ ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్‌లో కూడా ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత కథల ఎంపికలో కాలం కలిసి రాకపోవడం, కొన్ని సినిమాలు నిరాశపరచడంతో దాదాపు 2 నుండి 3 ఏళ్ల పాటు ఈమె తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా దూరంగా ఉండాల్సి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత నభా నటేష్ మళ్లీ "నాగబంధం" సినిమాతో టాలీవుడ్‌లోకి ఘనంగా రీ-ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ఈ సెకండ్ ఇన్నింగ్స్ నభాకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో, మళ్లీ టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన క్రేజీ ఆఫర్లు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.
With just a day left for its theatrical release, the team of Nagabandham interacted with the media and displayed immense confidence in the film. Mounted on a massive budget of Rs.110 crore, the mythological adventure has generated considerable buzz with its promotional campaign, and the makers believe audiences are in for a grand cinematic spectacle. Director Abhishek Nama said Nagabandham was envisioned as a tribute to India's rich cultural heritage and Sanatana Dharma. He revealed that the film blends mythology, adventure and devotion on a scale he had always dreamt of, adding that every frame has been designed to offer audiences a memorable visual experience dedicated to Lord Shiva and Lord Anantha Padmanabha Swamy. The biggest endorsement, however, came from producer Kishore Annapureddy. He admitted that he was nervous about the film until he watched the final cut. After watching it, he said all his fears disappeared, revealing that the interval block gave him goosebumps and an unparalleled high. He expressed confidence that the film's visuals and storytelling would leave a lasting impact on audiences. Lead actor Virat Karrna also opened up about the challenges he faced during the shoot, revealing that he continued filming the climax despite suffering a muscle tear and a 104-degree fever. Trusting Abhishek Nama's vision completely, he said the hardships were worth it as the film delivers a larger-than-life visual experience. With premieres scheduled on July 2 ahead of its worldwide release on July 3, Nagabandham heads into theatres carrying high expectations from both its makers and moviegoers. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    -హీరో క్యారక్టర్ కి పేరు ఉంటుంది కదా! -మరి చిరంజీవి క్యారక్టర్ కి మూవీ మొత్తం పేరు ఉండదు  -అది కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీలో   -ఆ మూవీ ఏంటో చూద్దాం ఎనీ హీరోని తీసుకోండి.. హీరో క్యారక్టర్ కి పేరు లేకుండా మూవీ మొత్తం నడవడం అనేది జరగని పని.. కానీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)నుంచి వచ్చిన ఒక మూవీలో చిరు క్యారక్టర్ కి పేరు లేదు. ఏంటి అబద్దమని అనుకుంటున్నారా! పేరు లేకుండానే సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యింది. మరి ఆ మూవీ ఏంటో చూద్దాం.   తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన రికార్డులు, సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఒక రికార్డుని క్రియేట్ చేసిన చిత్రం 'రాక్షసుడు'. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చౌదరి నవల ఆధారంగా  ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎస్. రామారావు నిర్మించిన ఈ చిత్రం 1986 అక్టోబర్ 2వ తేదీన విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలోనే  చిరంజీవి పోషించిన క్యారక్టర్ కి పేరు అనేది  ఉండదు. కథ మొత్తం మిగిలిన క్యారెక్టర్స్ చిరుని  'మిత్రమా', పురుషా, జికే పెంపుడు కొడుకా, సోదర' అని మాత్రమే సంబోధిస్తాయి. ఒక స్టార్ హీరో సినిమాలో హీరోగా  ప్రత్యేకంగా ఎలాంటి పేరు లేకుండా కేవలం ఒక సంకేత పదంతోనే క్యారక్టర్ ని నడిపించి మెప్పించడం టాలీవుడ్ చరిత్రలోనే  అరుదైన ప్రయోగం. Also read: Skn: ఎస్ కె ఎన్ ఆసక్తికరవ్యాఖ్యలు.. అది మన క్రష్‌ అయితే, ఏ క్రష్ అయినా మనతో రావాల్సిందే  చిరంజీవి సరసన రాధ, సుహాసిని హీరోయిన్లుగా నటించగా చిరు సోదరుడు నాగబాబు ఈ చిత్రంతోనే తన సినీరంగ ప్రవేశం చేశారు. మెగాస్టార్ పవర్‌ఫుల్ యాక్షన్, ఇళయరాజా అద్భుతమైన సంగీతం, వెటూరి సాహిత్యంలో వచ్చిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', అచ్చా అచ్చా వచ్చా వచ్చా  'హే నాటీ' వంటి పాటలు మూవీ  విజయంలో కీలక రోల్ పోషించాయి. ఆ రోజుల్లోనే ఏకంగా 28 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. ఈ సినిమా సాధించిన ఘన విజయానికి గుర్తుగా అప్పట్లో చెన్నైలో నిర్వహించిన వంద రోజుల వేడుకకి  సూపర్ స్టార్ రజనీకాంత్, అతిలోక సుందరి శ్రీదేవి, దర్శకేంద్రుడు కె. విశ్వనాథ్ వంటి దిగ్గజాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ వేడుకలో శ్రీదేవి స్వయంగా చిరంజీవికి మెమొంటోని  అందజేయడం విశేషం. ఈ చిత్రం తమిళంలోకి కూడా డబ్ అయి అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చిరంజీవి కెరీర్ లో ఎప్పుడు గుర్తుండిపోయే రాక్షసుడులో చిరంజీవి క్యారక్టర్ కి పేరు లేకపోవడం ఒక సంచలనమే అని చెప్పవచ్చు. యండమూరి నవలలో  కూడా హీరో క్యారక్టర్ కి పేరు ఉండదు.       
Anand Deverakonda has made an interesting revelation about actress Krithi Shetty, admitting that he had a crush on her after watching Uppena. The actor made the candid confession during the promotions of his upcoming film, leaving everyone around him smiling. Anand said he was deeply impressed by Krithi's screen presence and innocence in Uppena. He admitted that, like many youngsters, he developed a crush on the actress after watching her debut performance. However, he clarified that it remained nothing more than admiration for her work on screen. The actor also spoke about eventually meeting Krithi in person and said the admiration continued after interacting with her. He described her as a sweet and grounded person, adding that she is just as pleasant off-screen as she appears in films. Krithi Shetty became an overnight sensation with Uppena and quickly emerged as one of Telugu cinema's busiest young actresses. While she went through a challenging phase with a few setbacks, she has been steadily rebuilding her career with interesting projects across Telugu and Tamil cinema. Anand's light-hearted confession has now gone viral on social media, with fans enjoying his honesty. The actor's candid nature has often won him appreciation, and this latest revelation has only added another fun moment to his ongoing promotional campaign. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా బ్లాక్‌బస్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా మరింత భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ‘జైలర్ 2’ ప్రాజెక్ట్‌పై రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హృతిక్ రోషన్ ఒక పవర్‌ఫుల్ అతిథి పాత్రలో నటిస్తున్నారనే వార్త ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక రేంజ్ సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. తాజా సమాచారం ప్రకారం, హృతిక్ రోషన్‌కు సంబంధించిన కేమియో పోర్షన్, అలాగే రజనీకాంత్‌తో ఆయన కలిసి నటించిన కాంబినేషన్ సీన్స్ మరియు విజువల్స్ స్క్రీన్‌పై అద్భుతంగా వచ్చాయని కోలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ముందుగా అనుకున్న దానికంటే స్క్రీన్‌పై వీరిద్దరి కాంబో సీన్స్ చాలా అద్భుతంగా పండటంతో, సినిమా మొత్తానికి ఈ ఎపిసోడ్ 100 శాతం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ భావిస్తున్నారు. వాస్తవానికి ఈ పాత్ర నిడివిని ముందుగా అనుకున్న సమయం కంటే కాస్త ఎక్కువే చిత్రీకరించారట. సాధారణంగా సినిమా రన్‌టైమ్ ఎక్కువైతే లెంగ్త్‌ తగ్గించడానికి ఎడిటింగ్‌లో కొన్ని సీన్లను ట్రిమ్ చేస్తుంటారు, కానీ రజనీకాంత్, హృతిక్ రోషన్ కాంబినేషన్ సీన్స్ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా హై ఇస్తుండటంతో, ఎడిటింగ్‌లో వాటిని అస్సలు తగ్గించకూడదని చిత్ర బృందం ఒక గట్టి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్‌ను కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా, ఉత్తరాది ప్రేక్షకులను కూడా 100 శాతం భారీగా ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ స్టార్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం వల్ల హిందీ బెల్ట్‌లో ఈ సినిమా బిజినెస్ పొటెన్షియల్, బాక్సాఫీస్ మార్కెట్ రేంజ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు సైతం విశ్లేషిస్తున్నాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. హృతిక్ రోషన్ సీన్ల నిడివి పెరగడం వల్ల జైలర్ 2 సినిమా మొత్తం రన్‌టైమ్ కూడా భారీగా పెరిగిపోయినట్లుగా తెలుస్తోంది. దీనితో రన్‌టైమ్‌ను బ్యాలెన్స్ చేయడానికి మేకర్స్ మరో సౌత్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అతిథి పాత్రపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. సినిమా నిడివిని కంట్రోల్‌లో ఉంచేందుకు వీలుగా విజయ్ సేతుపతి కేమియో పోర్షన్‌ను కొంతమేర తగ్గించాలని నెల్సన్ అండ్ టీమ్ భావిస్తోందట. అంటే హృతిక్ రోషన్ పవర్‌ఫుల్ సీన్స్ కోసం విజయ్ సేతుపతి తన పాత్ర నిడివిని త్యాగం చేస్తున్నాడన్నమాట. ప్రస్తుతం ‘జైలర్ 2’ చిత్రం కీలకమైన రీషూట్ మరియు ప్యాచ్ వర్క్ దశలో ఉంది. అవుట్‌పుట్‌ను మరింత నెక్స్ట్ లెవెల్‌కు పెంచడానికి, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మరింత ఎఫెక్టివ్‌గా మార్చడానికి మేకర్స్ కొన్ని రీషూట్‌లను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా సినీ ప్రియులలో భారీ అంచనాలున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
SS Rajamouli has shared a major production update on his highly anticipated globe-trotting adventure Varanasi, starring Mahesh Babu in the lead. The ace filmmaker revealed that the film has reached the final leg of production, with only around 80 days of shooting left before principal photography is wrapped up. Speaking during his recent international interactions, Rajamouli said the team has already completed a major portion of the film, including the massive action episodes designed for the IMAX format. The remaining schedules will primarily focus on filming the smaller, interconnecting scenes that tie the story together. If everything goes according to plan, the shoot is expected to be completed by September or early October. Varanasi has been mounted on a grand scale with Mahesh Babu, Priyanka Chopra and Prithviraj Sukumaran playing pivotal roles. The film has already made headlines for being India's first feature designed specifically for both IMAX and CinemaScope formats, with Rajamouli stating that the team planned the visual scale from the scripting stage itself. With the shoot nearing completion, the excitement around Varanasi has reached another level. The makers are now gearing up to finish the remaining portions before shifting their focus to the extensive post-production work that Rajamouli's films are known for. Scheduled to release in April 2027, Varanasi is easily one of the most anticipated Indian films in production today. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    బేబీ ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ గురించి తెలియని సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం తన కొత్త చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న ఎస్ కే ఎన్ రీసెంట్ గా   “సమ్మర్ హాలిడేస్” అనే మూవీ  సాంగ్ లాంచ్ ఈవెంట్  కి హాజరయ్యాడు.      ఆ ఈవెంట్ లో ఎస్.కే.ఎన్ మాట్లాడుతు 'మన చిన్నప్పుడు థియేటర్లలో   'చిన్నారి చేతన్', 'బాల భారతం', 'లిటిల్ సోల్జర్స్' లాంటి అద్భుతమైన బాలల చిత్రాలు చూసి  ఎంజాయ్ చేసేవాళ్లం. కానీ ఈ మధ్యకాలంలో అలాంటి క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాలల సినిమాలు రావడం బాగా తగ్గిపోయింది. ధీరజ్ మళ్లీ ధైర్యం చేసి ఆ జానర్‌లో ఈ 'సమ్మర్ హాలిడేస్' చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాటని  ధీరజ్ నాకు ముందే వినిపించాడు, వినగానే నాకు విపరీతంగా నచ్చింది. 'లిటిల్ హార్ట్స్' సినిమాతో మెప్పించిన సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి ఈ చిత్రానికి కూడా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.  Also read: Vadde Naveen: వడ్డే నవీన్ రీఎంట్రీ సెకండ్ మూవీ.. ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు ప్లాప్ కదా! ఈ రోజుల్లో క్రష్ అంటే ఒక వ్యక్తి అనుకుంటారు. కానీ మీ కెరీర్‌నే మీ మొదటి క్రష్‌గా మార్చుకోండి. మన లైఫ్, కెరీర్ బాగుంటే ఏ క్రష్ అయినా మన వెనకాలే రావాల్సిందే. నా  సోదరుడు లాంటి ఆనంద్ దేవరకొండకు, ప్రొడ్యూసర్ ధీరజ్‌కి  ఈ మూవీ 100 శాతం పెద్ద సక్సెస్ ఇవ్వాలి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పాడు.    
    ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్(Vadde Naveen) దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత  గత నెల 19 న 'ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు'తో  థియేటర్స్ లోకి  అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై కమల్ తేజ నార్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై వడ్డే నవీన్ అభిమానులు, సాధారణ ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒకప్పటి చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న నవీన్, ఈ వయసులో ఒక పవర్‌ఫుల్ పోలీస్ కానిస్టేబుల్ క్యారక్టర్ ని ఎంచుకోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తన పదేళ్ల సర్వీస్‌లో ఏకంగా 55 సార్లు బదిలీ అయిన ఒక నిజాయితీ గల కానిస్టేబుల్ త్రిమూర్తులుగా అద్భుతంగా కనిపించారు. సినిమా అంతటా ఆయన నటన, డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులని  ఆకట్టుకున్నాయి. హీరోయిన్‌గా రాశీ సింగ్ హోమ్లీ వైఫ్ పాత్రలో మెప్పించగా, కళ్యాణ్ నాయక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అయితే, దర్శకుడు ఎంచుకున్న కథ ఓల్డ్ ది కావడం, స్క్రీన్‌ప్లే లోపాలు,సెకండ్ హాఫ్‌లో సాగతీత సీన్లు సినిమాని  దెబ్బతీశాయి. కమర్షియల్‌గా ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద 1.75/5 రేటింగ్ మాత్రమే లభించింది. దీంతో భారీ అంచనాలతో వచ్చిన వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ మూవీ ప్లాప్‌గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. ఈ పరాజయంతో ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఒకటే ఆసక్తికరమైన ప్రశ్న రేకెత్తుతోంది. వడ్డే నవీన్ మళ్లీ సినిమాలు చేస్తారా లేక ఈ ఫ్లాప్‌తో వెనక్కి తగ్గిపోతారా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే, నవీన్ కేవలం నటుడే కాకుండా ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయన తండ్రి వడ్డే రమేష్ గారు టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ కావడం గమనార్హం. తండ్రి మరణం తర్వాత వడ్డే నవీన్ సొంత బ్యానర్‌పై సినిమా తీసి తన ఉనికిని చాటుకోవాలని గట్టిగా ప్రయత్నించారు. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, నటుడిగా వడ్డే నవీన్ లుక్స్ మరియు పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. పదేళ్ల విరామం తర్వాత కూడా ప్రేక్షకులు తనను గుర్తుపెట్టుకుని చూపించిన ఆదరణకు ఆయన ఎమోషనల్ అయ్యారు. Also read: Pawan kalyan: పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమాల్లో పని చెయ్యాలని అనుకుంటున్నారా! ఎంట్రీ ఈజీ ప్రస్తుత సినిమా ట్రెండ్‌ను పరిశీలిస్తే, కథల్లో కొత్తదనం ఉంటే సీనియర్ హీరోల సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' ఫలితం నిరాశపరిచినప్పటికీ, నవీన్ నటనకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఆయన అంత సులభంగా వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. సరైన దర్శకుడు, పక్కా కమర్షియల్ ఎమోషన్స్ ఉన్న స్క్రిప్ట్ దొరికితే వడ్డే నవీన్ కచ్చితంగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా లేదా విలన్‌గా కూడా రాణించగల సత్తా ఆయనకు ఉందని గతంలోనే నిరూపితమైంది. వడ్డే నవీన్ తన తదుపరి అడుగును మరింత జాగ్రత్తగా, పక్కా ప్లానింగ్‌తో వేస్తారని, త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్.   
టాలీవుడ్ హిస్టరీలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ మహిళా ప్రధాన చిత్రం సాధించని రీతిలో, అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా సగర్వంగా నిలిచింది. కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సమంత తన అద్భుతమైన నటన, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ సినిమాను ఒంటిచేత్తో నడిపించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకుల నుంచి వస్తున్న భారీ రెస్పాన్స్ చూస్తుంటే ఈ చిత్రం మరిన్ని వసూళ్ల రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చారిత్రాత్మక ఘన విజయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌ను షేక్ చేస్తోంది. ‘బంగారం చరిత్రను సువర్ణాక్షరాలతో రాసింది’ అంటూ మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా తమ సంతోషాన్ని పంచుకున్నారు. సాధారణ గృహిణిగా జీవితాన్ని గడుపుతున్న ఒక పవర్ ఫుల్ లేడీ, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి మళ్ళీ వీరనారిగా ఎలా మారింది అనే పాయింట్ ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తోంది. ఈ అద్భుతమైన యాక్షన్ డ్రామాను రాజ్ నిడిమోరు (Raj Nidimoru) అద్భుతమైన కథాంశంతో, ఎంతో వైవిధ్యంగా సృష్టించారు. దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి (BV Nandini Reddy) ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. టాలాలా మూవింగ్ పిక్చర్స్ (Tralala Moving Pictures) బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం, మొదటి రోజు ఆట నుంచే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించింది. నందిని రెడ్డి మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, రాజ్ నిడిమోరు యాక్షన్ ప్యాక్డ్ స్క్రీన్‌ప్లే ఈ చిత్ర విజయానికి ప్రధాన బలాలని చెప్పవచ్చు. కలెక్షన్ల విషయానికి వస్తే, "మా ఇంటి బంగారం" బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసింది. గత 16 ఏళ్లుగా ఎవరూ బ్రేక్ చేయలేకపోయిన అనుష్క శెట్టి 'అరుంధతి' కలెక్షన్ల రికార్డును సమంత తన ఖాతాలో వేసుకుంది. అరుంధతి చిత్రం తన లైఫ్‌టైమ్‌లో సాధించిన ₹70 కోట్ల గ్లోబల్ వసూళ్ల మార్కును "మా ఇంటి బంగారం" చాలా సులువుగా దాటేసింది. కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹78 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ 12వ రోజు ముగిసే సమయానికి వరల్డ్‌వైడ్‌గా ఏకంగా ₹83 కోట్ల భారీ వసూళ్లను సాధించి అల్-టైమ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫీమేల్ లీడ్ తెలుగు ఫిల్మ్‌గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ చిత్రం కేవలం ₹20 కోట్ల పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కింది. బడ్జెట్‌తో పోలిస్తే ఇప్పటికే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ అద్భుతమైన విజయంతో బాక్సాఫీస్ వద్ద లేడీ సూపర్ స్టార్ గా సమంత తన స్టామినాను మరోసారి నిరూపించుకుంది.   https://x.com/TralalaPictures/status/2072280740734312528
ఒకప్పుడు సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు అంటే కేవలం ఊహలకు రెక్కలు తొడిగిన అద్భుత ప్రపంచాలు మాత్రమే. ఎగిరే కార్లు, రోబోల అంతరిక్ష యుద్ధాలు, అధునాతన భవిష్యత్తు నగరాలు... ఇలాంటి వింతలను వెండితెరపై చూసి ప్రేక్షకులు మురిసిపోయేవారు. కానీ కాలం చాలా వేగంగా మారింది. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం కృత్రిమ మేధస్సు (AI) యుగం. ఈ రోజు ఏఐ మనతో మాట్లాడుతోంది, మనకోసం వ్యాసాలు రాస్తోంది, అందమైన చిత్రాలు గీస్తోంది, అద్భుతమైన సంగీతాన్ని కూడా సృష్టిస్తోంది. మనిషి రోజువారీ చేసే పనుల్లో చాలావరకు తనదైన ముద్ర వేస్తూ ప్రపంచాన్ని శాసిస్తోంది. అయితే, సాంకేతికత ఇంతలా పెరిగినా, నేటి చాట్ జీపీటీ లేదా అధునాతన ఏఐ టూల్స్ జమానాలోనూ ఇప్పటికీ సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోయింది.. అదే "యంత్రాలు మనుషుల్లా నిజమైన ప్రేమను కూడా సృష్టించగలవా?". ఈ క్లిష్టమైన ప్రశ్నను ప్రపంచం ముందుకు సరిగ్గా పాతికేళ్ల క్రితమే నిలబెట్టింది "A.I. Artificial Intelligence" అనే హాలీవుడ్ ఆంగ్ల చిత్రం. ఇది కేవలం యంత్రాలు, కోడింగ్ లేదా హార్డ్‌వేర్ గురించి తీసిన సినిమా కాదు. మనిషిలాగా నిష్కల్మషంగా ప్రేమించాలనుకున్న ఒక చిన్నారి రోబో బాలుడి కథ. రక్తమాంసాలు లేని ఇనుప శరీరంలోనూ ఒకవేళ నిజమైన మనసు ఉంటే అది ఎలాంటి వేదనను అనుభవిస్తుందో చూపించిన అరుదైన దృశ్యకావ్యం ఇది. సరిగ్గా 2001 జూన్ 29న అమెరికాలో విడుదలైన ఈ చిత్రం, ఆ తర్వాత జూలై మొదటి వారంలో భారతదేశంలో విడుదలైంది. అంటే 2026 నాటికి ఈ అద్భుత చిత్రం విడుదలై విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సాంకేతిక హంగుల కన్నా మానవ భావోద్వేగాలకే పెద్దపీట వేసిన ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన సినీ ప్రయాణం దాగి ఉంది. ఈ వినూత్న కథను మొదట ఊహించి, ఎన్నో ఏళ్ల పాటు తన గుండెల్లో మోసిన దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్. ఒక రోబో బాలుడు తన తల్లి నిఖార్సయిన ప్రేమ కోసం విశ్వమంతా వెతికే ఈ లైన్ ఆయనకు ఎంతో నచ్చింది. అయితే అప్పటి 1980, 1990ల నాటి సాంకేతిక పరిజ్ఞానంతో తాను అనుకున్న దృశ్యరూపాన్ని తెరపైకి తీసుకురావడం సాధ్యం కాదని భావించి, దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆయన దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ కలను తెరపై ఆవిష్కరించకుండానే 1999లో ఆయన కన్నుమూశారు. ఆ తర్వాత ఆయన సన్నిహితుడు, ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. అలా కుబ్రిక్ ఆలోచనకు, స్పీల్‌బర్గ్ హృదయం తోడై ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అందుకే ఈ సినిమాను సినీ విశ్లేషకులు "కుబ్రిక్ మేధస్సు, స్పీల్‌బర్గ్ హృదయం కలిసిన అమరచిత్రం" అని కొనియాడతారు. ఈ కథ అంతా 'డేవిడ్' అనే చిన్న రోబో బాలుడి చుట్టూ తిరుగుతుంది. చూడటానికి ఎంతో ముద్దులొలికే పిల్లాడిలా ఉంటాడు. మిగతా రోబోల్లాగే మాట్లాడుతాడు, నవ్వుతాడు, అవసరమైతే కన్నీరు పెడతాడు. కానీ అతడిని ప్రపంచంలోని మిగతా అన్ని యంత్రాల నుంచి వేరు చేసిన ఒకే ఒక్క ప్రత్యేకత.. అతడికి ప్రోగ్రామ్ చేయబడిన "ప్రేమించే గుణం". ఒక మానవ కుటుంబం ఒకానొక పరిస్థితిలో అతడిని దత్తత తీసుకుంటుంది. ఆ ఇంట్లోని తల్లిని డేవిడ్ కేవలం తన యజమానిగా కాకుండా, ప్రాణానికి ప్రాణంగా భావించే 'అమ్మ'గా స్వీకరిస్తాడు. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం, లాజిక్కులు, లెక్కలు ఉండవు. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారిపోవడంతో ఆ కుటుంబం డేవిడ్‌ను అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంది. అయినా డేవిడ్ ఆశ కోల్పోడు. తన అమ్మ మళ్లీ తనను ఎప్పటికైనా దగ్గరకు తీసుకుంటుందనే నమ్మకంతో, తనను నిజమైన మనిషిగా మార్చమని అడగడానికి 'బ్లూ ఫెయిరీ' (నీలి దేవత) కోసం కొన్ని వందల మైళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఆ ప్రయాణంలో అతడు పడే వేదనే ప్రేక్షకుడి గుండెను పిండేస్తుంది. ఈ చిత్రం 25 ఏళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చినప్పుడు కృత్రిమ మేధస్సు అనేది కేవలం కొద్దిమంది శాస్త్రవేత్తల ప్రయోగశాలలకే పరిమితమై ఉండేది. కానీ నేడు అది ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చేసింది. ఏఐ ఎన్నో పనులను సులువు చేస్తోంది కానీ, డేవిడ్ లాగా ఒకరి కోసం శతాబ్దాల పాటు నిరీక్షించే నిఖార్సయిన ప్రేమను, త్యాగాన్ని మాత్రం అది ఇప్పటికీ నేర్చుకోలేకపోయింది. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషి హృదయానికి ఉండే భావోద్వేగాల విలువను ఏ కోడింగ్ భర్తీ చేయలేదు అని చెప్పడమే ఈ సినిమా సాధించిన అతిపెద్ద విజయం. పాతికేళ్లు దాటినా ఈ సినిమా నేటికీ ఎవ‌ర్‌గ్రీన్‌ క్లాసిక్‌గా నిలబడటానికి కారణం ఇందులోని భావోద్వేగాల బలమే.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు వాడమని చెబుతారు.  అయితే.. తన దగ్గరకు వచ్చిన రోగులకు జాగ్రత్తలు  చెప్పడానికి ముందు వైద్యులు కూడా చాలా జాగ్రత్తలు, మంచి అలవాట్లు ఫాలో అవ్వాలి. అలా అయినప్పుడే వారి మానసిక, శారీరక ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం అనేది తొందరగా లభించేది కాదు.. అది రోజువారీ మంచి అలవాట్ల ద్వారా నిదానంగా సొంతమవుతుంది.  వైద్యులు తమ రోజువారీ జీవితంలో పాటించే కొన్ని ఆరోగ్య అలవాట్లు ఉన్నాయి.  వీటిని అందరూ పాటించవచ్చు.  ఇందులో వచ్చే నష్టం ఏమీ ఉండదు. దీని వల్ల వైద్యుల లాగే ఓర్పు, సహనం వంటివి పెరుగుతాయి. ప్రతి ఏడాది డాక్టర్స్ దినోత్సవాన్ని జూలై 1 వ తేదీన జరుపుకుంటారు.  ఈ సందర్బంగా వైద్యులు పాటించే కొన్ని ఆరోగ్య అలవాట్ల గురించి తెలుసుకుంటే.. నిద్ర.. ప్రతిఒక్కరికి కనీసం ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర అవసరం. "సమయానికి నిద్రపోవడం ద్వారా శరీరానికి, మనసుకు తగినంత విశ్రాంతి లభిస్తుంది.  దీని వల్ల ఒత్తిడి  తగ్గుతుంది,  రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.  మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.   బ్లూ లైట్.. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి పడుకోవడానికి ఒక గంట ముందు ఫోన్‌లు, కంప్యూటర్‌లు , ఇతర ఎలక్ట్రానిక్స్ స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతిని నివారించాలి. ఆహారం..  కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ వనరులు, ఆరోగ్యకరమైన కొవ్వులు , అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ప్రోటీన్ల ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తగ్గించడం ద్వారా రోజంతా స్థిరమైన శక్తిని నిలుపుకోవడానికి ఇది సహాయపడుతుంది. డిన్నర్ టైం.. రాత్రి భోజనాన్ని త్వరగా తినడం ఎంతో మంచిది.  రాత్రి 7 గంటల లోపు భోజనం ముగించడం వల్ల శరీరానికి రాత్రంతా విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల  జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రాసెస్ ఆహారాలు.. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరతో నిండిన డెజర్ట్‌ల విషయంలో చాలా మంది కంట్రోల్ గా ఉండలేరు. కానీ వాటిని నివారించడానికి  తీపి తినాలని అనిపించినప్పుడు, చక్కెరతో నిండిన ప్రాసెస్ చేసిన డెజర్ట్‌ల వైపు వెళ్లకుండా ఆయా కాలాల్లో లభించే తాజా పండ్లు తినడం, ఖర్జూరం,  డ్రై ప్రూట్స్ వంటి తినడం వల్ల తీపి తిన్న ఫీల్ వస్తుంది. ఆరోగ్యానికి పోషకాలు కూడా అందుతాయి. భోజనం ట్రిక్.. భోజనం తినే ముందు  కూరగాయలతో తయారు చేసిన సలాడ్‌ తినడం వల్ల, ఎక్కువ ఆహారం తినకుండానే కడుపు నిండుతుంది.  దీనివల్ల ఆహారం అతిగా తినడం నివారించవచ్చు.  భోజనానికి కనీసం 20 నిమిషాల ముందు సలాడ్‌ తినడం చాలా మంచిది. చురుగ్గా ఉండాలి.. లైఫ్ స్టైల్ చురుగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  క్రమం తప్పకుండా కార్డియోవాస్కులర్ వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.  అలాగే వ్యాయామం వల్ల ఓర్పు కూడా పెరుగుతుంది.   స్ట్రెంత్ ట్రైనింగ్.. క్రమం తప్పకుండా శరీరాన్ని బలంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఫుషప్స్,  బైసెప్స్ తో పాటు ఇతర స్ట్రెంట వ్యాయామాలు కూడా శరీరం బలంగా మారడానికి సహాయపడుతుంది.  ఇవి కండరాలు బలంగా మారడానికి సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. వైద్యులకు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం. శారీరక దృఢత్వం మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ప్రతిరోజూ యోగా, ధ్యానం,యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామం వంటివి చేస్తారు.   రిలేషన్స్.. వైద్యులు కేవలం సమాజం కోసం మాత్రమే కాదు.. తమ కోసం తాము కూడా బ్రతకాలి.  వారికి ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబంతో సమయం గడపడం,  సంబంధాలను మెరుగ్గా ఉంచుకోవడం వంటివి వారు వృత్తిలో రాణించడానికి సహాయపడతాయి. కనీసం రోజుకు గంట సేపు అయినా కుటుంబంతో సంతోషంగా గడపడం చాలా ముఖ్యం. పైన చెప్పుకున్నవన్న ఎంతో మందివైద్యులు తప్పకుండా తమ జీవితంలో రోజూ పాటించే అలవాట్లు. ఇవి సాధారణ వ్యక్తులు కూడా పాటించవచ్చు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు, కుటుంబ బంధాలు కూడా బలంగా ఉంటాయి. అప్పుడే వారు వృత్తికి సరైన న్యాయం చేయగలరు.                                       *రూపశ్రీ.
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది  మనుషులను దగ్గర చేస్తుంది. కానీ కొన్నిసార్లు  తెలియకుండానే అవతలి వ్యక్తికి అసౌకర్యం కలిగించే ప్రశ్నలు అడుగుతుంటారు. అడిగేవారి  ఉద్దేశాలు తప్పు కాకపోయినా, కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు ఇతరులకు నచ్చకపోవచ్చు , పైగా ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఎదుటివారు బాధపడతారు కూడా.  నేటికాలంలో  గతంలో కంటే తమ వ్యక్తిగత జీవితాల పట్ల చాలా మందికి ఎక్కువ శ్రద్ధ ఉంటోంది. అయితే  ప్రతి వ్యక్తికి వారి స్వంత హద్దులు , వ్యక్తిగత గోప్యత ఉంటాయి, వాటిని గౌరవించాలి. కొన్నిసార్లు, మనం కేవలం కుతూహలంతో ప్రశ్నలు అడుగుతాము, కానీ అవతలి వ్యక్తి దానిని తమ పర్సనల్  విషయాల్లోకి చొరబడినట్లుగా భావించే అవకాశం ఉంటుంది. ఇది సంబంధాలు చెడిపోయే అవకాశాన్ని పెంచుతుంది. ఎవరినీ అడగకూడని నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ఎవరినీ నొప్పించకుండా ఉండగలం. అవేంటంటే.. జీతం.. ఒకరి ఆదాయం లేదా జీతం గురించి అడగడం చాలా సున్నితమైన ప్రశ్నలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు.  ఈ ప్రశ్న ఎదుటి వ్యక్తికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు.  ఇలాంటి ప్రశ్న వేయడం  వల్ల ఇతరులతో  తనను పోలుస్తున్నారని లేదా అంచనా వేస్తున్నారని ఎదుటివారికి  అనిపించవచ్చు. అందుకే ఎవరి సంపాదన గురించి ఎప్పుడూ అడగకూడదు. పెళ్ళెప్పుడు.. పెళ్లెప్పుడు అనే ప్రశ్నను భారతీయులు చాలా  తరచుగా అడుగుతుంటారు, కానీ ప్రతి వ్యక్తి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.  కొందరు తమ వృత్తిపై దృష్టి పెడుతుండగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు.  ఈ ప్రశ్నను పదేపదే అడగడం వల్ల ఎదుటి  వ్యక్తిపై అనవసరమైన ఒత్తిడి పడవచ్చు. వయసు.. వయస్సు అడగడం సాధారణంగా అనిపించినప్పటికీ, చాలా మంది దానిని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట  లేదా మొదటి సారి ఎవరితోనైనా కలిసినప్పుడు ఇలాంటి ప్రశ్న వేస్తే అది ఎదుటి వారిని   ఇబ్బందికి గురిచేస్తుంది. అవసరం ఉంటే తప్ప  వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవడమే మంచిది. పిల్లలు.. భారతదేశంలో పెళ్లైన చాలా మంది మహిళలు ఎదుర్కునే  ప్రశ్న ఇంకా పిల్లలు పుట్టలేదు ఎందుకు ఏమిటి అని.  ఇది  చాలా  భావోద్వేగపరమైన,  సున్నితమైనదిగా  ప్రశ్న. కొంతమందికి వారు మాట్లాడటానికి ఇష్టపడని వ్యక్తిగత నిర్ణయాలు, ఆరోగ్య కారణాలు లేదా కుటుంబ పరిస్థితులు ఉండవచ్చు. అందువల్ల, ఇలాంటి ప్రశ్నలు సంబంధాలలో దూరాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకే ఏ ఆడపిల్లను  ఎవరు ఈ ప్రశ్న అడగకూడదు.                                 *రూపశ్రీ.
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ చాలా ప్రత్యేకమైనది.  చాలామంది రిలేషన్లో ఉన్నప్పుడు తమ బాగస్వామిని చాలా ప్రేమిస్తుంటారు. కానీ ఏదైనా సందర్బం వస్తే నువ్వు నన్ను ప్రేమించడం లేదు అనే మాటను ఎదుర్కుంటూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే.. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయకపోవడం వల్ల.  ప్రేమించడం గొప్ప కాదు.. కానీ ప్రేమను సరైన విదంగా వ్యక్తం చేయకపోవడం వల్లే అసలైన సమస్య వస్తుంది. ప్రేమను సరైన విధంగా వ్యక్తం చేస్తే ఆ బంధాలు ఎంతో పదిలంగా పదికాలల పాటు సంతోషంగా ఉంటాయి.  బంధాలను బలంగా మార్చుకోవడానికి ప్రేమను వ్యక్తం చేసే పద్దతులు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. మనసులో కాదు.. మాటల్లో చెప్పాలి.. ప్రేమను మనసులో దాచుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. కొంతమందికి ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలే మంచి ఆయుదం. “నాకు నీ పట్ల గర్వంగా ఉంది”, “నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి”, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” వంటి చిన్న వాక్యాలు కూడా ఎదుటి వారి హృదయాన్ని టచ్ చేస్తాయి.  భాగస్వామి  తమ ప్రేమను మాటల ద్వారా వ్యక్తపరుస్తుంటే, వారిని మెచ్చుకోవడం, వారి ప్రయత్నాలను అభినందించడం, ప్రేమ సందేశాలు పంపడం వంటివి ఆ బంధాన్ని బలపరుస్తాయి. ఇలాంటి వ్యక్తులు విమర్శలను కూడా మరింత లోతుగా తీసుకుంటారు, కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు పాజిటివ్  పదాలను ఎంచుకోవడం ముఖ్యం. సమయం.. కొంతమందికి ప్రేమను వెలిబుచ్చడానికి  అత్యంత విలువైనది వారి సమయం. వారికి ఖరీదైన బహుమతుల కంటే, ఎలాంటి ఆటంకం  లేకుండా వారితో సమయం గడపడమే ముఖ్యం. ఫోన్‌ను పక్కన పెట్టి మాట్లాడుకోవడం, కలిసి నడవడం, కాఫీ డేట్‌కు వెళ్లడం లేదా కేవలం కలిసి కూర్చుని ఆ రోజు జరిగిన సంఘటనలను షేర్ చేసుకోవడం వంటివి కొందరికి   చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటి వారికి, లైప్ పార్ట్నర్ ఉనికే చాలా పెద్ద బహుమతి. స్పర్శ.. చాలా మంది కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం, నుదుటిపై ముద్దు పెట్టుకోవడం లేదా భుజంపై చేయి వేయడం వంటి టచింగ్  ద్వారా ప్రేమను అనుభూతి చెందుతారు. ఒకరినొకరు స్పృశించుకోవడం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు, భావోద్వేగ భద్రత , అనుబంధం కూడా ఇందులో భాగమే. అలాంటి వ్యక్తులు ప్రేమతో కూడిన టచింగ్ ను  పొందినప్పుడు, వారు తమ సంబంధంలో మరింత భద్రతగా, అనుబంధంగా , సంతోషంగా ఫీలవుతారు. మెమరీస్.. బహుమతులు ఇష్టపడేవారు బయటి విషయాలలోనే ప్రేమను చూస్తారని  చాలామంది తరచుగా అనుకుంటారు, కానీ ఈ నమ్మకం ఎప్పుడూ సరైనది కాదు. ఇది కూడా ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక మార్గం.  ఇందులో  బహుమతి ధర ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న భావనే ముఖ్యం. ఒక చిన్న పువ్వు, ఇష్టమైన చాక్లెట్, లేదా ప్రయాణం నుండి తెచ్చుకున్న ఒక చిన్న గిఫ్ట్  కూడా వారికి చాలా ప్రత్యేకంగా అనిపించవచ్చు. ఇది  వారి గురించి ఆలోచిస్తున్నారని, వారిని గుర్తుంచుకుంటున్నారని  వారికి తెలియజేస్తుంది. సహాయం.. కొంతమందికి, “నేను నీకు సహాయం చేస్తాను” అని చెప్పడం కంటే, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.   భాగస్వామి సహాయానికి లేదా సపోర్ట్ ఇవ్వడానికి  విలువ ఇస్తే, వారికి చిన్న చిన్న పనులలో సహాయం చేయడం, వారి బాధ్యతలను తేలికపరచడం లేదా అవసరమైనప్పుడు సపోర్ట్  ఇవ్వడం వంటివి వారిని ఎంతగానో ప్రేమిస్తున్నారనే భావనకు గురి చేస్తాయి. వారికి మాటల కన్నా చేతలే గొప్పవి. కష్టసమయాలలో.. ప్రతి సంబంధం కేవలం సంతోషకరమైన క్షణాలపై మాత్రమే ఆధారపడి ఉండదు.  కష్ట సమయాల్లో ఒకరికొకరు మానసికంగా  అండగా ఉండటం కూడా అంతే ముఖ్యం. తమ మాటలను ఎలాంటి జడ్జ్ చేయకుండా  విన్నప్పుడు, వారి భావాలను అర్థం చేసుకున్నప్పుడు,  కష్ట సమయాల్లో వారికి అండగా నిలిచినప్పుడు, కొంతమంది తాము ప్రేమించబడ్డామని భావిస్తారు. అలాంటి వారికి ఏ బహుమతి లేదా ప్రేమను వ్యక్తపచడానికి స్పెషల్ గా వేరే ఏ పని చేయకపోయినా , ఎమోషనల్ సందర్భాలలో మద్దతుగా ఉండటమే ముఖ్యం అనిపిస్తుంది. ప్రేమను ఎలా గుర్తించాలి?  ఎక్కువ ప్రేమగా అనిపించే విషయాల పట్ల శ్రద్ధ వహించాలి.  భాగస్వామి తరచుగా ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారో గమనించాలి.   ఏది లోపించిందని అనిపిస్తుందో, ఏది మిమ్మల్ని బాధపెడుతుందో అది కూడా ఒక సంకేతం కావచ్చు.  నిష్కపటంగా మాట్లాడాలి , ఒకరి ఎమోషన్ సపోర్ట్ ను  మరొకరు అర్థం చేసుకోవాలి.                                 *రూపశ్రీ.
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. ఆడవారిలో గర్బం నిలవకపోవడం లాగానే.. మగవారిలో వీర్యకణాల సమస్య వంటివి పిల్లలు పుట్టడంలో ఆటంకాలు కలిగిస్తాయి. కొందరికి వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం, మరికొందరికి వీర్యం సరిగా ఉత్పత్తి కాకపోవడం లాంటి చాలా సమస్యలు కూడా ఉంటాయి. అయితే మగవారిలో కొన్ని  అలవాట్లు వారిలో సంతాన అవకాశాలు తగ్గించేస్తాయని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. వేడి అసలు కారణం.. జీవశాస్త్రపరమైన కారణం వల్ల వృషణాలు శరీరం వెలుపల ఉంటాయని వైద్యులు చెబుతారు. వీర్య కణాల ఉత్పత్తి ఉత్తమంగా జరగాలంటే , వృషణాల ఉష్ణోగ్రత శరీర అంతర్గత ఉష్ణోగ్రత కంటే సుమారు 2 నుండి 4°C తక్కువగా ఉండాలట. ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసం కొద్దిగా తగ్గినా కూడా, అది సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందట. వృషణాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల, వీర్య కణాలను ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం జరుగుతుందట. ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి, వీర్యకణాల DNA దెబ్బతింటుందట. భారతీయ పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి వేడికి గురికావడం, బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వంటి రోజువారీ అలవాట్లు ముఖ్య కారణాలని చెబుతున్నారు. ఒడిలో ల్యాప్టాప్.. చాలా మంది మగవాళ్లు ల్యాప్‌టాప్‌ను నేరుగా తమ తొడలపై ఉంచుకుని గంటల తరబడి పనిచేస్తుంటారు. దీనివల్ల ఉత్పన్నమయ్యే వేడి, కాలక్రమేణా వృషణాల ఉష్ణోగ్రతను గణనీయంగా పెంచడానికి దారితీస్తుంది. కానీ వేడి ఒక్కటే సమస్య కాదు, ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకోవడం , ఫోన్‌ను ప్యాంటు జేబులో ఉంచుకోవడం వల్ల విద్యుదయస్కాంత వికిరణానికి గురై పిల్లలు పుట్టడంలో సమస్యలు   పెరగవచ్చట. లోదుస్తులు, జీన్స్..  బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించే పురుషులతో పోలిస్తే, వదులుగా ఉండే బాక్సర్ షార్ట్స్ ధరించే పురుషులలో మొత్తం వీర్య కణాల సంఖ్య 17% ఎక్కువగా , చురుకుగా ప్రయాణించే వీర్య కణాలు 33% ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తేల్చాయి. స్కిన్నీ లేదా బిగుతుగా ఉండే జీన్స్ పరిస్థితిని మరింత దిగజార్చుతాయని ఆయన ఇంకా తెలిపారు. అవి రోజంతా వృషణ ప్రాంతాన్ని శరీరానికి దగ్గరగా నొక్కి ఉంచుతాయి, దీనివల్ల వేడి లోపలే నిలిచిపోయి, శరీరం  ఉష్ణోగ్రత నియంత్రణకు అవకాశం లేకుండా పోతుంది. ఎప్పుడూ అవే ధరించడం వల్ల, కాలక్రమేణా ఈ ప్రభావం పెరిగి సంతానలేమి సమస్యలకు దారితీస్తుంది. సహాయపడే మార్పులు.. వదులుగా ఉండే బాక్సర్ షార్ట్‌లకు మారడం,  ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకోవడాన్ని అవాయిడ్ చేయడం మంచిది.  ల్యాప్‌టాప్‌ను  ఒడిలో కాకుండా బల్లపై ఉంచుకోవడం మంచిది. వేడి ప్రాంతాలలో ఎక్కువ సేపు గడపకుండా ఉండటం కూడా మేలు చేస్తుంది.                            *రూపశ్రీ.
 నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది జిమ్ చేస్తుంటారు, మరికొందరు యోగా చేస్తుంటారు. గుండె ఆరోగ్యం కోసం కొత్తగా వ్యాయామం  మొదలు పెట్టాలని అనుకునేవారు జిమ్ చేయాలా, యోగా చేయాలా అని గందరగోళానికి గురవుతూ ఉంటారు.    కొంతమంది జిమ్‌లో వ్యాయామం చేయడానికి ఇష్టపడితే, మరికొందరు యోగానే ఉత్తమ పద్ధతిగా భావిస్తారు. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం జిమ్ లేదా యోగా..  ఈ రెండింటిలో  గుండె ఆరోగ్యానికి ఏది బాగుంటుంది?  తెలుసుకుంటే.. జిమ్ లేదా యోగా ఏది మంచిది? గుండెను కాపాడుకోవడానికి జిమ్ , యోగా రెండూ అవసరమైనవే. అయితే, అవి పనిచేసే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. ఒకదానిని మించి మరొకటి ఎంచుకోవడం కంటే, రెండింటినీ  ఫిట్‌నెస్ లైఫ్ స్టైల్ లో  చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం వల్ల గుండెకు కలిగే ప్రయోజనాలు.. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్, రోయింగ్ , స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి జిమ్ వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా చేసే  వ్యాయామం గుండెను బలపరుస్తుంది , శరీరమంతటా రక్తాన్ని ప్రసరింపజేయడంలో సహాయపడుతుంది.  జిమ్ వర్కౌట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి , కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తాయి. అవి బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి.  తద్వారా గుండె జబ్బులు , పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవి స్టామినాను బాలెన్స్ ను  కూడా పెంచుతాయి. క్రమం తప్పకుండా  కార్డియో వ్యాయామాలు చేస్తే  గుండెను బలపరుస్తాయని , శరీరమంతటా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంప్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. యోగా ఎందుకు ముఖ్యం..? యోగా శరీర సౌలభ్యాన్ని మెరుగుపరచడం, సరైన శ్వాస, బాలెన్స్ ను  కాపాడుకోవడం , మానసిక ప్రశాంతతపై దృష్టి పెడుతుంది. కార్డియో వ్యాయామాల మాదిరిగానే  యోగా ఏరోబిక్ ఫిట్‌నెస్‌ను అందిస్తుంది.  అయితే యోగా  గుండె ఆరోగ్యానికి ఇంకా అనేక  విధాలుగా కూడా  ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. యోగా ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. యోగా  ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీర సౌలభ్యాన్ని , శరీరాకృతిని  మెరుగుపరుస్తుంది, శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది , మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. గుండె జబ్బులకు ఒత్తిడి ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. యోగా మనస్సును , నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కేవలం యోగాతో గుండె ఆరోగ్యం బాగుంటుందా? యోగా వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గుండె సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి అవసరమైన ఏరోబిక్ వ్యాయామాన్ని కేవలం యోగా మాత్రమే శరీరానికి అందించలేదు.  ఈ విషయాన్ని ఆరోగ్య  నిపుణులే చెబుతున్నారు.  ఆరోగ్య  నిపుణుల ప్రకారం, ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి వారానికి  కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి మధ్యస్థం నుండి  తీవ్రత గల వ్యాయామం చేయాలి. మెరుగైన ఫిట్‌నెస్ , గుండె ఆరోగ్యం కోసం యోగాను ఇతర శారీరక కార్యకలాపాలతో కలిపి చేయడం మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామం చేయాలి? జిమ్ , యోగాలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదని  గుండె ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు.  ఫిట్‌నెస్ దినచర్యలో రెండింటినీ చేర్చుకోవడం మంచిదట. ఒక బాలెన్స్డ్  ఫిట్‌నెస్ ప్రణాళికలో వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు, వారానికి కనీసం రెండు రోజులు స్ట్రెం్ ట్రైనింగ్,  కోలుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఉంటాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్ , శ్వాస వ్యాయామాలను కూడా చేర్చుకోవాలి. ఈ దినచర్య గుండె ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని ,  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.                                       *రూపశ్రీ.
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం.  శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి,  ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది.  శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు. ఇక మాంసాహారులు అయితే మాంసాన్ని తీసుకుంటారు. కానీ కాయ ధాన్యాలలో కూడా ప్రోటీన్ ఉంటుంది. వీటిని తరచుగా పప్పు ధాన్యాలు అని పిలుస్తూ ఉంటాం. వంటింట్లో ఎన్నో రకాల పప్పు దాన్యాలు ఉంటాయి. వీటిలో ఏ ధాన్యాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. సోయాబీన్.. సోయాబీన్లో అన్ని పప్పు ధాన్యాల కంటే అత్యధికంగా వంద గ్రాముల సోయాబీన్ కు 36–40 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇందులో శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు (Essential Amino Acids) దాదాపు సమతుల్యంగా లభిస్తాయి. అందువల్ల దీనిని అత్యుత్తమ ప్లాంట్  ప్రోటీన్ ఆహారాల్లో ఒకటిగా పరిగణిస్తారు. సోయాబీన్‌తో తయారయ్యే పాలు, టోఫూ, సోయా నగెట్స్ వంటి ఆహారాలు కూడా మంచి ప్రోటీన్ వనరులే. మినుములు.. ప్రోటీన్ అత్యధికంగా ఉండే ధాన్యాలలో మినుములు రెండవ స్థానంలో ఉంటాయి.  ఈ మినుములు ఒక  కప్పు మినుములలో సుమారు 25 నుండి 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని చెబుతారు. ఇడ్లీ, దోశ వంటి పులియబెట్టిన ఆహారాల్లో మినప్పప్పు ఉపయోగించడం వల్ల జీర్ణక్రియకు కూడా మేలు జరుగుతుంది. పెసలు.. పెసలులో 23–24 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. మొలకలు వచ్చిన పెసలు విటమిన్ సి, కొన్ని బి విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు కూడా తినవచ్చు. శనగలు.. శనగలులో ప్రోటీన్‌తో పాటు పీచు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువసేపు ఆకలి తగ్గి, బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. శనగలు ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలను కూడా అందిస్తాయి.   రాజ్మా.. రాజ్మాలో మంచి ప్రోటీన్, పీచు, పొటాషియం , ఐరన్  ఉంటాయి. అయితే వీటిని తప్పనిసరిగా బాగా నానబెట్టి, పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి. లేకపోతే జీర్ణవ్యవస్థకు చాలా ఇబ్బంది అవుతుంది. కందిపప్పు.. కందిపప్పు మన తెలుగు ఇళ్లలో ఎక్కువగా వాడే పప్పు. ఇందులో ప్రోటీన్‌తో పాటు ఫోలేట్, పొటాషియం, పీచు కూడా లభిస్తాయి. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చడం మంచి అలవాటు. ఎలా తింటే ప్రయోజనం.. పప్పులను కేవలం ఒకటే తినడం కంటే వాటిని బియ్యం, జొన్న, రాగి లేదా గోధుమ వంటి ధాన్యాలతో కలిపి తినడం మంచిది. ఇలా తినడం వల్ల శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాల సమతుల్యత మెరుగుపడుతుంది. అంతేకాదు.. పప్పులను కూరగాయలతో కూడా కలిపి తింటే మంచి సమతుల్య ఆహారం తీసుకున్నట్టు అవుతుంది. అలాగే పప్పులను 6–8 గంటలు నానబెట్టి వండితే జీర్ణక్రియ సులభమవుతుంది. కొన్ని పప్పులను మొలకలు చేసి తింటే విటమిన్లు పెరగడంతో పాటు కొన్ని పోషకాల శోషణ కూడా మెరుగుపడుతుంది. రోజువారీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? ఒక సాధారణ ఆరోగ్యవంతుడికి రోజుకు శరీర బరువు ప్రతి కిలోకు సుమారు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఉదాహరణకు 60 కిలోల బరువు ఉన్న వ్యక్తికి రోజుకు సుమారు 48 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు, క్రీడాకారులు లేదా కండరాల పెరుగుదల లక్ష్యంగా పెట్టుకున్నవారికి అవసరం మరింత ఎక్కువగా అవసరం కావచ్చు.                             *రూపశ్రీ.